అడ్డంగా దొరికిండు.. | Dorikindu horizontally .. | Sakshi
Sakshi News home page

అడ్డంగా దొరికిండు..

Published Fri, Aug 5 2016 12:00 AM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

: ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సర్వేయర్‌ మురళి

: ఏసీబీకి చిక్కిన డిప్యూటీ సర్వేయర్‌ మురళి

  • రూ.10వేలు లంచం తీసుకున్న డిప్యూటీ సర్వేయర్‌
  • ఖమ్మంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
  • ఓ అవినీతి చేప చిక్కింది. విశ్రాంత ఉద్యోగి భూమిని సర్వే చేయడానికి లంచం డిమాండ్‌ చేయడంతో విసిగిన పెద్దాయన..ఏసీబీని ఆశ్రయించారు. పథకం ప్రకారం..ఓ హోటల్‌లో డబ్బు అందజేస్తుండగా..అక్కడికక్కడే అవినీతి నిరోధక శాఖ అధికారులు సదరు ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది.  

    ఖమ్మం క్రైం:ల్యాండ్‌ సర్వేశాఖలో డిప్యూటీ సర్వేయర్‌ అన్నాల్‌దాస్‌ మురళి రూ.10వేలు లంచం తీసుకుంటూ గురువారం ఖమ్మంలో ఏసీబీకి చిక్కాడు. బోనకల్‌ మండలం రాయన్నపేటకు చెందిన రిటైర్డ్‌ సింగరేణి ఉద్యోగి కానూరి గోపికృష్ణ భూమిని సర్వే చేయడానికి లంచం ఇవ్వాలని పట్టుబట్టి తీసుకుంటుండగా ఇలా దొరికిపోయాడు. బాధితుడు, ఏసీబీ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..
    బాధితుడు గోపీకృష్ణకు బోనకల్‌ మండలంలోని కలకోటలో 436 సర్వే నెంబర్‌లో 20ఎకరాల భూమి ఉంది. తన కూతురు ఇంటì æకోనుగోలు కోసం 2011లో మూడెకరాల 71 సెంట్లను అదేప్రాంతానికి చెందిన వాసిరెడ్డి అప్పారావుకు విక్రయించారు. ఈ భూమిని కొలిపించినప్పుడు..పట్టా కాగితాల్లో ఉన్న దానికంటే తక్కువగా ఉందని, తన పొలాన్ని ఆక్రమించారని ఆరోపిస్తూ ఐదు నెలల క్రితం గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. సర్వేకు ఆర్డీఓ ఆదేశించారు. సర్వేశాఖలోని డిప్యూటీ సర్వేయర్‌ అన్నాల్‌దాస్‌మురళి కొన్నాళ్ల క్రితం గోపికృష్ణతో కలిసి వెళ్లి కలకోటలోని ఆ భూమిని పరిశీలించారు. రూ.10వేలు ఇస్తేనే సర్వే చేస్తానని తిప్పించుకుంటున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బాధితుడు భార్యతో కలిసి బెంగళూరులోని కూతురి వద్ద ఉంటున్నారు. ఈక్రమంలో మూడు నాలుగు సార్లు అక్కడి నుంచి ఖమ్మం వచ్చి డిప్యూటీ సర్వేయర్‌ను కలిసి సర్వే చేయాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినా స్పందించకపోవడంతో విసిగి..ఇటీవల ఏసీబీ సీఐ రమణమూర్తిని ఆశ్రయించి విషయం వివరించారు.
    పొద్దున్నే..పుచ్చుకునే
    ఏసీబీ అధికారుల సూచనతో బాధితుడు బుధవారం డిప్యూటీ సర్వేయర్‌ మురళికి ఫోన్‌ చేసి..‘మీరడిగిన లంచం ఇస్తాను’ అని చెప్పించారు. ఇంటికి తీసుకురావాలని అతను అడగడంతో గురువారం ఉదయం 7 గంటలకు ఎస్పీ ఆఫీస్‌ రోడ్‌లోని అతడి ఇంటికి వెళ్లగా అక్కడ లేకపోవడంతో..సమీపంలోని హోటల్‌లో టీ తాగుతున్నానని, ఇక్కడికి రావాల్సిందిగా చెప్పగా..ఏసీబీ సిబ్బంది అక్కడ మాటు వేశారు. హాటల్‌కు చేరుకున్న గోపికృష్ణ వద్ద నుంచి మురళి రూ.10వేలు తీసుకుంటుండగా..ఏసీబీ వారు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సాయిబాబా అధ్వర్యంలో జరిగిన దాడిలో ఏసీబీ సీఐలు రమణమూర్తి, పద్మ, వరంగల్‌ ఏసీబీ సీఐ రాఘవేంద్రరావు, సిబ్బంది పాపారావు, శ్రీనవాసాచారి, వెంకటరెడ్డి పాల్గొన్నారు.
    రేటు..పోస్టు
    ల్యాండ్‌ సర్వే శాఖలోని డిప్యూటీ సర్వేయర్‌ పోస్ట్‌ తీరే‡వేరుగా కనిపిస్తోంది. గతేడాది సెప్టెంబర్‌ 15వ తేదీన అప్పటి డిప్యూటీ సర్వేయర్‌ చారి రూ.లక్ష రూపాయలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. సరిగ్గా ఏడాది కావస్తుండగా..ఇదిగో ఇలా మరో డిప్యూటీ సర్వేయర్‌ ఏసీబీకి చిక్కడం విశేషం.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement