జై బజరంగభళీ
సాక్షి నెట్‌వర్క్/శివ్వంపేట: జిల్లా వ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ సంస్థల కార్యకర్తలు భారీ హనుమాన్ విగ్రహాలతో పట్టణాలలో ప్రదర్శన నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయానికి శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి వచ్చారు. పూర్ణకుంభ స్వా గతం అందుకున్న ఆయన.. వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో 108 కలశాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ కంటే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ఆచారాలు, పద్ధతులు చాలా గొప్పవన్నారు.
తల్లిదండ్రులను గౌరవించని వారు సమాజంలో ఉండటానికి అ నర్హులన్నారు. తల్లిదండ్రులతోపాటు గురువు, వైద్యు డు, పాలకులను గౌరవించాలన్నారు. ప్రస్తుతం వర్షాలు లేనందున ప్రతి ఒక్కరు పచ్చదనం పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా పలువురు మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. చాకరిమెట్ల ఆలయ పరిసరాల్లో గోశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందని, అందుకు ఎమ్మెల్యే సహకరించాలలన్నారు.
♦ సంగారెడ్డి పట్టణంలో పది అడుగుల ఆంజనేయస్వామి విగ్రహంతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ప్రారంభించారు.
♦ అందోలులో ప్రహ్లాద్ అనే వ్యక్తి హనుమంతుడి వేషధారణ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం ఆకర్షించింది.
♦ సిద్దిపేటలో హిందు స్వాభిమాన్ యాత్రను ఘనంగా నిర్వహించారు. రంగధాంపల్లి గ్రామ శివారు పంచవటి హనుమాన్ దేవాలయం నుంచి 12అడుగుల భారీ విగ్రహం తో పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు.