hits divider
-
అదృష్టం.. తృటిలో తప్పిన ప్రమాదం
-
అదృష్టం.. తృటిలో తప్పిన ప్రమాదం
సాక్షి, జగిత్యాల : జిల్లా కేంద్రంలో సోమవారం అర్థరాత్రి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి దాటాక అతి వేగంగా వెళుతున్న కారు జాగిత్యాల బైపాస్ రోడ్ లో డివైడర్ ను ఢీకొట్టి మూడు పల్టీలు పడింది. కారు బెలూన్ లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. కారు ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు జగిత్యాల లోని విద్యానగర్ కు చెందిన యువకులుగా గుర్తించారు. ప్రమాదంలో కారుబాగం బాగా దెబ్బతినగా.. ఎవరికి గాయాలు కాకపోవడం కొసమెరుపు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
సిగ్నేచర్ బ్రిడ్జిపై మరో ప్రమాదం
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సిగ్నేచర్ బ్రిడ్జిపై వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 24 గంటల్లోపే రెండు ప్రమాదాలు సంభవించాయి. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. శనివారం(నేడు) జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ రోజు ఉదయం ఇద్దరు యువకులు బైక్ మీద సిగ్నేచర్ బ్రిడ్జిపై నంగ్లోయి వెళ్తున్నారు. అయితే వేగంగా వెళ్తున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి బ్రిడ్జిపై ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది. ప్రమాదానికి గురైన వారిని ఘజియాబాద్‌కు చెందిన శంకర్(24), దీపక్(17)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. దీపక్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి జనాలు ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకుగాను ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి మరి స్టంట్లు చేస్తున్నారంటూ పోలీసులు వివరించారు. -
సిగ్నేచర్ బ్రిడ్జిపై థ్రిల్.. ప్రాణాలు తీసింది
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో ఇటీవల ప్రారంభమైన సిగ్నేచర్ బ్రిడ్జిపై శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతిచెందారు. కేటీఎమ్ స్పోర్ట్స్ బైక్‌పై వేగంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులు.. అదుపు తప్పి బ్రిడ్జిపై గల డివైడర్‌ను ఢీ కొట్టారు. దీంతో వారు 30 అడుగుల లోతులో పడిపోయారు. తీవ్రంగా గాయపడినవారిని ఆస్పత్రికి తరలించేలోపే ప్రాణాలు కొల్పోయారు. కాగా, అధిక స్పీడ్‌తో వెళ్తూ.. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నించడంతోనే బైక్ అదుపుతప్పి ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. కాగా, సిగ్నేచర్ బ్రిడ్జిపై జరిగిన తొలి యాక్సిడెంట్ ఇదే. ఢిల్లీ ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూసిన సిగ్నేచర్ బ్రిడ్జిని నవంబర్ 4 తేదీన సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రారంభించారు. బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి ఇక్కడ సెల్ఫీలు, ఫొటోలు తీసుకోవడానికి జనాలు ఆసక్తి కనబరుస్తున్నారు. బ్రిడ్జిపై వాహనాలు నిలిపి మరి ఫొటోలు దిగుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్నారు. కొందరైతే ప్రమాదకరంగా రేలింగ్‌పై నిల్చుని సైతం సెల్ఫీలు దిగుతున్నారు. పోలీసులు, అధికారులు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ.. యువత వాటిని పట్టించుకోవడం లేదు. -
నల్గొండ జిల్లాలో బస్సు బోల్తా