home loan rate
-
ఎస్బీఐ బంపర్ ఆఫర్
ముంబై: బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) గృహ రుణ రేటు 10 బేసిస్ పాయింట్ల (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) వరకూ తగ్గింది. 6.70 శాతం నుంచీ గృహ రుణాలను ఆఫర్ చేయనున్నట్లు బ్యాంక్ ఒక ప్రకటనలో తెలిపింది. రుణ మొత్తాలు, సిబిల్ స్కోర్ ఆధారంగా ఆఫర్ చేస్తున్న తాజా రుణ రేట్లు 2021 మార్చి 31వ తేదీ వరకూ అందుబాటులో ఉంటాయని బ్యాంక్ తెలిపింది. బ్యాంక్ ప్రకటన ప్రకారం, రూ.75 లక్షల వరకూ రుణాలపై వడ్డీ 6.70 శాతం నుంచీ ప్రారంభమవుతుంది. రూ.75 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకూ రుణ రేటు 6.75 శాతంగా ఉంటుంది. ప్రాసెసింగ్ ఫీజును కూడా బ్యాంక్ పూర్తిగా మినహాయిస్తుంది. పండుగల సీజన్ నేపథ్యం.. పండుగల సీజన్‌ను ప్రత్యేకించి మార్చి 29వ తేదీ హోలీని పురస్కరించుకుని తాజా రేట్ల తగ్గింపు నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ బిజినెస్) సలోనీ నారాయణ్ ప్రకటనలో తెలిపారు. మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం నేపథ్యంలో మహిళా రుణ గ్రహీతలకు ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. యోనో యాప్ వినియోగించే కస్టమర్లకు కూడా ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ లభిస్తుందని తెలిపారు. రీపేమెంట్ల వ్యవస్థ సజావుగా ఉందని సలోనీ నారాయణ్ పేర్కొన్నారు. రుణాల రీపేమెంట్ సవాలుతో కూడిన అంశంగా తాము భావించడం లేదనీ ఆయన వెల్లడించారు. ఎటువంటి ఇబ్బంది ఉన్నా, కస్టమర్‌తో కలిసి ఆ సమస్య పరిష్కారంపై బ్యాంక్ దృష్టి పెడుతుందన్నారు. ఈ అంశానికి సంబంధించి బ్యాంక్ తగిన అన్ని చర్యలూ తీసుకుంటోందని వివరించారు. గృహ రుణ విభాగంలో ఎస్బీఐ మొండిబకాయిలు (ఎన్పీఏ) 0.67% నుంచి 0.68% వరకూ ఉన్నట్లు చైర్మన్ దినేష్ ఖారా గత నెల్లో పేర్కొన్నారు. రూ.5 లక్షల కోట్లకుపైగా వ్యాపారం... ఎస్బీఐ గృహ రుణ వ్యాపార పరిమాణం రూ.5 లక్షల కోట్లపైగా ఉంది. బ్యాంక్ రియల్టీ అండ్ హౌసింగ్ బిజినెస్ (ఆర్‌ఈహెచ్‌బీయూ) విభాగం ఏయూఎం (అసెట్ అండర్ మేనేజ్మెంట్) 2012లో రూ.89,000 కోట్లుంటే, 2021 నాటికి ఈ పరిమాణం రూ. 5 లక్షల కోట్లను అధిగమించింది. 2023–24 చివరినాటికి ఈ గృహ రుణ ఏయూఎం రూ. 7 లక్షల కోట్లకు చేరుకోవాలన్న లక్ష్యంతో బ్యాంక్ పనిచేస్తోంది. మొత్తం గృహ రుణ మార్కెట్లో బ్యాంకింగ్ దిగ్గజం వాటా దాదాపు 34 శాతం. 2004లో ఎస్బీఐ గృహ రుణ వ్యాపారంలోకి అడుగుపెట్టింది. అప్పట్లో మొత్తం ఫోర్ట్‌ఫోలియో రూ. 17,000 కోట్లు. బ్యాంకుపై కస్టమర్ల విశ్వాసానికి ఈ విభాగం నిదర్శనమని చైర్మన్ దినేష్ ఖారా పేర్కొన్నారు. ఈ సానుకూల పరిస్థితికి బ్యాంకు సాంకేతికత, వ్యక్తిగత సేవలు కారణమన్నారు. గృహ రుణ మంజూరీ, పంపిణీ వ్యవహారాల్లో సామర్థ్యాలను మెరుగుపరచుకోడానికి పలు రకాల డిజిటల్ చొరవలను బ్యాంక్ ఆవిష్కరించింది. ఇందులో రిటైల్ రుణ నిర్వహణ వ్యవస్థ (ఆర్‌ఎల్‌ఎంఎస్) ఒకటి. రుణాల విషయంలో అన్ని స్థాయిల్లో అత్యుత్తమ డిజిటల్ సొల్యూషన్ ఇది. -
అతి తక్కువ గృహ రుణ రేటు!
బీఓబీ ఆఫర్ ∙ 8.35 శాతానికి తగ్గింపు ముంబై: ప్రభుత్వరంగంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) బ్యాంకింగ్‌లోనే అతితక్కువ గృహ రుణ రేటును ఆఫర్ చేసింది. ఏకంగా 70 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గించినట్లు ప్రకటించింది. దీనితో ఈ రేటు 8.35 శాతానికి తగ్గింది. ఇది గృహ రుణ విభాగానికి సంబంధించి పరిశ్రమలోనే అతి తక్కువ రేటని బ్యాంక్ పేర్కొంది. ఎస్బీఐ గృహ రుణ రేటు 8.50%గా ఉంది. సిబిల్ స్కోర్ ఉండాల్సిందే... తక్కువ గృహ రుణ రేటు ఆఫర్ అందుకోవాలంటే పటిష్ట సిబిల్ స్కోర్ అవసరమని బ్యాంక్ పేర్కొంది. ‘‘ఈ గృహ రుణ రేటు సిబిల్ స్కోర్‌కు అనుసంధానమై ఉంటుంది. కస్టమర్ తప్పనిసరిగా 760 ఆపైన సిబిల్ స్కోర్ పొంది ఉండాలి’’ అని బ్యాంక్ స్పష్టం చేసింది. రూ.50 లక్షల గృహ రుణంపై 70 బేసిస్ పాయింట్ల తగ్గింపు కస్టమర్‌కు నెలకు రూ.2,496 పొదుపు చేస్తుందని, 30 సంవత్సరాల్లో చూసుకుంటే ఇది దాదాపు రూ.9 లక్షల మిగులని బ్యాంక్ పేర్కొంది. కొత్త రేటు జనవరి 7 నుంచీ మంజూరయిన అన్ని రుణాలకూ వర్తిస్తుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. కారు రుణాలపై బీఓబీ వడ్డీరేటు 8.85 శాతం ఉంది. తనఖాల విషయంలో ఈ రేటు 10.35 శాతం. ఎంసీఎల్ఆర్కు మారితే చార్జీలు లేవు... బేస్ రేటు (9.60 శాతం) ప్రాతిపదికగా ఉన్న బ్యాంక్ కస్టమర్లు ఎటువంటి అదనపు చార్జీలూ లేకుండా కొత్త ఎంసీఎల్ఆర్లోకి మారే వెసులుబాటును బీఓబీ ఉంది. ఇలాంటి సందర్భాల్లో ఎస్బీఐసహా మిగిలిన బ్యాంకుల్లోనైతే మొత్తం చెల్లించాల్సిన రుణంలో కనీసం రూ.10,000 లేదా 0.5% ‘స్విచ్ఓవర్’ ఫీజుగా చెల్లించాల్సి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర రేటు కోత..: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర కూడా జనవరి 7వ తేదీతో వర్తించేలా ఎంసీఎల్ఆర్ను 30 బేసిస్ పాయింట్లు తగ్గించింది. వార్షిక ఎంసీఎల్ఆర్ 8.95%గా ఉంటుంది. -
ఇపుడు హెచ్డీఎఫ్సీ కూడా
ముంబై: ప్రభుత్వ, ప్రయివేటు బ్యాంకింగ్ దిగ్గజాలు గృహ రుణాలపై వడ్డీరేట్లు తగ్గించడంలో వరుసగా క్యూ కడుతున్నాయి. వరుసగా ప్రభుత్వరంగ మేజర్ ఎస్బీఐ, ప్రైవేట్ రంగ బ్యాంకు ఐసీఐసీఐ వార్షిక ఎంసీఎల్ఆర్ పై కోత పెడుతూ ప్రకటించగా ఇపుడు ఈ కోవలోకి మరో దిగ్గజ బ్యాంక్ చేరింది. ప్రముఖ ప్రయివేటు రంగ బ్యాంక్ హెచ్డీఎఫ్సీ కూడా హోం లోన్లపై 0.15 శాతం వడ్డీరేటు తగ్గింపును