Historical temple
-
ఖమ్మం జిల్లాలో వెయ్యేళ్లనాటి శివాలయం-అతిపెద్ద శివలింగం
కూసుమంచి (ఖమ్మం): కాకతీయుల భక్తిభావం, కళావైభవానికి ప్రత్యక్షసాక్ష్యం కూసుమంచిలోని శివాలయం. ఈశివాలయాన్నే గణపేశ్వరాలయంగా, రామలింగేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తున్నారు. క్రీ.శ 11–12వ శతాబ్ధంలో కాకతీయుల కాలంలో వెయ్యిన్నొక్కటి శివాలయాల నిర్మాణ క్రమంలో గణపతి దేవుడు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ప్రతీతి. ఈ ఆలయంలోని శివలింగం దక్షిణ భారతదేశంలో అతిపెద్ద శివలింగాల్లో ఒకటిగా ప్రసిద్ది చెందింది. ఖమ్మం జిల్లా కూసుమంచిలో ఉత్తర దిశగా ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ నిర్మాణం ఓ చేయి, కాలు లేని శిల్పి చేశాడనేది ప్రచారంలో ఉంది. ఈ ఆలయాన్ని పెద్దపెద్ద బండరాళ్లతో పేర్చిన ఘనత ఆ శిల్పికే దక్కింది. (చదవండి: అపార్ట్మెంట్లో బోర్‌వాటర్ వివాదం.. వాటర్‌ట్యాంక్ ఎక్కి దంపతుల హల్చల్) శివాలయంలోని శివలింగం ఆలయాన్ని పైగుండా చూస్తే నక్షత్రాకారంలో, మరోవైపు శివలింగాకారం ఉన్నట్లుగా బండరాళ్లను పేర్చి వాటిపై ఆలయాన్ని నిర్మించటం విశేషం. ఇక ఆలయంలో ఉన్న శివలింగం 6 అడుగుల ఎత్తు. 5.3 సెంమీ వ్యాసార్థంతో ప్రతిష్టించగా అది నున్నటి గ్రానైట్ రాయిని పోలి ఉంటుంది. శివలింగంపై ప్రతినిత్యం సూర్యోదయ సమయాన సూర్యకిరణాలు ప్రసరించేలా ఆలయాన్ని నిర్మించటం మరో విశేషం. వందలాది సంవత్సరాల పాటు కంపచెట్లు, మట్టిదిబ్బలతో జీర్ణావస్థకు చేరింది. గ్రామంలో గొప్ప ఆలయం ఉన్నా దాన్ని ఎవరూ పట్టించుకోక పోవటంతో అది ఎలా ఉందో కూడా గ్రామస్తులకు తెలియని పరిస్థితి. నాటి కూసుమంచి సీఐగా ఉన్న సాథు వీరప్రతాప్‌రెడ్డి దృష్టికి ఆలయం విషయం రావటంతో గ్రామస్థుల సహకారంతో ఈఆలయాన్ని వెలుగులోకి తీసుకవచ్చారు. దాన్ని అభివృద్ది పరిచి పూజలు ప్రారంభింపజేశారు. భక్తుల చొరవతో ఈ ఆలయం క్రమంగా వెలుగులోకి వచ్చింది. ఆ తరువాత మహా ఆలయంగా వెలుగొందుతోంది. ఈ ఆలయాన్ని దర్శించటం పునర్జన్మ సుకృతంగా పెద్దలు అభివర్ణిస్తున్నారు. కూసుమంచి శివాలయాన్ని దర్శిస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. అందుకే ఈశివాలయం భక్తులకు కొంగు బంగారంగా విరాజిల్లుతూ.. నానాటికి దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రతి శివరాత్రికి ఖమ్మం జిల్లాతో పాటు పొరుగున ఉన్న ఉమ్మడి నల్లగొండ, వరంగల్ నుండి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ప్రతియేడు వేల మంది భక్తులు ఈ శివాలయాన్ని దర్శించుకుంటున్నారు. (చదవండి: జంగు ప్రహ్లాద్ కన్నుమూత.. సీఎం కేసీఆర్ సంతాపం..) -
అలా ఉన్న చారిత్రక ఆలయాలను ఇలా మార్చారు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో చారిత్రక ప్రాంతాలు ఎన్నో! వేల ఏళ్ల నుంచి నిజాం కాలం వరకు నిర్మితమైన ఆలయాలకు కొదవలేదు. అద్భుత నిర్మాణకౌశలంతో అబ్బురపడేలా రూపుదిద్దుకుని అలరిస్తున్నాయి. కానీ, చాలా ఆలయాలు తీవ్ర నిరాదరణకు గురై జీర్ణావస్థకు చేరుకున్నాయి. వాటికి పూర్వవైభవం తెచ్చే దిశగా తెలంగాణ వారసత్వశాఖ అడుగులు వేసిన దాఖలాల్లేవు. అయితే ప్రభుత్వం కల్పించుకుంటే తప్ప అవి బాగు కావన్న భావనను పక్కన పెట్టి.. ఓ గ్రామ ప్రజలు ఆలయాలకు కొత్తశోభను తెచ్చి రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. సరిగ్గా ప్రపంచ పర్యాటక దినోత్సవం(ఈ నెల 27న) వేళ గ్రామస్తులు ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దారు. నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ల సహకారంతో శ్రమదానం చేసి ఆ ఊరు ఇప్పుడు కొత్తమార్గం చూపుతోంది. ఆ ఊరు నాగర్‌కర్నూలు జిల్లాలోని నందివడ్డెమాన్ గ్రామం. చేయిచేయి కలిపి శ్రమదానం చేసి.. నందివడ్డెమాన్ గ్రామంలో పదికిపైగా పురాతన దేవాలయాలు ఉన్నాయి. వాటిల్లో శివాలయం, త్రిమూర్తుల ఆలయంతోపాటు ఐదు గుళ్లను నేచర్ అండ్ ఇండియన్ కల్చర్ ఫౌండేషన్ ప్రతినిధులు ఎంపిక చేసుకున్నారు. ఆ సంస్థకు చెందిన కృష్ణంరాజుతోపాటు 30 మంది ప్రతినిధులు, ప్లీచ్ ఇండియా సీఈవో శివనాగిరిరెడ్డిలు ఆదివారం ఆ గ్రామానికి వెళ్లి యువకులతోపాటు సర్పంచ్ సుదర్శన్, ఎంపీటీసీ ఊషన్న, ఉపసర్పంచ్ శంకర్‌లతో సమావేశమయ్యారు. ప్రభుత్వసాయం కోసం ఎదురుచూడకుండా ముందుకు రావాలని సూచించటంతో యువకులు సుముఖత వ్యక్తం చేశారు. అందరూ శ్రమదానం చేసి ఐదు ఆలయాలను శుభ్రం చేసుకుని ముస్తాబు చేశారు. ఇలా మరిన్ని ఊళ్లను కూడా గుర్తించి ఆలయాలను పరిరక్షిస్తామని నిర్వాహకులు తెలిపారు. భద్రకాళి ఆలయం.. నాడు- నేడు అది గోన వంశీయుల రాజధాని ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి మాట్లాడుతూ క్రీ.శ.12, 13 శతాబ్దాల్లో కాకతీయ సామంతులైన గోన వంశీయులకు వర్ధమానపురం రాజధానిగా విలసిల్లిందని, రంగనాథ రామాయణం రాసిన గోన బుద్ధారెడ్డి, గోన గన్నారెడ్డి, గోన విఠల్‌రెడ్డిలు ఈ గ్రామం వారేనని పేర్కొన్నారు. జైనమత కేంద్రంగా వర్ధమాన మహావీరుడి ఆలయం ఉన్నందున ఈ ఊరికి ఆ పేరువచ్చిందని వివరించారు. అయితే కాలక్రమంలో ఆ ఊరు పేరు నందివడ్డేమాన్‌గా మారి ఉంటుందని అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో కూడా ఆయా దేవాలయాలను పరిరక్షించుకోవాలని ఆయన గ్రామస్తులకు సూచించారు. -
వలసపోవటమే తొలి మందు!
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి.. ఆ పదం వింటేనే గుండెలు ఆగిపోతాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ వేల మందిని బలిగొని ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇదే తరహాలో వేల ఏళ్ల కింద కూడా వైరస్లు ఊళ్లకు ఊళ్లనే మింగేశాయి. వైరస్ వ్యాపించిందంటే చాలు వేల మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. కోవిడ్ లాంటి వైరస్లు కొత్తేమీ కాదు.. భారీ ప్రాణ నష్టానికి కారణమైనవి ఎన్నో మన చరిత్రను వణికించాయి. దొరికిన తొలి ఆధారం ఇలాంటి మహమ్మారి ప్రబలినప్పుడు జనం మొదట చేసే పని వలస వెళ్లటం. ఆ ప్రాంతంలో వైరస్ ప్రబలంగా ఉండటంతో దానికి దూరంగా వెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉండటం అప్పట్లో చేసే మొదటి పని. ఇది నిజమనేందుకు కడప జిల్లా నందలూరులో ఆధారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న సౌమ్యనాథస్వామి దేవాలయంలో ఉన్న శాసనంలో నాటి మహమ్మారి వల్ల వలసపోయిన తీరును వివరించారు. దీన్ని చోళరాజు రాజేంద్రుడి హయాంలో 1257లో వేయించినట్లు గుర్తించారు. ఆ సమయంలో అక్కడి పెరుగం దూర గ్రామానికి చెందిన వారు మారీజ్వరం (ప్లేగు తరహా మహమ్మారి) ప్రబలి జననష్టం జరుగుతుంటే మిగతావారు వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్లకు వారు తిరిగి వచ్చేసరికి ఇతరులు ఆ ప్రాం తాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో తమ భూములు తిరిగి తమకు ఇప్పించాలంటూ రాజును వేడుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ శాసనంపై చెక్కించారు. మహమ్మారి ప్రబలడంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేవారనేందుకు తెలుగు ప్రాంతాల్లో లభించిన ఏకైక లిఖితపూర్వక ఆధారం ఇదే. నాగార్జునకొండపై మెడికల్ ల్యాబ్.. సిద్ధ నాగార్జునుడు.. అలనాటి వైద్య శాస్త్రంలో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి. 9వ శతాబ్దంలోనే నాగార్జున కొండపై అ ద్భుత మెడికల్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఎన్నో భయంకర వ్యాధుల కు మందుల ఫార్ములాలు రూ పొందించటానికి ఆద్యుడయ్యా డు. పాదరసం ప్రధాన వనరుగా ధాతువుల ఆధారంగా శారీరక స మస్యలను దూరం చేసే కీలక ప రిశోధనలకు ఇదే కేంద్రమైందని ఆయుర్వేద శాస్త్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇనుము ధాతువు లోపాన్ని నివారించటం ద్వారా రక్తహీనతను అరికట్టే కీలక అంశాలపై ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఏలేశ్వరం కేంద్రంగా నవ రససిద్ధులు (పరిశోధకులు) ఎన్నో మందులను రూపొందించారని చరి త్ర చెబుతోంది. ఇక్కడి పరిశోధనాలయానికి సంబంధించి గతంలోనూ ఆధారాలు వెలుగు చూశాయి. వలసల గురించి తెలిపే నందలూరు శాసనం ఇదే ఏలేశ్వరం ప్రధాన కేంద్రంగా.. ఏలేశ్వరానికి అప్పట్లో ప్రపంచ కీర్తి ఉండేది. ఇది ప్రధాన బౌద్ధ క్షేత్రం. ఇక్కడి విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయంలో చాలా దేశాలకు చెందిన విద్యార్థులు విద్య అభ్యసించేవారు. అదే రీతిలో ప్రపంచానికి మందులు అందించే పరిశోధనాలయం కూడా ఉందని చారిత్రక ఆధారాలు రూఢీ చేస్తున్నాయి. అప్పట్లో విపరీతంగా ప్రబలే మహమ్మారులను ఎదుర్కొనే మందులు కూడా ఇక్కడ రూపొందించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు. ఆస్పత్రులపై కాకతీయుల దృష్టి వైరస్ ప్రభావాలతో మహమ్మారులు ప్రబలి భారీ ప్రాణ నష్టం జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వైద్యశాలలు కూడా ఏర్పాటయ్యాయి. వైర స్ ప్రభావిత రోగాలకే కాకుండా సాధారణ చికిత్సలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేయించారు. కాకతీయుల కాలంలో ఇలాంటి ఆస్పత్రులు పలు ప్రాంతా ల్లో రూపొందాయి. ఇలాంటి ఆస్పత్రికి సంబంధించిన ఓ శాసనం గుంటూరు సమీపంలో వెలుగు చూసింది. అక్కడి మల్కాపూర్ గ్రామంలోని పురాతన దేవాల యం సమీపంలో లభించిన శాసనంలో.. కాకతీయ రా జులు అందజేసిన భూమిలో ఆస్పత్రి నిర్మాణం ప్రస్తా వన ఉంది. మందారం, వెలగపూడి గ్రామాల్లో ఈ భూ ములు కేటాయించారు. మొదటి గ్రామంలో గణపతి దేవుడు, రెండో గ్రామంలో రుద్రమదేవి ఇచ్చిన భూ ముల్లో ఆస్పత్రులు నిర్మించినట్లు 1261లో వేయించిన శాసనం చెబుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా తుమ్ముగూడెం (ఇంద్రపాలనగరం)లో లభించిన శాసనంలో.. ఎర్లపాడు, పెంకపర్రు ప్రాంతాల్లో గోవిందవర్మ అనే రాజు ఆస్పత్రి నిర్మించినట్టు ఉంది. అలనాటి అద్భుత వైద్యుడు అగ్గలయ్య హన్మకొండ బస్టాండు వెనుక ఉండే గుట్టపై 30 అడుగుల ఎత్తుండే ఓ శిల్పం అబ్బురపరుస్తుంది. అది ప్రముఖ వైద్యుడు అగ్గలయ్యది. ఒకటో శతాబ్దంలోనే శస్త్రచికిత్సలు చేసి, వైద్య రత్నాకర బిరుదు పొందిన ఆయ న అప్పట్లో ప్రపంచ ప్రసి ద్ధ వైద్యుడు. జైనుల కా లంలో గుర్తింపు పొందిన ఆయన.. ఈ ప్రాంతంలో ఎన్నో వ్యాధులను నయం చేశాడని, ఆయన ఆధ్వర్యంలో అద్భుత చికిత్సాలయాలు కొనసాగాయని అంటారు. ఈ వివరాలు సైదాపూర్‌లో శాసనంలో ఉన్నాయి. మన పురాణాల్లోనూ వైరస్ ప్రస్తావన! మన పురాణాల్లోనూ వైరస్ ప్రస్తావన ఉం దని చెబుతారు. వరాహ పురాణంలో అంధకాసుర వధను దీనికి ఉదాహరణగా చూపుతారు. ఆ రాక్షసుడి శరీరం నుంచి నేలపై ఒక్క రక్తం చుక్క పడినా ఎంతో మం ది అంధకాసురులు ఉద్భవించేవారట. వైరస్‌కు ప్ర తిరూపమే ఆ రాక్షసుడి వృ త్తాంతంగా చెబుతారు. అతడిని వధించేందుకు ప్రత్యేకంగా సప్త మాత్రికలు ఉద్భ వించారని, రాక్షసుడి శరీరం నుంచి రక్త చుక్కలు నేలపై పడకుండా జాగ్రత్త పడ్డ తీరును ఇందులో ప్రస్తావించారు. -
‘దత్తపుత్రుడు’ రామప్ప
