Home Town
-
ఉద్యోగం కోసం ఫారిన్కే పోవాలా?.. ఆసక్తిగా హోమ్ టౌన్ ట్రైలర్
టాలీవుడ్ ప్రేక్షకులను అలరించేందుకు మరో వెబ్ సిరీస్ వచ్చేస్తోంది. రాజీవ్ కనకాల, ఝాన్సీ ప్రధాన పాత్రల్లో తెరకెక్కించిన తెలుగు వెబ్ సిరీస్ హోమ్ టౌన్(Home Town). ఓ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే కష్టాల నేపథ్యంలోనే ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఇప్పటికే టీజర్ రిలీజ్ చేయగా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.తాజాగా ఈ ఫ్యామిలీ వెబ్ సిరీస్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ చేతుల మీదుగా ట్రైలర్ విడుదల చేశారు. తమ పిల్లలు బాగా చదివి గొప్పవాళ్లుగా ఎదిగితే చూడాలని ఆశపడే తండ్రి తపనే ట్రైలర్లో ప్రధానంగా కనిపిస్తోంది. మధ్య తరగతి కుటుంబాల పరిస్థితులు ఎలా ఉంటాయనేదే హోమ్ టౌన్లో ట్రైలర్లో చూపించారు. ఈ వెబ్ సిరీస్‌కు శ్రీకాంత్ దర్శకత్వం వహించారు. వచ్చేనెల నాలుగో తేదీ నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.You can leave your hometown, but can you ever leave the memories?The streets, the friendships, the late-night dreams Srikanth’s journey is ours too.https://t.co/T4V4GXBJWL#Hometown premieres from April 4 on #aha#ahaOriginal #RajeevKanakala #Jhansi pic.twitter.com/D523DRCH1s— ahavideoin (@ahavideoIN) March 25, 2025 -
పూత రేకులు, కోనసీమ అందాలు.. అద్భుత జ్ఞాపకాలంటోన్న యాంకర్ వింధ్య విశాఖ (ఫోటోలు)
-
పాట రచయిత చంద్రబోస్ స్వగ్రామం చల్లగరిగెలో సంబరాలు
-
హాయిగా ఊళ్లోనే ఉపాధి... ఇక ఎక్కడికీ వెళ్లనవసరం లేకుండా...
కూలీలకు ఉన్న ఊళ్లోనే ఉపాధి పనులను ప్రభుత్వం కల్పిస్తోంది. తద్వారా పొట్ట చేతపట్టుకుని నగరాలకు వలస వెళ్లే బాధ తప్పింది. మండు వేసవిలో ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉదయం వేళల్లో మాత్రమే పని చేసేలా వెసులుబాటు కల్పించింది. దేశంలోనే ఎక్కడా లేని విధంగా కూలీల కోసం వేల కోట్లు ఖర్చు చేస్తోంది. ఉపాధి కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. లక్షలాది కుటుంబాలకు లబ్ధి చేకూరింది. అధికార యంత్రాంగం నిర్విరామ కృషి ఫలితంగా ఉపాధి హామీ పథకం అమలులో రాష్ట్రం జాతీయ స్థాయిలో అగ్రస్థానంలో నిలిచింది. సాక్షి, చిత్తూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికార పగ్గాలు చేపట్టిన నాటి నుంచి ఉపాధి హామీ పథకంపై ప్రత్యేక శ్రద్ధ కనబరిచింది. పారదర్శకంగా పనులు చేపడుతూ కూలీల జీవనానికి భరోసా ఇచ్చింది. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొదటి స్థానం దక్కడం ప్రభుత్వ పనితీరుకు నిదర్శనం. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో జరిగిన పనులు, లబ్ధిదారులకు అందుతున్న నగదుపై నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఏపీ పనితీరును కేంద్రం ప్రశంసించింది. కూలీల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పథకాన్ని క్షేత్రస్థాయిలో ఈ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లోని 31 మండలాల్లో ఉపాధి హామీ పనులు పక్కాగా సాగుతున్నాయి. మూడేళ్లలో 5.5 లక్షల పనిదినాలు జిల్లా వ్యాప్తంగా 1,50,682 కుటుంబాల నుంచి 74,059 మంది కూలీలు ఉపాధి పనులకు హాజరవుతున్నారు. 2019 ప్రారంభం నుంచి ఈ ఏడాది జూన్ 10 వరకు 5,43,81,511 పనిదినాలను కల్పించారు. ఇందుకు గాను రూ.1971.31 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. 2021–22లో 20,393 కుటుంబాలు 100 రోజులపాటు పనులకు హాజరయ్యారు. ఇక 2022–23 ఏడాది ఏప్రిల్ వరకు 13.19 శాతం వరకు వంద రోజుల పనిదినాలు పూర్తి చేసినట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. కూలీలకు రోజువారి వేతనం సగటున రూ.251 అందుతోంది. ఉపాధి పనుల్లో జాబ్‌కార్డుపై నమోదైన ఒక కుటుంబానికి ఏడాదికి కనీసం వంద పనిదినాలు కల్పించాలన్నదే ప్రభుత్వ ఆశయం. కుటుంబంలో ముగ్గురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్నా వారికి కనీసం వంద పనిదినాలు కల్పిస్తారు. పల్లెల్లో పచ్చదనం ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనుల్లో ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం పెంచే పనులకు తొలి ప్రాధాన్యత ఇస్తున్నారు. మొక్కలు నాటేందుకు గోతులు తీయటం నుంచి మొక్కలు నాటి వాటి సంరక్షణ వరకు అన్నీ కూలీలే పర్యవేక్షిస్తున్నారు. దీనివల్ల చాలా గ్రామాల్లో పచ్చదనం పెరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇక పనిచేసిన వెంటనే కూలీలకు సకాలంలో వేతనాలను చెల్లిస్తున్నారు. మెరుగైన వసతులు జిల్లా వ్యాప్తంగా పనిచేస్తున్న ఉపాధి కూలీలకు మెరుగైన వసతులు కల్పించేలా అధికారులు చర్యలు చేపట్టారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని పని ప్రదేశంలో నీడ, మంచినీరు, ఫస్ట్ ఎయిడ్ కిట్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. దీంతో గ్రామీణ ప్రజలు ఉపాధి హామీ పనులకు వెళ్లేందుకు ఉత్సాహం కనబరుస్తున్నారు. కలెక్టర్ హరి నారాయణన్ క్షేత్రస్థాయిలో అమలవుతున్న ఉపాధి హామీ పనులను ఎప్పటికప్పడు పర్యవేక్షిస్తూ పనుల్లో పారదర్శకతను అమలు చేస్తున్నారు. పని అడిగిన ప్రతి కూలీకి ఉపాధి కల్పించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. కూలీలు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లకుండా స్థానికంగానే పనులు కల్పిస్తున్నారు. వారి జీవనోపాధికి తోడ్పాటునందిస్తున్నారు. ఆదుకున్న ఉపాధి ఎండలు మండిపోతున్నాయి. పనులు చేయలేకపోతున్నాము. ఇదే సమయంలో ఉపాధి పనులు కల్పించడంతో పట్టణాలకు వలస వెళ్లాల్సిన బాధ తప్పిపోయింది. ప్రభుత్వం ఉదయం 10 గంటల్లోపే పనులు చేసుకునే వెసులుబాటు కల్పించింది. అనంతరం పశుపోషణతో మెరుగైన జీవనం సాగిస్తున్నాం. –కుప్పయ్య, గొల్లపల్లె యాదమరి మండలం రోజుకు రూ.250 పనులు లేని కాలంలోనే రోజుకు రూ.250 సంపాదించుకునే ఉపాధిని ప్రభుత్వం కల్పించింది. నిత్యం పట్టణానికి వెళ్లే అవస్థ తప్పింది. ఇంటి దగ్గర పశువులను చూసుకునే వారు లేక ఇబ్బందులు పడుతున్నాను. ఉపాధి పనుల వల్ల కూలీ వస్తోంది. మిగిలిన సమయంలో సొంతపనులూ చేసుకుంటున్నాం. – నాగమ్మ, విజయపురం పని కల్పించటమే ధ్యేయం జిల్లా వ్యాప్తంగా అడిగిన వారందరికీ పని కల్పించేలా చర్యలు చేపట్టాము. ఉపాధి పనుల్లో జిల్లాను రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిపేందుకు ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నాం. అడిగిన వారికి జాబ్‌కార్డులను ఇస్తున్నాము. వేసవిని దృష్టిలో ఉంచుకుని కూలీలకు వసతులు కల్పిస్తున్నాము. – హరి నారాయణన్, కలెక్టర్, చిత్తూరు జిల్లా (చదవండి: పవన్ కల్యాణ్ జనసేన జనం కోసమా.. చంద్రబాబు కోసమా..?) -
చివరి కోరిక తీరకుండానే మృతి చెందిన బిపిన్ రావత్
పౌరి (ఉత్తరాఖండ్): బిపిన్ రావత్ రిటైరయ్యాక ఉత్తరాఖండ్‌లోని స్వగ్రామమైన ‘సైనా’లో ఇళ్లు కట్టుకోవాలని అనుకున్నారు. 2018 చివరిసారిగా ఆయన సొంతూరును సందర్శించారని బిపిన్ మేనమామ భరత్ తెలిపారు. పౌరి జిల్లాలోని ద్వారిఖాల్ బ్లాక్‌లో సైనీ గ్రామం ఉంది. ఈ ఊర్లో ప్రస్తుతం నివసిస్తున్న జనరల్ ఏకైక బంధువు భరత్. ‘2018లో వచ్చినపుడు కులదేవతకు పూజ చేశారు. రిటైరయ్యాక ఇక్కడే ఇల్లు నిర్మించుకుంటానని చెప్పారు. స్వగ్రామంతో బిపిన్‌కు అనుబంధం ఎక్కువ. ఊరి జనం ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వలస వెళ్లడం తనను బాధిస్తోందని, రిటైరయ్యాక ఈ ప్రాంతం కోసం ఏదైనా చేస్తానని గ్రామస్తులకు చెప్పారు. బిపిన్ ఫోన్లో నాతో మాట్లాడేవారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో సైనీకి వస్తానన్నారు’ అంటూ ఉబికి వస్తున్న కన్నీళ్లను తుడుచుకుంటూ చెప్పారు భరత్. (చదవండి: బిపిన్ రావత్.. మాటలు కూడా తూటాలే) తన మేనల్లుడి కోరిక తీరకుండానే ఇలా జరుగుతుందని ఊహించలేదని అన్నారు. రావత్ సతీమణి మధులిక సొంతూరు మధ్యప్రదేశ్ షాడోల్ జిల్లాలోని సొహాగ్‌పూర్. ప్రస్తుతం ఆమె కుటుంబం షాడోల్లో ఉన్న పూర్వీకుల ఇంట్లో నివశిస్తున్నారు. వచ్చే ఏడాది సొహాగ్‌పూర్ వచ్చి సైనిక పాఠశాల పనులు ప్రారంభిస్తానని రావత్ చెప్పినట్లు బావమరిది యశవర్ధన్ అన్నారు. చదవండి: విమాన ప్రమాదం అంటే గుర్తొచ్చేది బ్లాక్‌బాక్స్.. అసలు దానికథేంటి..? -
Ramnath Kovind: కలలో కూడా అనుకోలేదు!
లక్నో/కాన్పూర్: గ్రామీణ నేపథ్యం ఉన్న తనలాంటి సామాన్యుడు దేశ అత్యున్నత పదవిని పొందగలగడని కలలో కూడా ఊహించలేదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్దేహత్ జిల్లాలోని తను పుట్టిన ఊరు పారౌంఖ్ పౌరులనుద్దేశించి ఆదివారం కోవింద్ ప్రసంగించారు. స్వస్థలాన్ని చూడగానే భావోద్వేగానికి గురైన రాష్ట్రపతి.. మోకాళ్లపై వంగి అక్కడి నేలకు నమస్కరించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత కోవింద్ తన సొంతూరికి రావడం ఇదే ప్రథమం. ‘నాలాంటి సామాన్య పల్లెటూరి పిల్లవాడు దేశంలోనే అత్యున్నత పదవిని అధిరోహించగలడని కలలో కూడా అనుకోలేదు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ దాన్ని నిజం చేసింది. నేను ఏ స్థాయికి చేరుకున్నా, ఆ ఘనత ఈ నేలకు, ఈ మట్టికి, ఇక్కడి ప్రజలకే చెందుతుంది’ అని కోవింద్ ఉద్వేగపూరితంగా వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఇతర స్వాతంత్య్ర సమర యోధులకు కోవింద్ నివాళులర్పించారు. అక్కడి మిలన్ కేంద్రం, వీరాంగన ఝల్కారీ బాయి ఇంటర్ కాలేజ్‌లను సందర్శించారు. ‘నా కుటుంబ విలువల ప్రకారం, కులాలకతీతంగా గ్రామంలోని అత్యంత వృద్ధురాలిని అమ్మగా, అత్యంత వృద్ధుడిని తండ్రిగా భావిస్తాం. ఆ సంప్రదాయం ఇంకా కొనసాగుతున్నందుకు సంతోషంగా ఉంది’ అన్నారు. తన గ్రామం మట్టివాసన, ఇక్కడి జ్ఞాపకాలు తన హృదయంలో పదిలంగా ఉన్నాయన్నారు. ‘పారౌంఖ్ అంటే నా దృష్టిలో కేవలం ఒక గ్రామం కాదు. ఇది నా మాతృభూమి. దేశ సేవకు స్ఫూర్తినిచ్చిన నేల. ఆ స్ఫూర్తితోనే మొదట హైకోర్టుకు, అక్కడి నుంచి సుప్రీంకోర్టుకు.. ఆ తరువాత రాజ్యసభకు, ఆపై రాజ్‌భవన్‌కు.. ఇప్పుడు రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్నా’నన్నారు. ఉత్తరప్రదేశ్ నుంచి చాలా మంది ప్రధానమంత్రులయ్యారని, రాష్ట్రపతి అయిన తొలి వ్యక్తిని మాత్రం తానేనని కోవింద్ వెల్లడించారు. అందరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని గ్రామస్తులను కోరారు. గ్రామస్తులు రాష్ట్రపతిభవన్‌ను చూసేందుకు త్వరలో ఏర్పాట్లు చేస్తానన్నారు. స్కూల్లో తన క్లాస్మేట్స్ అయిన జస్వంత్ సింగ్, చంద్రభాన్ సింగ్, దశరథ్ సింగ్‌లను కలుసుకోలేకపోతున్నందుకు బాధగా ఉందన్నారు. -
చలో పల్లెకు
నల్లగొండ– గుంటూరు సరిహద్దు ప్రాంతానికి చెందిన అన్నదమ్ములు గిరిధర్, రుక్మాంగద్ హైదరాబాద్‌లో దుకాణాలు నిర్వహిస్తున్నారు. మాసాబ్‌ట్యాంకు ప్రాంతంలో ఒకరిది కిరాణా, సికింద్రాబాద్ ప్రాంతంలో మరొకరిది నూనె దుకాణం. లాక్డౌన్ మొదలైన కొత్తలో వారం పాటు సొంత గ్రామంలో ఉండి మళ్లీ వచ్చి వ్యాపారం కొనసాగిస్తున్నారు. ఇప్పుడు ఒక్కసారిగా కేసుల ఉధృతి పెరగటం, వచ్చే నెల రోజుల్లో ఊహకందని రీతిలో పెరుగుదల ఉంటుందన్న హెచ్చరికలతో మళ్లీ వారి కుటుంబాలు దుకాణాలకు తాళం పెట్టి సొంతూళ్లకు వెళ్లిపోయాయి. కరోనా అదుపులోకి వచ్చిన తర్వాతే వస్తామని వారు పేర్కొంటున్నారు. నగర శివారులోని పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేసే చిరంజీవి కుటుంబం కూకట్‌పల్లిలో ఉంటోంది. అడపాదడపా ఆన్లైన్ తరగతులు తప్ప పని లేదు. సామాజిక వ్యాప్తి దశ కొనసాగుతోందని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న హెచ్చరికలతో, ఆయన కుటుం బం ఇంటికి తాళం వేసి సిద్దిపేట జిల్లా గజ్వేల్ సమీపంలోని సొంతూరికి వెళ్లిపోయింది. అక్కడ పాతబడ్డ ఇంటికి మరమ్మతు చేయించుకుని మరీ ఉంటున్నారు. నానక్‌రామ్‌గూడ సమీపంలోని సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేసే మహిపాల్‌రెడ్డి కుటుంబం బోరబండలో ఉంటోంది. గత నాలుగున్నర నెలలుగా వర్క్‌ఫ్రమ్ హోం పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నా.. పిల్లల ఆన్లైన్ తరగతుల రీత్యా ఇక్కడే ఉంటూ వచ్చారు. ప్రస్తుతం కరోనా తీవ్రతను దృష్టిలో పెట్టుకొని తండ్రి సూచన మేరకు సిద్దిపేట సమీపంలోని సొంత గ్రామానికి వెళ్లిపోయారు. సాక్షి, హైదరాబాద్: ఇప్పటి వరకు ఓ ఎత్తు.. రానున్న రోజులది మరో ఎత్తు. సామాజిక వ్యాప్తి, వచ్చే 2 నెలల్లో కరోనా కల్లోలం ఉండనుందన్న వార్తల నేపథ్యంలో నగరవాసిలో గుబులు తీవ్రమైంది. ఎటువైపు నుంచి వైరస్ విరుచుకుపడుతుందోనన్న భయం వణికిస్తోంది. అడుగు బయటపెట్టాలంటేనే హడలిపోతున్నారు. ఈ నేపథ్యంలో సిటీలో ఉండటం కంటే సొంతూళ్లకు వెళ్లిపోవటమే సురక్షితమన్న భావన వ్యక్తమవుతోంది. వర్క్ ఫ్రం హోమ్ అవకాశం ఉన్న వారిలో చాలా మంది ఇప్పటికే బిచాణా సర్దేయగా, ఇప్పుడు ఇతర ఉద్యోగులు, వ్యాపారాలు చేసుకునేవారు ఊరిబాట పడుతున్నారు. వాలంటరీ రిటైర్మెంట్తో.. సంగారెడ్డిలో బహుళ జాతీయ కంపెనీలో పనిచేసే వ్యక్తి సెలవు పెట్టే అవకాశం లేక, వర్క్ ఫ్రం హోం విధానం కుదరక ఏకంగా వాలంటరీ రిటైర్మెంట్ తీసుకుని సొంత ప్రాంతానికి వెళ్లిపోయారు. కరోనా సోకినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలామంది కోలుకుంటున్నా, కొందరిలో మాత్రం భయం నెలకొంది. వైరస్ సోకిన కొందరు నాలుగైదు రోజుల్లోనే చనిపోతున్న ఉదంతాలు అతి తక్కువగానే ఉన్నా, వాటిని చూసి భయాందోళనల్లో మునిగిపోతున్నారు. ఎక్కువ మంది పనిచేసే చోట వైరస్ వ్యాప్తి అధికంగా ఉండటంతో అలాంటి చోట పనిచేసే వారు ఎక్కువగా భయపడుతున్నారు. వర్క్ ఫ్రం హోం అవకాశం లేనిచోట, సెలవుల్లేక విధిగా పనికి వెళ్లాల్సినవారు ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. దీంతో ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, పదవీ విరమణ వయసుకు కాస్త చేరువగా ఉన్నవారు వాలంటరీ రిటైర్మెంట్ వైపు మొగ్గుతున్నారు. మూతపడుతున్న దుకాణాలు ఇటీవలి వరకు కాస్త ధైర్యంగానే దుకాణాలను నిర్వహించిన వారు ఇప్పుడు క్రమంగా తీరు మార్చుకుం టున్నారు. వీరిది ఉద్యోగం లాంటి ప్రతిబంధకం లేకపోవటంతో దుకాణాలు మూసేసి కొంతకాలం సొంతూళ్లలో ఉండి వద్దామని వెళ్తున్నారు. విజయనగర్ కాలనీలో మందుల దుకాణం నిర్వహించే ఓ కుటుంబం ఆందోళనకు గురై వరంగల్ రూరల్ జిల్లాలోని సొంతూరుకు వెళ్లిపోయింది. ప్రస్తుతం కోవిడ్ వైద్యంలో వాడే మందుల కోసం వచ్చే వారి సంఖ్య పెరగటమే వారి భయానికి కారణం. అలా వచ్చే వారిలో కరోనా పాజిటివ్ వ్యక్తులు కూడా ఉం డే ప్రమాదం ఉండటంతో వారం క్రితం మందుల దుకాణం మూసేసి సొంతూరుకు వెళ్లిపోయారు. ఇలా పలువురు తమ దుకాణాలను మూసేస్తున్నారు. ఫలితంగా నగరంలోని చాలా కాలనీలు, బస్తీల్లో మూతపడుతున్న దుకాణాల సంఖ్య పెరుగుతోంది. పాలు, కూరలకూ ఇబ్బందే.. నగరం చుట్టూ ఉన్న గ్రామాల నుంచి నిత్యం వేల లీట్లర్ల పాలు, టన్నుల కొద్దీ కూరగాయలు సిటీకి వస్తుంటాయి. డెయిరీ కంపెనీలు సరఫరా చేసే పాలు కాకుండా క్యాన్లలో పాలు తెచ్చి ఇళ్లకు సరఫరా చేసే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటోంది. ఇప్పుడు వీరు సిటీకి రావాలంటే భయపడుతున్నారు. ఎవరింట కరోనా సోకిన వారున్నారో, ఏ రోడ్డులో వారు తారసపడతారో తెలియక భయపడుతున్నారు. దీంతో కొద్ది రోజులు పాలు సరఫరా చేయలేమని చెప్పి ఆపేస్తున్నారు. నగరంలోని మార్కెట్లు, రైతు బజార్లకు కూరలు తెచ్చే వారు కూడా అదే పనిచేస్తుండటంతో కొద్ది రోజులుగా సిటీకి కూరగాయల కొరత ఏర్పడుతూ వస్తోంది. ‘నేను గుడిమల్కాపూర్ మార్కెట్ నుంచి నిత్యం రూ.వేయి కూరలు కొని కాలనీల్లో అమ్ముతాను. కానీ ఇప్పుడు మార్కెట్ బాగా పలచగా కనిపిస్తోంది. చాలా మంది రైతులు కూరలు తేవటం లేదు. దీంతో మాకు కొన్ని రకాల కూరలు దొరకటం లేదు.’అని గోల్కొండకు చెందిన దిలావర్ వాపోయాడు. లాక్డౌన్ మొదలైన కొత్తలో ఆటోవాలాలు, టాక్సీ డ్రైవర్లు కూడా కూరలు అమ్మేందుకు ఎగబడటంతో ఎక్కడపడితే అక్కడ కూరలు కుప్పలుగా కనిపించేవి. ఇప్పుడు పరిస్థితి దానికి భిన్నంగా మారిపోయింది. రెగ్యులర్‌గా అమ్మేవారు కూడా రావటం మానేస్తున్నారు. దీంతో కూరగాయలకు కొరత ఏర్పడి ధరలు కూడా ఒక్కసారిగా భగ్గుమంటున్నాయి. రోడ్లపై పెరిగిన రద్దీ.. నగరం నుంచి సొంతూళ్లకు వెళ్లేవారి సంఖ్య పెరగటంతో గత కొద్ది రోజులుగా వివిధ రోడ్లపై రద్దీ పెరిగింది. ‘లాక్డౌన్ మొదలైన తర్వాత రోడ్లపై వాహన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది. జిల్లాల సరి హద్దులు మూసేయటం, వాహనాలకు అనుమతి లేకపోవటంతో అప్పట్లో కర్ఫ్యూ వాతావరణమే ఉండేది. అన్‌లాక్ తర్వాత పరిస్థితి మెరుగుపడ్డా మునపటి రద్దీ లేదు. కానీ గత పది రోజుల నుంచి వాహనాల సంఖ్య బాగా పెరిగింది. అది రోజురోజుకు ఎక్కువవుతోంది’అని జాతీయ రహదారుల విభాగం అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. -
