hottest day
-
భూగోళంపై అత్యంత వేడి దినం.. జూలై 4
వాషింగ్టన్: గత 1,25,000 సంవత్సరాల్లో ఈ ఏడాది జూలై 4వ తేదీ భూగోళంపై అత్యంత వేడి దినంగా రికార్డుకెక్కింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఉష్ణోగ్రత నమోదైన దినంగా ఈ నెల 3వ తేదీ రికార్డు సృష్టించింది. ఆ రికార్డు ఒక్కరోజులోనే బద్దలు కావడం విశేషం. 3న ప్రపంచవ్యాప్తంగా సగటు ఉష్ణోగ్రత 17.01 డిగ్రీల సెల్సియస్‌కు చేరినట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మెయిన్‌కి చెందిన క్లైమేట్ చేంజ్ ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. 4వ తేదీన ఇది 17.18 డిగ్రీల సెల్సియస్(62.92 డిగ్రీల ఫారన్‌హీట్)కు ఎగబాకినట్లు తెలియజేసింది. ఈ ఉష్ణోగ్రతను గణించడానికి మోడలింగ్ సిస్టమ్‌ను 1979 నుంచి ఉపయోగిస్తున్నారు. దీని ప్రకారం లక్షల సంవత్సరాల క్రితం నాటి ఉష్ణోగ్రతను సైతం అంచనా వేయొచ్చు. -
మంచుకొండల్లో 42 డిగ్రీల ఉష్ణోగ్రత!!
వేసవి సెలవలు వచ్చాయి కదా అని ఏదైనా చల్లటి ప్రదేశానికి వెళ్దామనుకుంటున్నారా? అయితే పొరపాటున కూడా జమ్ముకు మాత్రం వెళ్లద్దు. ఎందుకంటే, అక్కడ మన హైదరాబాద్ కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రత నమోదవుతోంది. గురువారం నాడు హైదరాబాద్‌లో గరిష్ఠ ఉష్ణోగ్రత కేవలం 40.1 డిగ్రీల సెల్సియస్ అయితే జమ్ములో ఏకంగా 41.8.. అంటే దాదాపు 42 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ సంవత్సరంలో ఈ సీజన్లో ఇంతవరకు ఇదే అత్యధిక ఉష్ణోగ్రత అని వాతావరణ శాఖ అధికారి ఒకరు తెలిపారు. అంతేకాదు.. రాబోయే రోజుల్లో ఈ ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని కూడా ఆయన అన్నారు. వేడి బాగా ఎక్కువగా ఉండటంతో జనం చాలావరకు ఇళ్లకే పరిమితం అవుతున్నారు. రోడ్ల మీద ఎక్కడా ట్రాఫిక్ అన్నది కనపడలేదు. మార్కెట్లు కూడా ఖాళీగానే ఉన్నాయి. ప్రైవేటు విద్యా సంస్థలు మూసేసినా, ప్రభుత్వ పాఠశాలు మాత్రం పనిచేస్తున్నాయి. వేడి బాగా ఎక్కువగా ఉన్నందున మధ్యాహ్న సమయాల్లో బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. తప్పనిసరై రావాల్సి వస్తే.. గొడుగులు తప్పకుండా వేసుకు రావాలని చెప్పారు.