పాక్, బలూచిస్థాన్ లలో హక్కుల ఉల్లంఘన: అమెరికా
వాష్గింటన్: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్, బలూచిస్థాన్ ప్రావిన్స్ లలో మానవహక్కుల ఉల్లంఘనలపై అమెరికా చాలా ఏళ్లుగా ఆందోళన వ్యక్తం చేస్తోందని ఆదేశ అధికార ప్రతినిధి మార్క్ సీ టోనర్ అన్నారు. మీడియాతో మాట్లాడుతూ ఆ ప్రాంతాల్లో పాకిస్థాన్ ఆర్మీ ఆణచివేతపై వేసిన ప్రశ్నకు సమాధానంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఆప్రాంతంలో నెలకొన్న అశాంతి పరిస్థితుల గురించి తమ మానవ హక్కుల నివేదికలో సైతం ఈవిషయాన్ని వెల్లడించామని ఆయన తెలిపారు. రాజకీయ పరిష్కారం ద్వారానే పాక్, బలూచిస్థాన్ లో శాంతియుత పరిస్థితులను సాధించగలమని తాము పాకిస్థాన్ కు, ఆదేశంలోని రాజకీయ పార్టీలకు చాలా సార్లు విజ్ఞప్తి చేశామని టోనర్ తెలిపారు. కశ్మీర్ పై అమెరికా విధానం గురించి పాకిస్ధాన్ కు బాగా తెలుసునని ఆయన వెల్లడించారు.