
న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవలే ప్రారంభించిన సిగ్నేచర్ బ్రిడ్జిపై వరుసగా ప్రమాదాలు జరుగుతున్నాయి. 24 గంటల్లోపే రెండు ప్రమాదాలు సంభవించాయి. శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా.. శనివారం(నేడు) జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. ఈ రోజు ఉదయం ఇద్దరు యువకులు బైక్ మీద సిగ్నేచర్ బ్రిడ్జిపై నంగ్లోయి వెళ్తున్నారు. అయితే వేగంగా వెళ్తున్న బైక్ ఒక్కసారిగా అదుపు తప్పి బ్రిడ్జిపై ఉన్న డివైడర్‌ను ఢీ కొట్టింది.
ప్రమాదానికి గురైన వారిని ఘజియాబాద్‌కు చెందిన శంకర్(24), దీపక్(17)లుగా గుర్తించారు. ఈ ప్రమాదంలో శంకర్ అక్కడికక్కడే మృతి చెందగా.. దీపక్ తీవ్రంగా గాయపడ్డాడు. బ్రిడ్జి ప్రారంభమైనప్పటి నుంచి జనాలు ఇక్కడ సెల్ఫీలు, ఫోటోలు తీసుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నారు. అందుకుగాను ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి మరి స్టంట్లు చేస్తున్నారంటూ పోలీసులు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment