horizon captured
-
30 కిలోల గంజాయి పట్టివేత
బద్వేల్: వైఎస్సార్ జిల్లా బద్వేల్లో 30 కిలోల గంజాయిను పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితురాలిగా ఓ మహిళను అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా కోటవురట్ల మండలం గొట్టెర గ్రామానికి చెందిన చిన్మల అనే మహిళ లగేజీ బ్యాగులో 30 కిలోల గంజాయిని ఉంచి మంగళవారం ఉదయం బద్వేల్ బస్టాండ్‌కు చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఆమెను పోలీసులు తనిఖీ చేయగా గంజాయి వెలుగు చూసింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా బద్వేల్లోని రంగారెడ్డి అనే వ్యక్తికి అందించేందుకు తీసుకొచ్చినట్టు అంగీకరించిందని పోలీసులు తెలిపారు. -
200 కిలోల గంజాయి పట్టివేత
రోలుగుంట: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడింది. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 200 కిలోల గంజాయిని తూటిపాల - జె.నాయుడుపాలెం రోడ్డులో పెదగడ్డ వంతెన వద్ద సోమవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా. -
రెండు టన్నుల గంజాయి పట్టివేత
ఖాసీంకోట (విశాఖపట్నం): జిల్లా పరిధిలోని ఖాసీంకోట మండలం అమీన్ సాహెబ్ పేట జంక్షన్ వద్ద బుధవారం సుమారు రెండు టన్నుల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. జి.మాడుగుల మండలం నుంచి హైదరాబాద్‌కు వ్యాన్‌లో తరలిస్తుండగా పోలీసులు తనిఖీల్లో గంజాయి బయటపడింది. గంజాయి బయటపడకుండా ఉండేందుకు ఊక బస్తాల మధ్య దాచి ఉంచారు. వ్యాన్ డ్రైవర్లు కె.కొండబాబు, సత్తిబాబులతో పాటు యజమాని మాచినేని నాగేశ్వరరావులను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. పట్టుబడిన గంజాయి విలువ రూ.60 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.