
సాక్షి, జగిత్యాల : జిల్లా కేంద్రంలో సోమవారం అర్థరాత్రి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి దాటాక అతి వేగంగా వెళుతున్న కారు జాగిత్యాల బైపాస్ రోడ్ లో డివైడర్ ను ఢీకొట్టి మూడు పల్టీలు పడింది. కారు బెలూన్ లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు సురక్షితంగా బయటపడ్డారు. కారు ప్రమాదం దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. ప్రమాదానికి గురైన కారులో ప్రయాణిస్తున్న వ్యక్తులు జగిత్యాల లోని విద్యానగర్ కు చెందిన యువకులుగా గుర్తించారు. ప్రమాదంలో కారుబాగం బాగా దెబ్బతినగా.. ఎవరికి గాయాలు కాకపోవడం కొసమెరుపు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment