West Indies Hits 72 Runs Last 6 Overs.. టి20 ప్రపంచకప్ 2021లో వెస్టిండీస్, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. ఇందులో వింతేముంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే తొలి 14 ఓవర్లలో విండీస్ చేసిన స్కోరు 70.. ఇందులో కేవలం మూడు బౌండరీలు మాత్రమే ఉన్నాయి. ఇక కోల్పోయిన వికెట్లు నాలుగు.
ఇక 14వ ఓవర్ తర్వాత విండీస్ బాదుడు మొదలుపెట్టింది.ఎవరైనా వికెట్ పడితే ఒత్తిడికి లోనవ్వడం చూస్తుంటాం. కానీ విండీస్ మాత్రం ఒకవైపు వికెట్లు పోతున్నా బాదుడే లక్ష్యంగా పెట్టుకుంది. చివరి ఆరు ఓవర్లలో విండీస్ 72 పరుగులను రాబట్టింది. ఈ 72 పరుగుల్లో .. 50 పరుగులు.. బౌండరీలు, సిక్సర్లు(7 సిక్సర్లు, 2 ఫోర్లు ) రూపంలో రావడం విశేషం. నికోలస్ పూరన్(44), జేసన్ హోల్డర్(15) సిక్సర్ల వర్షం కురిపించారు. డిపెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన వెస్టిండీస్ సరైన ఆటతీరును కనబరచకపోయినప్పటికి జట్టులో హిట్టర్లకు మాత్రం కొదువ లేదని మరోసారి నిరూపించింది.
చదవండి: BAN Vs WI: రసెల్ డైమండ్ డక్.. వెంటాడిన దురదృష్టం
West Indies vs. Bangladesh - 1st Inning Highlights via @t20worldcup https://t.co/R4i9Rj3IL6
— varun seggari (@SeggariVarun) October 29, 2021
Comments
Please login to add a commentAdd a comment