ప్రేమికుడిని.. ఉగ్రవాదిగా మార్చేసింది!
ప్రేమికుడిని.. ఉగ్రవాదిగా మార్చేసింది!
Published Sat, May 27 2017 6:27 PM | Last Updated on Tue, Sep 5 2017 12:09 PM
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు భద్రతా దళాలు గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వానీ స్థానంలో అతని వారసుడిగా హిజ్బుల్ కమాండర్ పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ను భద్రతా దళాలు శనివారం మట్టుబెట్టారు. అయితే సబ్జార్ అహ్మద్ ఎలా ఉగ్రవాదిగా మారాడన్న విషయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సబ్జార్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు ఆ ప్రపోజ్ లను అసలు ఒప్పుకోలేదు. సబ్జార్ అహ్మద్ కు తన కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదని తేల్చిచెప్పారు.
దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్జార్ ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు. దక్షిణ కశ్మీర్ రత్సునా గ్రామానికి చెందిన వాడు ఈ సబ్జార్, బుర్హాన్ వానీకి చిన్ననాటి మిత్రుడు. అప్పటికే బుర్హాన్ వానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సారథ్యం వహిస్తున్నాడు. టెర్రరిజంలోకి చేరడానికి సబ్జార్ పోలీసుల నుంచి రిఫైల్ దొంగతనం చేశాడు. 2015 ఏప్రిల్ లో ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు.
బుర్హాన్ వానీ తర్వాత వారసుడిగా పగ్గాలు పొందిన సబ్జార్ అహ్మద్ కు ఇన్నర్ సర్కిల్ లో ఎక్కువగా సబ్ డాన్ గా పేరొంది. జూలైలో బుర్హాన్ చనిపోయాక, హిజ్బుల్ ముజాహిద్దీన్ లోకి యువతను రిక్రూట్ మెంట్ చేసుకునే బాధ్యతను తనే తీసుకున్నాడు. అండర్ గ్రౌండ్ ద్వారానే ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. బుర్హాన్ వానీలాగా కాకుండా..ఈయన సోషల్ మీడియాకు దూరం.
Advertisement
Advertisement