hooks breslet
-
పసందైన పూసలు
ఒకే రకమైన జ్యూవెలరీని వేసుకోవడం ఓల్డ్ ఫ్యాషన్‌గా భావిస్తోంది నేటి యువత. ఒక డ్రెస్ వేసుకుంటే.. దానికి తగ్గ జ్యూవెలరీని వేసుకోవడానికే మొగ్గు చూపుతోంది. అంతేకాదు, ఒకేరకమైన మేకింగ్... అంటే జ్యూవెలరీ తయారీకి కావలసిన వాటిలోనూ వెరైటీ కోరుకుంటోంది. అందుకే ఎంతో ఫ్యాషన్‌గా.. అందంగా కనిపించే జ్యూవెలరీని ‘పూస’లతో ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వారం చూద్దాం.. కావలసినవి: రంగురంగుల పూసలు (చిన్నవి, పెద్దవి), ముత్యాలు, తీగలు, దారాలు, ఇయర్ రింగ్ హుక్స్, బ్రేస్లెట్ హుక్స్, చిన్న సైజు కటింగ్ ప్లయర్ తయారీ: ముందుగా ఏ రంగు జ్యూవెలరీ కావాలో.. ఆ రంగు పూసలను సిద్ధం చేసుకోవాలి. తర్వాత వాటితో ఇయర్ రింగ్స్, బ్రేస్లెట్, లెగ్ చెయిన్స్, నెక్లేస్ తయారు చేసుకోవాలి. ఎలా అంటే... గోల్డ్ లేదా సిల్వర్ కలర్ తీగకు పూసలు లేదా ముత్యాలను ఎక్కించి ఎలాంటి జ్యూవెలరీ కావాలంటే, దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇయర్ రింగ్స్ తయారీకైతే... తీగకు పూసలను ఎక్కించి, చివరకు హుక్స్ను తగిలిస్తే సరిపోతుంది (తీగను మెలికలు తిప్పడానికి కటింగ్ ప్లయర్ను వాడాలి). గాజుల తయారీకి దళసరి తీగలను ఉపయోగించాలి. కొన్నింటికి తీగకు బదులుగా దారాన్ని ఉపయోగిస్తేనే, జ్యుయెలరీ అందంగా కనిపిస్తుంది. నెక్లేస్, చెయిన్ల కోసం దళసరి దారాన్ని వాడాలి. ఒకే వరుస కాకుండా రెండు-మూడు వరుసలుగా పూసలను ఎక్కించి.. చివర్లకు హుక్ తగిలించొచ్చు లేదా రిబ్బన్ వాడినా బాగుంటుంది. అయినా.. పక్కనున్న ఫొటోలను చూస్తే, మీకో ఐడియా వస్తుంది. -
జిప్ జిమ్మిక్స్
వారం వారం ఎన్నో రకాల జ్యుయెలరీ మేకింగ్‌ను చూస్తున్నాం... ఈసారి జిప్స్తో జ్యుయెలరీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం... అవునండీ.. జిప్స్ అంటే అమ్మాయిల డ్రెస్సులకు, అబ్బాయి ప్యాంట్ షర్ట్స్‌కు ఉండేవే... వింతగా అనిపిస్తున్నా అది నిజమండీ. ప్రస్తుతం మార్కెట్లో రంగురంగుల జిప్స్‌ను విడిగా అమ్ముతున్న వాటితో కానీ ఇంట్లో పాతబడిన డ్రెస్సులకున్న జిప్స్తో కానీ ఈ జ్యుయెలరీని తయారు చేసుకోవచ్చు. ఎలా అంటే... కావలసినవి: జిప్లేసులు, జంప్రింగ్ చెయిన్స్, బీడ్స్, బ్రేస్లెట్ హుక్స్, ఇయర్రింగ్ హుక్స్, స్టడ్ పిన్స్, గ్లూ, కత్తెర తయారీ: ముందుగా బ్రేస్లెట్ తయారీకి రెండు జిప్లేస్లను తీసుకొని వాటికి ఇరువైపులా ఉన్న క్లాత్‌కు గ్లూ పూయాలి. ఇప్పుడు ఒకదానికి రెండువైపులా రెండు జంప్రింగ్ చెయిన్స్‌ను అతికించాలి. మరోదానికి బీడ్స్ అతికించాలి. అవి రెండూ ఆరాక... వాటి చివర్లకు హుక్స్ను తగిలిస్తే సరి.. ఎంతో ఫ్యాషన్‌గా కనిపించే బ్రేస్లెట్స్ రెడీ. ఈ బ్రేస్లెట్లను జీన్స్ మీదకు పెట్టుకుంటే అదిరిపోతుంది. జిప్లేస్కున్న క్లాత్ కట్ చేసి పూసలు అతికిస్తే నెక్లేస్ రెడీ. అలాగే జిప్ హ్యాండిల్స్‌కు ఇయర్రింగ్ హుక్స్, స్టడ్ పిన్స్‌ను తగిలిస్తే అవీ రెడీ అయినట్టే. అంతేకాకుండా జిప్ హ్యాండిల్స్‌ను జంపరింగ్స్తో జాయిన్ చేస్తే చెయిన్ తయారవుతుంది.