Sabzar Ahmad
-
ప్రేమికుడిని.. ఉగ్రవాదిగా మార్చేసింది!
శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు భద్రతా దళాలు గట్టి షాకిచ్చిన సంగతి తెలిసిందే. బుర్హాన్ వానీ స్థానంలో అతని వారసుడిగా హిజ్బుల్ కమాండర్ పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ ను భద్రతా దళాలు శనివారం మట్టుబెట్టారు. అయితే సబ్జార్ అహ్మద్ ఎలా ఉగ్రవాదిగా మారాడన్న విషయం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సబ్జార్ ఓ అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడు. కానీ అమ్మాయి వాళ్ల తల్లిదండ్రులు ఆ ప్రపోజ్ లను అసలు ఒప్పుకోలేదు. సబ్జార్ అహ్మద్ కు తన కూతుర్ని ఇవ్వడం ఇష్టం లేదని తేల్చిచెప్పారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన సబ్జార్ ఉగ్రవాదానికి ప్రేరేపితుడయ్యాడు. దక్షిణ కశ్మీర్ రత్సునా గ్రామానికి చెందిన వాడు ఈ సబ్జార్, బుర్హాన్ వానీకి చిన్ననాటి మిత్రుడు. అప్పటికే బుర్హాన్ వానీ, హిజ్బుల్ ముజాహిద్దీన్ కు సారథ్యం వహిస్తున్నాడు. టెర్రరిజంలోకి చేరడానికి సబ్జార్ పోలీసుల నుంచి రిఫైల్ దొంగతనం చేశాడు. 2015 ఏప్రిల్ లో ఈ గ్రూప్ లో జాయిన్ అయ్యాడు. బుర్హాన్ వానీ తర్వాత వారసుడిగా పగ్గాలు పొందిన సబ్జార్ అహ్మద్ కు ఇన్నర్ సర్కిల్ లో ఎక్కువగా సబ్ డాన్ గా పేరొంది. జూలైలో బుర్హాన్ చనిపోయాక, హిజ్బుల్ ముజాహిద్దీన్ లోకి యువతను రిక్రూట్ మెంట్ చేసుకునే బాధ్యతను తనే తీసుకున్నాడు. అండర్ గ్రౌండ్ ద్వారానే ఎక్కువగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నాడు. బుర్హాన్ వానీలాగా కాకుండా..ఈయన సోషల్ మీడియాకు దూరం. -
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
-
బుర్హాన్ వనీ వారసుడు కూడా..!
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో అలజడి రేపుతున్న వేర్పాటువాద మిలిటెంట్ సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్‌కు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. హిబ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ స్థానంలో అతని వారసుడిగా పగ్గాలు చేపట్టిన మరో ఉగ్రవాది సబ్జార్ అహ్మద్ కూడా భద్రతా దళాల ఎన్కౌంటర్లో మృతిచెందాడు. శనివారం జమ్మూకశ్మీర్‌లో జరిగిన రెండు వేర్వేరు ఎన్కౌంటర్లలో ఎనిమిది మంది ఉగ్రవాదులు మరణించారు. ఇందులో సబ్జార్ కూడా ఉన్నాడని భద్రతా దళాలు తెలిపాయి. పుల్వామా జిల్లాలోని ట్రాల్ సెక్టార్లో నక్కిన ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా దళాలు ఏరివేయగా.. బారాముల్లా జిల్లాలోని రాంపూర్ సెక్టార్లో ఎల్వోసీ మీదుగా చొరబాటుకు ప్రయత్నించిన ఆరుగురు టెర్రరిస్టులను ఆర్మీ మట్టుబెట్టింది. ట్రాల్‌లోని ఓ ఇంటిలో అబు జరార్ అలియాస్ సబ్జార్ అహ్మద్, ఓ పాకిస్థానీ ఉగ్రవాదితో కలిసి నక్కి ఉండగా.. భద్రతా దళాలు ఆ ఇంటిని చుట్టుమట్టాయి. ఈ సందర్బంగా జరిగిన ఎదురుకాల్పుల్లో ఈ ఇద్దరూ ప్రాణాలు విడిచాడు. హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్కౌంటర్లో మృతిచెందడంతో కశ్మీర్లో ఘర్షణలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఇక, ఉడీకి సమీపంలో ఉన్న రాంపూర్‌లో తెల్లవారుజామున ఎల్వోసీ మీదుగా అనుమానాస్పద కదలికలు ఉండటంతో వెంటనే అలర్ట్ అయిన సైన్యం ఈ భారీ ఆపరేషన్‌ను చేపట్టింది. ఈ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొని చొరబాటు ప్రయత్నాన్ని భగ్నం చేసింది. ఉడీ సెక్టార్లో శుక్రవారం జరిగిన చొరబాటు యత్నాన్ని సైన్యం సమర్థంగా తిప్పికొట్టిన సంగతి తెలిసిందే. పాక్ బార్డర్ యాక్షన్ టీమ్ (బ్యాట్)కు చెందిన ఇద్దరు చొరబాటుదారులు ఉడీ సెక్టార్‌లోకి వచ్చేందుకు ప్రయత్నించగా.. వారిని సైన్యం ఏరిపారేసింది.