homeo care
-
ఒళ్లంతాతెల్లమచ్చలువస్తున్నాయి...తగ్గేదెలా?
నా భార్య వయసు 36 ఏళ్లు. ఇటీవల ఆమె శరీరంపై వెంట్రుకలు ఎక్కువగా పెరుగుతుంటే డాక్టర్‌కు చూపించాం. ఆమె పీసీఓడీతో బాధపడుతున్నట్లు చెప్పారు. దీనికి హోమియోలో చికిత్స ఉందా? – ఎమ్. గట్టయ్య, సిద్ధిపేట రుతుక్రమం సవ్యంగా ఉన్న మహిళల్లో నెలసరి అయిన 11–18 రోజుల మధ్యకాలంలో వాళ్లలోని రెండు అండాశయాల్లోని ఏదో ఒకదాని నుంచి అండం విడుదల అవుతుంది. అలా జరగకుండా అపరిపక్వమైన అండాలు వెలువడి అవి నీటిబుడగల్లా అండాశయపు గోడలపై ఉండిపోయే కండిషన్‌ను పీసీవోడీ (పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్) అంటారు. ఇవి రెండువైపులా ఉంటే ‘బైలేటరల్ పీసీఓడీ’ అంటారు. ఈ సమస్యకు కచ్చితమైన కారణాలు తెలియనప్పటికీ జన్యుపరమైన అంశాలు ఒక కారణంగా భావిస్తున్నారు. అంతేగాక ఎఫ్ఎస్హెచ్, ఎల్‌హెచ్, ఈస్ట్రోజెన్, టెస్టోస్టెరాన్ హార్మోన్ల అసమతౌల్యత వల్ల ఈ సమస్య తలెత్తవచ్చు. సరైన జీవనశైలి పాటించనివారిలోనూ ఇది ఎక్కువ. లక్షణాలు: నెలసరి సరిగా రాకపోవడం, వచ్చినా అండాశయం నుంచి అండం విడుదల కాకపోవడం, రుతుస్రావం సమయంలో ఎక్కువ రక్తంపోవడం, రెండు రుతుక్రమాల మధ్యకాలంలో రక్తస్రావం కావడం, నెలసరి వచ్చే సమయంలో కడుపులో బాగా నొప్పిరావడం, నెలసరి రాకపోవడం, బరువు పెరగడం, తలవెంట్రుకలు రాలిపోతుండటం, ముఖం, వీపు, శరీరంపై మొటిమలు రావడం, ముఖం, ఛాతీపైన మగవారిలా వెంట్రుకలు రావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనివల్ల సంతానకలగకపోవడం, స్థూలకాయం, డయాబెటిస్, కొందరిలో చాలా అరుదుగా హృద్రోగ సమస్యలు రావచ్చు. రోగిని భౌతిక లక్షణాలతో పాటు అల్ట్రాసౌండ్ స్కాన్, హెచ్‌సీజీ, టెస్టోస్టెరాన్, ఆండ్రోజెన్, ప్రోలాక్టిన్ మొదలైన హార్మోన్ల పరీక్షలు, రక్తంలో చక్కెరపాళ్లు, కొలెస్ట్రాల్ శాతం వంటి పరీక్షలతో దీన్ని నిర్ధారణ చేయవచ్చు. హోమియో విధానంలో సరైన హార్మోన్ వ్యవస్థను పరిపుష్టం చేయడం ద్వారా దుష్ఫలితాలేవీ లేకుండా శాశ్వతంగా పీసీఓడీని నయం చేయవచ్చు.డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ బాబుకుఆస్తమా... చికిత్స ఉందా? మా బాబు వయసు పదేళ్లు. పుట్టినప్పటి నుంచి దగ్గు, ఆయాసం ఉన్నాయి. ఆయాసపడే సమయంలో పిల్లికూతలు వినిపిస్తుంటాయి. ఇప్పుడు చలికాలం వచ్చింది కదా... ఎప్పుడు హాస్పిటల్లో చేర్చాల్సివస్తుందో అని ఆందోళనగా ఉంటోంది. హోమియోలో ఆస్తమాకు పూర్తి చికిత్స ఉందా?– డి. రామమనోహర్,విశాఖపట్నం ఆస్తమా ఒక సాధారణమైన దీర్ఘకాలిక సమస్య. ఇది ఊపిరితిత్తుల్లోని వాయునాళాలకు సంబంధించిన వ్యాధి. వాయునాళాలు మూసుకుపోయి గాలిపీల్చడం, వదలడం కష్టంగా మారుతుంది. దీన్ని ఉబ్బసం, ఆయాసం, ఆస్తమా అనే పేర్లతో పిలుస్తుంటారు. ఇది దీర్ఘకాలికంగా... అంటే ఏళ్లతరబడి మనిషికి ఊపిరి అందకుండా చేస్తుంది. పిల్లలు, పెద్దలు అందరిలోనూ కనిపిస్తుంది. ఆస్తమా సమయంలో శ్వాసనాళాలు సంకోచించి, శ్లేష్మం (కళ్లె/ఫ్లెమ్) ఎక్కువగా తయారవుతుంది. అది కూడా ఊపిరిని అడ్డుకుంటుంది. కారణాలు: ∙దుమ్ము, ధూళి, కాలుష్యం ∙వాతావరణ పరిస్థితులు, చల్లగాలి ∙వైరస్లు, బ్యాక్టీరియాతో వచ్చే ఇన్ఫెక్షన్స్ ∙పొగాకు ∙పెంపుడు జంతువులు ∙సుగంధద్రవ్యాలు, ఘాటైన వాసనలు ∙పుప్పొడి రేణువులు వంశపారంపర్యం మొదలైనవి. లక్షణాలు: ∙ఆయాసం ∙దగ్గు రాత్రిపూట రావడం ∙గాలి తీసుకోవడం కష్టం కావడం; పిల్లికూతలు ∙ఛాతీ పట్టేసినట్లుగా ఉండటం. వ్యాధి నిర్ధారణ: ఎల్ఎఫ్టీ (లంగ్ ఫంక్షన్ టెస్ట్), ఛాతీ ఎక్స్‌రే, అలర్జీ టెస్టులు, కొన్ని రక్తపరీక్షలు. చికిత్స: ఆస్తమా నుంచి పూర్తిగా ఉపశమనం కలిగించే మందులు హోమియోపతిలో అందుబాటులో ఉన్నాయి. అవి ఆస్తమా లక్షణాలకు తగ్గించడమే కాకుండా, ఆ లక్షణాలను కలిగించే కారకాల పట్ల శరీరానికి వ్యాధి నిరోధకతను పెంచుతాయి. రోగి శారీరక, మానసిక, వంశపా రంపర్య తత్వాలనూ, వ్యాధి లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. ఈ విధానంలో ఆర్సినిక్ ఆల్బ్, ఇపికాక్, నేట్రమ్ సల్ఫ్, కాల్కేరియా కార్బ్, యాంటిమోనమ్ ఆల్బ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. నిపుణులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో తగిన మందులు వాడితే హోమియో విధానం ద్వారా ఆస్తమాను పూర్తిగా తగ్గించవచ్చు. డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఒళ్లంతాతెల్లమచ్చలువస్తున్నాయి...తగ్గేదెలా? నా వయసు 42 ఏళ్లు. నా శరీరమంత తెల్లమచ్చలు వచ్చాయి. మొదట్లో కాస్త చిన్నవిగా ఉండి, ఇప్పుడు క్రమంగా పెద్దవవుతూ అందరూ గమనించేలా ఉంటున్నాయి. ఎంతో మానసిక వేదన అనుభవిస్తున్నాను. నాకు హోమియోలో పరిష్కారం సూచించండి. – ఎమ్. ధర్మారావు, ఏలూరు శరీరానికి చర్మం ఒక కవచం లాంటిది. అన్ని అవయవాలలో చర్మం అతి పెద్దది. ఇందులో చెమట గ్రంథులు, రక్తనాళాలు, నరాలతో పాటు చర్మం చాయకు కారణమైన మెలనోసైట్స్ కూడా ఉంటాయి. ఏప్రాంతంలోనైనా చర్మంలో ఉండే ఈ కణాలు తగ్గినప్పుడు అక్కడ తెల్ల మచ్చలు వస్తాయి. ఈ మచ్చలనే బొల్లి లేదా ల్యూకోడెర్మా అంటారు. ఇప్పుడు మీరు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. చర్మం వెలుపల పొరల్లో ఉండే మెలనోసైట్ కణజాలాలు విడుదల చేసే ‘మెలనిన్ అనే ప్రత్యేక పదార్థం, టైరోసినేజ్ అనే ఎంజైమ్ వల్ల సరైన మోతాదులో విడుదల అవుతుంది. బొల్లి వ్యాధిలో ఈ ఎంజైము అనేక కారణాల వల్ల లోపిస్తుంది. దాంతో మెలనిన్ విడుదలకు అంతరాయం ఏర్పడి, చర్మం రంగును కోల్పోతుంది. ∙బొల్లి వ్యాధికి ముఖ్యమైన కారణాల్లో మానసిక ఒత్తిడి ఒకటి. ఇది స్త్రీ, పురుషుల తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా రావచ్చు. డిప్రైషన్, యాంగై్జటీ న్యూరోసిస్ మొదలైన మానసిక పరిస్థితులు దీనికి దారితీయవచ్చు. ∙పోషకాహారలోపం కూడా బొల్లి వ్యాధికి దారితీయవచ్చు. ∙జన్యుపరమైన కారణాలతో వంశపారంపర్యంగా కూడా వ్యాధి రావచ్చు. ∙దీర్ఘకాలిక గ్యాస్ట్రిక్ సమస్యలు: ఆహారంలో రాగి, ఇనుము మొదలైన ధాతువులు లోపించడం వల్ల విటమిన్లు, ప్రోటీన్ల వంటి పోషకాహార లోపం వల్ల గానీ, అమీబియాసిస్, బద్దెపురుగుల వంటి పరాన్నజీవుల వల్లగానీ తెల్లమచ్చలు కనిపించవచ్చు. ∙మందులు, రసాయనాలు దుష్ఫలితాలు, క్వినోన్స్, క్లోరోక్విన్, యాంటీబయాటిక్స్ వంటి పరిశ్రమల్లో పనిచేయడం లేదా వాటిని సరైన మోతాదులో వాడకపోవడం వల్ల కూడా బొల్లి వ్యాధి వచ్చే అవకాశం ఉంది. ∙కొన్ని ఎండోక్రైన్ గ్రంథులు స్రవించే హర్మోన్స్ లోపాలు, డయాబెటిస్‌లో వంటి వ్యాధులలో తెల్లమచ్చలు ఎక్కువగా కనిపించే వీలుంది. ∙వ్యాధి నిరోధక శక్తి (ఇమ్యూనిటీ) తగ్గడం, మన వ్యాధి నిరోధకత మనకే ముప్పుగా పరిణమించే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల మన సొంతకణాలే మనపై దాడి చేయడం వల్ల కూడా బొల్లి సోకే అవకాశం ఉంది. లక్షణాలు: మొదట చిన్న చిన్న మచ్చలుగా ఏర్పడి, ఆ తర్వాత శరీరం అంతటా వ్యాపిస్తాయి. చివరకు తెలుపు రంగులోకి మారతాయి. చర్మం పలుచబడినట్లు అవుతుంది. కొన్నిసార్లు ఎండవేడిని తట్టుకోలేరు. జుట్టు రంగుమారడం, రాలిపోవడం, వంటి లక్షణాలు ఉంటాయి. ఈ మచ్చలు ముఖ్యంగా చేతులు, పెదవులు, కాల్ల మీద రావచ్చు. ఇవి పెరగవచ్చు లేదా అని పరిమాణంలో ఉండిపోవచ్చు. చికిత్స: తెల్లమచ్చలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. తూజా, నైట్రిక్ యాసిడ్, నేట్రమ్‌మ్యూరియాటికమ్, ఆర్సెనికమ్ ఆల్బమ్, లాపిస్ అల్బా, రస్టాక్స్ వంటి మందులతో తెల్లమచ్చలకు సమర్థంగా చికిత్సను అందించవచ్చు. డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్, పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి?
నా వయసు 52 ఏళ్లు. నాకు కొంతకాలంగా కడుపులో విపరీతమైన మంటతోనూ, నొప్పి, అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలతో బాధపడతున్నాను. డాక్టర్‌ను సంప్రదిస్తే గ్యాస్ట్రైటిస్ అన్నారు. ఈ సమస్య ఎందుకు వస్తుంది. హోమియో చికిత్స ద్వారా నయమవుతుందా?– ఆర్. యాదగిరిరెడ్డి, నల్లగొండ జీర్ణకోశం లోపల ఉండే మ్యూకస్ పొర ఇన్ఫ్లమేషన్ లేదా వాపునకు గురికావడాన్ని గ్యాస్ట్రైటిస్ అంటారు. మనం తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు మన మెదడు లాగే జీర్ణ వ్యవస్థ మీద కూడా ప్రభావం పడుతుంది. గ్యాస్ట్రిక్ సమస్యలు ఆకస్మికంగా మొదలై కొన్ని రోజుల వరకు ఉండి తగ్గిపోతే అక్యూట్ గ్యాస్ట్రైటిస్ అంటారు. దీర్ఘకాలికంగా ఇదే సమస్య ఉంటే దాన్ని క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటారు. కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య ముదిరితే అవి కడుపులో అల్సర్స్ లేదా పుండ్లుగా ఏర్పడతాయి. కారణాలు – 20 నుంచి 50 శాతం అక్యూట్ గ్యాస్ట్రైటిస్ లకు వైరస్, బ్యాక్టీరియా (ముఖ్యంగా హెలికోబ్యాక్టర్ పైలోరీ అనే బ్యాక్టీరియా) కారణమవుతుంది. ∙తీవ్రమైన మానసిక ఒత్తిడి, మద్యం ఎక్కువగా తీసుకోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం కొన్ని రకాల మందులు... ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్ వాడటం ∙పైత్య రసం వెనక్కి ప్రవహించడం ∙క్రౌన్స్ డిసీజ్, కొన్ని ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙శస్త్రచికిత్స లేదా వంశపారంపర్య చరిత్ర ఉన్నవారిలో ∙ఆహారంలో వేపుళ్లు, మసాలాలు, కారం, పులుపు వంటివి ఎక్కువగా తీసుకునే వారిలో గ్యాస్ట్రైటిస్ సమస్య కనిపిస్తుంది. లక్షణాలు కడుపు నొప్పి, మంట ∙కడుపు ఉబ్బరం, కొంచెం తిన్నా కడుపు నిండుగా అనిపించడం ∙అజీర్ణం, వికారం, రక్తంతో కూడిన వాంతులు ∙ఆకలి తగ్గిపోవడం ∙కొందరిలో గ్యాస్ట్రిక్ సమస్య వల్ల మలం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. నివారణ కోసంపాటించాల్సిన జాగ్రత్తలు ♦ సమయానికి ఆహారం తీసుకోవాలి ∙కొద్దికొద్ది మోతాదుల్లో ఎక్కువ సార్లు తినాలి ♦ పొగతాగడం, మద్యపానం వంటి దురలవాట్లు పూర్తిగా మానేయాలి ♦ ఆహారంలో మసాలాలు, కారం, వేపుళ్లు తగ్గించాలి తిన్న వెంటనే పడుకోకూడదు. కనీసం రెండు గంటల తర్వాత నిద్రించాలి. చికిత్స హోమియో వైద్యవిధానం ద్వారా గ్యాస్ట్రిక్ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుంది. ఈ సమస్యలకు మూలకారణమైన ఆమ్లాలు, తీవ్ర రసాయనాల సమతౌల్యతను చక్కదిద్దడం వల్ల గ్యాస్ట్రిక్ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించవచ్చు.డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ ఏడీహెచ్‌డీ అంటే ఏమిటి?చికిత్స ఉందా? మా బాబు వయసు ఆరున్నరేళ్లు. ఎప్పుడూ ఉన్న చోట కుదురుగా ఉండడు. ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఇష్టపడతాడు. ఏకాగ్రత తక్కువ. దాదాపు ప్రతిరోజూ స్కూల్ నుంచి ఎవరో ఒక టీచర్ మావాడి ప్రవర్తన గురించి ఏదో ఒక కంప్లయింట్ చేస్తుంటారు. డాక్టర్‌కు చూపిస్తే ఒకరు ఏడీహెచ్‌డీ అన్నారు. హోమియోలో మా వాడి సమస్యకు ఏదైనా చికిత్స ఉందా?– ఆర్. సుందరయ్య, తాడేపల్లిగూడెం ఏడీహెచ్‌డీ అనేది అటెన్షన్ డెఫిసిట్ హైపర్ యాక్టివ్ డిజార్డర్ అనే వ్యాధి పేరుకు సంక్షిప్త రూపం. మీరు చెప్పిన లక్షణాలను బట్టి చూస్తే కూడా మీ బాబుకు అటెన్షన్ డెఫిసిట్ హైపర్యాక్టివ్ డిజార్డర్ ( ఏడీహెచ్‌డీ) అనే సమస్యే ఉందని అనిపిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 5 శాతం మంది పిల్లలు ఈ సమస్యతో బారిన పడుతుంటారు. కొంతమంది పిల్లల్లో వారు పెరుగుతున్న కొద్దీ సమస్య తగ్గుతుంది. ఏడీహెచ్‌డీ అనేది సాధారణంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాల పిల్లల్లో వస్తుంది. ఏడీహెచ్‌డీతో బాధపడే పిల్లలు సాధారణ పిల్లల్లా ఉండరు. ఈ సమస్య ఉన్న పిల్లలకు సాధారణంగా ఏమీ గుర్తుండదు.సమస్యకు కారణాలు∙జన్యుపరమైన కారణాలు ∙తల్లిదండ్రులు ఎవరిలో ఒకరికి ఈ సమస్య ఉండటం ∙తక్కువ బరువుతో ఉండే పిల్లల్లోనూ, సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల సమస్య రావచ్చు.లక్షణాలు ♦ మతిమరపు, తలనొప్పి ♦ ఆందోళన, వికారం, నిద్రలేమి, చిరాకు ♦ మానసిక స్థితి చక్కగా లేకపోవడం♦ ఒక చోట స్థితిమితంగా ఉండలేకపోవడం.♦ ఇతరులను ఇబ్బంది పెట్టడం. నిర్ధారణ రక్తపరీక్షలు, సీటీ స్కాన్, ఎమ్మారైచికిత్స హోమియోలో ఏడీహెచ్‌డీ సమస్యకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి వ్యక్తమయ్యే తీరు, లక్షణాలను విశ్లేషించి మందులు ఇవ్వాలి. ఈ మందుల వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఈ సమస్యకు హోమియోలో స్ట్రామోనియమ్, చైనా, అకోనైట్, బెల్లడోనా, మెడోరినమ్ వంటి మందులు అందుబాటులో ఉన్నాయి. వీటిని డాక్టర్ల పర్యవేక్షణలో వాడాలి.డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? నా వయసు 34 ఏళ్లు. వివాహమై పదేళ్లు అయ్యింది. ఇంతవరకు సంతానం లేదు. డాక్టర్‌ను సంప్రదిస్తే కొన్ని వైద్య పరీక్షలు చేసి ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అని చెప్పారు. ఇన్ఫెర్టిలిటీ అంటే ఏమిటి? దానికి కారణాలు ఏమిటి? హోమియోలో నా సమస్యకు శాశ్వత పరిష్కారం ఉందా?– ఒక సోదరి,మంచిర్యాల ఇటీవల చాలా మందిలో సంతానలేమి సమస్య కనిపిస్తోంది. దీనికి అనేక అంశాలు కారణమవుతాయి. సమస్య మహిళల్లో లేదా పురుషుల్లో ఉండవచ్చు. స్త్రీలలో సాధారణంగా కనిపించే కారణాలు : ∙జన్యుసంబంధిత లోపాలు ∙థైరాయిడ్ సమస్యలు ∙అండాశయంలో లోపాలు; నీటిబుడగలు ∙గర్భాశయంలో సమస్యలు ∙ఫెలోపియన్ ట్యూబ్స్‌లో వచ్చే సమస్యలు ∙డయాబెటిస్ ∙గర్భనిరోధక మాత్రలు అధికంగా వాడటం. పురుషుల్లో సాధారణంగా కనిపించే కారణాలు: ♦ హార్మోన్ సంబంధిత సమస్యలు ♦ థైరాయిడ్ ♦ పొగతాగడం ♦ శుక్రకణాల సంఖ్య తగ్గిపోవడం సంతానలేమిలో రకాలు : ♦ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ ♦ సెకండరీ ఇన్ఫెర్టిలిటీ ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ: అసలు సంతానం కలగకపోవడాన్ని ప్రైమరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా జన్యుసంబంధిత లోపాలు, హార్మోన్ సంబంధిత లోపాల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. సెకండరీ ఇన్ఫెర్టిలిటీ: మొదటి సంతానం కలిగిన తర్వాత లేదా అబార్షన్ అయిన తర్వాత మళ్లీ సంతానం కలగకపోవడాన్ని సెకండరీ ఇన్ఫెర్టిలిటీ అంటారు. ఇది ముఖ్యంగా గర్భాశయంలో ఏమైనా లోపాలు ఏర్పడటం, ఇన్ఫెక్షన్స్ రావడం వల్ల సంభవిస్తుంది. గుర్తించడం ఎలా: తగిన వైద్యపరీక్షల ద్వారా సమస్యను నిర్ధారణ చేస్తారు. ముఖ్యంగా థైరాయిడ్ ప్రొఫైల్, సాల్ఫింజోగ్రఫీ, అల్ట్రాసోనోగ్రఫీ, ఫాలిక్యులార్ స్టడీ వంటి టెస్ట్‌లు చేస్తారు. చికిత్స: హోమియోలో ఎలాంటి సమస్యలకైనా కాన్స్టిట్యూషనల్ పద్ధతిలో వ్యక్తి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స చేస్తారు. మీ సమస్యను పరిష్కరించేందుకు మంచి మందులు అందుబాటులో ఉన్నాయి.డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్ హోమియోపతి,హైదరాబాద్ -
బాబు ఇంకా పక్క తడుపుతున్నాడు
పేనుకొరుకుడుకు చికిత్స ఉందా? :మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. ఈమధ్య ఒకేదగ్గర వెంట్రుకలు రాలిపోతున్నాయి. అందరూ పేనుకొరుకుడు అంటున్నారు. హోమియోలో దీనికి పరిష్కారం ఉందా? – శ్రీలక్ష్మి, యాప్రాల్ పేనుకొరుకుడు సమస్యను వైద్యపరిభాషలో అలొపేషియా అంటారు. ఈ కండిషన్లో ఒక నిర్ణీత స్థలంలో వెంట్రుకలు పూర్తిగా రాలిపోయి, నున్నగా మారుతుంది. శరీరం తనను తాను రక్షించుకోగలిగే శక్తిని కోల్పోయినప్పుడు జుట్టు రాలిపోతుంటుంది. అలాంటప్పుడు చాలాసార్లు తలపై అక్కడక్కడ ప్యాచ్‌లలాగా ఏర్పడతాయి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ డిజార్డర్. అంటే తన సొంత వ్యాధి నిరోధక శక్తి తన వెంట్రుకలపైనే ప్రతికూలంగా పనిచేయడం వల్ల వచ్చే సమస్య అన్నమాట. ఇది తలలోగానీ, గడ్డంలోగానీ, మీసాలలోగాని ఇది రావచ్చు. ఇది అంటువ్యాధి కాదు. సాధారణంగా 60 ఏళ్లు పైబడిన వారిలో ఈ సమస్య కనిపించదు. కారణాలు: ∙మానసిక ఆందోళన ∙థైరాయిడ్ సమస్య ∙డయాబెటిస్, బీపీ వంటి సమస్య ఉన్నవాళ్లలో ఇది ఎక్కువగా కనిపిస్తుంటుంది ∙వంశపారంపర్యంగా ∙కవలల్లో ఒకరికి ఉంటే మరొకరికి వచ్చే అవకాశం ఉంటుంది. లక్షణాలు: ∙తలపై మొత్తం జుట్టు ఊడిపోయి, బట్టతల లక్షణాలు కనిపిస్తాయి. తలపై అక్కడక్కడ గుండ్రంగా ప్యాచ్‌లలా జుట్టు ఊడిపోతుంది ∙సాధారణంగా గుండ్రగా లేదా అండాకృతితో ఈ ప్యాచ్‌లు ఉంటాయి. నిర్ధారణ: ఈ సమస్య నిర్దిష్టంగా ఏ కారణం వల్ల వచ్చిందో తెలుసుకోవాలి. ట్రైకోస్కోపీ, బయాప్సీ, హిస్టలాజిక్ పరీక్షలు, పిగ్మెంట్ ఇన్‌కాంటినెన్స్ వంటివే మరికొన్ని పరీక్షలు. చికిత్స: పేనుకొరుకుడు సమస్యకు హోమియోలో మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. వైద్యులు వ్యాధి కారణాలు, లక్షణాలను పరిగణనలోకి తీసుకొని మందులను సూచిస్తారు.దీనికి హోమియోలో యాసిడ్ ఫ్లోర్, సల్ఫర్, ఫాస్ఫరస్, గ్రాఫైటిస్, సెలీనియమ్, సొరినమ్, తుజా వంటి మందులను డాక్టర్ల పర్యవేక్షణలో వాడాల్సి ఉంటుంది. -డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ ఇంటర్నేషనల్,హైదరాబాద్ బాబుఇంకా పక్క తడుపుతున్నాడు మా బాబు వయసు 13 ఏళ్లు. చిన్న వయసు నుంచి రాత్రిళ్లు నిద్రలో పక్కతడిపే అలవాటు ఉంది. ఇప్పటికీ ఇది ఆగలేదు. ఈ సమస్య వల్ల బయటకు ఎక్కడికైనా వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. హోమియో చికిత్స ద్వారా ఈ సమస్యను పూర్తిగా తగ్గించే అవకాశం ఉందా?– ఎమ్డీ. రమీజా, గుంటూరు మీ బాబు రాత్రుళ్లు నిద్రలో పక్క తడిపే ఈ అలవాటును వైద్య పరిభాషలో నాక్చర్నల్ ఎన్యురెసిస్ అంటారు. ఈ సమస్యతో బాధపడే పిల్లలు, వారి తల్లిదండ్రులు చాలా బాధపడతారు. ఈ సమస్య చిన్న పిల్లల్లోనే గాక కొంతమంది పెద్దల్లోనూ ఉంటుంది. సాధారణంగా పిల్లల్లో రాత్రి సమయంలో మూత్రవిసర్జనపై అదుపు అన్నది రెండు నుంచి ఐదేళ్ల వయసులో వస్తుంటుంది. కానీ ఐదు శాతం మంది పిల్లల్లో పదేళ్ల వయసు తర్వాత కూడా మూత్రవిసర్జనపై అదుపు సాధించడం జరగకపోవచ్చు. ఐదేళ్ల వయసు తర్వాత కూడా తరచూ పక్కతడిపే అలవాటు ఉండటాన్ని ప్రైమరీ ఎన్యురెసిస్ అంటారు. సాధారణంగా ఇది కొన్నాళ్లలోనే తగ్గిపోతుంది. ఎదుగుదల సమయంలో వచ్చే లోపం వల్ల ఇలా జరుగుతుండవచ్చు. అయితే కొంతమంది పిల్లలు పక్కతడపడం మానివేశాక, మళ్లీ ఆర్నెల్ల తర్వాత సమస్య తిరగబెట్టవచ్చు. ఇంతకుముందు పక్కతడపకుండా ప్రస్తుతం మళ్లీ పక్కతడపడం మొదలుపెట్టినట్లయితే ఈ పరిస్థితిని ‘సెకండరీ ఎన్యురెసిస్’ అంటారు. కారణాలు: నాడీవ్యవస్థ ఎదుగుదల లోపాలు, జన్యుపరమైన సమస్యలు (ముఖ్యంగా డౌన్‌సిండ్రోమ్), ఇన్ఫెక్షన్లు, మూత్రాశయం సమస్యలు, కొందరిలో వంశపారంపర్య కారణాల వల్ల ఈ సమస్య కనిపిస్తుండవచ్చు. ఇంకొంతమంది పిల్లల్లో కండరాలు ఎక్కువసార్లు అనియంత్రితంగా సంకోచం చెందడం వంటి కారణాలతోనూ ఈ సమస్య కనిపించవచ్చు. టైప్–1 డయాబెటిస్, మలబద్దకం వల్ల మూత్రాశయంపై ఒత్తిడి పడటం వల్ల, కెఫిన్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఈ సమస్య రావచ్చు. కొంతమంది పిల్లల్లో మానసిక ఒత్తిడి, భయం వల్ల కూడా రాత్రివేళలో తమకు తెలియకుండానే మూత్రవిసర్జన జరిగిపోవచ్చు. చికిత్స: పక్క తడిపే పిల్లలను తిట్టడం, వాళ్లకు శిక్షలు విధించడం వల్ల పిల్లలు మరింత కుంగిపోయి సమస్య మరింత జటిలం అవుతుంది. ఇలా పిల్లలను మందలించడం వల్ల ప్రయోజనం చేకూరదు సరికదా... కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అందుకే ఎట్టిపరిస్థితుల్లోనూ పిల్లలను దండించకూడదు. హోమియో చికిత్సతో పిల్లల్లో ఈ అలవాటు పూర్తిగా మాన్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.-డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ బాబుకుఆటిజమ్...చికిత్ససూచించండి మా బాబుకు మూడేళ్లు. ఆటిజమ్ ఉన్నట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. హోమియోలో మంచి చికిత్స సూచించండి.– డి. రాగిణి, వరంగల్ ఆటిజమ్ ఇటీవల పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తున్న వ్యాధి. దీనిలో చాలా స్థాయులు, ఎన్నో లక్షణాలు ఉంటాయి. కాబట్టి దీనితో బాధపడేవారందరిలోనూ లక్షణాలు ఒకేలా ఉండకపోవచ్చు. ఆటిస్టిక్ డిజార్డర్ అనేది ఆటిజంలో ఎక్కువగా కనిపించే సమస్య. మగపిల్లల్లో ఎక్కువ. రెట్స్ డిజార్డర్ అనే అరుదైన రకం ఆడపిల్లల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చైల్డ్‌హుడ్ డిసింటిగ్రేటెడ్ డిజార్డర్ అనేది ఆటజమ్‌లో ఒక తీవ్రమైన సమస్య.యాస్పర్జస్ డిజార్డర్‌లో పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉండి, వారు తదేకంగా చేసే పనులలో మంచి నైపుణ్యాన్ని ప్రదర్శిస్తారు. ఇలా దీనిలో చాలా రకాలు ఉంటాయి. ఇది మెదడు సరిగా అభివృద్ధి చెందకపోవడం వల్ల వస్తుంది. ఈ వ్యాధికి నిర్దిష్టమైన ఒకే కారణం గాక అనేక అంశాలు దోహదపడవచ్చు. మెదడు ఎదుగుదలకు తోడ్పడే జన్యువులు, అందులో స్రవించే సెరటోనిన్, డోపమిన్ వంటి రసాయనాలు ఇలా ఎన్నో అంశాలు దీనికి కారణం కావచ్చు. గర్భిణిగా ఉన్నప్పుడు తల్లి తీవ్రమైన ఉద్వేగాలకు లోనుకావడం, పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులు పిల్లలతో నాణ్యమైన సమయాన్ని గడపలేకపోవడం వల్ల కూడా ఇది రావచ్చు. పిల్లల్లో దీన్ని గుర్తించడానికి తోడ్పడే అంశాలు... ∙అకారణంగా ఎప్పుడూ ఏడుస్తూ ఉండటం ∙నలుగురిలో కలవడలేకపోవడం ∙ఆటవస్తువుల్లో ఏదో ఒక భాగంపైనే దృష్టి కేంద్రీకరించడం వయసుకు తగినంత మానసిక పరిపక్వత లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆటిజమ్ ఉన్న పిల్లలకు లక్షణాలను బట్టి చికిత్స ప్రారంభించాల్సి ఉంటుంది. మాటలు సరిగా రానివారిని స్పీచ్ థెరపీ ఉపయోగకరంగా ఉంటుంది. బిహేవియర్ థెరపీ కూడా దీనితో బాధపడే పిల్లల్లో మార్పు తీసుకురావడానికి సహాయపడుతుంది. పిల్లల వ్యక్తిగత లక్షణాలు బట్టి, కుటుంబ, సామాజిక పరిస్థితులను అవగాహనలోకి తీసుకొని, మూలకారణాలను అన్వేషించి చికిత్స చేయాల్సి ఉంటుంది. పిల్లల్లో ఆటిజమ్ వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స వ్యవధి ఉంటుంది. సరైన హోమియోపతి మందులను అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో వాడితే పిల్లలు మామూలుగా అయ్యేందుకు లేదా గరిష్ఠస్థాయికి మెరుగుపడేందుకు అవకాశం ఉంటుంది.డాక్టర్ ఎ.ఎం. రెడ్డి, సీఎండీ,పాజిటివ్ హోమియోపతి, హైదరాబాద్ -
వరుసగా గర్భస్రావాలు.. సంతానభాగ్యం ఉందా?
ఎంతోకాలంగాచెవి నొప్పి...తగ్గుతుందా? మా పాప వయసు తొమ్మిదేళ్లు. తనకు గత మూడేళ్లుగా తీవ్రంగా చెవినొప్పి వస్తోంది. చెవిలో చీము, వాపు కూడా కనపడుతున్నాయి. ఈ ఏడాది ఈ సమస్య ప్రతిరోజూ వస్తోంది. ఇంతకుముందు ఒక చెవిలోనే చీము కనిపించేది. ఇప్పుడు రెండు చెవుల్లోనూ చీము వస్తోంది. ఈఎన్టీ నిపుణులను సంప్రదిస్తే ఆపరేషన్ చెయ్యాలంటున్నారు. దీనికి హోమియోలో చికిత్స చెప్పండి. – ఎమ్. రాఘవులు, కోదాడ మీరు చెబుతున్న లక్షణాలను బట్టి మీ పాప దీర్ఘకాలిక చెవి వాపు (క్రానిక్ ఒటైటిస్ మీడియా)తో బాధపడుతోందని తెలుస్తోంది. చెవిని మనం మూడు భాగాలుగా చెప్పవచ్చు. బాహ్య చెవి, మధ్య చెవి, లోపలి చెవి. మీరు వివరించే సమస్య మధ్య చెవిలో వస్తుంది. ఇది చిన్నపిల్లలకు, మధ్యవయసువారికి, వృద్ధులకు సైతం వచ్చే అవకాశం ఉంది. అంటే ఏ వయసు వారిలోనైనా ఇది రావచ్చు. అయితే ఎక్కువగా చిన్నపిల్లలు దీని బారినపడతారు. కారణాలు: ∙కర్ణభేరి (ఇయర్ డ్రమ్)కు రంధ్రం ఏర్పడటం ∙మధ్య చెవి ఎముకల్లో మచ్చలు ఏర్పడటం ∙చెవి నుంచి దీర్ఘకాలం పాటు చీము రావడం ∙ముఖానికి సంబంధించిన నరాలు, సంతులనం కాల్వలు, కాక్లియా, మధ్య చెవిలో తరుగు రావడం వల్ల ∙ఎడినాయిడ్స్, టాన్సిల్స్, సూక్ష్మజీవులు, ఇన్ఫెక్షన్స్ వల్ల ఈ సమస్య రావచ్చు. లక్షణాలు: ∙తీవ్రమైన జ్వరం ∙వినికిడి లోపం ∙శరీరం సంతులనం కోల్పోవడం ∙చెవి నుంచి చీము కారడం ∙ముఖం బలహీన పడటం ∙తీవ్రమైన చెవి/తలనొప్పి ∙చెవి వెనకాల వాపు రావడం. నిర్ధారణ: ఆడియోమెట్రీ, సీటీ స్కాన్, ఎమ్మారై స్కాన్, ఎక్స్–రే చికిత్స: దీర్ఘకాలిక చెవి వాపు సమస్య పరిష్కారానికి హోమియోలో మంచిమందులు అందుబాటులో ఉన్నాయి. వ్యాధి లక్షణాలను విశ్లేషించి వైద్యులు తగిన మందులు సూచిస్తారు. ఈ సమస్యకు హోమియోలో ఎపిస్, బెల్లడోనా, కాస్టికమ్, ఫెర్రమ్‌ఫాస్, హెపార్‌సల్ఫ్, మెర్క్‌సాల్, నేట్రమ్మూర్, పల్సటిల్లా, సైలీషియా మొదలైన మందులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని అనుభవజ్ఞులైన హోమియో నిపుణుల పర్యవేక్షణలో వాడాలి.-డా‘‘ శ్రీకాంత్ మొర్లావర్,సీఎండీ, హోమియోకేర్ఇంటర్నేషనల్,హైదరాబాద్ వరుసగాగర్భస్రావాలు...సంతానభాగ్యం ఉందా? నా వయసు 34 ఏళ్లు. పెళ్లయి ఏడేళ్లు అవుతోంది. మూడుసార్లు గర్భం వచ్చింది. కానీ గర్భస్రావం అయ్యింది. డాక్టర్‌ను సంప్రదిస్తే అన్నీ నార్మల్‌గానే ఉన్నాయని అన్నారు. అయినా ఈ విధంగా ఎందుకు జరుగుతోందో అర్థం కావడం లేదు. హోమియో ద్వారా నాకు సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉందా?– సుమశ్రీ, నిజామాబాద్ గర్భధారణ జరిగి అది నిలవనప్పుడు, ముఖ్యంగా తరచూ గర్భస్రావాలు అవుతున్నప్పుడు అది వారిని మానసికంగానూ కుంగదీస్తుంది. మరోసారి గర్భం ధరించినా అది నిలుస్తుందో, నిలవదో అన్న ఆందోళనను కలగజేస్తుంది. ఇలా రెండు లేదా మూడుసార్లు గర్భస్రావం అయితే దాన్ని ‘రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్’గా పేర్కొంటారు. కారణాలు: ఇలా గర్భస్రావాలు జరగడానికి చాలా కారణాలు ఉంటాయి. అందులో కొన్ని... ∙గర్భాశయం అసాధారణంగా నిర్మితమై ఉండటం (రెండు గదుల గర్భాశయం) ∙గర్భాశయంలో కణుతులు / పాలిప్స్ ఉండటం ∙గర్భాశయపు సర్విక్స్ బలహీనంగా ఉండటం ∙కొన్ని రకాల ఆటో ఇమ్యూన్ వ్యాధులు ∙కొన్ని ఎండోక్రైన్ వ్యాధులు ∙వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉండటం ∙రకరకాల ఇన్ఫెక్షన్లు రావడం వంటి ఎన్నో కారణాలు గర్భస్రావానికి దారితీస్తాయి. అయితే కొంతమందిలో ఎలాంటి కారణం లేకుండా కూడా గర్భస్రావాలు జరుగుతుండవచ్చు. చికిత్స: రోగనిరోధకశక్తిని పెంపొందించడం, హార్మోన్ల అసమతౌల్యతను చక్కదిద్దడం వంటి చర్యల ద్వారా సంతాన లేమి సమస్యను పరిష్కరించవచ్చు. అలాగే గర్భస్రావానికి దారితీసే అనేక కారణాలు కనుగొని, వాటికి తగిన చికిత్స అందించడంతో పాటు కాన్స్టిట్యూషన్ పద్ధతిలో మానసిక, శారీరక తత్వాలను పరిగణనలోకి తీసుకొని చికిత్స అందిస్తే సంతాన సాఫల్యం కలుగుతుంది. అయితే అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో కారణాలతో పాటు వేర్వేరు అంశాలను పరిగణనలోకి తీసుకొని సరైన ఔషధాలను వాడితే సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది.-డాక్టర్ కె. శ్రీనివాస్ గుప్తా,ఎండీ (హోమియో),స్టార్ హోమియోపతి, హైదరాబాద్ యానల్ ఫిషర్‌కు చికిత్స ఉందా? నా వయసు 65 ఏళ్లు. మలవిసర్జన టైమ్‌లో తీవ్రంగా నొప్పి వస్తోంది. డాక్టర్‌ను సంప్రదిస్తే యానల్ ఫిషర్ అని చెప్పారు. ఆపరేషన్ చేయాలన్నారు. ఆపరేషన్ లేకుండానే హోమియోలో దీనికి చికిత్స ఉందా? – ఎమ్. రామ్మోహన్రావు, సిద్దిపేట మలద్వారం దగ్గర ఏర్పడే చీలికను ఫిషర్ అంటారు. మనం తీసుకునే ఆహారంలో పీచుపదార్థాల పాళ్లు తగ్గడం వల్ల మలబద్దకం వస్తుంది. దాంతో మలవిసర్జన సాఫీగా జరగదు. అలాంటి సమయంలో మలవిసర్జన కోసం విపరీతంగా ముక్కడం వల్ల మలద్వారం వద్ద పగుళ్లు ఏర్పడతాయి. ఇలా ఏర్పడే పగుళ్లను ఫిషర్ అంటారు. ఈ సమస్య ఉన్నప్పుడు మల విసర్జన సమయంలో నొప్పితో పాటు రక్తస్రావం జరుగుతుంది. ఇది వేసవికాలంలో ఎక్కువ ఉంటుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనవిధానం వల్ల ఈమధ్యకాలంలో ఇలాంటి సమస్యలు మరీ ఎక్కువగా కనిపిస్తున్నాయి. మలబద్దకం వల్ల రోగి ఎక్కువగా ముక్కాల్సి రావడంతో మలద్వారంతో పాటు దాని చుట్టుపక్కల ఉండే అవయవాలన్నీ తీవ్ర ఒత్తిడికి గురవుతాయి. క్రమేపీ అక్కడి ప్రాంతంలో కూడా వాపు రావడం, రక్తనాళాలు చిట్లడం మలంతో పాటు రక్తం పడటం జరుగుతుంది. ఫిషర్ సంవత్సరాల తరబడి బాధిస్తుంటుంది. ఆపరేషన్ చేయించుకున్నా మళ్లీ సమస్య తిరగబెట్టడం మామూలే. ఇది రోగులను మరింత ఆందోళనకు గురి చేస్తుంది. కారణాలు : ∙దీర్ఘకాలిక మలబద్దకం ∙ఎక్కువకాలం విరేచనాలు ∙వంశపారంపర్యం ∙అతిగా మద్యం తీసుకోవడం ∙ఫాస్ట్ఫుడ్స్, వేపుళ్లు ఎక్కువగా తినడం ∙మాంసాహారం తరచుగా తినడం వల్ల ఫిషర్ సమస్య వస్తుంది. లక్షణాలు: తీవ్రమైన నొప్పి, మంట ∙చురుకుగా ఉండలేరు ∙చిరాకు, కోపం ∙విరేచనంలో రక్తం పడుతుంటుంది ∙కొందరిలో మలవిసర్జన అనంతరం మరో రెండు గంటల పాటు నొప్పి, మంట. చికిత్స: ఫిషర్ సమస్యను నయం చేయడానికి హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. వాటితో ఆపరేషన్ అవసరం లేకుండానే చాలావరకు నయం చేయవచ్చు. రోగి మానసిక, శారీరక తత్వాన్ని, ఆరోగ్య చరిత్ర వంటి అనేక అంశాలను పరిగణనలోకి తీసుకొని హోమియో మందులను అనుభవజ్ఞులైన డాక్టర్ల పర్యవేక్షణలో వాడితే ఫలితం ఉంటుంది.-డాక్టర్ టి.కిరణ్‌కుమార్, డైరెక్టర్,పాజిటివ్ హోమియోపతి, విజయవాడ, వైజాగ్ -
ఆన్లైన్లో ‘హోమియో కేర్’
అంతర్జాతీయ స్థాయి వైద్య సేవలు 1.30 కోట్ల మందికి చేరువయ్యాం విస్తరణకు రూ.40 కోట్ల వ్యయం సాక్షితో హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ శ్రీకాంత్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హోమియో వైద్య రంగంలో ఉన్న హోమియోకేర్ ఇంటర్నేషనల్... ఆన్లైన్ వైద్య సేవలనూ విస్తరిస్తోంది. టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగిస్తూ రోగులు ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వైద్యులతో సంప్రదించే సౌకర్యాన్ని అమలు చేస్తోంది. దేశీయంగా రోజుకు 300 మంది వరకూ ఈ ఆన్లైన్ వైద్య సేవలు పొందుతుండగా అంతర్జాతీయంగా దాదాపు 100 మందికి ప్రతి రోజూ ఆన్లైన్ వైద్యసేవలు అందుతున్నట్లు హోమియోకేర్ ఇంటర్నేషనల్ సీఎండీ డాక్టర్ శ్రీకాంత్ మోర్లవార్ చెప్పారు. తమ కేంద్రాల్లో రోగులకు అందుతున్న వైద్య సేవలను మెడికల్ ఆడిట్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని చెప్పారు. సాక్షి బిజినెస్ బ్యూరో ప్రతినిధితో ఆయనింకా ఏం చెప్పారంటే... నాణ్యమైన వైద్యం.. రోగులకు అంతర్జాతీయ స్థాయి, నాణ్యమైన వైద్యం అందించేందుకు ప్రయత్నిస్తున్నాం. అందుకే హోమియో రంగంలో తొలిసారిగా మెడికల్ ఆడిట్ పేరుతో అన్ని హోమియోకేర్ ఇంటర్నేషనల్ కేంద్రాలనూ కేంద్రీకృత వ్యవస్థకు అనుసంధానించాం. రోగి ఏ కేంద్రానికి వెళ్లినా వైద్యులు సిఫార్సు చేస్తున్న మందులను పర్యవేక్షిస్తాం. అనుసరించాల్సిన వైద్య విధానాన్ని వైద్యులకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సూచిస్తాం. తదనంతరం సమస్య తీరును క్రమానుసారం అధ్యయనం చేసి రోగులకు, వైద్యులకు ఎప్పటికప్పుడు సూచనలిస్తాం. ఈ విధానంలో వైద్యులకు జవాబుదారీ పెరుగుతుంది. హోమియోకేర్‌కు చెందిన 300 మంది వైద్యులతోపాటు భారత్‌తోసహా విదేశాలకు చెందిన మరో 300 మంది వైద్యులకు హోమియో వైద్యంలో కొత్త అంశాలపై ఎప్పటికప్పుడు శిక్షణ ఇస్తున్నాం. ఆన్లైన్లో 30 శాతం.. మూడు దశాబ్దాల సంస్థ ప్రస్థానంలో 1.30 కోట్ల మందికిపైగా వైద్యం అందించాం. డిసెంబర్‌కల్లా ఈ సంఖ్య 1.80 కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నాం. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది కనక ఈ అంచనా వేస్తున్నాం. వంశపారంపర్య సమస్యలు, సంతానలేమి, మధుమేహం, కీళ్ల నొప్పుల వంటి క్లిష్ట సమస్యలకు చికిత్స ఇస్తున్నాం. 30 శాతం మంది ఆన్లైన్లోనే పేర్లు నమోదు చేసుకుంటున్నారు. దేశీయంగా హోమియో మార్కెట్ పరిమాణం 2014-15లో రూ.6,000 కోట్లుంది. 2015-16లో రూ.7,000 కోట్లను దాటుతుంది. హోమియోను కార్పొరేట్ స్థాయికి తెచ్చింది మేమే. విస్తరణకు రూ.40 కోట్లు.. కేరళ మినహా దక్షిణాది రాష్ట్రాల్లో 32 కేంద్రాల్ని నిర్వహిస్తున్నాం. మహారాష్ట్ర, ఒడిశా, కేరళతోపాటు సింగపూర్, దుబాయి, యూకేల్లో అడుగు పెడుతున్నాం. ఏడాదిలో కొత్తగా 15 కేంద్రాలు రానున్నాయి. క్లినిక్‌ల ఏర్పాటు, టెక్నాలజీ, శిక్షణకు గాను 2015-16లో రూ.40 కోట్లు వెచ్చిస్తున్నాం. వాటా విక్రయించాలంటూ వచ్చిన రూ.300 కోట్ల ఆఫర్‌ను కాదనుకున్నాం. 2017 కల్లా 100 క్లినిక్‌లను ఏర్పాటుచేస్తాం. ఆ తర్వాతే వాటా విక్రయానికి వెళతాం. వైద్య కళాశాల, ఔషధ తయారీ యూనిట్ పెట్టాలన్న ఆలోచన ఉంది. దేశ, విదేశాలకు చెందిన అగ్రస్థాయి కంపెనీల నుంచి మందులను సేకరించి, కాంబినేషన్లను సొంతంగా అభివృద్ధి చేస్తున్నాం. -
హెపటైటిస్, హెర్పిస్‌లకు మెరుగైన వైద్యచికిత్స
కొన్ని వైరస్లు శరీరంలో ప్రవేశించి నిద్రాణంగా ఉండిపోతాయి. ఆ సమయంలో లక్షణాలేవీ కనిపించడం లేదని నిర్లక్ష్యంగా ఉంటే అది ఒక్కోసారి ప్రాణాపాయానికి దారి తీయవచ్చు. వాటిలో ముఖ్యమైనవి హెపటైటిస్ బి, సి, హెర్పిస్ సింప్లెక్స్ వైరస్లు. ఈ వైరస్‌లకు హోమియోలో మెరుగైన చికిత్స ఉందని అంటున్నారు హోమియో వైద్యనిపుణులు డా. రవికిరణ్. హెపటైటిస్ అనగానే మామూలుగా హెపటైటిస్ బి గుర్తుకు వస్తుంది. కానీ హెపటైటిస్ సి,ఏ, ఇ అనే చాలా రకాలూ ఉన్నాయి. హెపటైటిస్‌తో కాలేయం పనితీరు మెల్లగా మందగించి ప్రాణాంతకంగామారుతుంది. కాలేయ కేన్సర్‌కూ దారి తీయవచ్చు. హెపటైటిస్ బి రాకుండా వ్యాక్సిన్ అందుబాటులో ఉన్నప్పటికీ, ఈ వ్యాధి వచ్చిన తర్వాత శాశ్వత పరిష్కారాన్ని చూపే చికిత్స ఇతర వైద్యవిధానాలలో లేదు. కానీ హోమియో వైద్యంలో అద్భుతమైన చికిత్స ఉంది. ఇవీ కారణాలు సురక్షితం కాని శృంగారంలో పాల్గొనడం. స్వలింగ సంపర్కం. అపరిచితుల నుంచి రక్తం స్వీకరించడం. కలుషితమైన సిరంజులను వాడటం. తల్లి నుంచి బిడ్డకు వైరస్ వ్యాప్తిచెందడం. ప్రధానంగా ఈ మూడు మార్గాల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుంటుంది. వ్యాధి లక్షణాలు ఇది పేషెంట్ తాలూకు రోగనిరోధక శక్తి మీద దాడి చేస్తుంది. ఆకలి లేకపోవడం, వికారం, ఒంటినొప్పులు, పసుపు రంగులో మూత్రం వంటి లక్షణాల తర్వాత మెల్లిగా పచ్చకామెర్లు మొదలవుతాయి. దీంతోపాటుగా చర్మంపైన దద్దుర్లు కనిపిస్తాయి. చాలామందిలో ఇవి తర్వాత కనుమరుగయిపోతాయి. కొన్ని కేసులలో కాలేయం పనిచేయటం ఆగిపోయి మరణం సంభవిస్తుంది. దీనినే ఫల్మినంట్ హెపటిక్ ఫెయిల్యూర్ అంటారు. కొన్ని సందర్భాల్లో హెపటైటిస్ బి వ్యాధి చాలా ఆలస్యంగా... అంటే కొన్నేళ్ల తర్వాత బయటపడవచ్చు. దీన్ని క్రానిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ లివర్లేదా క్రానిక్ హెపటైటిస్ అంటారు. వీరిలో కామెర్ల వ్యాధి తగ్గకుండా అలాగే ఉంటుంది. వాంతులు, ఒళ్ళంతా దురదలు, విరేచనాలు, కడుపుబ్బరం, పొట్టలో నొప్పి, రక్తనాళాల వాపు, కిడ్నీ సమస్యలు, ప్లేట్లెట్స్ తగ్గడం, తలనొప్పి, రక్తహీనత, రక్తకణాల సంఖ్య పడిపోవడం జరుగుతుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు. వ్యాధి నిర్ధారణ పరీక్షలు హెపటైటిస్ బి, సి లను గుర్తించడానికిహెచ్బిఎస్ఎజి; సి గురించి హెచ్సివి యాంటీబాడీ ఎంజైమ్ ఇమ్యూనో అస్సే; హెపటైటిస్ బి, సి వైరల్ లోడ్ పీసీఆర్ టెస్ట్ వంటివి వ్యాధి నిర్ధారణలో ఉపయోగపడతాయి. ఎల్ఎఫ్టీ, ఈఎస్సార్ పరీక్షలు కూడా ఉపయోగపడతాయి. హోమియో చికిత్స హెపటైటిస్ బి, సి వైరస్లు కాలేయాన్నే తమ ఆవాసంగా చేసుకోడానికి కారణం... అవి వృద్ధి చెందే అవకాశం ఎక్కువ. దీన్నే రిప్లికేషన్ అంటారు. ఈ రిప్లికేషన్‌ను హోమియో మందుల ద్వారా అడ్డుకోవచ్చును. అంతేగాక రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేసి వైరస్‌ను పెరగకుండా చేయవచ్చు. లైకోపోడియం, హెపర్‌సల్ఫ్, మెర్క్‌సాల్, బ్రయోనియా, ఫాస్ఫరస్ వంటి మందులు వ్యాధిని సమర్థంగా తగ్గిస్తాయి. నిర్లక్ష్యం చేస్తే... హెపటైటిస్ వైరస్ ఉన్నా లక్షణాలు కనిపించడం లేదని నిర్లక్ష్యం చేస్తే సిర్రోసిస్‌కు దారితీసి లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. లివర్ కేన్సర్‌కూ దారితీయవచ్చు. కొన్నిసార్లు కిడ్నీలు, స్ల్పీన్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. హెర్పిస్ సింప్లెక్స్ ఒక గుండు సూది మొనమీద కోటి వైరస్లు ఇమిడిపోయేంత సూక్ష్మమెన ఈ వైరస్ రెండు రకాలుగా ఉంటుంది. హెచ్ఎస్వి 1: ఇది నోటి దగ్గర పొక్కుల రూపంలో బయటపడుతుంది. పెదవుల చుట్టూ తెల్లని నీటిపొక్కులలాగా వస్తాయి. ఇది తల్లిదండ్రులు, తోటి పిల్లల నుంచి వ్యాపిస్తుంది. తరచు వచ్చిపోతుంటుంది. హెచ్ఎస్వి 2: జననావయవాల దగ్గర బయటపడే దీన్ని జెనిటల్ హెర్పిస్ అని అంటారు. ఇది నిత్యం వేధించే లైంగిక సమస్య. హెర్పిస్ వైరస్ పురుషుల నుంచి స్త్రీలకు, స్త్రీల నుంచి పురుషులకు లైంగికంగా కలయిక సమయంలో వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ వెన్నెముక చివరిభాగం శాక్రమ్ చుట్టూ ఉండే నాడుల సముదాయంలో చేరి అక్కడ నిద్రావస్థలో ఉండిపోతుంది. ఈ నిద్రాణస్థితిలో ఎలాంటి లక్షణాలు చూపించకుండా అవసరమైనపుడు తన ప్రతాపాన్ని చూపిస్తుంది. గుర్తుపట్టడం ఎలా? తొలిదశలో జననాంగాల్లో మంట, నొప్పి, మూత్రంలో దురద, జ్వరం వచ్చినట్లుగా ఉంటుంది. ఒళ్లునొప్పులు, గజ్జలలో, చంకలలో గడ్డలు కట్టినట్లుగా ఉంటుంది. తరువాత క్రమంగా జననాంగాల వద్ద చిన్న చిన్న నీటిపొక్కులు కనిపించి, రెండు మూడు రోజులలో పగిలి పుండ్లలాగా తయారవుతాయి. ఈ దశలోనే రోగికి సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. తొలిసారి లక్షణాలు కనిపించినపుడు సరియైన చికిత్స తీసుకుంటే ప్రారంభదశలోనే తగ్గిపోతుంది. కానీ చాలామందిలో వైరస్ ఉండిపోవడం వల్ల నిదానంగా ఉంటూ తిరిగి బయటపడుతూ ఉంటుంది. దీన్ని హెర్పిస్ రికరెంట్ అటాక్ అని అంటారు. నిర్ధారణ ఎలా? అపరిచిత వ్యక్తులతో లైంగిక సంపర్కం తరువాత వారం రోజులలో నీటి పొక్కులలా పుండ్లు కనిపిస్తాయి. కొన్నిరోజుల తరువాత మానిపోయి తిరిగి వస్తుంటాయి. దీన్ని బట్టి హెర్పిస్ని గుర్తించవచ్చు. పీసీఆర్ టెస్ట్, హెచ్ఎస్వి. 1, 2 ఐజీజీ, ఐజీఎమ్ పరీక్షలు ఉపయోగపడతాయి. పుండ్ల దగ్గర ఉండే స్రావాలను సేకరించి చేసే కల్చర్ టెస్ట్, డీఎన్ఏ టెస్ట్, యూరిన్ టెస్ట్ మొదలైనవి వ్యాధి నిర్ధారణకు ఉపకరిస్తాయి. కాంప్లికేషన్స్ హెర్పిస్ ఎక్కువగా స్త్రీలను బాధిస్తుంది. గర్భిణుల్లో మొదటినెలలో హెర్పిస్ వస్తే గర్భస్రావానికి అవకాశాలు ఎక్కువ. ప్రసవ సమయంలో హెర్పిస్ ఉంటే పిల్లలకు వచ్చే ప్రమాదం ఉంది. దీనిని నియోనాటల్ హెర్పిస్ అంటారు. శరీరంలో హెర్పిస్ ఉంటే చర్మం మీద దద్దుర్లు. అలర్జీలాంటి సమస్యలు; వెన్నెముకలోని నాడీమండలానికి హెర్పిస్ వస్తే అంగస్తంభన సమస్యలు; కొందరిలో నాడీమండలానికి హెర్పిస్ వస్తే మెదడులో మెనింజైటిస్ రావచ్చు. హోమియో చికిత్స హెర్పిస్ సింప్లెక్స్ వంటి లైంగిక వ్యాధుల నివారణకు హోమియో చికిత్స అద్భుతంగా పనిచేస్తుంది. రోగనిరోధక వ్యవస్థను పటిష్టం చేయడం ద్వారా రోగనివారణకు అవకాశం ఏర్పడుతుంది. హెర్పిస్ వ్యాధికి సంబంధించిన లక్షణాలు కనిపించినపుడు శృంగారానికి దూరంగా ఉండాలి. వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి. హెర్పిస్ ఉన్నవారు కండోమ్ ఉపయోగిస్తే మంచిది. అనుభజ్ఞులైన హోమియో వైద్యుని దగ్గర చికిత్స తీసుకుంటే హెర్పిస్ వ్యాధిని సమూలంగా తరిమేయవచ్చు. డాక్టర్ రవికిరణ్, ఎం.డి. ప్రముఖ హోమియో వైద్యనిపుణులు మాస్టర్స్ హోమియోపతి, అమీర్‌పేట, కూకట్పల్లి, దిల్సుఖ్నగర్, హైదరాబాద్, విజయవాడ ph: 7842 108 108 / 7569 108 108 -
సోరియాసిస్ సమస్యకు హోమియోకేర్ పరిష్కారం
చలికాలం రాగానే చాలామంది చర్మ సంబంధిత రోగులలో వ్యాధి తీవ్రత పెరిగి వైద్యుని దగ్గరకు పరుగులు తీస్తుంటారు. ఇందులో అత్యంత క్లిష్టమైన సమస్య ‘సోరియాసిస్’. చాలామంది రోగులు ఇది సాధారణ చర్మవ్యాధి అనుకుంటారు. కాని ఇది రోగనిరోధక వ్యవస్థ వికటించడం వల్ల వచ్చే చర్మ సంబంధిత వ్యాధి అని చాలా తక్కువమందికి తెలుసు. కనుక ‘సోరియాసిస్’ వచ్చిన రోగులలో జబ్బును కేవలం పై పూతలతోనే నయం చేయలేం. ప్రపంచ జనాభాలో సుమారుగా 3 శాతం మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. రోగి మరణానికి దారి తీయదు. కాని రోగి ఈ జబ్బుతో సంవత్సరాల తరబడి బాధపడటం వలన ఇది సామాజిక రుగ్మతకు, మానసిక అశాంతికి దారితీస్తుంది. సోరియాసిస్ అంటే... సోరియాసిస్ అనేది దీర్ఘకాలికంగా కొనసాగే చర్మవ్యాధి. ఇందులో ముఖ్యంగా చర్మంపై దురదలతో కూడుకున్న వెండిరంగు పొలుసులు కనిపిస్తాయి.సోరియాసిస్‌లో ముందుగా చర్మం ఇన్ఫ్లమేషన్కు గురి అయి ఎర్రగా మారి క్రమంగా చర్మం వెండి రంగు పొలుసుల రూపంలో రాలిపోవడం జరుగుతుంది. సాధారణంగా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు ఈ వ్యాధి లక్షణాలు అధికమవుతాయి. ఈ వ్యాధి చర్మంతో పాటు గోళ్ళు, కీళ్లను కూడా ప్రభావితం చేస్తుంది. ఆరోగ్యవంతుడి చర్మం ఉపరితలం కింద కొత్తకణాలు నిరంతరంగా తయారవుతాయి. సుమారు నెలరోజులకు ఇవి వెలుపలకు చేరుకుంటాయి. ఇలా పైపొరగా ఏర్పడిన కణాలు క్రమేణా నిర్జీవమై పొలుసులుగా రాలిపోయి కింది కణాలను బహిర్గతం చేస్తాయి. కాని రోగనిరోధక శక్తి వికటించి శరీర కణాలపై దాడి చేయడం వలన వచ్చే సోరియాసిస్ వ్యాధి వలన ఈ ప్రక్రియ అదుపు తప్పుతుంది. చర్మకణాలు వేగంగా తయారై 3-4 రోజులకే వెలుపల పొరకు చేరుకుంటాయి. ఈ విధంగా పైకి చేరిన కణాలు వేగంగా చనిపోవడం, కొత్త కణాలు లోపల నుండి ఏర్పడటం ... ఈ మొత్తం ప్రక్రియ త్వరత్వరగా పూర్తి కావడం వలన వెలుపలి పొర ఊడిపోక ముందే కొత్త పొర రావడం వలన చర్మం పొలుసులుగా రాలిపోతుంది. కారణాలు: సోరియాసిస్‌కు గల కారణాలు జన్యుపరమైన కారణాలు లేక మానసిక ఒత్తిడి వలన కాని రావచ్చు అని అనుభవ పూర్వకంగా తెలుస్తోంది. రోగ నిరోధక వ్యవస్థలోని అసమతుల్యతల వలన కూడా రావచ్చు. దీర్ఘకాలికంగా కొన్నిరకాల మందులు వాడటం వలన ‘సోరియాసిస్’ జబ్బు రావచ్చు. రకాలు సోరియాసిస్ వల్గారిస్: ఇది సాధారణంగా కనిపించేదే. స్కిన్‌పై ఎర్రని మచ్చలుగా మొదలై పెద్ద పొలుసుగా మారడం దీని ప్రధాన లక్షణం. గట్టేట్ సోరియాసిస్: ఇది సాధారణంగా పిల్లలలోనూ, యుక్త వయస్కులలోనూ వస్తుంది. దీనిలో చర్మంపై చిన్న పొక్కులు, ఎర్రని మచ్చలు వస్తాయి మొదటి దశలో ఉండగానే చికిత్స ప్రారంభిస్తే దీన్ని సంపూర్ణంగా నయం చేయవచ్చు. పస్చులర్ సోరియాసిస్: ఇది అరుదుగా కనిపించే సోరియాసిస్ రకం. దీనిలో సాధారణంగా చర్మంపై చీముతో నిండిన పొక్కులు కనిపిస్తాయి. ఎరిత్రోడర్మిక్ సోరియాసిస్: ఇది కొంచెం ప్రమాదకరమైన దే. ఇది శరీరంలో చాలా భాగం చర్మాన్ని ప్రభావితం చేస్తుంది. దీనిలో పొలుసులు పెద్దగా ఊడిపోతాయి. ఈ వ్యాధి తీవ్రంగా ఉంటే శరీరంలో ఉండే ధాతువుల్లో అసమతుల్యత చోటు చేసుకోవడం, ప్రొటీన్లు కోల్పోవటం జరుగుతుంది. ఇన్వర్స్ సోరియాసిస్: ఇది ముఖ్యంగా చర్మం మడతలలో వస్తుంది. కాంప్లికేషన్స్: సోరియాటిక్ ఆర్థరైటిస్ ఊ మానసిక అశాంతి, ఊలవణాలు, విటమిన్ లోపాలకు దారి తీస్తుంది. తీసుకోవలసిన జాగ్రత్తలు ఊ అధికంగా నీరు తాగడం ఊ అధికంగా ప్రొటీన్లు కల ఆహారాన్ని తీసుకోవడం ఊ చర్మం పొడి బారకుండా కొబ్బరినూనె, మాయిశ్చరైజర్ రాయడం ఊ పొడి చేసిన అవిశ గింజలను రోజూ తీసుకోవడం వలన చర్మాన్ని మృదువుగా ఉంచడానికి కావలసిన ఒమెగా 3 కొవ్వు ఆమ్లం సోరియాసిస్ని కొంత వరకు అదుపులో ఉంచవచ్చు ఊ రోజూ వ్యాయామం చేయడం ఊ రోజూ సూర్యరశ్మిలో కొంత సమయం ఉండటం. సూర్యకాంతిలో ఉండే అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి. పొలుసులు ఏర్పడటం తగ్గిస్తుంది ఊ చలికాలం, మానసిక ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, కొన్ని ఇతర ఔషధాల వలన వ్యాధి తీవ్రత పెరిగే అవకాశం ఉంటుంది. నిర్థారణ పరీక్షలు : ఊ సీబీపీ ఊ ఈఎస్ఆర్ ఊ స్కిన్ బ్లాప్సీ ఊ కీళ్లను ప్రభావితం చేసినప్పుడు ఎక్స్‌రే మొదలగు వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించాలి. కాని సాధారణంగా అనుభవజ్ఞులైన డాక్టర్లు సోరియాసిస్ రోగి చర్మ లక్షణాలను బట్టి రోగ నిర్ధారణ చేస్తారు. హోమియో చికిత్స: చాలామంది సోరియాసిస్ రోగులు ఆత్రుతతో వైద్యులను, వైద్య విధానాలను త్వరగా మారుస్తూ ఉంటారు. ఇది సరియైన పద్ధతి కాదు. సోరియాసిస్ వైద్యం తీసుకునే రోగి ఏదో ఒక వైద్య విధానాన్ని ఎంచుకొని దీర్ఘకాలం ఓపికగా వైద్యం చేయించుకుంటే మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. హోమియోకేర్ ఇంటర్నేషనల్‌లో జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమం విధానం ద్వారా, సోరియాసిస్ రోగి వ్యక్తిత్వాన్ని పరిగణనలోకి తీసుకోని వికటించిన రోగ నిరోధక వ్యవస్థను సరిచేసి ఎలాంటి దుష్ఫలితాలు లేకుండా సంపూర్ణంగా నయం చేయవచ్చు. లక్షణాలు సోరియాసిస్ తల, మోచేతులు, మోకాళ్ళు, అరి చేతులు, అరిపాదాలు, ఉదరంపై చర్మాన్ని ప్రభావితం చేస్తుంది ఊ చర్మం ఎర్రబడటం ఊ సాధారణ నుండి అతి తీవ్రమైన దురద ఊ చర్మంపై వెండిరంగు పొలుసులు ఊడిపోవడంఊ సోరియాసిస్ తలలో ఉన్నప్పుడు పొలుసులు రాలడంతో పాటు జుట్టు రాలిపోవడం ఊ అరిచేతులు, అరిపాదాలు చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పగలడం వలన తీవ్రమైన నొప్పి ఉండవచ్చు ఊ సోరియాసిస్ గోర్లను ప్రభావితం చేస్తే అవి పెళుసుబారి దృఢత్వాన్ని కోల్పోయి త్వరగా విరిగిపోతాయి ఊ సోరియాసిస్ వ్యాధి తీవ్రంగా ఉండే కీళ్లను ప్రభావితం చేసి కీళ్లనొప్పులకు దారి తీస్తుంది. డాక్టర్ శ్రీకాంత్ మొర్లావర్, సి.ఎం.డి., హోమియోకేర్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ ఉచిత కన్సల్టేషన్ కొరకు: 9550001188/99 టోల్ ఫ్రీ: 1800 102 2202 బ్రాంచ్‌లు: హైదరాబాద్, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, విశాఖపట్నం, హనుమకొండ, తిరుపతి, కర్ణాటక, తమిళనాడు.