human rights violation
-
Police Commemoration Day: ఉగ్రవాదమే అతిపెద్ద హక్కుల ఉల్లంఘన
న్యూఢిల్లీ: ఉగ్రవాదమే అతిపెద్ద మానవ హక్కుల ఉల్లంఘన అని కేంద్ర హోం మంత్రి అమిత్ షా నొక్కి చెప్పారు. విదేశీ గడ్డ నుంచి ఆన్లైన్ ద్వారా జరిగే ఉగ్ర భావజాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా గుర్తించలేమని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం అమిత్ షా 90వ ఇంటర్‌పోల్ జనరల్ అసెంబ్లీ ముగింపు సమావేశంలో ప్రసంగించారు. ‘ఉగ్రవాదం, ఉగ్రవాదులకు సంబంధించిన స్పష్టమైన ఉమ్మడి నిర్వచనం ఇచ్చేందుకు అన్ని దేశాలు కలిసి రావాలి. అలా జరిగినప్పుడే ఉగ్రవాదులపైనా, ఉగ్రవాదంపైన అంతర్జాతీయంగా కలిసికట్టుగా పోరాడగలం. ఉగ్రవాదంపై చిత్తశుద్ధితో పోరాటం సాగించడం, మంచి, చెడు ఉగ్రవాదాల మధ్య తేడాను గుర్తించడం, ఉగ్ర దాడులను చిన్నవి, పెద్దవి అంటూ వర్గీకరించడం ముందుగా జరగాలి’అని పేర్కొన్నారు. ఆన్లైన్ ద్వారా సాగే ఉగ్రవాద సిద్ధాంతాల ప్రచారాన్ని రాజకీయ సమస్యగా భావించలేమంటూ ఆయన...ఉగ్రవాదంపై దీర్ఘకాలంలో నిబద్ధత, సమగ్రతతో కూడిన పోరాటం సాగించేందుకు కట్టుబడి ఉండాలన్నారు. ‘చాలా దేశాల్లో ఇంటర్‌పోల్ ఏజెన్సీ, ఉగ్రవాద వ్యతిరేక సంస్థలు వేర్వేరుగా ఉంటున్నాయి. ఈ పరిస్థితుల్లో ఉగ్రవాదంపై పోరాటం కొనసాగాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఉగ్రవాద వ్యతిరేక సంస్థలన్నీ ఏకతాటిపైకి రావాలి’అని అమిత్ షా అభిప్రాయ పడ్డారు. దీనికోసం ఇంటర్‌పోల్ శాశ్వత కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా నిఘా సమాచారాన్ని సభ్య దేశాలతో పంచుకుంటూ ఉండాలన్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ అవసరమైన సాంకేతిక, మానవ వనరులను ఇంటర్‌పోల్‌తో పంచుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాల మధ్య ఉమ్మడి, పరస్పర సహకారం అవసరమని సీబీఐ డైరెక్టర్ సుబోధ్ జైశ్వాల్ అన్నారు. జాతి వ్యతిరేక కార్యకలాపాలు తగ్గుముఖం దేశంలో జాతి వ్యతిరేక కార్యకలాపాలకు హాట్స్పాట్లుగా పేరున్న చాలా ప్రాంతాల్లో ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడ్డాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. అశాంతికి నెలవైన ఈశాన్య రాష్ట్రాల్లో హింసాత్మక ఘటనలు నేడు 70% వరకు తగ్గుముఖం పట్టాయన్నారు. నక్సల్ ప్రభావిత ప్రాంతాలతోపాటు జమ్మూకశ్మీర్లోనూ భద్రతాపరంగా ఇదే రకమైన పురోగతి కనిపిస్తోందని పేర్కొన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. -
మోదీకి ఎందుకంత భయం.. ఒవైసీ సెటైర్లు
సాక్షి,న్యూఢిల్లీ: చైనా జిన్జియాంగ్ రాష్ట్రంలో ఉయ్ఘర్లపై జరుగుతున్న మనవహక్కుల ఉల్లంఘనలపై చర్చించేందుకు ఐక్యరాజ్యసమితి మానవహక్కుల కమిషన్ ముందుకు ముసాయిదా తీర్మానం వచ్చింది. అయితే దీనిపై చర్చకు జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. పలు ఇతర దేశాలు కూడా ఓటింగ్‌లో పాల్గొనకపోవడంతో ఇది చైనాకు అనుకూలంగా మారింది. తీర్మానం వీగిపోయింది. ఫలితంగా చైనాకు మరోసారి తిరుగులేకుండా పోయింది. ఈ విషయంపై స్పందిస్తూ ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోదీకి చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అంటే ఎందుకంత భయం? అని ప్రశ్నించారు. ఆయనతో 18 సార్లు భేటీ అయినా.. ఏది కరెక్ట్, ఏది తప్పో చెప్పే ధైర్యం లేదా అని నిలదీశారు. ఐరాస ఓటింగ్‌లో భారత్ దూరంగా ఉండి చైనాకు ఎందుకు అనుకూలంగా వ్యవహరించిందో ప్రధాని చెప్పాలని ఒవైసీ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. Will the PM Modi saheb explain the reason for India’s decision to help China out in the UNHRC on the Uighur issue by choosing to abstain from an important vote? Is he so scared of offending Xi Jingping, whom he met 18 times, that India can’t speak for what is right? https://t.co/TJNy3Ffn2w — Asaduddin Owaisi (@asadowaisi) October 7, 2022 కాంగ్రెస్ అధికార ప్రతినిధి షామ మహమద్ కూడా ఈ విషయంపై విమర్శలు గుప్పించారు. మన భూమిని చైనా ఆక్రమించిందని చెప్పడానికి గానీ, చైనాలో మానవహక్కుల ఉల్లంఘనలకు ఖండించడానికి గానీ మోదీ సిద్ధంగా లేరు, చైనా అంటే ఆయనకు ఎందుకంత భయం అని ప్రశ్నించారు. ఈమేరకు ఆమె ట్వీట్ చేశారు. India abstains on draft resolution at UNHRC for a debate on human rights violations of Uyghurs in China Far from holding China accountable for stealing our land, PM Modi can't even bring himself to condemn China on human right violations. Why is @narendramodi so scared of China! — Dr. Shama Mohamed (@drshamamohd) October 6, 2022 ఐరాస మానవహక్కుల కమిషన్ తీర్మానంపై జరిగిన ఓటింగ్ ఫలితం చైనాకు అనుకూలంగా వచ్చింది. 19 దేశాలు తీర్మానాన్ని వ్యతిరేకించాయి. భారత్, మలేసియా, ఉక్రెయిన్ సహా 11 దేశాలు ఓటింగ్‌కు దూరంగా ఉన్నాయి. దీంతో తీర్మానం వీగిపోయింది. చదవండి: వందే భారత్ రైలు ప్రమాదం.. గేదెల యజమానులపై కేసు -
అర్ధరాత్రి అంత్యక్రియలు ఉల్లంఘనే
లక్నో: హాథ్రస్ సామూహిక అత్యాచార బాధిత యువతి భౌతిక కాయాన్ని అర్థరాత్రి దహనంచేయడం మానవహక్కుల ఉల్లంఘన అని, అందుకు బాధ్యులైన వారిని గుర్తించి చర్యలు చేపట్టాలని అలహాబాద్ హైకోర్టు ఆదేశించింది. హాథ్రస్ లాంటి ఘటనల్లో శవ దహనానికి మార్గదర్శకాలను రూపొందించాలని హైకోర్టు లక్నో బెంచ్ రాష్ట్రప్రభుత్వాన్ని ఆదేశించింది. సాంప్రదాయాలను పాటించకుండా, అర్థరాత్రి శవాన్ని దహనం చేయడం బాధిత మహిళ మానవ హక్కులను, వారి కుటుంబ సభ్యులు, బంధువుల మానవ హక్కులను ఉల్లంఘించడమేనని అభిప్రాయపడింది. హాథ్రస్‌కు సీబీఐ బృందం హాథ్రస్ హత్యాచార బాధితురాలి కుటుంబ సభ్యులను మంగళవారం సీబీఐ ప్రశ్నించింది. నేరం జరిగిన ప్రాంతాన్ని సీబీఐ అధికారులు పరిశీలించారు. మంగళవారం ఉదయం హాథ్రస్ చేరుకున్న సీబీఐ బృందం మొదట బాధితురాలి సోదరుడి నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ తరువాత, వారి కుటుంబం నుంచి పూర్తి వివరాలను సేకరించారు. సంఘటన పూర్వాపరాలపై వారిని లోతుగా ప్రశ్నించారు. మరోవైపు, హాథ్రస్ కేసు విచారణకు సీబీఐ ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందంలో మరో నలుగురు అధికారులు కొత్తగా చేరారు. సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబ్ నుంచి కూడా నిపుణులు ఈ బృందంలో చేరారు. -
మోదీకి పాక్ హక్కుల కార్యకర్తల వేడుకోలు..
ఇస్లామాబాద్ : సింధ్‌లో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అంశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఐక్యరాజ్యసమితిలో లేవనెత్తాలని పాకిస్తాన్ హక్కుల కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీకి విజ్ఞప్తి చేశారు. సింధ్ సహా పాకిస్తాన్‌లోని ఇతర ప్రాంతాల్లో మానవ హక్కుల ఉల్లంఘనను ఐరాసలో ప్రధాని మోదీ ప్రస్తావించాలని సింధ్ ఫౌండేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, పాక్‌లో ప్రముఖ రాజకీయ కార్యకర్త మునవర్ సుఫీ లఘరి ప్రధానిని కోరారు. సింధ్ ప్రాంతంలో ప్రజల్లో అలుముకున్న భయాందోళనలను తొలగించడం పెనుసవాల్‌గా మారిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. భారత్‌లో పెద్దసంఖ్యల్లో సింధీలు నివసిస్తున్న క్రమంలో వారి సమస్యలను రానున్న ఐరాస సాధారణ సమితి సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించాలని కోరారు.మైనారిటీలు, పాకిస్తాన్లో ప్రజాస్వామ్య ప్రకియ అనే పేరిట జరిగిన మానవ హక్కుల కౌన్సిల్ 42వ సదస్సును ఉద్దేశించి లఘరి మాట్లాడారు. మత స్వేచ్ఛపై అమెరికా మాట్లాడుతున్న తరహాలో కనీసం మానవ హక్కుల గురించి ప్రధాని మోదీ మాట్లాడాలని కోరారు.ఇక పాక్‌లో మానవ హక్కుల ఉల్లంఘనపై పీఓకే, బెలూచిస్తాన్, ఆప్ఘనిస్తాన్‌లకు చెందిన పలువురు హక్కుల కార్యకర్తలు పాక్ తీరును తప్పుపట్టారు. -
పాకిస్థాన్ పోలీసులు.. చేదు నిజాలు
ఇస్లామాబాద్: పాకిస్థాన్ పోలీసులు సాగిస్తున్న అరాచకాలకు సంబంధించిన చేదు నిజాలు వెల్లడయ్యాయి. పాక్ పోలీసులు మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతున్నారని ఓ ప్రపంచ మానవ హక్కుల సంస్థ వెల్లడించింది. పేద ప్రజలు, మైనార్టీలు, శరణార్థులపై హింస, అక్రమ అరెస్టులు, హత్యలు, లైంగిక హింసకు పాల్పడుతున్నారని పేర్కొంది. బలూచిస్తాన్, పంజాబ్ , సింధ్ ప్రావిన్స్‌లలో సీనియర్ పోలీసు అధికారులు, బాధితులను ఇంటర్వ్యూ చేసిన హ్యూమన్ రైట్స్ వాచ్, ఇందుకు సంబంధించి 102 పేజీల నివేదిక రూపొందించింది. కస్టడీలో ఉన్న వారిని దర్యాప్తు సమయంలో పోలీసులు ఎక్కువగా హింసిస్తున్నారని నివేదికలో పేర్కొంది. కేసుల విచారణ, ఫోరెన్సిక్ విశ్లేషణలో పోలీసులకు సరైన శిక్షణ ఇవ్వడంలేదని.. రాజకీయ నాయకులు, స్థానిక ఉన్నత వర్గాల ఒత్తిడుల వల్లే పోలీసులు నకిలీ ఎన్కౌంటర్లకు పాల్పడుతున్నారని సీనియర్ అధికారులు తెలిపినట్లు వెల్లడించింది. 2015లో పోలీసులు 2,000 నకిలీ ఎన్కౌంటర్లు చేశారన్న సంస్థ.. పోలీసు వ్యవస్థను వెంటనే ప్రక్షాళన చేయాలని డిమాండ్ చేసింది.