Hizbul terrorist
-
కశ్మీర్ లోయలో వరుస హత్యలు.. హిజ్బుల్ ఉగ్రవాది అరెస్ట్
బెంగళూరు: ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సంస్థ టాప్ కమాండర్, టెర్రరిస్ట్ తాలిబ్ హుస్సేన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్ లోయలో హిందువులను లక్ష్యంగా చేసుకుని హత్య చేసిన కేసులో జమ్మూకశ్మీర్ పోలీసులు బెంగుళూరులో ఇతడిని అదుపులోకి తీసుకున్నారు. బెంగుళూరులో ఉగ్రవాది అరెస్టుపై ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ప్రజల కదలికలపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందన్నారు. ఉగ్రవాదిని అరెస్ట్ చేయడంలో తమ పోలీసులు పూర్తి సహాయం అందించారన్నారు. బెంగుళూరులో తాలిబ్ హుస్సేన్‌ను జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్టు చేయడంలో తాము సాయం చేసినట్లు వెల్లడించారు. కశ్మీర్ పోలీసు ఇన్స్పెక్టర్ జనరల్ మాట్లాడుతూ.. రాహుల్ భట్ హత్యలో ఇద్దరు ఉగ్రవాదులు ప్రమేయం ఉండగా ఒకరిని అంతమొందించినట్లు తెలిపారు. అమ్రీన్ భట్ హత్య కేసులో, ఇద్దరు ఉగ్రవాదులను గుర్తించి మట్టుబెట్టారు. ఇక విజయ్ కుమార్ హత్యలో కేసులో ఉగ్రవాదులు గుర్తించామని వారిని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. కాగా జూన్ 2న జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్‌లో ఎలాహి దేహతి బ్యాంక్ మేనేజర్‌ను ఉగ్రవాదులు కాల్చిచంపిన విషయం తెలిసిందే. మేనేజర్ క్యాబిన్లో ఉన్న విజయ్ కుమార్‌ను ఓ ఉగ్రవాది తన చేతుల్లోని తుపాకీతో కాల్చేశాడు. రెండు రౌండ్ల కాల్పులు జరపడంతో మేనేజర్ అక్కడే కుప్పకూలిపోయాడు. చదవండి: బీజేపీకి సంకటం.. దేశ ప్రతిష్టకు భంగపాటు -
కశ్మీర్లో ఎన్కౌంటర్.. 6గురు ఉగ్రవాదుల హతం
శ్రీనగర్ : జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. శనివారం ఉదయం కశ్మీర్ పుల్వామా జిల్లా ట్రాల్ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను అంతమొందించారు. చనిపోయిన వారంతా మాజీ హిజ్బుల్ చీఫ్ జాకీర్ ముసా అన్సార్‌కు చెందిన ‘ఘజ్వత్ ఉల్ హింద్’ ముఠాకు చెందిన వారని తెలిసింది. మరణించిన వారిలో జాకీర్ ముసా ముఖ్య అనుచరుడు సోలిహా మహ్మద్ కూడా ఉన్నట్లు సమాచారం. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా ధ్రువీకరించలేదు. వివరాల ప్రకారం దద్సారా ప్రాంతంలోని ఆరమ్‌పోరా కుగ్రామంలో ఉగ్రవాదుల ఉన్నట్లు అధికారులకు సమాచారం అందింది. దాంతో కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. అధికారులు తనిఖీలు చేస్తుండగా.. ఓ ఇంట్లో దాగి ఉన్న ఉగ్రవాదులు వారిపై కాల్పులు జరిపారు. దీంతో ఎదురుకాల్పుల జరిపిన భద్రతా సిబ్బంది ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చినట్లు తెలిసింది. ఎన్కౌంటర్ జరిగిన ప్రాంతం నుంచి అధికారులు ఆయుధాలను, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. -
హిజ్బుల్ టెర్రరిస్ట్ అరెస్ట్
శ్రీనగర్ : హిజ్బుల్ ముజాహిదిన్ టెర్రరిస్ట్ ఆదిల్ అహ్మద్ భట్‌ను బుధవారం జమ్మూ కశ్మీర్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని దగ్గర నుంచి ఆయుధాలు, బాంబులు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. భద్రతా బలగాలపై కాల్పులు సహా అనేక బాంబు పేలుళ్లలో భట్ నిందితుడు. ఇదిలాఉండగా.. భద్రతా బలగాలు బుధవారం లష్కరే తోయిబా టాప్ కమాండర్ అబు ఇస్మాయిల్‌ను అదుపులోకి తీసుకున్నాయి. అమర్నాథ్ యాత్ర దాడిలో ఇస్మాయిల్ ప్రధాన నిందితుడు. -
ప్రేమికుడిని.. ఉగ్రవాదిగా మార్చేసింది!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు భద్రతా దళాలు గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వానీ స్థానంలో అతని వారసుడిగా హిజ్బుల్ కమాండర్ పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ను భద్రతా దళాలు శనివారం మట్టుబెట్టారు. అయితే సబ్జార్ అహ్మద్ ఎలా ఉగ్రవాదిగా మారాడన్న విషయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సబ్జార్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు ఆ ప్రపోజ్ లను అసలు ఒప్పుకోలేదు. సబ్జార్ అహ్మద్ కు తన కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదని తేల్చిచెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్జార్ ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు. దక్షిణ కశ్మీర్ రత్సునా గ్రామానికి చెందిన వాడు ఈ సబ్జార్, బుర్హాన్ వానీకి చిన్ననాటి మిత్రుడు. అప్పటికే బుర్హాన్ వానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సారథ్యం వహిస్తున్నాడు. టెర్రరిజంలోకి చేరడానికి సబ్జార్ పోలీసుల నుంచి రిఫైల్ దొంగతనం చేశాడు. 2015 ఏప్రిల్ లో ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. బుర్హాన్ వానీ తర్వాత వారసుడిగా పగ్గాలు పొందిన సబ్జార్ అహ్మద్ కు ఇన్నర్ సర్కిల్ లో ఎక్కువగా సబ్ డాన్ గా పేరొంది. జూలైలో బుర్హాన్ చనిపోయాక, హిజ్బుల్ ముజాహిద్దీన్ లోకి యువతను రిక్రూట్ మెంట్ చేసుకునే బాధ్యతను తనే తీసుకున్నాడు. అండర్ గ్రౌండ్ ద్వారానే ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. బుర్హాన్ వానీలాగా కాకుండా..ఈయన సోషల్ మీడియాకు దూరం.