Home Land Security Department
-
కెవిన్ అనూహ్య రాజీనామా
వాషింగ్టన్: అమెరికా యాక్టివ్ హోంల్యాండ్ సెక్యూరిటీ సెక్రటరీ కెవిన్ మెక్‌లీనన్ అనూహ్యంగా పదవి నుంచి వైదొలిగారు. ఈ మేరకు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కెవిన్ మెక్‌లీనన్ హోంల్యాండ్ సెక్యూరిటీ యాక్టింగ్ సెక్రటరీగా అత్యుత్తమ సేవలందించారంటూ ఆయనకు ట్రంప్ అభినందనలు తెలిపారు. చాలా ఏళ్లపాటు పాటు ప్రభుత్వానికి సేవలించిన కెవిన్ ఇపుడు తన కుటుంబంతో ఎక్కువ సమయం గడపాలని, ప్రైవేటు రంగానికి వెళ్లాలని కోరుకుంటున్నరాని ఆయన ట్వీట్ చేశారు. చాలా మంది అద్భుతమైన అభ్యర్థులున్నారనీ, వచ్చే వారం కొత్త యాక్టింగ్ సెక్రటరీని ప్రకటిస్తానని ట్రంప్ పేర్కొన్నారు. వైస్ ప్రెసిడెంట్ మైక్ పెన్స్ మెక్‌లీనన్ సేవలను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. అటు తన రాజీనామా విషయాన్ని కెవిన్ కూడా ట్విటర్ ద్వారా ధృవీకరించారు. కాగా మాజీ డిహెచ్ఎస్ కార్యదర్శి కిర్స్ట్జెన్ నీల్సన్ రాజీనామా చేసిన తరువాత ఏప్రిల్‌లో మెక్‌లీనన్ డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ (డిహెచ్ఎస్) యాక్టింగ్ చీఫ్‌గా ఎన్నికయ్యారు. అక్రమ వలసదారులను దక్షిణ సరిహద్దు నుండి యుఎస్‌లోకి ప్రవేశించకుండా నిరోధించే దూకుడు ప్రచారాన్ని పర్యవేక్షించిన మెక్‌లీనన్, ఇటీవల తన ఉద్యోగల బాధ్యతలపై మీడియా ద్వారా తన నిరాశను వ్యక్తం చేశారు. దీనికి తోడుగా వైట్ హౌస్ అతన్ని శాఖ కార్యదర్శిగా నామినేట్ చేయడానికి ఇష్టపడకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. Kevin McAleenan has done an outstanding job as Acting Secretary of Homeland Security. We have worked well together with Border Crossings being way down. Kevin now, after many years in Government, wants to spend more time with his family and go to the private sector.... — Donald J. Trump (@realDonaldTrump) October 11, 2019 Thank you Kevin McAleenan for your dedication and service to our country! You have done great work securing our border and we are thankful for your continued support of President @realDonaldTrump and our entire Administration. — Vice President Mike Pence (@VP) October 12, 2019 I want to thank the President for the opportunity to serve alongside the men and women of the Department of Homeland Security. With his support, over the last 6 months, we have made tremendous progress mitigating the border security and humanitarian crisis we faced this year... pic.twitter.com/A4rTcZgJKF — Acting Sec. Kevin McAleenan (@DHSMcAleenan) October 12, 2019 -
