బద్వేల్: వైఎస్సార్ జిల్లా బద్వేల్‌లో 30 కిలోల గంజాయిను పోలీసులు మంగళవారం ఉదయం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితురాలిగా ఓ మహిళను అరెస్ట్ చేశారు. విశాఖ జిల్లా కోటవురట్ల మండలం గొట్టెర గ్రామానికి చెందిన చిన్మల అనే మహిళ లగేజీ బ్యాగులో 30 కిలోల గంజాయిని ఉంచి మంగళవారం ఉదయం బద్వేల్ బస్టాండ్‌కు చేరుకుంది. అనుమానాస్పదంగా కనిపిస్తున్న ఆమెను పోలీసులు తనిఖీ చేయగా గంజాయి వెలుగు చూసింది. ఆమెను అదుపులోకి తీసుకుని విచారించగా బద్వేల్‌లోని రంగారెడ్డి అనే వ్యక్తికి అందించేందుకు తీసుకొచ్చినట్టు అంగీకరించిందని పోలీసులు తెలిపారు.