స్వగ్రామం
అతడు ఒక కుగ్రామం నుండి చిన్నప్పుడే విదేశాలకు వెళ్లిపోయి అపరిమితంగా డబ్బు సంపాదించాడు. పాతికేళ్ల తర్వాత సంపాదన మీద విసుగొచ్చి తన స్వగ్రామానికి తిరిగొచ్చి గ్రామ స్వరూపం చూసి నివ్వెరపోయాడు. చిన్నప్పుడు తన స్నేహితులతో ఈత కొట్టిన కాలువగట్లు, కోతికొమ్మచ్చి ఆడిన పచ్చని చెట్లు, విశాలమైన వీధులు, మండువా లోగిళ్లు అన్నీ మాయమైపోయాయి! ఉదయాన్నే పక్షుల కిలకిలరావాలు, నాగళ్లు భుజాన వేసుకుని పొలాలకు వెళ్లే రైతులు, పచ్చని పంట పొలాలు, అన్నా.. అక్కా.. తాతా.. మామా.. అంటూ పిలుచుకునే ఆప్యాయత నిండిన జనాలు ఎక్కడా కనిపించలేదు. రహదారి విస్తరణలో ఆధునిక సౌకర్యాలతో తన చిన్ననాటి గ్రామం ఆనవాళ్లు కూడా మిగల్లేదు! ఆనాటి గ్రామాన్ని మళ్లీ పునరుద్ధరించాలని అనుకున్నాడు. తన దగ్గరున్న డబ్బుతో ఒక పెద్ద స్థలం ఖరీదు చేసి తను చిన్నప్పుడు తిరిగిన గ్రామంలా తయారు చేశాడు. విశాలమైన మట్టి రహదారులు, దగ్గర్లో చెరువులు, కాలువగట్లు, వాటిపక్కన ఆధునిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని ఉపయోగించి అడవుల్లో ఉన్న పచ్చని చెట్లను తీసుకొచ్చి నాటించాడు. ఒక చలనచిత్రంలో వేసే కృత్రిమ కళాకృతిలా పాత గ్రామం కనిపించేట్టు చేశాడు. ఊళ్లో తిండిదొరక్క పై ఊళ్లకు వలస వెళ్లిపోయిన తన చిన్ననాటి స్నేహితులను పిలిపించి వారికి గృహాలు కట్టించి బతకడానికి డబ్బు కూడా ఇచ్చి ఆ గ్రామంలో నివాసం ఏర్పాటు చేశాడు. కానీ ఎన్నాళ్లయినా ఉదయాన్నే పొలాలకెళ్లే రైతులు, ఆప్యాయత ఒలికించే పిలుపులు వినిపించడం లేదు! పైగా ‘విదేశాలకి వెళ్లి బాగా సంపాదించి మనకి పెట్టాడు. అలాగని విద్యుత్ సౌకర్యంలేని ఈ పల్లెటూళ్లో ఎన్నాళ్లుండగలం?’ అంటూ రుసరుసలాడసాగారు! – లోగిశ లక్ష్మీనాయుడు -
ఈ బుల్లితెర నటుడు నిజంగా శ్రీమంతుడే
ముంబై : పుట్టిన ఊరికి కొంతైనా మేలు చేయాలనుకున్నాడు. సొంత గడ్డ అభివృద్ధిని తన ఎదుగుదలగా భావించాడు. అనుకున్నదే తడవుగా సొంత ఊరిలో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నాడు. ఆయనే ప్రముఖ హిందీ బుల్లితెర నటుడు గుర్మిత్ చౌదరి. సామాజిక సేవలలో ఎప్పుడూ ముందుండే ఇతడు ఇప్పుడు మరో అడుగు ముందుకేశాడు. ఇంట గెలిచి రచ్చ గెలవాలి అన్న ఆలోచనతో ముందుగా తను పుట్టిన ఊరిని తీర్చిదిద్దాలని అనుకున్నాడు. గుర్మిత్ పుట్టింది బీహార్‌లోని బాగల్పుర అనే గ్రామంలో. ఆ గ్రామం తీవ్రమైన కరెంట్ కోతలతో ఇబ్బంది పడుతోందని తెలుసుకున్న గుర్మిత్ వాటిని పరిష్కరించాలని అనుకున్నాడు. అక్కడ సోలార్ పానెళ్లను ఏర్పాటు చేసి విద్యుత్ సమస్యను కొంతైనా తీర్చాలని భావించాడు. కేవలం వనరులను సమకూర్చడంతోనే సరిపోదనుకున్న గుర్మిత్ ముందుగా ఆ ఊరి ప్రజలకు సోలార్ శక్తిని ఉపయోగించటంపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశాడు. ఈ సందర్భంగా గుర్మిత్ మాట్లాడుతూ.. సోలార్ పానెళ్ల ఆలోచన తనకు ఎప్పటి నుంచో ఉందని, వాతావరణ మార్పులపై వస్తున్న వార్తలను ఎప్పటికప్పుడు తెలుసుకునే వాడినని తెలిపాడు. సౌర శక్తి వాడకం ఒకటే దీనికి మార్గంగా భావించానని పేర్కొన్నాడు. సహజ సిద్ధంగా లభించే వాటితో విద్యుత్‌ను ఉత్పత్తి చేయొచ్చని తన ఊరి వాళ్లకు తెలియదని చెప్పాడు. సొంత ఊరి నుంచి ఈ మంచి పని మొదలుపెట్టడం సంతోషంగా ఉందని, ఈ మంచి పనుల్ని మరింత ముందుకు తీసుకుపోతానని గుర్మిత్ వెల్లడించాడు. -
పుట్టినగడ్డ వీడి.. పుట్టెడు దుఃఖం మిగిల్చి..