జీరో టాలరెన్స్... అమెరికా వివరణ
వాషింగ్టన్ : అమెరికా సరిహద్దుల నుంచి వలసదారుల్ని నిలువరించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘జీరో టాలరెన్స్’ విధానాన్ని అమల్లోకి తెచ్చిన విషయం తెలిసిందే. ఈ విధానం ప్రకారం అమెరికాలోకి అక్రమంగా చొరబడిన తల్లిదండ్రులతోపాటు ఉన్న పిల్లల్ని వేరుచేసి వేర్వేరు కేంద్రాల్లో ఉంచుతారు. ఎలాంటి సంరక్షణా లేకుండా తాత్కాలికంగా తయారుచేసిన కేజ్‌ల్లో ఐదారేళ్ల పసివారిని నిర్బంధిస్తున్నారంటూ అన్ని వర్గాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తోంది. తాజాగా జీరో టాలరెన్స్ విధానాన్ని అమెరికా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో పాటు లారా బుష్ కూడా తప్పుపట్టారు. అయితే విధానంపై సమాధానం ఇవ్వాల్సిన అధికారులే నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ విభాగం(డీహెచ్ఎస్) జీరో టాలరెన్స్ విధానం గురించి పత్రికా ప్రకటన విడుదల చేసింది. భద్రతా కారణాల దృష్ట్యానే... సరిహద్దు గుండా అక్రమంగా దేశంలోకి చొరబడే తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేసేందుకు ప్రత్యేకంగా ఒక విధానమంటూ ఏదీలేదని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. కాకపోతే మైనర్లను కస్టడీలోకి తీసుకొని వారి బాగోగులను చూసుకోవాల్సిన బాధ్యత తమకు ఉందని తెలిపింది. అయితే.. అక్రమ వలసదారుల్లో కొంత మంది మానవ అక్రమ రవాణాకు పాల్పడేవారు ఉండే అవకాశం ఉన్నందున పిల్లల భద్రత దృష్ట్యానే తాము కాస్త కఠినంగా వ్యవహరిస్తున్నామని పేర్కొంది. 2017 అక్టోబర్ నుంచి 2018 ఫిబ్రవరి మధ్య కాలంలో ఈవిధంగా సరిహద్దుల గుండా పిల్లలతో సహా ప్రవేశించే వారి సంఖ్య 315 శాతం పెరిగిందని, వీరిలో చాలా మంది పిల్లల గురించి ప్రశ్నించినపుడు సరైన సమాధానం చెప్పకుండా తడబడటం తమ అనుమానాన్ని మరింతగా పెంచిందని డీహెచ్ఎస్ తెలిపింది. ఇటువంటి కారణాల వల్లే కుటుంబ సభ్యుల నుంచి పిల్లల్ని వేరుచేస్తున్నామని.. అయితే కోర్టు ఆదేశాల మేరకు అదుపులోకి తీసుకున్న పిల్లల్ని 20 రోజుల్లోగా విడుదల చేస్తున్నామని డీహెచ్ఎస్ తెలిపింది. వారిని తిరస్కరించడం లేదు... ఆశ్రయం కోరి వచ్చేవారిని అమెరికా తిరస్కరించడంలేదని, కేవలం తమ పౌరుల భద్రతా దృష్ట్యానే వలసదారులను అన్ని విధాలా పరీక్షించిన తర్వాతే దేశంలోకి అనుమతిస్తామని డీహెచ్ఎస్ స్పష్టం చేసింది. ఈ విషయంలో అమెరికా సరిహద్దు రక్షణా విభాగం(యూఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్) నిబంధనలను అనుసరించి ఎంత మంది విదేశీయులకు దేశంలోకి ప్రవేశించే అనుమతి ఇవ్వాలనే నిర్ణయం జరుగుతుందని తెలిపింది. ప్రస్తుతం ప్రచారంలో ఉన్నట్లుగా అక్రమ వలసదారుల నుంచి పిల్లల్ని వేరుచేసిన తర్వాత వారి బాగోగుల గురించి తల్లిదండ్రులకు ఎటువంటి సమాచారం అందించడంలేదనే వార్తల్ని డీహెచ్ఎస్ ఖండించింది. పిల్లల్ని ఎక్కడ ఉంచామనే విషయం తల్లిదండ్రులకు కచ్చితంగా తెలియజేస్తామని.. అదేవిధంగా డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్(హెచ్ఎస్ఎస్) సహాయంతో డిటెన్షన్ రిపోర్టింగ్ అండ్ ఇన్ఫర్మేషన్ లైన్(డ్రిల్) ద్వారా ఫోన్, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పిల్లలతో సంభాషించే వీలు కల్పిస్తున్నామని పేర్కొంది. అవన్నీ అవాస్తవాలే... అమెరికా సరిహద్దు అధికారులకు ఇతర భాషలు తెలియని కారణంగానే సమస్యలు ఎక్కువవుతున్నాయంటూ వచ్చిన వార్తల్ని డీహెచ్ఎస్ ఖండించింది. బార్డర్ పెట్రోల్ ట్రైనీస్ కచ్చితంగా రెండు భాషల్లో(ఇంగ్లీష్, స్పానిష్) ప్రావీణ్యం కలిగి ఉంటారని, వలసదారుల మాటల్ని వారు చక్కగా అర్థం చేసుకోగలరని తెలిపింది. పూర్తి వివరాలు తెలుసుకున్న తర్వాతే మైనర్లను అదుపులోకి తీసుకుంటారని.. అదేవిధంగా అదుపులోకి తీసుకునే సమయంలో, తిరిగి తల్లిదండ్రులకు అప్పగించే సమయంలో డాక్యుమెంటేషన్ ప్రాసెస్‌లో నిబంధనలు కచ్చితంగా పాటిస్తారని తెలిపింది. వలసదారులకు శుభ్రమైన తాగు నీటిని అందించడంతో పాటు వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచుతున్నామని డీహెచ్ఎస్ పేర్కొంది. అదేవిధంగా పిల్లల్ని కేజ్‌లు, ఐస్‌బాక్స్‌లో బంధించడం లేదని, వారి సంరక్షణకు సంబంధించి బాధ్యతగా వ్యవహరిస్తున్నామని తెలిపింది. ఫోర్స్ సెటిల్మెంట్ అగ్రిమెంట్ నిర్బంధంలోకి తీసుకున్న వారిని 20 రోజుల్లోగా తప్పనిసరిగా విడుదల చేస్తున్నామని.. ఒంటరిగా దేశంలోకి చొరబడిన మైనర్లను అదుపులోకి తీసుకున్న 72 గంటల్లోగా హెచ్ఎస్ఎస్కు తరలించి వారి వివరాలు సేకరిస్తామని డీహెచ్ఎస్ వివరించింది. నిర్బంధంలో ఉన్న పిల్లలతో మాట్లాడటానికి హెచ్ఎస్ఎస్ కల్పించే సదుపాయాల వివరాలు... హెచ్ఎస్ఎస్ హాట్‌లైన్ (ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో 24 గంటలు అందుబాటులో ఉంటుంది) 1. ఐసీఈ(యూఎస్ ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్) నిబంధనల ప్రకారం నిర్బంధ సౌకర్యాలేని వారు ఫోన్ చేయాల్సిన నంబర్ : 1-800-203-7001 2. ఐసీఈ నిబంధనల ప్రకారం నిర్బంధంలో ఉన్నవారు : 699# ఫోన్ చేసే వ్యక్తులు పిల్లల పూర్తి పేరు, పుట్టిన తేదీ, మాతృదేశం తదితర వివరాలు తెలపాల్సి ఉంటుంది. హెచ్ఎస్ఎస్ ఈమెయిల్ : information@ORRNCC.com ఐసీఈ కాల్‌సెంటర్ : (సోమ వారం- శుక్రవారం ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు) నంబర్లు : 1-888-350-4024, 9116# ఈమెయిల్ - Parental.Interest@ice.dhs.gov -
భారతీయులకు ‘గ్లోబల్ ఎంట్రీ’