ప్రకటించింది. ముఖ్యంగా బ్యాంకులన్నీ మహిళా రుణ గ్రహీతలకు ప్రాధాన్యత ఇవ్వడం విశేషం. హోం రుణాలను 9.15 శాతం వడ్డీరేటుతో మహిళా రుణగ్రహీతలకు రూ .75 లక్షల వరకు ఇవ్వనున్నట్టు తెలిపింది. అలాగే ఇతరులకు తగ్గింపు రేటులో అంటే 9.20శాతాన్ని అందుబాటులోకి తెచ్చినట్టు హెచ్డీఎఫ్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఎప్పటిలాగానే గత రెండు నెలలుగా తమ ఫండ్స్ మార్జినల్ కాస్ట్ (ఉపాంత వ్యయాలు)తగ్గుముఖం పట్టాయని, ఈ ప్రయోజనాలను వినియోగదారులకు పంచడమే తమ లక్ష్యమని హెచ్డీఎఫ్సీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రేణు సుద్ కర్నాడ్ చెప్పారు. కాగా ఆర్ బీఐ సూచనలమేరకు ఎస్ బీఐ తో పాటు మరిన్ని బ్యాంకులు రుణ వడ్డీరేటును తగ్గించక తప్పదని విశ్లేషకులు అంచనావేశారు. అలాగే ఈ పరిణామం మిగతా చిన్న బ్యాంకులపై పడనుందని కూడా విశ్లేషించారు. -
తీపి కబురందించిన ఐసీఐసీఐ
ముంబై: విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే ప్రయివేట్ బ్యాంకు దిగ్గజం ఐసీఐసీఐ కూడా తీపి కబురు అందించింది. నవంబరు 2 నుంచి హోం లోన్లపై వడ్డీరేట్లను స్వల్పంగా తగ్గించింది. వార్షిక ఎంసీఎల్ ఆర్ 15 బీపీఎస్ పాయింట్లను తగ్గిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. ఐసిఐసిఐ బ్యాంక్ వెబ్ సైట్ ప్రకారం వడ్డీరేటును 9.30 శాతం నుంచి 9.15 శాతానికి తగ్గించింది. అదే సమయంలో వేతన వర్గాలకు 9.35శాతంగా ఉన్న వడ్డీరేటు సవరించిన కొత్త రేటు ప్రకారం ప్రస్తుతం 9.20 శాతంగా ఉండనుంది. ముఖ్యంగా మహిళా ఖాతాదారులకు 9.15శాతం వడ్డీరేటులో గరిష్టంగా రూ.75 లక్షల వరకు గృహరుణాలను అందుబాటులోకి తెచ్చింది. అలాగే తాజాగా బ్యాంక్ టర్మ్ లోన్, ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని కల్పించిన ఐసీఐసీఐ వేతన జీవులకు మరో వెసులుబాటు కల్పించింది. సాలరీడ్ ఎంప్లాయిస్ కి( వేతన జీవులకు) రుణ వడ్డీరేటును 9.20 శాతంగా ప్రకటించింది. కాగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా ఫెస్టివల్ ఆఫర్ పేరుతో గృహ రుణాలపై వడ్డీ రేట్లను తాజాగా తగ్గించింది. 20 బేసిస్ పాయింట్లు కోత పెట్టడంతో వడ్డీ రేటు 9.1 శాతానికి దిగి ఆరేళ్ల కనిష్ఠ స్థాయిని నమోదు చేసింది. ఇతర రుణగ్రహీతలకు కూడా గృహ రుణాలను 9.15 శాతం వడ్డీ రేటుకే అందించనున్నట్లు ప్రకటించడంతో పాటుగా ప్రాసెసింగ్ ఫీజును రూడా మాఫీ చేసిన సంగతి తెలిసిందే.