పండుగ నవ్వులు వారి పెదవులపై ఇంకా చెదిరిపోలేదు.. అందరూ ఒక్క చోట చేరిన వేళ పంచుకున్న తల్లీబిడ్డల మమకారం, అక్కా చెల్లెళ్ల అనురాగం మాసిపోలేదు. మిత్రులు, కుటుంబ సభ్యుల కోలాహలం వారిని వీడిపోలేదు.. మూడు రోజుల తర్వాత సంక్రాంతి సంబరాలను గుండెల్లో పదిలంగా దాచుకుని బాధ్యతలు పెంచిన దూరాలకు పయనమయ్యారు నరసరావుపేటకు చెందిన అన్నదమ్ముల కూతుళ్లు. సొంత గడ్డపై నుంచి బయలుదేరి 24 గంటలు తిరగకుండానే తెలంగాణలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో విగతజీవులయ్యారు. ముచ్చటైన వేడుకల్లో మునిగిన కుటుంబాలను దుఃఖసాగరంలో ముంచెత్తారు. ఆ కుటుంబ సభ్యులంతా ఉన్నత స్థాయిలోనే ఉన్నారు. విద్యాభ్యాసం, ఉద్యోగాల కోసం కర్ణాటక, పూణె ప్రాంతాల్లో ఉంటున్నారు. సంక్రాంతి పర్వదిన వేడుకలు జరుపుకునేందుకు సొంత ఊరైన నర్సరావుపేటకు వచ్చారు. ఐదు రోజులపాటు పట్టణంలోనే ఆనందోత్సాహాల నడుమ పండగను జరుపుకున్నారు. గురువారం ఉదయం ఇంటి నుంచి తమ సొంత కారులో హైదరాబాద్‌కు బయలుదేరారు. మరో గంటలో ఇంటికి చేరుకుంటామనగా బస్సు రూపంలో వచ్చిన మృత్యువు ఇద్దరిని కబళించింది. మరో ముగ్గురిని ఆస్పత్రిపాలు చేసింది. ఈ ఘటన చౌటుప్పల్ మండలం పంతంగి గ్రామం వద్ద 65వ నంబరు జాతీయ రహదారిపై గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. చౌటుప్పల్(మునుగోడు)/ నరసరావుపేట: గుంటూరు జిల్లా నర్సరావుపేటకు చెందిన కట్ట పద్మజ (49) అక్కడే ఎస్ఎస్ఎన్ ప్రభుత్వ కళాశాలలో లెక్చరర్‌గా పని చేస్తున్నారు. ఈమె కుమారుడు రామచంద్రారెడి, కుమార్తె వాసంతి కర్ణాటకలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరితోపాటు పద్మజ, ఆమె బాబాయి కూతురు లక్ష్మీప్రియాంక (28) హైదరాబాద్ బయలుదేరారు. లక్ష్మీప్రియాంక పూణెలో పీడియాట్రిక్ చదివింది. అక్కడే ఉద్యోగ ప్రయత్నాల్లో నిమగ్నమైంది. వీరందరూ కలిసి కారులో బయలుదేరారు. పిల్లలు ముగ్గురిని హైదరాబాద్ నుంచి పంపించేందుకు పద్మజ డ్రైవర్ కృష్ణారెడ్డి(27)ని తీసుకొని వస్తున్నారు. లక్ష్మీప్రియాంక విమానంలో పూణెకు, వాసంతి, రాంచంద్రారెడ్డిలు బస్సులో కర్ణాటకకు వెళ్లాల్సి ఉంది. ఇందుకోసం హైదరాబాద్‌కు వచ్చి సాయంత్రం వరకు బంధువుల ఇంట్లో ఉండి సాయంత్రం పిల్లలను పంపించేందుకు నిర్ణయించుకున్నారు. ఆ మేరకు వారంతా ఉల్లాసంగా మాట్లాడుకుంటూ వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బైకును తప్పించే క్రమంలో.. నల్లగొండ జిల్లా మిర్యాలగూడెం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు హైదరాబాద్ నుంచి 25 మంది ప్రయాణికులతో మిర్యాలగూడకు బయలుదేరింది. జాతీయ రహదారిపై మితిమీరిన వేగంతో వెళ్తున్న మరో బస్సు వెనుక నుంచి ఈ బస్సు వెళ్తుంది. ఇదే సమయంలో పంతంగి గ్రామ స్టేజీ వద్ద ఓ ద్విచక్ర వాహనం ఒక్కసారిగా బస్సులకు అడ్డుగా వచ్చింది. ముందున్న బస్సు బైకును తప్పించుకుని వెళ్లాడు. వెనుక ఉన్న ఈ బస్సుకు తప్పించే అవకాశం లేకపోవడంతో చేసేదేమి లేక డ్రైవర్ జావిద్ ప్రమాదాన్ని తప్పించే ప్రయత్నం చేశాడు. అందులో భాగంగా జంక్షన్ నుంచి బస్సును అదే వేగంతో హైదరాబాద్ వెళ్లే మార్గంలోకి మళ్లిం చాడు. సరిగ్గా అదే సమయంలో అటుగా వస్తున్న కారు బస్సుకు ఢీకొట్టింది. బలంగా తగలడంతో కారు బస్సు కిందకు ఇరుక్కుపోయింది. అందులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అదే వేగంతో రోడ్డు కిందకు దూసుకుపోయింది. బస్సులోని ప్రయాణికులు పూర్తిగా సురక్షితంగా బయటపడినప్పటికీ భయభ్రాంతులకు గురయ్యారు. ఐదుగురిలో ఇద్దరు దుర్మరణం ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో డ్రైవర్‌తోపాటు ముందు సీట్లో కూర్చున్న రామచంద్రారెడ్డిలతో పోలిస్తే వెనుక సీట్లో కూర్చున్న ముగ్గురికి బలమైన గాయాలయ్యాయి. వారిని కారులో నుంచి బయటకు తీసేందుకు స్థానికులు తీవ్రంగా ప్రయత్నం చేసి క్రేన్ సాయంతో బయటకు తీశారు. హుటాహుటిన వారిని చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స ప్రారంభించగానే పద్మజ మృతి చెందింది. మిగతావారి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌కు తరలించారు. వారిలో లక్ష్మిప్రియాంకను కామినేని ఆస్పత్రికి, మిగతా ముగ్గురుని సన్‌రైజ్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్స ప్రారంభించగానే కామినేని ఆసుపత్రిలో లక్ష్మిప్రియాంక సైతం మృతి చెందింది. మిగతా ముగ్గురు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. లక్ష్మిప్రియాంకకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. భర్త పూణేలో ఉద్యోగం చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన ఏసీపీ రమేష్ ఏసీపీ రామోజు రమేష్, సీఐ వెంకటయ్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాద వివరాలను తెలుసుకున్నారు. కారును క్రేన్ సాయంతో బస్సు కింద నుంచి తప్పించారు. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు. మతదేహాలకు ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. పద్మజ భర్త శ్రీధర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
మోదీ తన స్కూల్లో మొకాలిపై కూర్చొని మట్టిని తాకి..
వాద్ నగర్/ గుజరాత్ : ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం భావోద్వేగానికి లోనయ్యారు. తాను చిన్నప్పుడు చదువుకున్న పాఠశాలకు స్వయంగా నడుచుకుంటూ వెళ్లి మొకాలిపై కూర్చుని స్కూల్లోని మట్టిని తాకారు. తాను ఈరోజు ఇన్ని విలువలతో బతుకుతున్నానంటే ఆ పాఠాలు ఈ నేల నుంచే నేర్చుకున్నానంటూ పేర్కొన్నారు. 2014 తర్వాత తొలిసారి ప్రధాని హోదాలో తన స్వగ్రామం వాదనగర్ వెళ్లిన మోదీ దారి పొడవునా భారీ నీరాజనాలు అందుకున్నారు. తమ మధ్య తిరిగిన బిడ్డ ప్రధానిగా తమ గ్రామానికి రావడంతో అంతా ఘన స్వాగతం పలికారు. బరేలీలోని ఓ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ప్రారంభానికి వచ్చిన సందర్భంగా తన గ్రామంలో అడుగుపెట్టారు. భద్రతా సిబ్బంది అక్కడే ఉండమని చెప్పి తన ఎస్యూవీ వాహనంలో నుంచి బయటకు దిగి నేరుగా స్కూల్‌కి నడుచుకుంటూ వెళ్లారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరినీ పేరు పేరునా పలకరించారు. 'నేను నా ప్రయాణాన్ని వాద్ నగర్ నుంచి ప్రారంభించాను. ఇప్పుడు వారణాసి చేరుకున్నాను. వాదనగర్, వారణాసి రెండూ కూడా పవిత్ర శివుడి ప్రాంతాలే. ఈ శివుడు నాకు తిరుగులేని శక్తినిచ్చాడు. ఈ మట్టి నుంచి నేను అందుకున్న అతిపెద్ద బహుబతి ఇదే' అని అన్నారు. మరోసారి వారు అందించిన దీవెనలతో తిరిగెళ్లి దేశం కోసం మరింత శ్రమిస్తానంటూ ట్వీట్ చేశారు. -
పురిటిగడ్డపై ప్రధాని మోదీ
-
మహారాష్ట్రలో గవిచర్ల వాసి మృతి
స్వగ్రామానికి తీసుకుని రావడానికి ఆపన్నహస్తం కోసం నిరీక్షణ సంగెం: రెక్కాడితేగానీ డొక్కాడని బడుగు జీవి. అనారోగ్యానికి గురై ఒంటరిగా స్వగ్రామానికి తిరిగి వస్తూ మార్గమధ్యలో రైలులోనే తుది శ్వాస విడిచాడు. మహారాష్ట్రలోని బూస్వాల్ రైల్వేస్టేషన్‌లోని శవాన్ని స్వగ్రామానికి తీసుకునిరావడానికి చేతిలో చిల్లి గవ్వలేక ఆ కుటుంబం ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తోంది. వరంగల్ రూరల్ జిల్లా సంగెం మం డలం గవిచర్లకు చెందిన అనుమాండ్ల సతీశ్(35) నిరుపేద. భార్య నర్మద, కుమార్తె లావణ్య(10) కుమారుడు రాజు(7), తల్లితండ్రులు ఉన్నారు. పొట్టకూటి కోసం సూరత్ వెళ్లి కూలి పనులు చేసేవాడు. అక్కడ అనారోగ్యానికి గురికాగా, తోటి కార్మికులు సోమవారం ఉదయం రైలు ఎక్కించి.. వరంగల్ పం పారు. ఒంటరిగా రైలులో వస్తుండగా తీవ్రమైన అనారోగ్యంతో మహారాష్ట్రలోని బూస్వాల్ రైలు స్టేషన్లో సతీశ్ మృతి చెందాడు. రైల్వే పోలీసులు సతీశ్ శవాన్ని బూస్వాల్ రైల్వేస్టేషన్లో దింపివేశారు. సమాచారాన్ని కుటుంబసభ్యులకు చేర వేశారు. భార్య నర్మద, తల్లితండ్రులు చంద్రమౌళి, ఎల్లమ్మల వద్ద శవాన్ని తీసుకొచ్చేం దుకు చిల్లగవ్వ కూడా లేదు. ఎవరైనా ఆదుకుంటే శవాన్ని స్వగ్రామానికి తీసుకుని వచ్చి దహన సంస్కారాలు చేయగలుగుతామని విలపిస్తున్నారు. దాతలు స్పందించి మృతుని భార్య నర్మద 81061 49253, మృతుని బంధువు శ్రీనివాస్ 94920 46102 నంబర్లలో సంప్రదించాలని బాధితులు వేడుకుంటున్నారు. జిల్లా పద్మశాలి ఉద్యో గుల సంఘం తరఫున రూ.5 వేల ఆర్ధిక సహాయం అందించడానికి ఏర్పాట్లు చేశారు -
ఊరు దాటకుండానే ఊడ్చేశారు!
కాగజ్‌నగర్ రూరల్ : విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడుతున్నారు. వచ్చే వేతనం సరిపోవడం లేదో.. ప్రభుత్వ సొమ్మేకదా పోయేదేముంది అనుకున్నారో.. కొంత మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారు. 2010-11 సంవత్సరంలో జిల్లాలోని 38 మండలాలకు చెందిన 2,525మంది ఉపాధ్యాయులు ప్రయాణాలు చేయకుండానే లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ), హోం టౌన్ పేరిట సుమారు రూ.2,02,23,127 స్వాహా చేశారు. ఈ విషయాన్ని గతంలో సాక్షి ప్రచురించిన విషయం తెలిసిందే. సమాచార హక్కు చట్టం ద్వారా 2010-11 హోంటౌన్ నిధులు పొందిన ఉపాధ్యాయుల వివరాలను కోరుతూ పట్టణానికి చెందిన జాగృతి వ్యవస్థాపక అధ్యక్షుడు అశ్రాఫ్ దరఖాస్తు చేసుకోగా వివరాలు వెల్లడయ్యాయి. గతంలో ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అవినీతి జరిగినట్లు ప్రభుత్వానికి నివేది క అందించారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు సంబంధిత ఉపాధ్యాయుల నుంచి నిధులు రికవరీ చేయాలని నోటీసులు జారీ చేసింది. తాజాగా నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ఉపాధ్యాయుల జూలై మాసం వేతనాల నుంచి నిధులు రికవరీ చేయాలని ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రయాణం చేయకుండానే బోగస్ బిల్లులు సమర్పించి అక్రమంగా పొందిన భత్యాన్ని ఉపాధ్యాయుల వేతనాల నుంచి 10 శాతం వడ్డీతో కోత, ఇంక్రిమెంట్ల నిలిపివేయాలని ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జిల్లా విద్యాధికారి నుంచి ఆయా మండలాల ఎంఈవోలకు ఉత్వర్వుల కాపీలు అందాయి. ఉపాధ్యాయుల నిర్వాకం ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ సొంత ఊళ్లకు కుటుంబీ కులతో కలిసి వెళ్లేందుకు లీవ్ ట్రావెల్ కన్సెషన్(ఎల్టీసీ)ని మంజూరు చేస్తారు. జీవో నంబర్ 40ప్రకారం ఎల్టీసీ కింద నాలుగేళ్లకోమారు విహారయాత్రలకు, రెండేళ్లకోమారు హోంటౌన్ కింద ఉపాధ్యాయులు కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లివచ్చేందుకు వెసులుబాటు ఉంది. దీనిపై పూర్తిస్థాయి అధికారాలు ఎంఈవో, ప్రధానోపాధ్యాలకు ఉన్నాయి. దీన్ని ఆసరాగా చేసుకు న్న ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు బోగస్ ప్రయాణ భత్యానికి తెరలేపారు. నిబంధనల ప్రకారం ప్రయాణానికి వెళ్లే ముందు 80 శాతం అడ్వాన్స్‌గా అందించాల్సి ఉంటుంది. బిల్లులు సమర్పించిన అనంతరం 20 శాతం మంజూరు చేయాల్సి ఉంటుంది. విద్యాశాఖ కల్పించిన ఈ వెసులుబాటును ఆసరాగా చేసుకుని కొందరు ఎంఈవోలు, ఉపాధ్యాయులు అక్రమాలకు పాల్పడ్డారు. అందరిదీ ఇచ్చాపురమేనా? సిర్పూర్ నియోజకవర్గంలోని ఆయా మండలాల ఉపాధ్యాయులందరి పూర్వికులదీ శ్రీకాకులం జిల్లా ఇచ్చాపురమేనట. ఇది వినడానికి వింతగానే ఉన్నా ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఇది వాస్తవం. ఎందుకంటే హోంటౌన్ పేరిట నియోజకవర్గంలోని సుమారు 200 మంది శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురమే వెళ్లి వచ్చారట. తమ పూర్వీకుల గ్రామం ఇచ్చాపురం అని చూపెడుతూ వారు బస్సు టికెట్లను కూడా పొందుపరిచి నిధులను స్వాహా చేశారు. ఇందులో మరో వింత ఏంటంటే ఈజ్గాం బెంగాళీ క్యాంపులోని ఉపాధ్యాయులంతా బెంగాళీలే. వీరు కూడా ఇచ్చాపురం తమ పూర్వీకుల గ్రామం అంటూ బిల్లులు పొందారు. బెంగాళీ క్యాంపులోని బెంగాళీలు 1972లో పశ్చిమబెంగాల్ నుంచి ఇక్కడికి వలస వచ్చారు. వీరి కోసం అప్పట్లోనే ప్రభుత్వం ప్రత్యే క రాయితీల ద్వారా బెంగాళీ మీడియం పాఠశాలలను నెలకొల్పి బెంగాళీలనే ఉపాధ్యాయులుగా నియమిం చింది. వీరికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పూర్వీకులు ఉండే అవకాశం లేదు. ఇక తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోశిస్తూ, ఉపాధ్యాయ సంఘాల పేరు చెప్పుకునే పలువురు ఉపాధ్యాయులు తాము తెలంగాణ వాళ్లం కాదు.. ఆంధ్రావాళ్లం అంటూ ఇచ్చాపురం మా పూర్వీకుల గ్రా మం అని బిల్లులు పొందారు. ఈ విషయం కింది స్థాయి నుంచి ఉన్నతాధికారుల వరకు తెలిసినా బిల్లుల మం జూరు ఎలా జరిగిందో అర్థం చేసుకోవచ్చు. ఇలా జిల్లాలోని అనేక మంది ఉపాధ్యాయులు అనేక ప్రదేశాలకు వెళ్లి వచ్చినట్లు బిల్లులు పొందారు. అక్రమాలకు పాల్పడినందుకు విద్యాశాఖ నిధులు రికవరీ చేస్తోంది.