HRC Notices
-
హెచ్ఆర్సీ ఆదేశాలపై హైకోర్టు విస్మయం
సాక్షి, అమరావతి: భూ సేకరణ పరిహారం చెల్లింపులో జాప్యం చేసినందుకుగాను బాధితుడికి రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశిస్తూ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (ఎస్హెచ్ఆర్సీ) ఇటీవల ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. భూ సేకరణ వ్యవహారాల్లో పరిహారం చెల్లింపునకు ఆదేశాలు జారీచేసే అధికారం హెచ్ఆర్సీకి ఎక్కడ ఉందని ప్రశ్నించింది. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలన్న హెచ్ఆర్సీ ఆదేశాలను హైకోర్టు నిలిపేసింది.ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని హెచ్ఆర్సీ రిజిస్ట్రార్, ఆరి్థక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, కర్నూలు కలెక్టర్, నంద్యాల ఆర్డీవోలను ఆదేశించింది. తదుపరి విచారణను సెపె్టంబర్ 1వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్‌మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ డీవీఎస్ఎస్ సోమయాజులుతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 10 లక్షల పరిహారం ఇవ్వాలన్న హెచ్ఆర్సీ నంద్యాలలోని వీరాపురం చెరువును పునరుద్ధరించాలని 1993లో అధికారులు నిర్ణయించారు. అందుకు కొంత భూమిని సేకరించాలని నిర్ణయించి ముసాయిదా భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే, సేకరించదలచిన భూములు పట్టా భూములు కాదని, ప్రభుత్వ భూములని తెలుసుకున్న అధికారులు ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. దీనిపై కొందరు వ్యక్తులు 2003లో హైకోర్టును ఆశ్రయించి పరిహారం చెల్లించేలా అధికారులను ఆదేశించాలని కోరారు. ఆ భూములు పట్టా భూములు కాకపోవడం, ఆ భూములను సేకరించకపోవడం వల్ల వాటికి ఎలాంటి పరిహారం ఇవ్వాల్సిన అవసరం లేదంటూ హైకోర్టు ఆ పిటిషన్‌ను కొట్టేసింది. ఆ తరువాత మరికొందరు ఇదే అంశంపై 2013లో హైకోర్టును ఆశ్రయించగా, ఆ పిటిషన్ పెండింగ్‌లో ఉంది. ఈ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తుల్లో ఒకరైన ఎంజేఎస్ రాజు 2021లో హెచ్ఆర్సీని ఆశ్రయించారు. పరిహారం చెల్లించకుండా అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారంటూ ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన హెచ్ఆర్సీ రాజుకు రూ.10 లక్షల పరిహారం చెల్లించాలని జల వనరుల శాఖ అధికారులను ఆదేశిస్తూ ఈ ఏడాది మే 5న ఉత్తర్వులిచి్చంది. హెచ్ఆర్సీకి ఆ అధికారం లేదన్న హైకోర్టు ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ జల వనరుల శాఖ ముఖ్య కార్యదర్శి, నీటి పారుదల శాఖ అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై బుధవారం సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫున ప్రభుత్వ న్యాయవాది (నీటి పారుదలశాఖ) శీలం శివకుమారి వాదనలు వినిపిస్తూ.. హెచ్ఆర్సీ ముందు వాస్తవాలను ఉంచలేదన్నారు. ఈ మొత్తం వ్యవహారాన్ని హెచ్ఆర్సీ సరైన దృష్టి కోణంలో చూడలేదన్నారు. భూ సేకరణ, పరిహారం తదితర అంశాలు హెచ్ఆర్సీ పరిధిలోకి రావని తెలిపారు. వివాదం హైకోర్టులో పెండింగ్‌లో ఉండగా, ఆ అంశంపై హెచ్ఆర్సీ జోక్యం తగదన్నారు. ఈ వాదనలతో ధర్మాసనం ఏకీభవించింది. భూ సేకరణ, పరిహారం వ్యవహారాల్లో హెచ్ఆర్సీ ఎలా జోక్యం చేసుకుంటుందని ధర్మాసనం ప్రశ్నించింది. పరిహారం చెల్లింపు అధికారం ఎక్కడ ఉందని నిలదీసింది. రూ.10 లక్షల పరిహారం చెల్లించాలంటూ హెచ్ఆర్సీ ఇచ్చిన ఆదేశాలను నిలుపుదల చేసి.. కౌంటర్లు దాఖలు చేయాలని నోటీసులు జారీ చేసింది. ఇది కూడా చదవండి: అప్పు పథంలో ఐదు రాష్ట్రాలు -
జీహెచ్ఎంసీ కమిషనర్‌కు హెచ్చార్సీ నోటీసులు
హైదరాబాద్: జీహెచ్ఎంసీ కమిషనర్ కు హెచ్చార్సీ నోటీసులు జారీ చేసింది. రామాంతాపూర్ పరిధి కామాక్షి పురంలో వీధికుక్కల దాడిలో పిల్లలు తీవ్రంగా గాయపడిన విషయంపై మానవహక్కుల కమిషన్ స్పందించింది. గాయపడిన విషయాన్ని బాలల హక్కుల సంఘం హెచ్ఆర్సీ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో జీహెచ్ఎంసీ కమిషనర్‌కి నోటీసులు జారీ చేస్తూ ఈ ఘటన పై జూన్ 19 లోగా నివేదిక ఇవ్వాలని హెచ్చార్సీ ఆదేశించింది. -
దివాకర్ బస్సు ప్రమాదం..పలువురికి హెచ్చార్సీ నోటీసులు
♦ కృష్ణా జిల్లా కలెక్టర్, ఏపీ రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, ♦ ట్రావెల్స్ యజమానులకు నోటీసులు విజయవాడ లీగల్: ఏపీలోని కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం మూలపాడు వద్ద ఫిబ్రవరి 28న జరిగిన దివాకర్ బస్సు ప్రమాదానికి సంబం ధించి జిల్లా కలెక్టర్, ఆ రాష్ట్ర రవాణా శాఖ కమిషనర్, డీజీపీ, దివాకర్ ట్రావెల్స్ యజమానులకు ఏపీ మానవ హక్కుల కమిషన్ గురువారం నోటీసులు జారీ చేసింది. వారితో పాటు పెనుగంచిప్రోలు తహసీల్దారు, సబ్ ఇన్స్పెక్టర్, నందిగామ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్లను శుక్రవారం స్వయంగా కమిషన్ ముందు హాజరు కావాలని ఆదేశించింది. దివాకర్ బస్సు ప్రమాదంలో పది మంది ప్రయాణికులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఆ ఘటనపై బెజవాడ బార్ అసోసియేషన్ న్యాయవాది తగరం కిరణ్‌బాబు మానవ హక్కుల కమిషన్‌లో పిటిషన్ దాఖలు చేశారు. ఆ ఘటనపై సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. మృతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, ట్రావెల్స్ యజమానుల నుంచి ఎలాంటి సహాయం అందలేదని, ఆ ఘటనలో అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. ప్రమాదానికి కారణమైన దివాకర్ ట్రావెల్స్ యజమానులు జె.సి.దివాకర్‌రెడ్డి ఎంపీగా, జె.సి.ప్రభాకర రెడ్డి ఎమ్మెల్యేగా అధికార టీడీపీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండడంతో కేసును నీరు గార్చేందుకు ప్రభుత్వం యత్నిస్తోందని కిరణ్‌బాబు ఆరోపించారు. మృతులకు పోస్టుమార్టం నిర్వహించలేదన్న ఆరోపణలు రావడంతో ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆస్పత్రిలో ఉన్న మృతదేహాలను చూసేందుకు వచ్చి అధికారులను ప్రశ్నించగా కలెక్టర్, ఆస్పత్రి వైద్యులు సరైన సమాధానం చెప్పకపోగా వాదనకు దిగారని ప్రస్తావించారు. మృతులకు తీవ్ర అన్యాయం జరిగిందని, ఇదంతా మానవ హక్కుల ఉల్లంఘనే అన్నారు. విచారణకు స్వీకరించిన కమిషన్ బాధ్యులకు నోటీసులు జారీ చేసింది. -
కలెక్టర్, డీఎంహెచ్ఓలకు హెచ్ఆర్సీ నోటీసులు
శృంగవరపుకోట: రాష్ట్ర న్యాయసేవల అథారిటీ ఆదేశాల అమలులో కలెక్టర్ ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారంటూ చేసిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మానవ హక్కుల సంఘం(హెచ్ఆర్సి) కలెక్టర్, డీఎంహెచ్ఓలకు నోటీసులు జారీ చేసిందని స్థానిక న్యాయవాది చిక్కాల ఈశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఈమేరకు ఆయన హెచ్ఆర్సి జారీ చేసిన నోటీసు ప్రతిని మీడియాకు విడుదల చేశారు. జిల్లాలో దోమల నివారణకు సివిక్ ఎక్స్‌నోరా ప్రాజెక్టు అమలు చేయాలని రాష్ట్ర న్యాయసేవల అథారిటీ గతంలో ఆదేశాలిచ్చింది. ఆ ఆదేశాల అమలులో కలెక్టర్ చొరవ చూపకపోవడంతో హెచ్ఆర్సీని ఆశ్రయించినట్టు ఈశ్వరరావు చెప్పారు. దీంతో ఈ కార్యక్రమం అమలుకు తీసుకున్న చర్యలను వివరించే తగిన వివరాలతో ఆగస్టు 16వ తేదీన ఉదయం 10.30గంటలకు కమిషన్ ఎదుట హాజరు కావాలని హెచ్ఆర్సి ఆదేశించిందని న్యాయవాది ఈశ్వరరావు చెప్పారు.