huge rainfall
-
ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు
-
ఏపీలో నాలుగు రోజులు భారీవర్షాలు
సాక్షి, అమరావతి: వాయువ్య బంగాళాఖాతం, పరిసర ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో రాగల 4 రోజుల పాటు రాష్ట్రంలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు తెలిపారు. తీరం వెంబడి గంటకు 45-55 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని, అలలు 3 నుండి 3.5 మీటర్ల ఎత్తు ఎగిసిపడే అవకాశముందని పేర్కొన్నారు. సముద్రం అలజడిగా ఉంటుందని, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లరాదన్నారు. నేడు విశాఖ, తూర్పు గోదావరి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు(శుక్రవారం) విశాఖ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ పేర్కొంది. ఆగష్టు 15న విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశముందని పేర్కొంది. ఆగష్టు 16న విశాఖ, తూర్పు జిల్లాలో అక్కడక్కడ మోస్తారు నుంచి భారీ వర్షాలు, రాష్ట్రంలో మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కె. కన్నబాబు వెల్లడించారు. -
మళ్లీ వరద భయం
పోలవరం రూరల్, న్యూస్‌లైన్ : గోదావరి మళ్లీ ఉగ్రరూపం దాలుస్తోంది. ఎగువ నుంచి నదిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో శనివారం ఏజెన్సీలోని 26 గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామయ్యపేట సమీపంలోని తవ్వు కాలువలోను, కొత్తూరు గ్రామ సమీపంలోని లో-లెవెల్ కాజ్వే వద్ద సుమారు ఆరు అడుగుల ఎత్తును నీరు ప్రవహిస్తోంది. దీంతో పలు గ్రామాల గిరిజనులు పడవలపై వాటిని దాటి కాలినకడన శనివారం ప్రయాణం సాగించారు. గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలోకి అధికంగా నీరు చేరడంతో క్రమేపీ వరద పెరుగుతోంది. శుక్రవారం రాత్రి పోలవరం మండలంలో కుంభ వర్షం కురిసింది. 14.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇసుక కాలువ పొంగి ప్రవహించింది. ఒకవైపు భారీ వర్షాలు, మరోవైపు గోదావరి పెరగడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నాట్లు వేసిన పొలాలు ముంపునకు గురికావడంతో ఆందోళన చెందుతున్నారు. గోదావరికి వరద పెరగడంతో కడె మ్మ స్లూయిజ్ ద్వారా నీరు పొలాల్లోకి ప్రవహిస్తోంది. పోలవరం ప్రాంతంలో ఊడ్చిన పొలా లు, ఆకు మడులు ముంపునకు గురయ్యాయి. పెరిగిన నీటి మట్టం కొవ్వూరు, న్యూస్‌లైన్ : గోదావరి పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలకు నదిలో వరద పెరుగుతోంది. కొవ్వూరు గోష్పాదక్షేత్రం వద్ద నీరు ఒడ్డును తాకుతూ ప్రవహిస్తోంది. స్నానఘట్టం వద్ద మెట్లు పూర్తిగా మునిగిపోయాయి. ఈనెల మొదటివారంలో వచ్చిన వరద ప్రభావానికి పేరుకుపోయిన ఒండ్రు మట్టి, ఇసుక మేటలు ఇంకా అలాగే ఉన్నాయి. అప్పట్లో వారం రోజులపాటు ఇక్కడ ఆలయాలు ముంపులోనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాల్లో నేటికీ రెండు అడుగుల మేర వరదనీరు నిలిచి ఉంది. ఎగువున భద్రాచలంలో వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో క్రమేణా కొవ్వూరు, ధవళేశ్వరం వద్ద నీటిమట్టం పెరుగుతూ వస్తోంది. శనివారం ఉదయం నుంచి భద్రాచలం వద్ద నీటిమట్టం నిలకడగా కొనసాగుతోంది. శనివారం ఉదయం 8 గంటలకు 42.60 అడుగులు ఉన్న నీటిమట్టం సాయంత్రానికి 42.10 అడుగులకు స్వల్పంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద ఉదయం 6 గంటలకు 7.40 అడుగులున్న నీటిమట్టం రాత్రి 7 గంటలకు 9.50 అడుగులకు పెరిగింది. దీంతో అధికారులు ఆనకట్టకున్న మొత్తం 175 గేట్లను ఎత్తివేసి 7 లక్షల 81వేల 533 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచి పెడుతున్నారు. ప్రస్తుతం పరిస్థితి నిలకడగా ఉందని అధికారులు చెబుతున్నారు.