బస్‌స్టాప్‌లోకి దూసుకెళ్లిన కారు: ఇద్దరు మృతి
బెంగళూరు: బెంగళూరు నగరంలోని హోసూర్ రోడ్డులో శనివారం కారు బీభత్సం సృష్టించింది. బస్ స్టాప్‌లో బస్సు కోసం వేచి ఉన్న ప్రయాణికులపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మరణించారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కారులోని వ్యక్తిని స్థానికులు పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. అలాగే మృతదేహాలను పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.