ఈ వారం యూట్యూబ్ హిట్స్‌ | youtube hits in this week | Sakshi
Sakshi News home page

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

Published Sun, Feb 19 2017 11:57 PM | Last Updated on Tue, Sep 5 2017 4:07 AM

ఈ వారం యూట్యూబ్  హిట్స్‌

ఈ వారం యూట్యూబ్ హిట్స్‌

ఎద్‌ షీరన్‌: హౌ ఉడ్‌ యు ఫీల్‌ (పీయ్‌న్‌)
నిడివి : 4 ని. 45 సె.,  హిట్స్‌ : 67,48,454

పీయాన్‌ అంటే స్తుతి కీర్తన. ఇందులో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని స్తుతిస్తూ గీతాలాపన చేస్తుంటాడు. 26 ఏళ్ల బ్రిటన్‌ సింగర్, సాంగ్‌ రైటర్‌ ఎద్‌ షీరన్‌ గొంతులోంచి వచ్చే మార్ద్రవమైన ఆ ప్రేమ ఫీల్‌.. శ్రోతల్ని కావలించుకుంటుంది. ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని వింటే మీరు మీ ప్రేయసి దగ్గరికి వెళ్లడమో, మీ ప్రేయసే మీ దగ్గరికి వచ్చేయడమో జరుగుతుంది. నమ్మండి! ‘నువ్వు నాకు ఒకే ఒక అమ్మాయివి. ఆ సంగతి నీకూ తెలుసు. నీతో ఏకాంతంలో ఉన్నప్పుడు నా వయసు తగ్గినట్లుగా అయిపోతాను. పార్క్‌ చేసిన కారులో నువ్వూ నేనూ దొంగ ముద్దులు పెట్టుకుంటున్నప్పుడు మనం ఒకర్ని ఒకరం అడగలేని ప్రశ్నలు ఎన్నో మనసులో మెదులుతాయి. నేన్నిన్ను ప్రేమిస్తున్నానని చెబితే నీకు ఏమనిపిస్తుంది? నువ్వెలా ఫీలవుతావ్‌..’ ఇలా తేలిపోతుంటుంది సాంగ్‌. మొత్తం నాలుగు చరణాలు ఉన్నాయి. చివరి చరణంలో అబ్బాయి ఇక ఆగలేక అడుగుతాడు... ‘నీకు ఐ లవ్యూ చెప్పాను కదా, నువ్వు కూడా నాకు ఐ లవ్యూ చెప్పు..’ అంటాడు. కాస్త మెల్లకన్నుతో కనిపించే  ఇద్‌ షీరన్‌ అనే తెల్లబ్బాయి ఈ ‘హౌ డు యు ఫీల్‌’ లవ్‌ సాంగ్‌ను మొన్న ఫిబ్రవరి 17న తన బర్త్‌డే సందర్భంగా విడుదల చేశాడు. షీరన్‌ ఇప్పటికే రెండు అల్బమ్‌లు రిలీజ్‌ చేశాడు. మూడో అల్బమ్‌ ‘డివైడ్‌’ మార్చిలో వస్తోంది.

ది హౌస్‌: అఫిషియల్‌ ట్రైలర్‌
నిడివి : 2 ని. 27 సె.,  హిట్స్‌ : 11,42,026

కామెడీ స్క్రిప్టు రాయడంలో ఆండ్రూ జె.కొహెన్‌ ఎక్స్‌పర్ట్‌. 2014లో విడుదలైన హాలీవుడ్‌ కామెడీ మూవీ ‘నైబర్స్‌’లో పంచ్‌లన్నీ ఆండ్రూవే. మరో స్క్రిప్టు రైటర్‌ బ్రెండన్‌ ఓబ్రియన్‌తో కలిసి ఆయన ‘నైబర్స్‌’కి పని చేశారు. ఇప్పుడు కూడా వీళ్లిద్దరి కాంబినేషన్‌ స్క్రిప్టులోనే ఆండ్రూ డైరెక్షన్‌లో కొత్త కామెడీ ఫిల్మ్‌ ‘ది హౌస్‌’ తయారవుతోంది. జూన్‌ 20న విడుదల కాబోతున్న ఈ చిత్రం ట్రైలర్‌ రెండు రోజుల క్రితమే యూట్యూబ్‌లోకి అప్‌లోడ్‌ అయింది. ట్రైలర్‌ నిండుగా ఉంది. ఎంత నిండుగానంటే.. ‘హోప్‌ఫుల్లీ ఆల్‌ ద ఫన్నీ పార్ట్స్‌ ఆరెంట్‌ ఇన్‌ ది ట్రైలర్‌’ అని ఓ వ్యూయర్‌ కామెంట్‌ పోస్ట్‌ చేసేశారు. చిత్రంలో స్కాట్, కేట్‌ అని ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్లకో కూతురు ఉంటుంది. ఆమెకు ట్యూషన్‌ ఫీజు కట్టడానికి వీళ్ల దగ్గర డబ్బులు ఉండవు. ఏం చేయాలి? బాగా ఆలోచించి, ఇంట్లోనే బేస్‌మెంట్‌లో అక్రమంగా ఒక జూదగృహం (కేసినో) మొదలు పెడతారు. ఇక అక్కడి నుంచి కామెడీ స్టార్ట్‌ అవుతుంది.

డోరా: తమిళ్‌ మూవీ ట్రైలర్‌
నిడివి : 55 సె.,  హిట్స్‌ : 12,35,875

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ ‘కబాలి’ మూవీ తర్వాత ఇంచుమించు ఆ లెవల్‌లో యూత్‌ని రఫ్‌ ఆడిస్తున్న టీజర్‌ డోరా. ఈ తమిళ్‌ హారర్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌కు దర్శకుడు.. దాస్‌ రామస్వామి. నయనతార ప్రధాన పాత్రను పోషిస్తున్నారు. డోరా షూటింగ్‌ నిరుడు మార్చిలో ప్రారంభమైంది. చిత్రం ఈ ఏప్రిల్‌ 11న విడుదల అవుతోంది. డోరా అంటే ‘గాడ్స్‌ గిఫ్ట్‌’ అని అర్థం. మూవీ కథ ఏంటో పూర్తిగా బయటికి రాకపోయినా టీజర్‌ చూసి కొంత పట్టేయొచ్చు. అడవి లాంటి ప్రదేశం, మాంత్రికురాలు, రాత్రి, చీకటి, కారు డ్రైవర్, రక్తం, రక్తపిశాచి, రోడ్డుపై ఒంటరిగా నడుచుకుంటూ వెళుతున్న యువతి, ఒక ఊరు, ఆ ఊరికి దారి చూపే బాణం లాంటి సూచిక, అధాటున భయపడిన నయనతార, వెనుక నుంచి దెయ్యం మాట్లాడ్డం, సమాధులు, సిలువలు... మొత్తానికి భయమే ప్రధాన కథాంశం అనీ, ప్రేక్షకులను భయపెట్టడమే అసలు కథనం అని వీడియో చెబుతోంది. మ్యూజిక్‌ వివేక్‌ శివ, మెర్విన్‌ సాల్మన్‌. వీళ్లిద్దరి చేతుల్లోనే సినిమా అంతా ఉంది. సాధారణంగా హారర్‌ థ్రిల్లర్‌లకు మ్యూజిక్కే ప్రాణం కాబట్టి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement