రోలుగుంట: విశాఖపట్నం జిల్లా రోలుగుంట మండలంలో గంజాయి పెద్ద మొత్తంలో పట్టుబడింది. ద్విచక్ర వాహనంపై తరలిస్తున్న 200 కిలోల గంజాయిని తూటిపాల - జె.నాయుడుపాలెం రోడ్డులో పెదగడ్డ వంతెన వద్ద సోమవారం ఉదయం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకోగా, మరో వ్యక్తి పరారయ్యాడు. పట్టుబడిన గంజాయి విలువ సుమారు రూ.20 లక్షలు ఉంటుందని అంచనా.