historical low
-
రూపాయి చరిత్రాత్మక పతనం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ గురువారం భారీగా పతనమయ్యింది. చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఒకేరోజు రూపాయి 86 పైసలు (1.16 శాతం) బలహీనపడి 75.12 వద్ద ముగిసింది. ఇంత వరకూ రూపాయి ఈ స్థాయిని ఎప్పుడూ చూడలేదు. కోవిడ్–19 భయాందోళనకర పరిస్థితులు, ఈక్విటీ మార్కెట్ల భారీ నష్టాలు, దేశం నుంచి భారీగా వెనక్కు వెళుతున్న విదేశీ పెట్టుబడులు, ఆరు దేశాలతో ట్రేడయ్యే డాలర్ ఇండెక్స్ బలోపేతం వంటి అంశాలు రూపాయి బలహీనతకు కారణాలు. కొన్ని ముఖ్యాంశాలు చూస్తే.. ► గడచిన ఆరు నెలల్లో (2019 సెప్టెంబర్ 3 తర్వాత) రూపాయి ఒకేరోజు 86 పైసలు బలహీనపడ్డం ఇదే తొలిసారి. ► ఈ ఏడాది మార్చి ఒక్కనెలలోనే రూపాయి విలువ 4 శాతం పతనమయ్యింది. ► బుధవారం రూపాయి ముగింపు 74.26. గురువారం 74.96 వద్ద బలహీన ధోరణిలో ట్రేడింగ్ ప్రారంభమైంది. 74.70 గరిష్టం దాటి ముందుకు వెళ్లలేదు. ఒకదశలో 75.30 కనిష్టాన్ని కూడా చూసింది. ► భారత్ షేర్లు, బాండ్ల నుంచి ఈ నెల్లో ఇప్పటి వరకూ విదేశీ ఇన్వెస్టర్లు 10 బిలియన్ డాలర్ల పెట్టుబడులను వెనక్కు తీసుకున్నారు. 2013 ఆర్థిక సంక్షోభ పరిస్థితుల అనంతరం ఇంత స్థాయిలో పెట్టుబడుల ఉపసంహరణ ఇదే తొలిసారి. ► బుధవారం దాదాపు 18% పడిన క్రూడ్ ధర, గురువారం అదే స్థాయిలో రికవరీ అవడం కూడా రూపాయి సెంటిమెంట్‌ను బలహీనపరిచింది. ► కోవిడ్–19 భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అన్ని పెట్టుబడుల సాధనాల నుంచీ నిధులు ఉపసంహంచుకుని డాలర్ కోసం వెంటబడుతున్న సంకేతాలు ఉన్నాయి. డాలర్ ఇండెక్స్ 103 దాటేయడం గమనార్హం. ► రూపాయి కనిష్ట స్థాయిల చరిత్ర చూస్తే ఈ నెల 12, 13 తేదీల ఇంట్రాడేల్లో వరుసగా 74.50ని చూసినా, ఈ నెల 18వ తేదీ బుధవారం వరకూ కనిష్ట స్థాయి ముగింపు మాత్రం 74.39. క్రూడ్ ధరల భారీ పెరుగుదల నేపథ్యంలో 2018 అక్టోబర్ 9న రూపాయి ఈ (74.39) చరిత్రాత్మక కనిష్ట స్థాయి వద్ద ముగిసింది. నాడు ఇంట్రాడేలో 74.45 స్థాయిని కూడా తాకింది. ► తర్వాత పలు సానుకూల అంశాలతో క్రమంగా కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. అయితే ఇక్కడ నుంచి ఏ దశలోనూ మరింత బలపడలేకపోయింది. ► కరోనా కాటు నేపథ్యంలో కొద్ది వారాల్లో 76.20 వరకూ రూపాయి బలహీనపడే అవకాశం ఉందని కొందరి వాదన. -
రూపాయి@66.24
ఆహార భద్రత బిల్లు సబ్బిడీపై భయాందోళనలు రూపాయి పతనానికి కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి తాజాగా చారిత్రాత్మక కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఇంట్రాడే మార్కెట్ లో రూపాయి 66.30 విలువకు క్షీణించి, చివరికి 66.24 వద్ద ముగిసింది. రూపాయి మరింత క్షీణించడం స్థానిక ఈక్వీటి మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరలు పెరగడం, దిగుమతిదారుల, బ్యాంకుల నుంచి డాలర్ కు డిమాండ్ పెరగడం రూపాయి పతనానికి మరో కారణమైంది. మంగళవారం మార్కెట్ లో రూపాయి 194 పైసలు క్షీణించింది. -
రూపాయి మరింత పతనం.. చారిత్రక కనిష్ఠం 64.68
-
రూపాయి మరింత పతనం
రూపాయి పరిస్థితి నానాటికీ తీసికట్టుగా తయారవుతోంది. బుధవారం ఉదయం కొద్దిసేపు పర్వాలేదనిపించినా, మళ్లీ కాసేపటికే దిగజారడం మొదలుపెట్టింది. మధ్యాహ్నం ఓ సమయంలో డాలర్‌తో పోలిస్తే 64.68 వద్ద ట్రేడయింది. గత కొన్ని రోజుల ఇంట్రా డే రికార్డులతో పోల్చి చూసుకుంటే ఇది అత్యంత తక్కువ కావడం గమనార్హం. మధ్యాహ్నం చాలా సేపు దాదాపు 64.11 వద్ద ట్రేడయినా, తర్వాత మరింత పతనమైంది. ఈ ప్రభావం స్టాక్ మార్కెట్ల మీద కూడా స్పష్టంగా కనిపించింది. బీఎస్ఈ సెన్సెక్స్‌తో పాటు నిఫ్టీ కూడా దారుణమైన నష్టాలను చవిచూశాయి. కానీ, ఈ పతనం ఇక్కడితో ఆగదని, ఒక నెల రోజుల్లో సుమారు 70 రూపాయల స్థాయికి దిగజారుతుందని డ్యూచ్ బ్యాంకు అంచనా వేస్తోంది. అలాగని ఇది శాశ్వతంగా అంతే స్థాయిలో ఉండిపోతుందని కూడా ఆవేదన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఈ సంవత్సరాంతానికల్లా మళ్లీ కోలుకుంటుందని చెబుతున్నారు. ఈ విషయాన్ని డ్యూచ్ బ్యాంకు ఓ పరిశోధన చేసి మరీ తేల్చింది. బుధవారం ఉదయం అమెరికన్ డాలర్‌తో పోలిస్తే 63.33 వద్ద ట్రేడయిన రూపాయి.. తర్వాత పమళ్లీ పడిపోయింది. మంగళవారం కూడా ఇంట్రా డేలో 64.31 వద్ద ట్రేడయ్యి అత్యంత దిగువ స్థాయికి వెళ్లింది. బుధవారం దానికంటే మించిపోయింది. ఇంట్రా డేలో 64.68 వరకు వెళ్లిపోయింది. సాధారణంగానే డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ తక్కువగా ఉంటుంది గానీ, ఇటీవలి కాలంలో అది మరింత దారుణంగా తయారైంది. సుమారు నెల రోజుల్లోనే రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే 70కి చేరుతుందని డ్యూచ్ బ్యాంకు అంచనా వేస్తోంది. ఇక్కడి ఆర్థిక విధానాలేవీ రూపాయిని బలపరిచే విధంగా లేకపోవడం, మరోవైపు దేశానికి వచ్చే పెట్టుబడులు కూడా తగ్గిపోవడం లాంటి కారణాల వల్ల రూపాయి జీవితకాల కనిష్ఠానికి వెళ్లిపోయింది. ఇదంతా చూస్తుంటే భారతదేశం మళ్లీ 1991 నాటి ఆర్థిక సంక్షోభం దిశగా వెళ్తోందన్న సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థికమంత్రి చిదంబరం, ప్రధాని మన్మోహన్ సింగ్, ఇతర ఆర్థికవేత్తలు దీన్ని ఖండిస్తున్నా, పరిస్థితులన్నీ అలాగే ఉన్నాయి. రూపాయి విలువ దిగజారిపోవడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు నుంచి ప్రతి కొనుగోలుకు మరింత ఎక్కువగా వెచ్చించాల్సి వస్తోంది. దీనివల్ల మన దేశ ఖజానా మరింతగా డొల్లపోయే ప్రమాదం స్పష్టంగా ఉంది. చెల్లింపుల విషయంలో సంక్షోభం తలెత్తితే, గతంలోలా మళ్లీ బంగారాన్ని తాకట్టు పెట్టి మరీ దాన్ని అధిగమించాల్సి వస్తుంది.