సాక్షి, హైదరాబాద్: చారిత్రకంగా ఎన్నో అద్భుతమైన నిర్మాణాలు నిధుల్లేక అభివృద్ధికి నోచు కోవట్లేదు. ఈ నేపథ్యంలో చారిత్రక నిర్మాణాలను దత్తతకు ఇవ్వాలని కేంద్రం నిర్ణయిం చింది. దశల వారీగా ముఖ్యమైన కట్టడాలను కార్పొరేట్ సంస్థలకు దత్తత ఇవ్వాలని భావి స్తోంది. సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థలు చారిత్రక కట్టడాల అభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చింది. ఇందు లో భాగంగా తొలుత రామప్ప దేవాలయం, గోల్కొండ కోట, చార్మినార్‌ల దత్తతకు సంబం ధించి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్ర పర్యాటక శాఖ, సాంస్కృ తిక శాఖ, కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థలు దీన్ని జారీ చేశాయి. దీనికి జీఎమ్మార్, కాక తీయ హెరిటేజ్ ట్రస్టులతో పాటు మరికొన్ని సంస్థలు దరఖాస్తు చేసుకున్నాయి. వీటిని పరిశీలించిన కేంద్ర పర్యాటక శాఖ ఆయా సంస్థలకు లేఖలు అందజేసింది. రామప్ప దేవాలయ ప్రాంగణాన్ని అభివృద్ధి చేసేందుకు సంబంధించి మూడు వారాల్లో ప్రతిపాదనలు సమర్పించాలని సూచించింది. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో కేంద్రపర్యాటక శాఖ సహాయ మంత్రి అల్ఫోన్స్ సమక్షంలో కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ ప్రతినిధి పాండురంగారావుకు అధికారులు లేఖ అందజేశారు. జీఎమ్మార్ సంస్థ కూడా గతంలో ప్రతిపాదన సమర్పించింది. మూడువారాల్లో వచ్చే ప్రతిపాదనలు పరిశీలించి దత్తత సంస్థను కేంద్రం అధికారికంగా ప్రకటిస్తుంది. దత్తత తీసుకుని ఏం చేస్తారు..? రామప్ప దేవాలయం ప్రపంచంలోనే ప్రత్యేక నిర్మాణాల్లో ఒకటి. నాటి ఇంజనీరింగ్ అద్భుతానికి నిలువెత్తు నిదర్శనం. నిర్మాణ బరువును తగ్గించేందుకు నీటిలో తేలే ఇటుకలను రూపొందించి ఈ గుడిని నిర్మించారు. ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో గుర్తింపు కోసం పోటీ పడుతోంది. కానీ ఆ అద్భుత నిర్మాణం వద్ద పర్యాటకులకు కనీస వసతుల్లేవు. సరైన రోడ్డు వసతి లేదు. ప్రస్తుతం ఆ కట్టడం కేంద్ర పురావస్తు సర్వేక్షణ సంస్థ అధీనంలో ఉండగా, నిర్మాణ పర్యవేక్షణకు మాత్రమే నిధులు విడుదల చేస్తూ సంరక్షిస్తోంది. కానీ పర్యాటకులకు వసతులు కల్పించటం సాధ్యం కావ టం లేదు. మంచి రోడ్డు, పచ్చిక బయళ్లు, లైటింగ్ వ్యవస్థ, సౌండ్, లైట్ షో లాంటి ఏర్పాట్లు చేయాలన్నా నిధుల కొరత వేధిస్తోంది. దీంతో సామాజిక బాధ్యత కింద కార్పొరేట్ సంస్థల నుంచి విరాళాలు సేకరించి ఆ పనులు చేపట్టబోతోంది. దత్తతకు తీసుకునే సంస్థ ఆ నిధుల జమ బాధ్యతను పర్యవేక్షిస్తుంది. పనులు మాత్రం పురావస్తు శాఖ నిర్వహిస్తుంది. -
500 ఏళ్ల చారిత్ర - కఠ్మాండు పేరు ఏర్పడిన కట్టడం
కఠ్మాండు: భూకంపం ధాటికి ప్రఖ్యాత 'కష్టమండప' దేవాలయం నేలమట్టమైంది. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక నిర్మాణం పేరుపైనే నేపాల్ రాజధానికి కఠ్మాండు అనే పేరు వచ్చింది. భూకంపం వచ్చినరోజే దర్బారా స్వ్కేర్ దగ్గరలో ఉన్న ఆ గుడి ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. దాంతో దేవాలయ శిధిలాల కిందపడి రక్తదాతలు, నర్సులు దుర్మరణం చెందారు. గతంలో భూకంపాన్ని తట్టుకున్న చరిత్ర దీనికి ఉంది. దాంతో పలువురు ఈ నిర్మాణంలోనికి పరిగెత్తుకువచ్చారు. భూకం తీవ్రతకు ఆలయం కూలిపోయింది. వారంతా శిధిలాల కింద ప్రాణాలు కోల్పోయారు.