hitting
-
ప్లీజ్ ఇలాంటి స్కూల్లో పిల్లలను చేర్పించకండి
-
మహిళా అధికారినిపై దాష్టీకం: డ్యూటీలో ఉంది.. అందులోనూ గర్భిణి!
కొంతమంది ఇటీవల కాలంలో అత్యంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారు. ఆడ, మగ అనే తారతమ్యం లేకుండా అత్యంత దారుణంగా దిగజారి ప్రవర్తిస్తున్నారు. అచ్చం అలాంటి అమానుష ఘటనే మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పైగా సాటి మహిళ, గర్భిణి అని చూడకుండా అత్యంత పాశవికంగా ఆమె పై దాడి చేశారు. అసలు విషయంలోకెళ్తే....మహారాష్ట్రలోని సతారా జిల్లాలో అటవీ శాఖలో పనిచేస్తున్న గర్భిణి అధికారి పై పల్సవాడే మాజీ సర్పంచ్ అతని భార్య అత్యంత అమానుషంగా దాడిచేశారు. మహిళా అటవీ శాఖాధికారులు తనకు సమాచారం ఇవ్వకుండా కూలీలను వేరే స్థలంలో పనిలో పెట్టుకున్నారని స్థానిక అటవీ కమిటీలో మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం వాపోయారు. అంతేకాదు మాజీ సర్పంచ్ సోమవారం మహిళా అధికారిణిని ఫోన్లో బెదిరించాడు కూడా. ఈ మేరకు మాజీ సర్పంచ్ రామచంద్ర గంగారాం జంకర్, అతని భార్య ప్రగతి జంకర్.. మహిళా అటవీ అధికారి, ఆమె భర్త పై దాడి చేశారు. పైగా మాజీ సర్పంచ్ భార్య ప్రగతి జంకర్... సాటి మహిళ, గర్భిణి అనే కనికరం లేకుండా అటవీ అధికారి జుట్లు పట్టుకుని లాగి కిందపడేసి, చెప్పుతో కొట్టి అవమానించారు. ఈ మేరకు ఈ ఘటనను ఆ మహిళా ఆఫీసర్ భర్త, అటవీ సిబ్బంది రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి మాజీ సర్పంచ్‌ని అతని భార్యను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. (చదవండి: ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఏందయ్యా ఇది..) -
BAN Vs WI: వికెట్లు పోతూనే ఉన్నాయి.. అయినా చితకబాదారు
West Indies Hits 72 Runs Last 6 Overs.. టి20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తొలి 14 ఓవర్లలో విండీస్ చేసిన స్కోరు 70.. ఇందులో కేవలం మూడు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఇక కోల్పోయిన వికెట్లు నాలుగు. ఇక 14వ ఓవర్ తర్వాత విండీస్ బాదుడు మొదలుపెట్టింది.ఎవరైనా వికెట్ పడితే ఒత్తిడికి లోనవ్వడం చూస్తుంటాం. కానీ విండీస్ మాత్రం ఒకవైపు వికెట్లు పోతున్నా బాదుడే లక్ష్యంగా పెట్టుకుంది. చివరి ఆరు ఓవర్లలో విండీస్ 72 పరుగులను రాబట్టింది. ఈ 72 పరుగుల్లో .. 50 పరుగులు.. బౌండరీలు, సిక్సర్లు(7 సిక్సర్లు, 2 ఫోర్లు ) రూపంలో రావడం విశేషం. నికోలస్ పూరన్(44), జేసన్ హోల్డర్(15) సిక్సర్ల వర్షం కురిపించారు. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ సరైన ఆటతీరును కనబరచకపోయినప్పటికి జట్టులో హిట్టర్లకు మాత్రం కొదువ లేదని మరోసారి నిరూపించింది. చదవండి: BAN Vs WI: రసెల్ డైమండ్ డక్.. వెంటాడిన దురదృష్టం West Indies vs. Bangladesh - 1st Inning Highlights via @t20worldcup https://t.co/R4i9Rj3IL6 — varun seggari (@SeggariVarun) October 29, 2021 -
చులకన భావం; బావమరిదిపై బావలు దాడి
సాక్షి చీమకుర్తి: లెక్కలేని తనం, చులకన భావం, అహంకారం వెరసి నిండు ప్రాణం గాలిలో కలిసింది. మేనల్లుడిని ఒక దెబ్బ కొట్టినందుకు ఇద్దరు బావలు కలిసి బావమరిదిని తలపై ఇనుప పైపుతో బలంగా కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అతడు మృత్యువాతపడ్డాడు. పోలీసులు, ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. సంతనూతలపాడు మండలం గుమ్మనంపాడుకు చెందిన తాడి చిరంజీవి (30) తలపై తన బావలు వెలుగు శ్రీనివాస్, కోటిలు ఇనుప పైపు తీసుకొని బలంగా బాదారు. మంగళవారం సాయంత్రం ఈ సంఘటన జరగగా రాత్రి ఒంటి గంట సమయంలో ఒంగోలు జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ దాసరి రాజారావు తెలిపారు. మృతదేహాన్ని సీఐ సుబ్బారావు, ఎస్ఐ రాజారావు పరిశీలించారు. మృతుడి భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు హత్య కేసుగా నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. చదవండి: ప్రియుడి మోసం.. నర్సు ఆత్మహత్య చదవండి: ‘నన్ను చూసి నవ్వుతావంట్రా.. ఎంత ధైర్యంరా నీకు’ గాయపడిన సాయి మణికంఠ సాక్షి, అద్దంకి : ఉన్న సమస్యను కూర్చొని మాట్లాడుకుందాం..అంటూ పిలిపించి యువకుడిపై కత్తితో దాడి చేశారు. ఆ యువకుడు పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాడు. ఈ సంఘటన పట్టణంలోని బస్టాండ్ సెంటర్ సమీపంలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. జె.పంగులూరుకు చెందిన గుంజి సాయి మణికంఠ హైదరాబాద్‌లో బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పాలెపు శ్రీను కుమార్తె తనను ప్రేమించమంటూ సాయి మణికంఠ వెంట పడేది. ఆమె పదే పదే అలాగే చేస్తుండటంతో అతడు ఆమె తండ్రితో విషయం చెప్పి కుమార్తెను జాగ్రత్త చేసుకోమని కోరాడు. శ్రీను కుమార్తె అదే పనిగా మళ్లీ మణికంఠకు ఫోన్లు చేస్తోంది. కుమార్తెకు నచ్చజెప్పినా వినక పోవడంతో ఆమె తండ్రి హైదరాబాద్‌లో ఉన్న సాయి మణికంఠను ఊరికి రమ్మని కోరాడు. వస్తే తమ కుమార్తె విషయం మాట్లాడాలని చెప్పి పిలిపించాడు. యువకుడు అద్దంకి బస్టాండ్ వద్దకు రాగానే శ్రీను పథకం ప్రకారం కత్తితో దాడి చేశాడు. హఠాత్ పరిణామానికి భీతిల్లిన మణికంఠ బతుకు జీవుడా అంటూ పారిపోయి ఓ చోట దాక్కుని ప్రాణాలు దక్కించుకున్నాడు. తేరుకున్న తర్వాత 108కి ఫోన్ చేశాడు. 108 సిబ్బంది వచ్చి క్షతగాత్రుడిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. క్షతగాత్రుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మహేశ్ తెలిపారు. -
సాహా విధ్వంసం.. 20 బంతుల్లో శతకం!
కోల్‌కతా : టీమిండియా టెస్ట్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహా రెచ్చిపోయాడు. ఐపీఎల్ ఎఫెక్ట్ ఎమో కానీ మైదానంలో చెలరేగాడు. ఏకంగా 14 సిక్సులు, నాలుగు ఫోర్లతో కేవలం 20 బంతుల్లో శతకం బాదాడు. శనివారం కోల్‌కతాలో జరిగిన జేసీ ముఖర్జీ లోకల్ టీ20 టోర్నీలో సాహా 20 బంతుల్లో 102 పరుగులు చేశాడు. ఎదుర్కొన్న 20 బంతుల్లో 18 బంతులను బౌండరీ లైన్ దాటించడం విశేషం. వీటితోనే సాహా 100 పరుగులను పూర్తి చేశాడు. మరో రెండు బంతుల్లో రెండు సింగిల్స్ సాధించాడు. ఈ విజృంభణతో సాహా ప్రాతినిధ్యం వహిస్తున్న మోహన్ బగాన్ జట్టు బీఎన్ఆర్ రీక్రియేషన్ క్లబ్‌పై పది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బీఎన్ఆర్ 152 లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన మోహన్ బగాన్ సాహా, కెప్టెన్ సుబ్హోమయ్(43 22 బంతుల్లో)లు దాటిగా ఆడటంతో వికెట్ నష్ట పోకుండా కేవలం 7 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఈ మ్యాచ్ అనంతరం సాహా మాట్లాడుతూ.. ‘ఇది రికార్డో కాదో కూడా నాకు తెలియదు. ఐపీఎల్‌ను దృష్టిలో ఉంచుకోని ప్రత్యేకమైన్ షాట్స్ ఆడటానికి ప్రయత్నించా. ప్రతి బంతి నా బ్యాట్ మధ్యలో తగిలిందని భావించి హిట్టింగ్ చేశానని’ తెలిపాడు. ఇక వన్డే, టీ20ల్లో అవకాశంపై స్పందిస్తూ.. అది సెలక్టర్ల నిర్ణయమని, అవకాశం వచ్చేలా ఆడటమే నా బాధ్యత అని చెప్పుకొచ్చాడు. ఈ సీజన్ ఐపీఎల్లో సాహా సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. అయితే ఓపెనింగ్ బ్యాటింగ్ చేయడానికే ఇష్టపడుతానన్నా సాహా సన్‌రైజర్స్‌లో ధావన్, వార్నర్‌లు ఉండటంతో ఏ స్థానంలో ఆడటానికైనా సిద్దమేనన్నాడు. ఇప్పటి వరకు టీ20 ఫార్మాట్లో అతి తక్కువ బంతుల్లో శతకం సాధించిన రికార్డు విధ్వంసకర బ్యాట్స్‌మెన్ క్రిస్‌గేల్ పేరిట ఉన్న విషయం తెలిసిందే. 2013 ఐపీఎల్లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుకు ప్రాతినిథ్యం వహించిన గేల్.. పుణె వారియర్స్‌పై 30 బంతుల్లో శతకం సాధించి రికార్డు సృష్టించాడు. -
గాలి జనార్దన్ రెడ్డి పిటిషన్‌ను కొట్టేసిన సుప్రీం
సాక్షి, న్యూఢిల్లీ: గనుల అక్రమ తవ్వకాల కేసుకు సంబంధించి కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్దన్ రెడ్డి దాఖలుచేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టేసింది. పలు కేసుల్లో తన బెయిలు మంజూరుకు విధించిన షరతులను సడలించాలని కోరుతూ సోమవారం ఆయన కోర్టులో పిటిషన్ వేశారు. అనంతపురం, బళ్లారి ప్రాంతాలకు రాకూడదని, విదేశాలకు వెళ్లకూడదని ఆయనను ఆదేశిస్తూ గతంలో బెయిల్ సమయంలో కోర్టు షరతులు విధించడం తెలిసిందే. స్వస్థలం వెళ్లేందుకు అనువుగా బెయిల్ షరతులను సడలించాలని తాజా పిటిషన్లో జనార్దన్‌రెడ్డి కోరారు. జస్టిస్ సిక్రీ నేతృత్వంలోని బెంచ్ పిటిషన్‌ను విచారించి షరతుల సడలింపు కుదరదని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టేసింది. ప్రధాన కేసులో చార్జిషీటు దాఖలైన తర్వాత బెయిల్ షరతుల అంశాన్ని పరిశీలిస్తామని పేర్కొంది. -
ఆర్టీసీ బస్సు ఢీ కొని వ్యక్తి మృతి
గూడూరు రూరల్: ఆర్టీసీ బస్సు ఢీకొని కె.నాగలాపురంకు చెందిన కుర్వ ఎల్లయ్య(46) మృతి చెందాడు. పెంచికలపాడు సమీపంలోని కాటన్‌మిల్లు వద్ద బుధవారం రాత్రి ప్రమాదం చోటుచేసుకుంది. కె.నాగలాపురానికి చెందిన కుర్వ ఎల్లయ్యకు భార్య కిష్టమ్మ, ఇద్దరు సంతానం ఉన్నారు. ఇతనికి 150 వరకు గొర్రెల మంద ఉండగా, వాటిని మేపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పెంచికలపాడు సమీపంలోని కాటన్ మిల్లు వెనుక ఉన్న పొలంలో తన గొర్రెల మందను నిలుపుకున్న కాపరులకు ఇంటి నుంచి భోజనం తీసుకుని రాత్రి 9 గంటలకు బయలుదేరాడు. కాటన్ మిల్లు సమీపంలో రోడ్డుపై ఎడమ వైపున ఎల్లయ్య వెళుతుండగా పత్తికొండ డిపోకు చెందిన ఏపీ 21 జెడ్ 0148 ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డాడు. సమాచారం తెలుసుకున్న కె.నాగలాపురం ఎస్ఐ మల్లికార్జున, హెడ్‌కానిస్టెబుల్ పెద్దయ్య, కానిస్టేబుల్ రామాంజనేయులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న బస్సు డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. -
లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
నంద్యాల: పట్టణంలోని అయ్యలూరు మెట్ట వద్ద లారీ, బైక్ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. సోమవారం గుజరాత్ నుంచి చెన్నైకి వెళ్తున్న లారీ.. బైక్‌పై వెళ్తున్న లారీ సిలార్‌బాషా (35)ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు శిరివెళ్లకు చెందిన రైతు. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందగానే రూరల్ ఎస్ఐ రమణ సంఘటన స్థలానికి చేరుకొని లారీని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి కేసు నమోదు చేశారు -
హెచ్ఎంను చెప్పుతో కొట్టిన ఉపాధ్యాయురాలు
జఫర్‌గఢ్ హైస్కూల్లో ఘటన జఫర్‌గఢ్ : విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పిస్తూ ఆదర్శంగా ఉండాల్సిన ఓ ఉపాధ్యాయురాలు పాఠశాలలోనే ప్రధానోపాధ్యాయుడిపై చెప్పు తో కొట్టగా, మరో ఉపాధ్యాయుడు ఆమెకు తోడై పిడిగుద్దులతో దాడికి పాల్పడ్డాడు. జఫర్‌గఢ్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.. పాఠశాలలో ప్రార్థన సమయం ముగిశాక విద్యార్థులు తరగతి గదుల్లోకి, ఉపాధ్యాయులు స్టాఫ్ రూమ్‌లోకి వెళ్లారు. ప్రధానోపాధ్యాయుడు తిరుపతిరెడ్డి తన గదిలోకి వెళ్లి కూర్చోగా ఇదే పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు విష్ణుమూర్తి, ఉపాధ్యాయురాలు దేవరాయి శారద హెచ్ఎం గదిలోకి వెళ్లారు. ‘మా గురించి ఊరి లో ఎందుకు చెప్తున్నావంటూ’ శారద హెచ్ఎం తిరుపతిరెడ్డిపై చెప్పుతో దాడికి దిగగా పక్కనే ఉన్న విష్ణుమూర్తి కూడా పిడుగుద్దుల వర్షం కురిపించాడు. ఆ సమయంలో క్లర్కు, అటెండర్ మాత్రమే ఉన్నారు. క్లర్కు ప్రధానోపాధ్యాయుడిపై జరుగుతున్న దాడిని నివారించే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. దీంతో భీతిల్లిన హెచ్ఎం బయటకి రావడంతో, గలాటాను గమనించిన మిగతా ఉపాధ్యాయులు కూడా స్టాఫ్ రూములో నుంచి బయటికి వచ్చారు. సమాచారం అందుకున్న ఎంఈఓ బత్తిని రాజేందర్ వెంటనే పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడిపై జరిగిన దాడి విషయాన్ని తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఉపాధ్యాయ సంఘాల నాయకులు కూడా పాఠశాలకు వచ్చారు. ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి కూడా తీసుకెళ్లారు. పరస్పరం ఫిర్యాదు ఉపాధ్యాయుల మధ్య గొడవ స్థానిక పోలీస్స్టేకు చేరుకుంది. తనపై ఉపాధ్యాయురాలు శారద చెప్పుతో దాడికి దిగగా, మరో ఉపాధ్యాయుడు విష్ణుమూర్తి కూడా దాడి చేశాడని, వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు తిరుపతిరెడ్డి పాఠశాల ఉపాధ్యాయ బృందంతో కలిసి స్థానిక పోలీస్స్టేలో లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. హెచ్ఎం తమను అవమానపరుస్తున్నాడంటూ తిరుపతిరెడ్డిపై సదరు ఉపాధ్యాయురాలు శారద కూడా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఇద్దరు ఉపాధ్యాయులపై వేటు విద్యారణ్యపురి :ప్రధానోపాధ్యాయుడిపై దాడికి దిగిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్ చేస్తున్నట్లు డీఈఓ పి.రాజీవ్ తెలిపారు. జఫర్‌గఢ్ హైస్కూల్ హెచ్ఎం తిరుపతిరెడ్డిపై అదే పాఠశాలలో పని చేస్తున్న స్కూల్ అసిస్టెంట్లు డి.శారద, విష్ణుమూర్తి దాడిచేశారని, ఈ విషయాన్ని తిరుపతిరెడ్డి తనకు ఫిర్యాదు చేశారని చెప్పారు. విద్యాబోధన సమయంలో సెల్ఫో వాడకూడదని చెప్పడంతో పాటు ఆ ఇద్దరు ఉపాధ్యాయులు పాఠశాలకు రానప్పుడు గైర్హాజరు వేసినందునే దాడి చేశారని హెచ్ఎం ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఘటనపై విచారణ నిర్వహించామని, ఉపాధ్యాయులు దాడికి పాల్పడింది వాస్తవమేనని తేలిందని చెప్పారు. ఈ ఘటనపై ఎంఈఓ కూడా నివేదిక అందజేశారని, దీంతో వారిద్దరిపై సస్పెన్ష వేటు విధించామని తెలిపారు. ఘటనపై ఈనెల 22న జనగామ డిప్యూటీ డీఈఓతో కూడా విచారణ జరిపిస్తామని చెప్పారు.