Hanumajjayanti
-
హైకోర్టు అనుమతిచ్చినా వీరహనుమాన్ విజయ యాత్రకు బ్రేక్
సాక్షి, హైదరాబాద్: హనుమజ్జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో జరగాల్సిన వీరహనుమాన్ విజయ యాత్రకు అకస్మాత్తుగా బ్రేక్ పడింది. హైకోర్టు యాత్రకు అనుమతిచ్చినా కూడా యాత్ర ఆగిపోయింది. అయితే యాత్రను తామే స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు హిందూ సంఘాలు ప్రకటించాయి. వాస్తవంగా హైదరాబాద్‌లో మంగళవారం హనుమజ్జయంతి సందర్భంగా పాతబస్తీ నుంచి సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ ఆంజనేయస్వామి ఆలయం వరకు శోభయాత్ర జరగాల్సి ఉంది. అయితే ప్రభుత్వం అనుమతి ఇవ్వడం లేదని హైకోర్టుకు వెళ్లి మరీ అనుమతి తెచ్చుకున్నారు. అయితే న్యాయస్థానాలు ఎన్నో ఆంక్షలతో వీరహనుమాన్ విజయ యాత్రకు అనుమతిచ్చింది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో పక్కాగా నిబంధనలు పాటించాలని సూచించింది. ఈ నేపథ్యంలో భజరంగ్‌దల్, విశ్వహిందూ పరిషత్ తదితర సంఘాలు యాత్రపై సమాలోచనలు చేశాయి. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో యాత్ర విరమించుకుంటే మంచిదనే అభిప్రాయానికి ఆయా సంస్థలు వచ్చాయి. చివరకు వీరహనుమాన్ విజయ యాత్రను స్వచ్ఛందంగా విరమించుకుంటున్నట్లు విశ్వహిందూ పరిషత్, భజరంగ్‌దళ్ ప్రతినిధులు బండారి రమేశ్, రామరాజు, సుభాశ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. తెలంగాణా ప్రభుత్వం కరోనా నియమాలు మత రాజకీయాలకు అతీతంగా అమలు చేయాలని ఈ సందర్భంగా ఆ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. చదవండి: ఈ హనుమాన్ జయంతికి ఓ ప్రత్యేకత ఉంది.. చిరంజీవి చదవండి: గుడ్‌న్యూస్.. 64 వేల బెడ్లతో రైల్వే శాఖ సిద్ధం -
జై బజరంగభళీ
సాక్షి నెట్వర్క్/శివ్వంపేట: జిల్లా వ్యాప్తంగా హనుమజ్జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. హిందూ సంస్థల కార్యకర్తలు భారీ హనుమాన్ విగ్రహాలతో పట్టణాలలో ప్రదర్శన నిర్వహించారు. ప్రసిద్ధి చెందిన చాకరిమెట్ల సహకార ఆంజనేయస్వామి ఆలయానికి శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామి వచ్చారు. పూర్ణకుంభ స్వా గతం అందుకున్న ఆయన.. వర్షాలు సమృద్ధిగా కురవాలనే సంకల్పంతో 108 కలశాలతో స్వామికి అభిషేకం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ సైన్స్ కంటే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ఆచారాలు, పద్ధతులు చాలా గొప్పవన్నారు. తల్లిదండ్రులను గౌరవించని వారు సమాజంలో ఉండటానికి అ నర్హులన్నారు. తల్లిదండ్రులతోపాటు గురువు, వైద్యు డు, పాలకులను గౌరవించాలన్నారు. ప్రస్తుతం వర్షాలు లేనందున ప్రతి ఒక్కరు పచ్చదనం పరిరక్షణలో భాగస్వాములు కావాలన్నారు. హిందూ ధర్మాన్ని కించపరిచేలా పలువురు మాట్లాడుతున్నారని, అది సరికాదన్నారు. చాకరిమెట్ల ఆలయ పరిసరాల్లో గోశాల ఏర్పాటు చేయాలనే ఉద్దేశం ఉందని, అందుకు ఎమ్మెల్యే సహకరించాలలన్నారు. ♦ సంగారెడ్డి పట్టణంలో పది అడుగుల ఆంజనేయస్వామి విగ్రహంతో నిర్వహించిన భారీ బైక్ ర్యాలీ ఆకట్టుకుంది. ర్యాలీని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కాసాల బుచ్చిరెడ్డి ప్రారంభించారు. ♦ అందోలులో ప్రహ్లాద్ అనే వ్యక్తి హనుమంతుడి వేషధారణ హనుమాన్ శోభాయాత్రలో పాల్గొనడం ఆకర్షించింది. ♦ సిద్దిపేటలో హిందు స్వాభిమాన్ యాత్రను ఘనంగా నిర్వహించారు. రంగధాంపల్లి గ్రామ శివారు పంచవటి హనుమాన్ దేవాలయం నుంచి 12అడుగుల భారీ విగ్రహం తో పట్టణ పురవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు. -
వైభవంగా హనుమజ్జయంతి
జపాలిలో కిట కిటలాడిన భక్తులు తిరుమల, న్యూస్‌లైన్: తిరుమలలో హనుమాన్ జయంతి వైభవంగా జరిగింది. ప్రతి ఏడాది హనుమజ్జయంతిని తిరుమల పాపవినాశనం మార్గంలోని జపాలిలో వేడుకగా నిర్వహించడం అనవాయితీ. శుక్రవారం హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి టీటీడీ ధర్మకర్తల మండలి చైర్మన్ కనుమూరి బాపిరాజుకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేకువజాము నుంచే ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. ఆంజనేయస్వామి మాలను ధరించి దీక్ష చేప్పటిన భక్తులు తెల్లవారుజామునే ఆలయానికి చేరుకున్నారు. జై సీతారామ్ అంటూ నామస్మరణ చేస్తూ ఆంజనీపుత్రుని సేవలో తరించారు. అంతకుముందు హథీరామ్ జీ మఠం మహంత్ అర్జున్‌దాస్ ఆధ్వర్యంలో ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీఆంజనేయస్వామిని ప్రత్యేక పుష్పాలను అలంకరించి సర్వాంగ సుందరంగా అలంకరించారు. అభిషేకాలను, ఇతర పూజలను నిర్వహించారు. అలాగే శ్రీవారి ఆల యం ముందున్న బేడి ఆంజనేయస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామికి ఉదయం 9గంటలకు ఆభిషేకాన్ని నిర్వహించారు. టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్, జేఈవో శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో అర్చకులు పెరుగు, తేనె, కొబ్బరినీళ్లు, చందనం, పాలుతో అభిషేకాన్ని నిర్వహించారు. మొదటి ఘాట్‌రోడ్డు ఏడోమైలు వద్దనున్న భారీ ఆంజనేయస్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శరణాగత ప్రపత్తికి, దాసభక్తికి ప్రతీక హనుమంతుడు... దాస భక్తికి ప్రతీకైన ఆంజనేయస్వామి భక్తాగ్రేసురుల్లో అత్యంత ఉత్కృష్ణమైనవారని టీటీడీ చైర్మన్ బాపిరాజు పేర్కొన్నారు. టీటీడీ తరుపున ఆంజనేయస్వామికి పట్టువస్త్రాలను సమర్పించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సంపూర్ణ శరణాగతే జీవన పరమావధిగా చేసుకున్న భక్తాగ్రగణ్యుడు హనుమంతుడన్నారు. జీవితాంతం రామనాస్మరణే ధ్యేయంగా మలచుకుని నేటికీ చిరంజీవిగానే ఉంటూ తన భక్తుల కోరికలను తీరుస్తున్న కల్పతరువుగా ఆంజనేయస్వామి ప్రసిద్ధిగాంచినట్లు చెప్పారు. భక్తుల సౌకర్యార్ధం జపాలిలో అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులందరూ జపాలీ తీర్ధానికి చేరుకుని హనుమంతుడిని దర్శించుకుంటున్నారని చెప్పారు.