ఎక్కువ తనిఖీలు లేకుండానే అమెరికాలోకి ప్రవేశం ఇతర దేశాల పౌరులు ఎక్కువ తనిఖీలు లేకుండా తేలికగా అమెరికాలోకి అడుగుపెట్టడానికి అనుమతించే ‘గ్లోబల్ ఎంట్రీ’ అర్హతను భారతీయులకు కూడా కల్పిస్తున్నట్టు అమెరికా ఇటీవల ప్రకటించింది. ముందే అనుమతి పొందిన, ముప్పు కలిగించే అవకాశం లేని ప్రయాణికులు సులువుగా అమెరికాలో ప్రవేశించడానికి వీలుగా కస్టమ్స్, సరిహద్దు రక్షణ విభాగం (సీబీపీ) గ్లోబల్ ఎంట్రీని గతంలో రూపొందించింది. అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ శాఖలో భాగమైన సీబీపీ తాజా నిర్ణయం ఫలితంగా ఇక నుంచి భారతీయులు గ్లోబల్ ఎంట్రీ సౌకర్యం కోసం గ్లోబల్ ఆన్లైన్ ఎన్రోల్మెంట్ సిస్టం(గోస్) వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. తాజా నిర్ణయంతో గ్లోబల్ ఎంట్రీ అవకాశం లభించిన పదకొండో దేశంగా భారత్ ఆవిర్భవించింది. అమెరికాలో భారత రాయబారిగా ఉన్న నవతేజ్‌సింగ్ సర్నా ఈ విధానంలో పేరు నమోదు చేయించుకున్న తొలి భారతీయుడయ్యారు. విమానాశ్రయాల్లో ఇబ్బందులుండవు! ఇప్పటికే అమెరికాతోపాటు 10 ఇతర దేశాలకు చెందిన 40 లక్షల మంది గ్లోబల్ ఎంట్రీ సభ్యులుగా చేరారు. అమెరికా విమానాశ్రయాల్లో వారు సంప్రదాయ సీపీబీ తనిఖీ లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. ప్రత్యేక ఆటోమేటెడ్ కియోస్క్(గది)కు వెళ్లి తమ గుర్తింపు కార్డులను నిమిషాల్లో తనిఖీ చేయించుకుని అమెరికా నగరాల్లోకి ప్రవేశించవచ్చు. గ్లోబల్ ఎంట్రీ సభ్యులు అమెరికా రవాణా భద్రత విభాగం అందించే ప్రత్యేక స్క్రీనింగ్ సౌకర్యం కూడా పొందవచ్చు. అమెరికాతో సన్నిహిత సంబంధాలున్న అర్జెంటీనా, కొలంబియా, జర్మనీ, మెక్సికో, నెదర్లాండ్స్, పనామా, దక్షిణ కొరియా, సింగపూర్, స్విట్జర్లాండ్, బ్రిటన్ దేశాల పౌరులకు ఇప్పటికే గ్లోబల్ ఎంట్రీ అర్హతకు అనుమతి ఇచ్చారు. తాజాగా భారత్ ఈ జాబితాలో చేరింది. 11 దేశాలతోపాటు అమెరికా పౌరులు, జాతీయులు, చట్టబద్ధమైన శాశ్వత వాసులు కూడా గ్లోబల్ ఎంట్రీలో సభ్యత్వం తీసుకోవడానికి అర్హులే. అలాగే, నెక్సస్ ప్రోగ్రాంలో నమోదైన కెనడా పౌరులు, నివాసులు కూడా గ్లోబల్ ఎంట్రీకి దరఖాస్తుచేసుకోవచ్చు. 53 ఎయిర్‌పోర్టుల్లో సౌకర్యం ప్రస్తుతం 53 అమెరికా విమానాశ్రయాల్లో ఈ గ్లోబల్ ఎంట్రీ ఆటోమేటెడ్ కియోస్క్‌లు పనిచేస్తున్నాయి. ఐదేళ్ల గ్లోబల్ ఎంట్రీ సభ్యత్వానికి దరఖాస్తు ఫీజు వంద డాలర్లు. ఆన్లైన్లోనే అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. మొదట దరఖాస్తుదారుడి పూర్వపరాలు తనిఖీచేస్తారు. అనంతరం అమెరికా, కెనడా, ఖతార్‌లో ఉన్న వందకు పైగా నమోదు కేంద్రాల్లో ఒక చోట దరఖాస్తుదారుడిని సీబీపీ అధికారి ఒకరు ఇంటర్వ్యూ చేసి సభ్యత్వంపై తుది నిర్ణయం తీసుకుంటారు. గ్లోబల్ ఎంట్రీ నియమాలు, షరతులు ఉల్లంఘించినవారి సభ్యత్వం రద్దుచేస్తారు. అమెరికాలోకి ఉగ్రవాదులు, వారు ఉపయోగించే ఆయుధాలు రాకుండా చూడడం గ్లోబల్ ఎంట్రీ ఉద్దేశం. దీని అమలు బాధ్యత సీబీపీదే. – సాక్షి నాలెడ్జ్ సెంటర్