భూకంపానికి ముందు, ఆ తరువాత 'కష్టమండప' దేవాలయం
కఠ్మాండు: భూకంపం ధాటికి ప్రఖ్యాత 'కష్టమండప' దేవాలయం నేలమట్టమైంది. దాదాపు 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ చారిత్రక నిర్మాణం పేరుపైనే నేపాల్ రాజధానికి కఠ్మాండు అనే పేరు వచ్చింది. భూకంపం వచ్చినరోజే దర్బారా స్వ్కేర్ దగ్గరలో ఉన్న ఆ గుడి ప్రాంగణంలో రక్తదాన శిబిరం నిర్వహించారు.
దాంతో దేవాలయ శిధిలాల కిందపడి రక్తదాతలు, నర్సులు దుర్మరణం చెందారు. గతంలో భూకంపాన్ని తట్టుకున్న చరిత్ర దీనికి ఉంది. దాంతో పలువురు ఈ నిర్మాణంలోనికి పరిగెత్తుకువచ్చారు. భూకం తీవ్రతకు ఆలయం కూలిపోయింది. వారంతా శిధిలాల కింద ప్రాణాలు కోల్పోయారు.