The House
-
ఈ వారం యూట్యూబ్ హిట్స్
ఎద్ షీరన్: హౌ ఉడ్ యు ఫీల్ (పీయ్న్) నిడివి : 4 ని. 45 సె., హిట్స్ : 67,48,454 పీయాన్ అంటే స్తుతి కీర్తన. ఇందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని స్తుతిస్తూ గీతాలాపన చేస్తుంటాడు. 26 ఏళ్ల బ్రిటన్ సింగర్, సాంగ్ రైటర్ ఎద్ షీరన్ గొంతులోంచి వచ్చే మార్ద్రవమైన ఆ ప్రేమ ఫీల్.. శ్రోతల్ని కావలించుకుంటుంది. ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని వింటే మీరు మీ ప్రేయసి దగ్గరికి వెళ్లడమో, మీ ప్రేయసే మీ దగ్గరికి వచ్చేయడమో జరుగుతుంది. నమ్మండి! ‘నువ్వు నాకు ఒకే ఒక అమ్మాయివి. ఆ సంగతి నీకూ తెలుసు. నీతో ఏకాంతంలో ఉన్నప్పుడు నా వయసు తగ్గినట్లుగా అయిపోతాను. పార్క్ చేసిన కారులో నువ్వూ నేనూ దొంగ ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు మనం ఒకర్ని ఒకరం అడగలేని ప్రశ్నలు ఎన్నో మనసులో మెదులుతాయి. నేన్నిన్ను ప్రేమిస్తున్నానని చెబితే నీకు ఏమనిపిస్తుంది? నువ్వెలా ఫీలవుతావ్..’ ఇలా తేలిపోతుంటుంది సాంగ్. మొత్తం నాలుగు చరణాలు ఉన్నాయి. చివరి చరణంలో అబ్బాయి ఇక ఆగలేక అడుగుతాడు... ‘నీకు ఐ లవ్యూ చెప్పాను కదా, నువ్వు కూడా నాకు ఐ లవ్యూ చెప్పు..’ అంటాడు. కాస్త మెల్లకన్నుతో కనిపించే ఇద్ షీరన్ అనే తెల్లబ్బాయి ఈ ‘హౌ డు యు ఫీల్’ లవ్ సాంగ్‌ను మొన్న ఫిబ్రవరి 17న తన బర్త్‌డే సందర్భంగా విడుదల చేశాడు. షీరన్ ఇప్పటికే రెండు అల్బమ్లు రిలీజ్ చేశాడు. మూడో అల్బమ్ ‘డివైడ్’ మార్చిలో వస్తోంది. ది హౌస్: అఫిషియల్ ట్రైలర్ నిడివి : 2 ని. 27 సె., హిట్స్ : 11,42,026 కామెడీ స్క్రిప్టు రాయడంలో ఆండ్రూ జె.కొహెన్ ఎక్స్పర్ట్. 2014లో విడుదలైన హాలీవుడ్ కామెడీ మూవీ ‘నైబర్స్’లో పంచ్‌లన్నీ ఆండ్రూవే. మరో స్క్రిప్టు రైటర్ బ్రెండన్ ఓబ్రియన్‌తో కలిసి ఆయన ‘నైబర్స్’కి పని చేశారు. ఇప్పుడు కూడా వీళ్లిద్దరి కాంబినేషన్ స్క్రిప్టులోనే ఆండ్రూ డైరెక్షన్లో కొత్త కామెడీ ఫిల్మ్ ‘ది హౌస్’ తయారవుతోంది. జూన్ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్లోడ్ అయింది. ట్రైలర్ నిండుగా ఉంది. ఎంత నిండుగానంటే.. ‘హోప్ఫుల్లీ ఆల్ ద ఫన్నీ పార్ట్స్ ఆరెంట్ ఇన్ ది ట్రైలర్’ అని ఓ వ్యూయర్ కామెంట్ పోస్ట్ చేసేశారు. చిత్రంలో స్కాట్, కేట్ అని ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్లకో కూతురు ఉంటుంది. ఆమెకు ట్యూషన్ ఫీజు కట్టడానికి వీళ్ల దగ్గర డబ్బులు ఉండవు. ఏం చేయాలి? బాగా ఆలోచించి, ఇంట్లోనే బేస్మెంట్లో అక్రమంగా ఒక జూదగృహం (కేసినో) మొదలు పెడతారు. ఇక అక్కడి నుంచి కామెడీ స్టార్ట్ అవుతుంది. డోరా: తమిళ్ మూవీ ట్రైలర్ నిడివి : 55 సె., హిట్స్ : 12,35,875 సూపర్‌స్టార్ రజనీకాంత్ ‘కబాలి’ మూవీ తర్వాత ఇంచుమించు ఆ లెవల్లో యూత్‌ని రఫ్ ఆడిస్తున్న టీజర్ డోరా. ఈ తమిళ్ హారర్ థ్రిల్లర్ ఫిల్మ్‌కు దర్శకుడు.. దాస్ రామస్వామి. నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. డోరా షూటింగ్ నిరుడు మార్చిలో ప్రారంభమైంది. చిత్రం ఈ ఏప్రిల్ 11న విడుదల అవుతోంది. డోరా అంటే ‘గాడ్స్ గిఫ్ట్’ అని అర్థం. మూవీ కథ ఏంటో పూర్తిగా బయటికి రాకపోయినా టీజర్ చూసి కొంత పట్టేయొచ్చు. అడవి లాంటి ప్రదేశం, మాంత్రికురాలు, రాత్రి, చీకటి, కారు డ్రైవర్, రక్తం, రక్తపిశాచి, రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతి, ఒక ఊరు, ఆ ఊరికి దారి చూపే బాణం లాంటి సూచిక, అధాటున భయపడిన నయనతార, వెనుక నుంచి దెయ్యం మాట్లాడ్డం, సమాధులు, సిలువలు... మొత్తానికి భయమే ప్రధాన కథాంశం అనీ, ప్రేక్షకులను భయపెట్టడమే అసలు కథనం అని వీడియో చెబుతోంది. మ్యూజిక్ వివేక్ శివ, మెర్విన్ సాల్మన్. వీళ్లిద్దరి చేతుల్లోనే సినిమా అంతా ఉంది. సాధారణంగా హారర్ థ్రిల్లర్లకు మ్యూజిక్కే ప్రాణం కాబట్టి. -
బైక్ ఉంటే.. రేషన్ కట్!
80 వేల బియ్యం యూనిట్లకు కోత 20 శాతం కార్డులకు సరుకులు నిల్ 6 నెలలు వరుసగా రేషన్ తీసుకోని వారి పేర్లు తొలగింపుట ఈ చేత్తో ఇచ్చి.. ఆ చేత్తో లాక్కుంటున్న సర్కారు సామాన్య ప్రజల గగ్గోలు మీకు 100 సీసీ బైకు ఉందా.. 750 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు ఉందా.. 2.5 ఎకరాల మాగాణి ఉందా.. 5 ఎకరాల మెట్ట భూములున్నాయా.. మీ ఇంటికి రూ.500కు పైగా విద్యుత్ బిల్లు వస్తోందా?.. వీటిలో ఏ ఒక్కదానికి మీరు ‘అవును’ అని తలూపినా.. సంక్షేమ కార్యక్రమాలకు మీరు అనర్హులైనట్లే! ఇదేమిటి.. ఇదెక్కడి చోద్యం అనకండి.. ఎందుకంటే రాష్ట్ర సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు అలా ఉంటున్నాయి మరి..!! పైన పేర్కొన్న కొలమానాలు పెట్టి సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల సంఖ్యను తెగ్గొట్టి నిధులు మిగుల్చుకోవాలని ప్రభుత్వ పెద్దలు తలపోస్తున్నారు. చివరికి ఇదే ఫార్ములాతో రేషన్ బియ్యంలోనూ కోత విధించేందుకు సిద్ధపడ్డారు. తర్వాత వంతు సామాజిక పెన్షన్లదని అధికారులే చెబుతున్నారు. ఇంటిలో ఒకరి పేరే.. మా ఇంటిలో నాభర్త, నేను, ఇద్దరు పిల్లలు ఉంటే ఒకరి పేరుతోనే రేషన్‌కార్డులో అచ్చయింది. దీంతో ఐదుకిలోల బియ్యమే ఇస్తున్నారు. ముగ్గురికి రేషన్ ఇవ్వరట. కార్డు సమస్య ఇలా ఉండడం వల్ల సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసినా స్పందన లేదు. - సీహెచ్.సంతోషి, ఇందిరానగర్ విశాఖపట్నం : ప్రస్తుతం జరుగుతున్న రేషన్ బియ్యంలో కోత విధించే తంతు చూస్తే.. ఈ చేత్తో ఇచ్చి ఆ చేత్తో లాక్కున్నట్టుంది సర్కార్ తీరు. ఆధార్ సీడింగ్ పేరుతో గత ఏడాది కాలంలో రెండున్నర లక్షలకు పైగా కార్డులను, ఐదులక్షలకు పైగా యూనిట్లను తొలగించిన ప్రభుత్వం.. అనంతరం తీరిగ్గా కొత్త కార్డులు జారీ చేసింది. అందులో భాగంగా విశాఖ జిల్లాలో 1.15 లక్షల కొత్తకార్డులు ఇచ్చారు. ఈ కార్డుల పరిధిలో 1.85 లక్షల బియ్యం యూనిట్లు(కుటుంబంలోని ఒక మనిషికి ఇచ్చే బియ్యాన్ని ఒక యూనిట్‌గా పరిగణిస్తారు) ఉన్నాయి. జనవరిలో నిర్వహించిన ‘జన్మభూమి-మావూరు’లో అట్టహాసంగా పంపిణీ చేసిన ఈ కార్డుల అసలు రంగు ఫిబ్రవరిలో బయటపడింది. రేషన్ కార్డుల్లో నమోదైన ఒకరిద్దరిద్దరు సభ్యులకు మినహా మిగిలిన సభ్యులకు బియ్యం ఇవ్వం పొమ్మన్నారు డీలర్లు. కాగా సుమారు 20 శాతం కార్డులకు అసలు సరుకులే అందలేదు. కారణం అడిగితే ఈ కార్డుల్లో ఏ ఒక్కరికీ సరుకుల ఎలాట్మెంట్ జరగలేదని చెబుతున్నారు. ఇదేమిటని ప్రశ్నిస్తే.. ఆధార్, ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ కానందునే సరుకులు కేటాయించలేదని అధికారులు చెప్పుకొచ్చారు. ఈ 20 శాతం కొత్తకార్డులతోపాటు మొత్తం కార్డుల్లో సుమారు 80వేల యూనిట్లకు ఫిబ్రవరిలో సరుకులందలేదు. దీంతో వారంతా తమ ఆధార్, ఫ్యామిలీ ఫోటోలు అప్లోడ్ చేసుకునేందుకు మీ సేవ కేంద్రాలు, ఏఎస్వో కార్యాలయాల వద్ద క్యూలు కట్టారు. కానీ అక్కడి కంప్యూటర్లు వీరిలో చాలా మందిని తెల్లకార్డుకు అనర్హులుగా ప్రకటిస్తూ.. వారికి సరుకులిచ్చే అవకాశం లేదని తేల్చేశాయి. ఏ విధంగా మేము అనర్హులమో చెప్పాలని కోరితే.. మీకు వందకుపైగా సీసీ సామర్థ్యమున్న బైకు ఉందని కంప్యూటర్ చూపిస్తోంది. ఈ ఒక్క కారణంతోనే సరుకులందని 80 వేల యూనిట్లలో సగానికిైపైగా కంప్యూటర్ వ్యవస్థ తొలగించేసిందని అధికారులే చెబుతున్నారు. ఇది ఆరంభమే.. ఇక్కడితో అయిపోలేదని.. తర్వాత దశల్లో ఇంకా చాలామంది పేర్లు అనర్హుల జాబితాలో చేరిపోతాయని అంటున్నారు. అదేలా అంటే.. తర్వాతి దశల్లో 750 చ.అ. విస్తీర్ణంలో ఇల్లు.. 2.5 ఎకరాల మాగాణి.. 5 ఎకరాల మెట్ట భూమి ఉన్న వారిని.. రూ.500కు పైగా విద్యుత్ బిల్లులొస్తున్న వారి పేర్లను రేషన్ అర్హుల జాబితా నుంచి తొలగించేలా కంప్యూటర్ వ్యవస్థకు ఫీడ్ చేస్తారని తెలుస్తోంది. మరోపక్క ఈ-పా్స్ ద్వారా సరుకులు తీసుకోలేని 21 శాతానికి పైగా రేషన్‌కార్డులను ఈ-పాస్ మిషన్ల నుంచి ఇప్పటికే తొలగించేశారు. గత ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు వరుసగా సరుకులు తీసుకోని వారిని గుర్తించి వారి పేర్లను హైదరాబాద్ స్థాయిలోనే సర్వర్ నుంచి తొలగించేశారు. వీరి కార్డులు రద్దు కావని అధికారులు పైకి చెబుతున్నప్పటికీ ఈ-పాస్ మిషన్లలో వాటి వివరాలు ఇక కన్పించవు. ఈ విధంగా లక్షన్నరకు పైగా కార్డులు పూర్తిగా ఈ-పాస్ నుంచి తొలగించినట్టు అధికారులు చెబుతున్నారు. ఇదంతా హైదరాబాద్ స్థాయిలో జరిగిందని.. తమకు కూడా కనీస సమాచారం లేదంటున్నారు. కాగా ఇచ్చినట్టే ఇచ్చి ఈ కోతలేమిటని కొత్త కార్డుదారులు ప్రశ్నిస్తున్నారు. జనవరిలో కొత్తగా జారీ చేసిన 1.15 లక్షల కార్డుల్లో కనీసం 20 శాతం కార్డుదారుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. మరో పక్క సరుకులందక ఇబ్బందిపడుతున్న పాత కార్డుల వారి పరిస్థితి కూడా అదేవిధంగా ఉంది. అడిగితే నాపేరు తీసేశారు... 18జీపీఎల్15: కాళ్ల రమణమ్మ మా ఇంటిలోని అందరి పేర్లు రేషన్‌కార్డులో ఉన్నా.. రికార్డులో లేవంటూ డీలరు చెప్పారు. తొలుత ఐదుగురిలో ఇద్దరికే రేషన్ ఇచ్చేవారు. తర్వాత నాపేరు, ఎవరి పేరూ లేదట. ఇదేం విడ్డూరమో తెలీదు. పేదల బాధలు వినడానికి అధికారులకు తీరిక లేదు. కాళ్ల రమణమ్మ, గోపాలపట్నం -
ఒక్క క్లిక్‌తో ఇంటికి అనుమతి
సరళ పద్ధతుల్లో నూతన భవన నిర్మాణ పాలసీ జీహెచ్ఎంసీపై సమీక్ష అనంతరం మంత్రి తలసాని హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒక మధ్యతరగతి కుటుంబం ఇల్లు కట్టుకోవాలంటే ప్రస్తుతం సవాలక్ష సమస్యలు ఎదురవుతున్నాయి. లెక్కకు మిక్కిలిగా ఉన్న ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ తదితర సంస్థల నుంచి పొందాల్సిన అనుమతులు, అధికారులకు ‘ఆమ్యామ్యాలు’ వంటి దశలను దాటితేగానీ మహాయజ్ఞం లాంటి ఇంటి నిర్మాణం మొదలుపెట్టడం సాధ్యంకావట్లేదు. ఈ దుస్థితి లేని వ్యవస్థ అందుబాటులోకి వస్తే... అధికారులకు చేయి తడపాల్సిన అవసరం లేకుండా కేవలం ఒక్క మౌస్ క్లిక్‌తో క్షణాల్లో గృహ నిర్మాణానికి అనుమతి లభిస్తే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో సరళ పద్ధతుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసేందుకు రాష్ట్రం ప్రభుత్వం కొత్తగా భవన నిర్మాణ విధానాన్ని రూపొందిస్తోంది. అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణతోపాటు నూతన భవన నిర్మాణ పాలసీ రూపకల్పన అంశంపై రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ శుక్రవారం సచివాలయంలో పురపాలక శాఖ, జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్ష జరిపారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆదేశాలతో నూతన భవన నిర్మాణ పాలసీపై కసరత్తు చేస్తున్నామన్నారు. ఒకే ఒక్క మౌస్ క్లిక్‌తో భవన నిర్మాణ అనుమతులన్నీ వచ్చేలా కొత్త పాలసీ ఉంటుందన్నారు. కొత్త పరిశ్రమల స్థాపనకు అనుమతుల కోసం అమలు చేస్తున్న ‘టీఎస్-ఐపాస్’ విధానం తరహాలోనే భవన నిర్మాణ విధానం ఉంటుందన్నారు. ఇంటి నుంచే ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పిస్తామన్నారు. నగరంలో చాలా అక్రమ కట్టడాలున్నాయని, నాలాలపైనా నిర్మాణాలున్నాయని, దేవాలయస్థలాలను సైతం ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. హెచ్ఎండీఏ పరిధిలోని కన్జర్వేటివ్ జోన్లో అనుమతులు లేకపోయినా నిర్మాణాలు జరిగాయన్నారు. ఇలాంటి దుర్మార్గమైన వ్యవస్థను రూపుమాపి భవిష్యత్తులో తప్పులు పునారావృతం కాకుండా ఉండేందుకు అన్ని విభాగాలను సమన్వయం చేసేలా నూతన పాలసీ ఉంటుందన్నారు. దీని ద్వారానే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. భవిష్యత్తులో అక్రమ కట్టడాలు జరిగితే ఆ ప్రాంత అధికారినే బాధ్యుడిగా చేసి చర్యలు తీసుకుంటామన్నారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా నగరానికి ఇప్పటికే రూ. 230 కోట్లు మంజూరు చేశామన్నారు. వీటికి ప్రస్తుతం టెండర్లు పిలుస్తున్నట్లు తెలిపారు. స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా రోడ్ల మీద చెత్త పారబోయకుండా నగర పరిశుభ్రత కోసం ప్రతీ ఇంటికీ రెండు డస్టుబిన్లు ఇవ్వనున్నట్లు తలసాని చెప్పారు. పరిశుభ్రత విషయంలో ప్రభుత్వ ఆదేశాలను బేఖాతరు చేస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. హైదరాబాద్ తాగునీటి అవసరాల కోసం రెండు రిజర్వాయర్లు నిర్మించేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు చెప్పారు. హైదరాబాద్ నగర ప్రణాళికపై తమ కమిటీ సెప్టెంబర్ 1న మరోసారి సమావేశమై నెల రోజుల్లో సీఎం కే సీఆర్‌కు నివేదిక ఇస్తుందన్నారు. జీవో 111కు ఎలాంటి మినహాయింపులు ఉండబోవని, అక్కడ కట్టిన నిర్మాణాలను కూల్చేస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ సమస్యలకు ఇక చెక్ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో పలు సమస్యలు తీరనున్నాయి. ఇప్పటివరకూ ఇంటిని నిర్మించాలంటే ఈ పాట్లన్నీ పడాల్సి వచ్చేది. నగర పాలక సంస్థ నుంచి ఇంటి నిర్మాణ అనుమతి విధిగా పొందాలి. ఇందుకు ఇళ్లు నిర్మించాల్సిన స్థలం తాలూకా అన్ని లింక్ డాక్యుమెంట్లను సమర్పించాలి. అంతేకాదు టౌన్‌ప్లానింగ్ అధికారుల తనిఖీలు, వాళ్లకుఇవ్వాల్సిన ‘మామూళు’్ల షరామామూలే. డాక్యుమెంట్లన్నీ సరిగానే ఉన్నా...మున్సిపల్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. నిర్మాణ అనుమతికి లోబడి మాత్రమే భవనంలో అంతస్తులు నిర్మించాలి. విద్యుత్,మంచినీటి కనెక్షన్ పొందాలంటే లింక్ డాక్యుమెంట్లు, సేల్డీడ్లు తప్పనిసరి. బహుళ అంతస్తుల భవంతులు నిర్మించాలంటే ఫైర్‌సేఫ్టీ అనుమతులు, సెట్బ్యాక్లు(భవంతి చుట్టూ ఖాళీస్థలాలు) తప్పనిసరి. 200 చదరపు మీటర్ల విస్తీర్ణం మించిన భవనానికి సంబంధించిన స్థలంలో నిర్మాణ వైశాల్యంలో పదిశాతం స్థలాన్ని మున్సిపాల్టీకి తనఖా పెట్టాలి. టౌన్‌ప్లానింగ్ అనుమతుల ప్రకారమే ఇంటిని నిర్మించినట్లు ధ్రువీకరిస్తేనే భవంతి నిర్మాణం తరవాత ఆక్యుపెన్సీ ధ్రువీకరణ మంజూరు చేస్తారు.గృహనిర్మాణ అనుమతికి దరఖాస్తుతోపాటు రూ.10 వేలు డీడీని సమర్పించాలి. ఇంటి నిర్మాణ విస్తీర్ణాన్ని బట్టి అనుమతులకు చెల్లించాల్సిన రుసుము పెరుగుతుంది. ఇంటిని నిర్మిస్తున్న లేఅవుట్ ల్యాండ్ రెగ్యులరైజేషన్(ఎల్ఆర్ఎస్)ధ్రువీకరణ ఉంటేనే ఇంటిరుణం దొరికే పరిస్థితి ఉంది. గతంలో అనుమతి లేకుండా ఇళ్లు నిర్మించిన వారు ప్రభుత్వం జారీచేసే మార్గదర్శకాల ప్రకారం బిల్డింగ్ పీనలైజేషన్(బీపీఎస్) పథకం కింద భవంతిని క్రమబద్దీకరించుకోవాలి. పదిమీటర్ల ఎత్తుకు మించిన భవనానికి సమర్పించాల్సిన డాక్యుమెంట్లు ఇవీ... భవన నిర్మాణ దరఖాస్తుపై ఇంటి యజ మాని సంతకం, బిల్డర్, ఆర్కిటెక్ట్, ఇంజనీర్ల సంతకాలు. ఓనర్ డిక్లరేషన్‌పై గెజిటెడ్ అధికారి అటెస్టేషన్. భవన ఆర్కిటెక్ట్ లేదా ఇంజ నీర్ లెసైన్సు కాపీ. ఎమ్మార్వో జారీ చేసే టౌన్ సర్వే రికార్డు. గతంలో జారీచేసిన అనుమతి పత్రం. వెయ్యి చదరపు మీటర్లు దాటిన భవంతికి యూఎల్సీ క్లియరెన్స్. వెయ్యి చదరపు మీటర్ల లోపలున్న భవంతికి యూఎల్సీ అఫిడవిట్. ఓనర్షిప్ డాక్యుమెంట్లు లింక్ డాక్యుమెంట్లు. రూ. 20 నాన్‌జ్యుడీషియల్ స్టాంప్ పేపర్. భవన నిర్మాణ ప్లాన్.