house allottment
-
చూడు బాబూ...ఇవిగో ఇళ్లు
-
జనవరి 15లోగా లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేయాలి
సాక్షి, హైదరాబాద్: నిర్మాణం పూర్తయిన డబుల్ బెడ్రూం ఇళ్ల కేటాయింపులకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికను జనవరి 15 నాటికి పూర్తి చేయా లని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణ పురోగతి, లబ్ధిదారుల ఎంపిక తదితర అంశాలపై గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీ సునీల్ శర్మలతో కలసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ లబ్ధిదారులకు ఇళ్లు అందేలా చూడాలని కలెక్టర్లను కోరారు. దారిద్య్రరేఖకు దిగువనున్న కుటుంబాలు, ఆహారభద్రత కార్డులు, అద్దె ఇళ్లలో ఉన్న వారి జాబితాను ఎంపిక చేయాలని సూచించారు. తుది జాబితాను సంబంధిత ప్రజాప్రతినిధుల ఆమోదంతో హైదరాబాద్‌కు పంపాలని పేర్కొన్నారు. హైదరాబాద్‌తో సహా రాష్ట్రంలో మొత్తం 2 లక్షల 91 వేల డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణాలను చేపట్టామని వివరించారు. హైదరాబాద్ మినహా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో లక్షా 29 వేల ఇళ్ల నిర్మాణం పూర్తయిందని తెలిపారు. కాగా, 62 వేల ఇళ్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. సీఎస్ సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ల కాలనీల్లో విద్యుత్, సీవరేజ్, రహదారుల నిర్మాణాలను వెంటనే చేపట్టాలని కోరారు. కాగా, సెక్రటేరియట్ భవనం, అమరవీరుల స్మారకచిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణ పనుల పురోగతిని మంత్రి వేముల, సోమేశ్ కుమార్ బీఆర్కేఆర్ భవన్ 10వఅంతస్తునుంచి పరిశీలించారు. 26లోగా పోడు సర్వే పూర్తి చేయాలి.. ఈ నెల 26లోగా పోడు భూముల సర్వే పూర్తి చేసి, గ్రామ సభల ద్వారా వివరాలను సబ్ కమిటీకి పంపేందుకు చర్యలు తీసుకోవాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. అలాగే క్రీడా ప్రాంగణాలు, బృహత్ ప్రకృతి వనాలను లక్ష్యాల మేరకు పూర్తి చేసి ఆన్లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని కోరారు. ధరణిలో వచ్చిన ఫిర్యాదులను, జీవో 58, 59 ప్రకారం ఉన్న సమస్యలను పరిశీలించి అర్హులైన వారికి పట్టాలు ఇవ్వాలని సీఎస్ సూచించారు. డా.బి.ఆర్ అంబేడ్కర్ సెక్రటేరియట్, అమరవీరుల స్మారక చిహ్నం, 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం నిర్మాణాలను బీఆర్కేఆర్ భవన్ పదో అంతస్తు నుంచి సీఎస్ సోమేశ్‌కుమార్‌తో కలిసి పరిశీలిస్తున్న -
వైఎస్ జగన్ మాట
-
పేదల ఇళ్లకు రూ.13,411 కోట్లు
సాక్షి, అమరావతి: పేదలందరికీ ఇళ్ల స్థలాల పంపిణీతో పాటు బలహీన వర్గాల గృహ నిర్మాణాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని నాబార్డు రాష్ట్ర ఫోకస్ పత్రంలో పేర్కొంది. ఉగాది సందర్భంగా మార్చి 25వ తేదీన 25 లక్షల మంది పేదలకు ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించిందని, ఐదేళ్లలో వారందరికీ గృహ నిర్మాణాలను కూడా పూర్తి చేయాలనే సంకల్పంతో ఉందని 2020–21 రాష్ట్ర ఫోకస్ పత్రంలో నాబార్డు తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం రూ.8,615 కోట్లు కేటాయించిందని, 2020–21లో గృహ నిర్మాణాల రుణ అంచనా రూ.13,411.22 కోట్లు అని పేర్కొంది. ఇది 2019–20 కంటే 6.44 శాతం ఎక్కువ. ఇళ్లకు జియో ట్యాగింగ్ వల్ల నిధుల దుర్వినియోగాన్ని అరికట్టడంతో పాటు నిర్మాణాల్లో జాప్యాన్ని నివారించవచ్చని తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో వేతనాలు పొందుతున్న వారికే గృహ నిర్మాణాలకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తున్నాయని, అయితే గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు కూడా రుణాలు ఇవ్వాల్సిన అవసరం ఉందని సూచించింది. గృహ నిర్మాణాలకు రుణాల మంజూరు విధానాన్ని మరింత సరళతరం చేయాల్సి ఉందని పేర్కొంది. రాష్ట్రంలో తొలిసారిగా పేదల ఇళ్ల నిర్మాణం కోసం వేల ఎకరాలను స్థలాల రూపంలో ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టడం గమనార్హం. -
ప్రభుత్వం దృష్టికి చిత్రపురి సమస్యలు
‘‘చిత్రపురి కాలనీలో 24 క్రాఫ్ట్స్‌లో పనిచేస్తున్న సినీ కార్మికులకు కాకుండా సినిమాయేతరులకు ఇళ్లు కేటాయించారు. సుమారు 5 వేలకుపైగా నిజమైన సినీకార్మికులకు ఇళ్లు కేటాయించాల్సి ఉంది. దీనికోసం ‘చిత్రపురి పోరాట సమితి’ చేస్తున్న దీక్షల్లో న్యాయం ఉంది’’ అని తెలంగాణ ఫిల్మ్ చాంబర్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ అన్నారు. చిత్రపురి కాలనీలో ఇళ్ల కేటాయింపులో అవకతవకలు జరిగాయని, చిత్రపురి కాలనీ హౌసింగ్ సొసైటీ కార్యవర్గ సభ్యుల అవినీతి అక్రమాలపై విచారణ జరిపించాలని ‘చిత్రపురి పోరాట సమితి’ ఆధ్వర్యంలో చేస్తున్న నిరాహార దీక్షకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బుధవారం మద్దతు పలికారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘26 రోజులుగా దీక్షలు చేపడుతున్నా హౌస్‌ంగ్ సొసైటీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. సినీ కార్మికులకు ఇచ్చిన స్థలాన్ని ‘కైరోస్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్’కి కేటాయించడం చట్ట విరుద్ధం, వెంటనే ఆ స్కూల్‌ను తొలగించాలి. ఈ సొసైటీలో జరిగిన అవకతవకలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాం. ప్రభుత్వం కేటాంచబోయే 9 ఎకరాలను ‘చిత్రపురి పోరాట సమితి’కి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరుతాం’’ అన్నారు. కాగా ధర్నాలో పాల్గొంటున్నారనే కారణంతో షూటింగ్‌లకు పిలవని కొందరు సినీ కార్మికులకు ప్రతాని రామకృష్ణ గౌడ్ బియ్యం వితరణ చేశారు. ‘‘న్యాయం కోసం పోరాటం చేసే వారిని బెదిరిస్తున్నారని, ఎవరు బెదిరించినా న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం’’ అని ‘చిత్రపురి పోరాట సమితి సభ్యుడు’, డైరెక్టర్ కస్తూరి శ్రీనివాస్ అన్నారు. బి నరసింహా రెడ్డి, మహేందర్, ఓ. రవిశంకర్, మురళితో పాటు పలువురు సినీకార్మికులు పాల్గొన్నారు. -
వర్గపోరు.. లబ్ధిదారుల బేజారు
ప్రజాసమస్యలను తీర్చడానికే ప్రజాప్రతినిధులు ఉండాలి, ఇక్కడేమో ప్రజాప్రతినిధులే ప్రజలకు సమస్యగా మారారు. నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీకి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధుల వర్గపోరుతో ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. పెత్తనం కోసం పాకులాడుతూ ప్రజల సమస్యలు గాలికొదిలేశారు. ప్రభుత్వ గృహ పథకంలో దరఖాస్తు చేసుకున్న వారికి గృహాలు మంజూరు కాకుండా ఒక వర్గం అడ్డుకుంటుంటే మరో వర్గం వారు ఇళ్లు నిర్మించుకున్న లబ్ధిదారులకు బిల్లులు రాకుండా అడ్డుపడుతున్నారు. సాక్షి, బల్లికురవ (ప్రకాశం): గూడులేని అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రకటించారు. అర్హులు గ్రామాల వారీగా దరఖాస్తులు చేసుకొంటే కొందరికే మంజూరు పత్రాలు ఇచ్చారు. ఒక్కపైసా బిల్లు కూడా చెల్లించలేదు. మరికొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండా అడ్డుకొంటున్నారు. అద్దంకి నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరామకృష్ణమూర్తి, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య వర్గపోరులో పేదలు బలవుతున్నారు. ముక్తేశ్వరంలో ఇల్లు నిర్మించుకొన్నా మంజూరు ఉత్తర్వులు ఇవ్వని గృహం అర్థాంతరంగా నిలిచిన గృహాలు ప్రభుత్వం, అధికారులు పక్కా ఇళ్లకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించటంతో 2015, 2016 సంవత్సరాల్లో ముక్తేశ్వరం, సూరేపల్లి, రామాంజనేయపురం, పెదఅంబడిపూడి, చిన అంబడిపూడి కొత్తపాలెం, బల్లికురవ గ్రామాల్లో సుమారు 120 మంది దరఖాస్తు చేశారు. వీరిలో కొందరికి మంజూరు ఉత్తర్వులిచ్చారు. కొందరికి మంజూరు ఉత్తర్వులు రాకుండానే అడ్డుకున్నారు. ఇంటినిర్మాణానికి దరఖాస్తు చేశాం. మంజూరు ఉత్తర్వులతో బిల్లులు చెల్లించకపోతారా అని అప్పుచేసి మరీ గృహాలు నిర్మించుకున్నారు. వర్గపోరుతో నిలిచిన బిల్లులు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ కరణం బలరాం, ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమంటోంది. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ సీపీ తరపున గెలుపొందిన ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ 2016లో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకోవటంతో బలరాం వర్గానికి ప్రాధాన్యత తగ్గింది. అప్పటి వరకు అధికారపార్టీలో హీరోలుగా కొనసాగిన గ్రామస్థాయి నేతలు జీరోలు కాగా వైఎస్సార్ సీపీ గ్రామస్థాయి నేతలు ఎమ్మెల్యేతో పాటు టీడీపీ తీర్థం పుచ్చుకోవటంతో హీరోలయ్యారు. ఈ హీరోలు టీడీపీకి ఓట్లు వేసిన లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులు మంజూరు ఉత్తర్వులనే నిలుపుదల చేయించారు. అధికారుల వత్తాసు గ్రామస్థాయి నేతలకు అధికారులు సైతం డూడూ బసవన్నలా తల ఊపుతూ బిల్లులు చెల్లించటంలేదు. అప్పులు తెచ్చి ఇల్లు నిర్మించుకున్నామని తమ పరిస్థితి ఏమిటని లబ్ధిదారులు గగ్గోలు పెడుతున్నారు. అయినా అధికారులు గ్రామస్థాయి నేతల్లో కనికరం లేదు. ఎమ్మెల్యే ఏ గ్రూపులో నేతలు తమకు అనుకూలమైన వారికి గతంలో నిర్మించుకొన్న ఇళ్లకు కూడా రెండో పేరుతో తిరిగి బిల్లు చెల్లించేలా చేస్తున్నారని లబ్ధిదారులు వాపోతున్నారు. ఈ విషయాన్ని జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఎలాంటి ప్రయోజనం లేదని లబ్ధిదారులు యలగాల అంజయ్య, చల్లగుండ్ల శ్రీనివాసరావు, పోలయ్య, మందా మేరి వాపోయారు. రాబోయే ఎన్నికల్లో తమ ఇళ్ల బిల్లులు నిలుపుదల చేసిన నేతలకు ఓటు ద్వారా బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నామని లబ్ధిదారులు వివరించారు. సర్పంచ్‌గా పోటీచేశాననే బిల్లు ఆపారు ముక్తేశ్వరం పంచాయతీ సర్పంచ్‌గా 2014లో ఎమ్మెల్సీ కరణం బలరాం ఆశీస్సులతో బరిలోకి దిగి ఓటమి పాలయ్యాను. ఆ అక్కసుతో తాను పక్కా ఇంటి నిర్మాణానికి దరఖాస్తు చేసుకున్నా మంజూరు కాకుండా తన ప్రత్యర్ధులు అడ్డుకుంటున్నారు. ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడంలేదు. – మందామేరి, రామాంజనేయపురం అప్పుచేసి ఇల్లు నిర్మించా బిల్లు లేదు ఇల్లు నిర్మాణానికి దరఖాస్తు చేశాను. మంజూరైన జాబితా నుంచి నా పేరు తొలగించారు. అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదు. ఇంటి నిర్మాణానికి చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియడం లేదు. – కోవూరి సుబ్బరావమ్మ, చిన అంబడిపూడి టీడీపీకి ఓటు వేసి జీరో అయ్యాను బలరాం కొడుకు వెంకటేష్ ఓట్లు వేసి, విజయవాడ మహానాడుకు వెళ్లి నేడు జీరోలం అయ్యాం. ఇళ్ల నిర్మాణానికి పేదల చేత దరఖాస్తు చేయిస్తే ఇళ్లు మంజూరు కాకుండా అడ్డుకుంటున్నారు. ఇలాంటి దుర్మార్గపు పాలన ఏనాడు చూడలేదు. రాబోయే ఎన్నికల్లో వీళ్లకి ఓటు ద్వారా బుద్ధి చెప్తాం. – యలగాల అంజయ్య, ముక్తేశ్వరం -
షాకిచ్చిన ప్రభుత్వం.. హుందాగా మాజీ సీఎం!
సాక్షి, బెంగళూరు : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ నేత బీఎస్ యడ్యూరప్పకు హెచ్డీ కుమారస్వామి కూటమి ప్రభుత్వం షాకిచ్చింది. అయితే యెడ్డీ మాత్రం చాలా హుందాగా వ్యవహరించి తన గౌరవాన్ని కాపాడుకున్నారని తెలుస్తోంది. సీఎంగా ఉన్న సమయంలో యడ్యూరప్ప రేస్‌కోర్స్ రోడ్డులోని నంబర్2 ఇంట్లో ఉండేవారు. అయితే కొన్ని రోజుల కిందట ప్రతిపక్షనేతగా తనకు ఆ ఇంటిని తిరిగి కేటాయించాలని కాంగ్రెస్-జేడీఎస్ కూటమి ప్రభుత్వానికి ఆయన విజ్ఞప్తిచేశారు. కానీ కుమారస్వామి ప్రభుత్వం యెడ్డీకి అదే రోడ్డులోని నంబర్ 4 ఇంటిని కేటాయించింది. బీజేపీ నేత అడిగిన ఇంట్లో ప్రస్తుతం మంత్రి మహేష్ ఉంటున్నారు. దీంతో యెడ్డీకి వేరే ఇంటిని ఇవ్వగా అందుకు ఆయన నిరాకరించారు. దీనిపై మాజీ సీఎం యడ్యూరప్ప మీడియాతో మాట్లాడుతూ.. ‘మిత్రులారా.. నేను ఆ ఇంటిని కేటాయించాలని చాలాకాలం కిందటే కోరాను. కానీ నాకు అందుకు అవకాశం ఇవ్వలేదు. నా సొంత ఇంట్లోనే ఉంటాను. ప్రస్తుతం నాకు కేటాయించిన నంబర్ 4 ఇంటిని వేరే నేతకు కేటాయిస్తే ప్రయోజనం ఉంటుంది. దీనిపై ఇంతకంటే ఎక్కువ విషయాలు చెప్పదలుచుకోలేదు’ అని చెప్పారు. ప్రతిపక్షనేతగా తనను గౌరవం ఇచ్చేందుకైనా గతంలో ఉన్న ఇంటిని కర్ణాటక ప్రభుత్వం తనకు కేటాయిస్తుందని యడ్యూరప్ప ఎన్నో ఆశలు పెట్టుకున్నారని సమాచారం. బంగ్లా కేటాయింపు వివాదంపై సీఎం కుమారస్వామి స్పందిస్తూ.. యడ్యూరప్పకు ఓ నివాసాన్ని కేటాయించాం. కచ్చితంగా ఆయన బంగ్లానే కేటాయించాలంటే కష్టం. చాలామంది మంత్రులు అదే ఇంటిని అడుగుతున్నారు. ఒకరికి ఆ ఇంటిని కేటాయించామని’ వివరించారు. -
ఫ్రిజ్ ఉంటే ఇల్లు రాదు
పేదలకు సొంత ఇల్లు దక్కడం గగనమే రాయితీ ఇళ్ల మంజూరులో సర్కారు కొత్త నిబంధనలు గృహ నిర్మాణ శాఖ జీవో జారీ యూనిట్ కాస్ట్ రూ.2.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు కుదింపు సాక్షి, విజయవాడ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదోడికి సొంతింటి కల కలగానే మిగిలిపోయే ప్రమాదం వచ్చి పడింది. గూడు కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న పేదలకు సర్కారు ఇచ్చిన జీవో అశనిపాతంలా పరిణమించింది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మొత్తం పొందాలంటే 13 రకాల నిబంధనలు పాటించాలన్న షరతులతో రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా జీవోనే జారీ చేయడంతో కలకలం రేగుతోంది. రాష్ట్రంలో మంజూరు చేస్తున్న ఇళ్లలో ఒక్కోదానికి రూ.72 వేల చొప్పున కేంద్ర ప్రభుత్వం రాయితీ ఇస్తోంది. ఇప్పటికే ఇంటి నిర్మాణం (యూనిట్ కాస్ట్) మొత్తాన్ని రూ.2.75 లక్షల నుంచి రూ.2.25 లక్షలకు రాష్ట్ర ప్రభుత్వం కుదించింది. దీనికితోడు కేంద్రం పెట్టిన షరతులను సాకుగా చూపి 13 రకాల నిబంధనలను అమల్లోకి తెస్తూ రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఇటీవల జీవో నంబర్ 90 జారీ చేసింది. ఈ జీవోను కచ్చితంగా అమలు చేస్తే వాస్తవంగా ఒక్క ఇల్లు కూడా మంజూరయ్యే అవకాశం లేదని పేదలు వాపోతున్నారు. ఏడాదైనా ఒక్క ఇల్లూ రాలేదు ఎన్టీఆర్ గ్రామీణ గృహ నిర్మాణ పథకంలో గతేడాది ఆగస్టులో రెండు లక్షల ఇళ్లు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 5 లక్షలమంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో 1.26 లక్షల దరఖాస్తులు సక్రమంగా ఉన్నట్టు తేల్చారు. ఏడాదైనా ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయలేదు. 13 రకాల నిబంధనలను పరిగణనలోకి తీసుకొని ఇళ్లు మంజూరు చేయాలని ఉన్నతాధికారులు మౌఖికంగా చెప్పారు. ఇవీ నిబంధనలు... ఇళ్ల మంజూరుకు చెబుతున్న నిబంధనలను పరికిస్తే రాష్ట్రంలో ఒక్కరికైనా ఇల్లు వస్తుందా? అనేది అనుమానమే. ప్రభుత్వం కేటాయించే ఇల్లు రావాలంటే ఇవి ఉండకూడదు. ఫ్రిజ్, ల్యాండ్‌లైన్ ఫోన్, మోటార్ సైకిల్, మూడు, నాలుగు చక్రాల వాహనాలు, వ్యవసాయ యంత్రాలు, వ్యవసాయ అనుబంధ యంత్రాలుండకూడదు. లబ్ధిదారుడు ప్రభుత్వ ఉద్కోగి కాకూడదు, కుటుంబంలో ఏ ఒక్కరికైనా రూ.10 వేలకు పైగా వేతనం రాకూడదు. రూ.50 వేలకు పైగా విలువైన కిసాన్ పత్రాలు ఉండకూడదు. ఆదాయపు పన్ను, వృత్తి పన్ను చెల్లించేవారూ అనర్హులు. సొంతంగా 2.5 ఎకరాల మాగాణి, ఏడున్నర ఎకరాలకు పైగా మెట్ట భూమి ఉండకూడదు. రెండెకరాలకు మించి కౌలు చేసినా ఇల్లు ఇవ్వరు. పేదలకు వెసులుబాటిస్తే తప్ప రాష్ట్రంలో ఒక్క ఇల్లయినా మంజూరు చేసే అవకాశం లేదన్నది వాస్తవం.