హౌసింగ్.కామ్ చేతికి హోమ్బై360
ముంబై: ప్రాపర్టీ పోర్టల్ దిగ్గజం హౌసింగ్.కామ్ మరో కంపెనీని టేకోవర్ చేసింది. డెవలపర్లను, ఏజెంట్లను, కొనుగోలుదారులను అనుసంధానం చేసే క్లౌడ్ ఆధారిత సేల్స్ లైఫ్‌సైకిల్ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ హోమ్బై360ని కొనుగోలు చేసింది. డీల్ విలువ 2 మిలియన్ డాలర్లు (సుమారు రూ.13 కోట్లు). హౌసింగ్.కామ్ ఈ ఏడాది ఇప్పటికే రెండు కంపెనీలను కొనుగోలు చేసింది. ‘డెవలపర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ను వినియోగించుకొని వారి విక్రయాల, ఆపరేటింగ్ ధరలను తగ్గించుకుంటే ప్రాపర్టీ ధరలు తగ్గి కొనుగోలుదారులకు లబ్ధి చేకూరుతుంది’ అని హౌసింగ్.కామ్ తాత్కాలిక సీఈవో రిషబ్ గుప్తా తెలిపారు.