శాసనం లభించిన దేవాలయం
సాక్షి, హైదరాబాద్: మహమ్మారి.. ఆ పదం వింటేనే గుండెలు ఆగిపోతాయి. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న కోవిడ్ వైరస్ వేల మందిని బలిగొని ప్రపంచమంతటా విస్తరిస్తోంది. ఇదే తరహాలో వేల ఏళ్ల కింద కూడా వైరస్‌లు ఊళ్లకు ఊళ్లనే మింగేశాయి. వైరస్ వ్యాపించిందంటే చాలు వేల మంది ప్రాణాలు పోగొట్టుకునేవారు. కోవిడ్ లాంటి వైరస్‌లు కొత్తేమీ కాదు.. భారీ ప్రాణ నష్టానికి కారణమైనవి ఎన్నో మన చరిత్రను వణికించాయి.
దొరికిన తొలి ఆధారం
ఇలాంటి మహమ్మారి ప్రబలినప్పుడు జనం మొదట చేసే పని వలస వెళ్లటం. ఆ ప్రాంతంలో వైరస్ ప్రబలంగా ఉండటంతో దానికి దూరంగా వెళ్లి సురక్షిత ప్రాంతంలో ఉండటం అప్పట్లో చేసే మొదటి పని. ఇది నిజమనేందుకు కడప జిల్లా నందలూరులో ఆధారం వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న సౌమ్యనాథస్వామి దేవాలయంలో ఉన్న శాసనంలో నాటి మహమ్మారి వల్ల వలసపోయిన తీరును వివరించారు. దీన్ని చోళరాజు రాజేంద్రుడి హయాంలో 1257లో వేయించినట్లు గుర్తించారు. ఆ సమయంలో అక్కడి పెరుగం దూర గ్రామానికి చెందిన వారు మారీజ్వరం (ప్లేగు తరహా మహమ్మారి) ప్రబలి జననష్టం జరుగుతుంటే మిగతావారు వేరే సురక్షిత ప్రాంతానికి వెళ్లి నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కొన్నేళ్లకు వారు తిరిగి వచ్చేసరికి ఇతరులు ఆ ప్రాం తాన్ని ఆక్రమించుకున్నారు. దీంతో తమ భూములు తిరిగి తమకు ఇప్పించాలంటూ రాజును వేడుకున్నారు. ఈ వ్యవహారాన్ని ఆ శాసనంపై చెక్కించారు. మహమ్మారి ప్రబలడంతో ఆ ప్రాంతాన్ని పూర్తిగా ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లేవారనేందుకు తెలుగు ప్రాంతాల్లో లభించిన ఏకైక లిఖితపూర్వక ఆధారం ఇదే.
నాగార్జునకొండపై మెడికల్ ల్యాబ్..
సిద్ధ నాగార్జునుడు.. అలనాటి వైద్య శాస్త్రంలో అద్భుతాలు సృష్టించిన వ్యక్తి. 9వ శతాబ్దంలోనే నాగార్జున కొండపై అ ద్భుత మెడికల్ ల్యాబ్ ఏర్పాటు చేసి ఎన్నో భయంకర వ్యాధుల కు మందుల ఫార్ములాలు రూ పొందించటానికి ఆద్యుడయ్యా డు. పాదరసం ప్రధాన వనరుగా ధాతువుల ఆధారంగా శారీరక స మస్యలను దూరం చేసే కీలక ప రిశోధనలకు ఇదే కేంద్రమైందని ఆయుర్వేద శాస్త్రాలు తేటతెల్లం చేస్తున్నాయి. ఇనుము ధాతువు లోపాన్ని నివారించటం ద్వారా రక్తహీనతను అరికట్టే కీలక అంశాలపై ఇక్కడ పరిశోధనలు జరిగాయి. ఏలేశ్వరం కేంద్రంగా నవ రససిద్ధులు (పరిశోధకులు) ఎన్నో మందులను రూపొందించారని చరి త్ర చెబుతోంది. ఇక్కడి పరిశోధనాలయానికి సంబంధించి గతంలోనూ ఆధారాలు వెలుగు చూశాయి.
వలసల గురించి తెలిపే నందలూరు శాసనం ఇదే
ఏలేశ్వరం ప్రధాన కేంద్రంగా..
