horizontally ..
-
జిల్లా జడ్జి నియామకాల్లో వర్టికల్ రిజర్వేషన్లు !
సాక్షి, హైదరాబాద్: జిల్లా జడ్జి పోస్టుల నియా మకాల్లో హారిజాంటల్ రిజర్వేషన్ విధానానికి రాష్ట్ర ప్రభుత్వం మంగళం పాడింది. 9 జిల్లా జడ్డి పోస్టు (ఎంట్రీ లెవల్)లను వర్టికల్ పద్ధతిలో నియమించేందుకు చర్యలు మొదలుపెట్టింది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఇటీవల నోటిఫికేషన్ ఇవ్వగా, పూర్తిస్థాయి(డిటెయిల్డ్) నోటిఫికేషన్ ఈనెల 14వ తేదీ నుంచి తెలంగాణ రాష్ట్ర హైకోర్టు వెబ్సైట్లో అందుబాటులో ఉంచ నున్నట్టు అధికారులు వెల్లడించారు.ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 9 ఉద్యో గాలకు సంబంధించి రోస్టర్ పాయింట్లను ప్రకటించింది. అయితే ఈ రోస్టర్ వర్టికల్ రిజర్వేషన్ల పద్ధతిలో ఉండడం గమనార్హం. రాష్ట్రంలో నూతన జోనల్ విధానం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించి సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం హారిజాంటల్ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. కానీ తాజాగా జిల్లాజడ్జి పోస్టుల భర్తీలో వర్టికల్ రిజర్వేషన్ విధానం ఉండడంతో అయోమయం నెలకొంది.జిల్లా జడ్జి పోస్టుల భర్తీలో భాగంగా ఈనెల 14వ తేదీ నుంచే దరఖాస్తుల స్వీకరణ ప్రారంభించనున్నట్టు అందులో వివరించారు. మే 13వ తేదీ వరకు దరఖాస్తుల స్వీకరణ పూర్తవుతుందని, ఈ ఏడాది ఆగస్టు 24, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు ప్రాథమికంగా ప్రకటించారు. అయితే 9 జిల్లా జడ్జి పోస్టుల్లో మహిళలకు నాలుగు పోస్టులు రిజర్వు చేసింది. ఖాళీ పోస్టులు, రోస్టర్ పాయింట్ల వారీగా ఎలా ఉంటుందో ప్రభుత్వం వెల్లడించింది. -
47% కొలువులు మహిళలకే
సాక్షి, హైదరాబాద్: గడిచిన మూడు నెలల్లో మొత్తం 28,942 కొలువులను భర్తీ చేయగా, అందులో 13,571 (47 శాతం) కొలువులను మహిళలు, 15,371 (51 శాతం) ఉద్యోగాలను పురుషులు దక్కించుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. మహిళా రిజర్వేషన్లను హారిజాంటల్గా అమలు చేయాలని ఆదేశిస్తూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జీవో నం.3 జారీ చేయగా, దీనితో మహిళలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని బీఆర్ఎస్ ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత మూడు నెలల్లో భర్తీ చేసిన ఉద్యోగాల్లో మహిళలు, పురుషులకు లభించిన పోస్టుల సంఖ్యతో రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలను విడుదల చేసింది. ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం కోటా మాత్రమే ఉన్నా, వారు ఏకంగా 47 శాతం ఉద్యోగాలను దక్కించుకున్నారని ప్రభుత్వం తెలిపింది. రిజర్వేషన్లు, రోస్టర్ పాయింట్ల విషయంలో హైకోర్టు, సుప్రీం కోర్టుల ఆదేశాల మేరకు 2022 లోనే రాష్ట్ర ప్రభుత్వం 7593 మెమో జారీ చేసిందని, దాని ఆధారంగానే ప్రభుత్వం ఇటీవల జీవో నం. 3 జారీ చేసిందని అధికారవర్గాలు తెలిపాయి. -
మహిళలు లేకపోతే పురుషులతో భర్తీ
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో హారిజాంటల్ రిజర్వేషన్ల అమలు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం సవరించింది. మహిళలకు హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పాయింట్ల పట్టికలో ఎలాంటి ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 (33.3) శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయిస్తూ గతంలో జీఓ ఎంఎస్ 3ను జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఉద్యోగాల భర్తీ క్రమంలో నిర్దేశించిన పోస్టులకు సరైన అభ్యర్థులు లేనిపక్షంలో వాటిని క్యారీఫార్వర్డ్ చేసే పద్ధతి (ఖాళీని అలాగే ఉంచడం) ఇకపై ఉండబోదు. దీనికి అనుగుణంగా తెలంగాణ స్టేట్ సబార్డినేట్ సర్వీస్ రూల్స్–1996 లోని రూల్ 22, 22ఏలో ప్రభుత్వం మార్పులు చేసింది. తాజా సవరణలో