Hindupuram lodge
-
Doctor Death: పెళ్లయి చిన్నపాప ఉందన్నా వినలేదు.. పచ్చబొట్లు వేయించుకొని..
సాక్షి, హిందూపురం: పట్టణంలోని జీఆర్ లాడ్జీలో కొన్ని రోజుల క్రితం అనుమానాస్పదంగా మరణించిన డాక్టర్ అక్షిత కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఆమె వెంట వచ్చిన యువకుడే హంతకుడిగా తేల్చారు. దిశ పోలీసుస్టేషన్ డీఎస్పీ శ్రీనివాసులు ఆదివారం స్థానిక టూటౌన్ పోలీసుస్టేషన్లో సీఐ వెంకటేశ్వర్లుతో కలిసి వివరాలు వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం ఏటూరి నాగరం పట్టణానికి చెందిన పిసింగి మహేశ్ వర్మ 6 నెలల క్రితం బస్సులో ప్రయాణిస్తుండగా వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్ల డాక్టర్ అక్షిత పరిచయమైంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె ఫోన్ నెంబర్ తెలుసుకున్న మహేశ్ వర్మ ఆమెకు వీడియో కాల్స్ చేసేవాడు. ప్రేమిస్తున్నానంటూ వేధించేవాడు. ఉన్నత విద్య కోసం కొన్నిరోజుల క్రితం అక్షిత చిక్బళ్లాపురం వెళ్లగా.. అక్కడికే వెళ్లి వేధింపులు మొదలుపెట్టాడు. అరెస్ట్ వివరాలు వెల్లడిస్తున్న ‘దిశ’ డీఎస్పీ శ్రీనివాసులు చదవండి: (పెళ్లయి ఇద్దరు పిల్లలు.. ఇంజనీరింగ్ విద్యార్థితో జంప్) తనకు పెళ్లయి చిన్నపాప ఉందని తిరస్కరించినా వినలేదు. ఒంటిపై ఆమె పేరు, ఫొటోలతో పచ్చబొట్లు వేసుకోవడమే కాకుండా ప్రేమ ఒప్పుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటానంటూ బెదిరించినా అక్షిత ఒప్పుకోలేదు. దీంతో ఆమె ఫొటోలు మార్ఫింగ్ చేసిన మహేష్ వర్మ వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని బెదిరించి బెంగళూరు తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. మళ్లీ ఆ ఫొటోలను అడ్డం పెట్టుకుని ఈ నెల 24న హిందూపురంలోని జీఆర్ లాడ్జీకి రప్పించి అత్యాచారం చేశాడు. ఫొటోలు డిలీట్ చేయాలని కోరితే.. ఆమె ముఖంపై దిండు పెట్టి ఊపిరి ఆడకుండా చేశాడు. అనంతరం లాడ్జీ నిర్వాహకుల వద్ద ఆమెకేమైందో తెలియదని అమాయకుడిలా నటిస్తూ తనే 108కు ఫోన్ చేసి సమాచారం ఇచ్చి పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు పక్కా సమాచారంతో ఆదివారం స్థానిక రైల్వే స్టేషన్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మహేష్‌వర్మపై గతంలో కూడా ఆ రాష్ట్రంలో వేధింపుల కేసు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. జైలు శిక్ష కూడా అనుభవించాడన్నారు. -
Doctor Death Mystery: ‘అశ్లీల చిత్రాలతో బెదిరించి చంపేశాడు’
సాక్షి, హిందూపురం (శ్రీసత్యసాయి జిల్లా): తన సోదరి చిత్రాలను మార్ఫింగ్ ద్వారా అశ్లీల చిత్రాలు మార్చి బెదిరించి లాడ్జికి వచ్చేలా చేసి ఆమెను చంపేశాడని పట్టణంలోని జీఆర్ లాడ్జిలో బుధవారం అనుమానాస్పదంగా మృతి చెందిన డాక్టర్ అక్షిత సోదరుడు శషాంక్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు గురువారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు.. వరంగల్ జిల్లా మంగపేటకు చెందిన దేంతనపల్లి అక్షిత కర్ణాటక రాష్ట్రం చిక్‌బళ్లాపూర్ జిల్లాలోని ఓ మెడికల్ కళాశాలలో పీజీ చదువుతోంది. ఈమెకు 6 నెలల క్రితం మెదక్ జిల్లా పటాన్ చెరువుకు చెందిన మహేష్ వర్మ బస్సులో పరిచయమయ్యాడు. అక్షిత ఇన్‌స్ట్రాగామ్ ఫాలో అయ్యి ఆమె ఫొటోలు డౌన్లోడ్ చేసుకున్నాడు. వాటిని అశ్లీలంగా మార్చిన అనంతరం అక్షితకు చూపి బెదిరిస్తూ వచ్చాడు. ఈ క్రమంలోనే బుధవారం ఆమెను హిందూపురంలోని జీఆర్ లాడ్జికి వచ్చేలా చేశాడు. లాడ్జిలోని ఓ రూంలో గొంతు నులిమి హత్య చేశాడు. ఈ మేరకు మృతురాలి తమ్ముడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించినట్లు పేర్కొన్నారు. నిందితుడు మహేష్ వర్మ పరారీలో ఉన్నాడని, అతన్ని పట్టుకుని పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. చదవండి: (లాడ్జిలో ప్రియుడితో దిగిన అక్షిత.. దారుణ హత్య) -
నన్ను అత్యాచారం చేసి చంపబోయాడు!
అనంతపురం: హిందూపురంలోని ఓ లాడ్జిలో ఆదివారం ఓ యువతి అపస్మారక స్థితిలో కనిపించింది. అది గమనించిన లాడ్జీ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించింది. కాసేపటికి తేరుకున్న ఆ యువతి.. తన మేనమామ తనకు మాయమాటలు చెప్పి ఈ లాడ్జీకి తీసుకువచ్చినట్టు చెప్పింది. మేనమామ బాబు.. తనపై అత్యాచారం చేసి చంపేందుకు యత్నించినట్టు ఆమె ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.