రూపాయి@66.24
ఆహార భద్రత బిల్లు సబ్బిడీపై భయాందోళనలు రూపాయి పతనానికి కారణమైంది. అంతర్జాతీయ మార్కెట్ లో డాలర్ కు వ్యతిరేకంగా రూపాయి తాజాగా చారిత్రాత్మక కనిష్టాన్ని నమోదు చేసుకుంది. ఇంట్రాడే మార్కెట్ లో రూపాయి 66.30 విలువకు క్షీణించి, చివరికి 66.24 వద్ద ముగిసింది.
రూపాయి మరింత క్షీణించడం స్థానిక ఈక్వీటి మార్కెట్లపై తీవ్ర ప్రభావం చూపింది. చమురు ధరలు పెరగడం, దిగుమతిదారుల, బ్యాంకుల నుంచి డాలర్ కు డిమాండ్ పెరగడం రూపాయి పతనానికి మరో కారణమైంది. మంగళవారం మార్కెట్ లో రూపాయి 194 పైసలు క్షీణించింది.