భాగంగా ప్రస్తుతం మహిళలకు 33.3 శాతం రిజర్వు చేస్తున్నప్పటికీ.. కమ్యూనిటీ రిజర్వేషన్ల కేటగిరీల్లో అర్హులైన మహిళా అభ్యర్థులు లేనప్పుడు ఆయా ఉద్యోగాలను పురుషులతో భర్తీ చేసే వెసులుబాటు కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ తరఫున రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి జీఓఎంఎస్ 35 జారీ చేశారు. ఈ ఉత్తర్వులను తక్షణమే అమలు చేయాలని అన్ని ప్రభుత్వ శాఖలకు, ఉద్యోగ నియామక సంస్థలైన టీఎస్పీఎస్సీతో పా టు ఇతర బోర్డులకు పంపించారు. దీంతో ఏదైనా నోటిఫికేషన్లో నిర్దేశించిన అన్ని ఖాళీలను అదే సమయంలో తప్పనిసరిగా భర్తీ చేయాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లో ఉద్యోగాలకు అర్హులైన మహిళా అభ్యర్థులు లేని సందర్భంలో, అదే కమ్యూనిటీకి చెందిన పురుషులతో భర్తీ చేయ డం వల్ల పోస్టులు ఖాళీగా ఉండే పరిస్థితి ఉత్పన్నం కాదు. మహిళలకు నిర్దేశించిన పోస్టులు పురుషులతో భర్తీ చేస్తే... మహిళలకు దక్కాల్సిన 33.3% దక్కకుండా పోతాయనే అభిప్రాయం వ్యక్తమవు తోంది. నియామకాల ప్రక్రియలో దీర్ఘకాలికంగా ప రిస్థితిని పరిశీలిస్తే మహిళలకు అతి తక్కువ సంఖ్య లో పోస్టులు దక్కుతాయనే వాదన వినిపిస్తోంది. -
మహిళలకు రిజర్వేషన్లు.. ప్రతి కేటగిరీలో 33.3%
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగ నియామ కాల్లో మహిళలకు హారిజాంటల్ (సమాంతర) పద్ధతిలో 33 1/3 శాతం (33.333%) రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో, ఆ మేరకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ తాజాగా ఉత్తర్వులు జారీ (జీఓ.ఎంఎస్.3) చేశారు. వీటి ప్రకారం మహిళలకు ఓపెన్ కాంపిటీషన్ (ఓసీ)తో పాటు ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, బీసీ–ఏ, బీసీ–బీ, బీసీ–సీ, బీసీ–డీ, బీసీ–ఈ, దివ్యాంగులు, ఎక్స్ సర్విస్‌మెన్, క్రీడాకారుల కోటాలో హారిజాంటల్ పద్ధతి (రోస్టర్ పట్టికలో ప్రత్యేకంగా ఎలాంటి మార్కింగ్ లేకుండా)లో 33 1/3 శాతం రిజర్వేషన్లు అమలు చేయనున్నారు. ఇప్పటివరకు వర్టీకల్ పద్ధతి (పట్టికలోని పోస్టుల్లో కొన్నిటిని ప్రత్యేకంగా మహిళలకంటూ మార్కింగ్ ఇచ్చేవారు)లో ఉద్యోగ నియామ కాలు చేయగా.. ఇకపై ఎలాంటి మార్కింగ్ చేయకుండా 33 1/3శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం సూచించిన మెథడాలజీ ప్రకారం అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో మహిళలకు 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలుకు గతంలో ఇచ్చిన జీవో నం.41/1996, జీవో నం. 56/1996 ఉత్తర్వులు రద్దు చేసింది. ఈ పద్ధతిని ప్రస్తుతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ప్రభుత్వ విభాగాలు, ప్రభుత్వరంగ సంస్థలు, రాజ్యాంగ నియామక సంస్థలు, ఎయిడెడ్ విద్యాసంస్థలు, స్థానిక సంస్థల్లో మహిళలకు సమాంతర రిజర్వేషన్ల నిబంధనలు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సాధారణ పరిపాలనశాఖ ప్రత్యేకంగా జీవో జారీ చేయనుందని తాజా ఉత్తర్వుల్లో ప్రభుత్వం పేర్కొంది. మెమోకు అనుగుణంగా ఉత్తర్వులు మహిళలకు హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుకు సంబంధించి ఇటీవల రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి సాధారణ పరిపాలన శాఖ తరపున ఒక మెమో జారీ చేసిన సంగతి తెలిసిందే. కాగా ఈ మెమోను అన్ని నియామక సంస్థలకు పంపించారు. ఈ విషయంలో న్యాయ వివాదాలు తలెత్తకుండా మహిళా శిశు సంక్షేమశాఖ 33 1/3 శాతం రిజర్వేషన్ల అమలు కోసం 1996లో జారీ చేసిన జీవో నం.41కు, రాష్ట్ర సబార్డినేట్ సర్విసు నిబంధనలు రూల్.22కు సవరణలు చేయాలని పేర్కొంటూ టీఎస్పీఎస్సీ ఈనెల 8న మహిళా శిశు సంక్షేమ శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఆ శాఖ మహిళలకు రోస్టర్ పాయింట్ లేకుండా హారిజాంటల్ రిజర్వేషన్ల అమలుపై ఉత్తర్వులు జారీ చేసింది. -
అడ్డంగా దొరికిండు..
రూ.10వేలు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్ ఖమ్మంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు ఓ అవినీతి చేప చిక్కింది. విశ్రాంత ఉద్యోగి భూమిని సర్వే చేయడానికి లంచం డిమాండ్ చేయడంతో విసిగిన పెద్దాయన..ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం..ఓ హోటల్లో డబ్బు అందజేస్తుండగా..అక్కడికక్కడే అవినీతి నిరోధక శాఖ అధికారులు సదరు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. ఖమ్మం క్రైం:ల్యాండ్ సర్వేశాఖలో డిప్యూటీ సర్వేయర్ అన్నాల్‌దాస్ మురళి రూ.10వేలు లంచం తీసుకుంటూ గురువారం ఖమ్మంలో ఏసీబీకి చిక్కాడు. బోనకల్ మండలం రాయన్నపేటకు చెందిన రిటైర్డ్ సింగరేణి ఉద్యోగి కానూరి గోపికృష్ణ భూమిని సర్వే చేయడానికి లంచం ఇవ్వాలని పట్టుబట్టి తీసుకుంటుండగా ఇలా దొరికిపోయాడు. బాధితుడు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు గోపీకృష్ణకు బోనకల్ మండలంలోని కలకోటలో 436 సర్వే నెంబర్లో 20ఎకరాల భూమి ఉంది. తన కూతురు ఇంటì æకోనుగోలు కోసం 2011లో మూడెకరాల 71 సెంట్లను అదేప్రాంతానికి చెందిన వాసిరెడ్డి అప్పారావుకు విక్రయించారు. ఈ భూమిని కొలిపించినప్పుడు..పట్టా కాగితాల్లో ఉన్న దానికంటే తక్కువగా ఉందని, తన పొలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ ఐదు నెలల క్రితం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సర్వేకు ఆర్డీఓ ఆదేశించారు. సర్వేశాఖలోని డిప్యూటీ సర్వేయర్ అన్నాల్దాస్మురళి కొన్నాళ్ల క్రితం గోపికృష్ణతో కలిసి వెళ్లి కలకోటలోని ఆ భూమిని పరిశీలించారు. రూ.10వేలు ఇస్తేనే సర్వే చేస్తానని తిప్పించుకుంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడు భార్యతో కలిసి బెంగళూరులోని కూతురి వద్ద ఉంటున్నారు. ఈక్రమంలో మూడు నాలుగు సార్లు అక్కడి నుంచి ఖమ్మం వచ్చి డిప్యూటీ సర్వేయర్‌ను కలిసి సర్వే చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడంతో విసిగి..ఇటీవల ఏసీబీ సీఐ రమణమూర్తిని ఆశ్రయించి విషయం వివరించారు. పొద్దున్నే..పుచ్చుకునే ఏసీబీ అధికారుల సూచనతో బాధితుడు బుధవారం డిప్యూటీ సర్వేయర్ మురళికి ఫోన్ చేసి..‘మీరడిగిన లంచం ఇస్తాను’ అని చెప్పించారు. ఇంటికి తీసుకురావాలని అతను అడగడంతో గురువారం ఉదయం 7 గంటలకు ఎస్పీ ఆఫీస్ రోడ్‌లోని అతడి ఇంటికి వెళ్లగా అక్కడ లేకపోవడంతో..సమీపంలోని హోటల్లో టీ తాగుతున్నానని, ఇక్కడికి రావాల్సిందిగా చెప్పగా..ఏసీబీ సిబ్బంది అక్కడ మాటు వేశారు. హాటల్‌కు చేరుకున్న గోపికృష్ణ వద్ద నుంచి మురళి రూ.10వేలు తీసుకుంటుండగా..ఏసీబీ వారు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా అధ్వర్యంలో జరిగిన దాడిలో ఏసీబీ సీఐలు రమణమూర్తి, పద్మ, వరంగల్ ఏసీబీ సీఐ రాఘవేంద్రరావు, సిబ్బంది పాపారావు, శ్రీనవాసాచారి, వెంకటరెడ్డి పాల్గొన్నారు. రేటు..పోస్టు ల్యాండ్ సర్వే శాఖలోని డిప్యూటీ సర్వేయర్ పోస్ట్ తీరే‡వేరుగా కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్ 15వ తేదీన అప్పటి డిప్యూటీ సర్వేయర్ చారి రూ.లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సరిగ్గా ఏడాది కావస్తుండగా..ఇదిగో ఇలా మరో డిప్యూటీ సర్వేయర్ ఏసీబీకి చిక్కడం విశేషం.