ఏలేశ్వరానికి అప్పట్లో ప్రపంచ కీర్తి ఉండేది. ఇది ప్రధాన బౌద్ధ క్షేత్రం. ఇక్కడి విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయంలో చాలా దేశాలకు చెందిన విద్యార్థులు విద్య అభ్యసించేవారు. అదే రీతిలో ప్రపంచానికి మందులు అందించే పరిశోధనాలయం కూడా ఉందని చారిత్రక ఆధారాలు రూఢీ చేస్తున్నాయి. అప్పట్లో విపరీతంగా ప్రబలే మహమ్మారులను ఎదుర్కొనే మందులు కూడా ఇక్కడ రూపొందించారని చరిత్రకారులు పేర్కొంటున్నారు.
ఆస్పత్రులపై కాకతీయుల దృష్టి
వైరస్ ప్రభావాలతో మహమ్మారులు ప్రబలి భారీ ప్రాణ నష్టం జరుగుతుండటంతో వివిధ ప్రాంతాల్లో ప్రత్యేకంగా వైద్యశాలలు కూడా ఏర్పాటయ్యాయి. వైర స్ ప్రభావిత రోగాలకే కాకుండా సాధారణ చికిత్సలను దృష్టిలో ఉంచుకుని వీటిని ఏర్పాటు చేయించారు. కాకతీయుల కాలంలో ఇలాంటి ఆస్పత్రులు పలు ప్రాంతా ల్లో రూపొందాయి. ఇలాంటి ఆస్పత్రికి సంబంధించిన ఓ శాసనం గుంటూరు సమీపంలో వెలుగు చూసింది. అక్కడి మల్కాపూర్ గ్రామంలోని పురాతన దేవాల యం సమీపంలో లభించిన శాసనంలో.. కాకతీయ రా జులు అందజేసిన భూమిలో ఆస్పత్రి నిర్మాణం ప్రస్తా వన ఉంది. మందారం, వెలగపూడి గ్రామాల్లో ఈ భూ ములు కేటాయించారు. మొదటి గ్రామంలో గణపతి దేవుడు, రెండో గ్రామంలో రుద్రమదేవి ఇచ్చిన భూ ముల్లో ఆస్పత్రులు నిర్మించినట్లు 1261లో వేయించిన శాసనం చెబుతోంది. ఉమ్మడి నల్లగొండ జిల్లా తుమ్ముగూడెం (ఇంద్రపాలనగరం)లో లభించిన శాసనంలో.. ఎర్లపాడు, పెంకపర్రు ప్రాంతాల్లో గోవిందవర్మ అనే రాజు ఆస్పత్రి నిర్మించినట్టు ఉంది.
అలనాటి అద్భుత వైద్యుడు అగ్గలయ్య
హన్మకొండ బస్టాండు వెనుక ఉండే గుట్టపై 30 అడుగుల ఎత్తుండే ఓ శిల్పం అబ్బురపరుస్తుంది. అది ప్రముఖ వైద్యుడు అగ్గలయ్యది. ఒకటో శతాబ్దంలోనే శస్త్రచికిత్సలు చేసి, వైద్య రత్నాకర బిరుదు పొందిన ఆయ న అప్పట్లో ప్రపంచ ప్రసి ద్ధ వైద్యుడు. జైనుల కా లంలో గుర్తింపు పొందిన ఆయన.. ఈ ప్రాంతంలో ఎన్నో వ్యాధులను నయం చేశాడని, ఆయన ఆధ్వర్యంలో అద్భుత చికిత్సాలయాలు కొనసాగాయని అంటారు. ఈ వివరాలు సైదాపూర్‌లో శాసనంలో ఉన్నాయి.
మన పురాణాల్లోనూ వైరస్ ప్రస్తావన!
మన పురాణాల్లోనూ వైరస్ ప్రస్తావన ఉం దని చెబుతారు. వరాహ పురాణంలో అంధకాసుర వధను దీనికి ఉదాహరణగా చూపుతారు. ఆ రాక్షసుడి శరీరం నుంచి నేలపై ఒక్క రక్తం చుక్క పడినా ఎంతో మం ది అంధకాసురులు ఉద్భవించేవారట. వైరస్‌కు ప్ర తిరూపమే ఆ రాక్షసుడి వృ త్తాంతంగా చెబుతారు. అతడిని వధించేందుకు ప్రత్యేకంగా సప్త మాత్రికలు ఉద్భ వించారని, రాక్షసుడి శరీరం నుంచి రక్త చుక్కలు నేలపై పడకుండా జాగ్రత్త పడ్డ తీరును ఇందులో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment