ఐఫోన్7లో మనకు తెలియని మరో కొత్త ఫీచర్!
న్యూయార్క్ : మీరు కొత్తగా కొనుకున్న ఐఫోన్7లో హోమ్ బటన్ పనిచేయడం లేదా..? అయితే ఏమాత్రం ఆందోళన పడకండి. దానికి ఓ పరిష్కారం ఉందట. ఓ వర్చ్యువల్ బటన్‌ను(దాగిఉన్న హోమ్ బటన్) ఆపిల్ సంస్థ ఐఫోన్7లో పొందుపరిచిందట. ఫిజికల్ హోమ్ బటన్ పనిచేయడం ఆగిపోయినప్పుడు, వెంటనే ఈ వర్చ్యువల్ బటన్ ఆన్ అయిపోతుందట. అయితే ఈ వర్చ్యువల్ హోమ్ బటన్ ఎక్కడ ఉంటుందా అనేదే సందేహమా.. ఈ బటన్‌ను ఐఫోన్7 ఫోన్ల స్క్రీన్ కింద భాగంలో ఆ సంస్థ అమర్చిందని ఆపిల్-ట్రాకింగ్ వెబ్సైట్ మ్యాక్రూమర్స్ వెల్లడించింది. ఐఫోన్7 హోమ్ బటన్‌ను ఈ ఏడాదే కొత్తగా రీడిజైన్ చేశారు.
ఈ కొత్త హోమ్ బటన్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, అదనపు ఒత్తిడితో దీన్ని ఆన్ చేయవచ్చు. బటన్‌ను యూజర్లు నొక్కినప్పుడు ఇది వైబ్రేట్ అవుతుంది. అదేవిధంగా ఆ బటన్ యాక్టివేట్ అయినట్టు యూజర్లకు వెంటనే తెలిసిపోతుందని ఫార్చ్యూన్ రిపోర్టు చేసింది.ఈ ఫీచర్ టెక్నికల్‌గా దాగిఉంటుందని, ఫిజికట్ బటన్ పనిచేయనప్పుడు, ఇది ఆన్ అవుతుందని రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. పాత పద్ధతులకు స్వస్తి చెబుతూ హోమ్ బటన్‌లో మార్పులు తీసుకురావాలని ఆపిల్ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఐఫోన్ నుంచి తర్వాత రాబోతున్న గ్లాస్ వేరియంట్ల కోసం హోమ్ బటన్‌లో ఆపిల్ మార్పులు తెస్తున్నట్టు సమాచారం. చిన్నచిన్నగా ఫిజికల్ హోమ్ బటన్ల వాడకాన్ని ఆపిల్ సంస్థ తొలగిస్తుందని టాక్.