Humpy Koneru
-
హంపి, హారిక గేమ్‌లు ‘డ్రా’
ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): ప్రపంచ మహిళల చెస్ చాంపియన్‌షిప్‌లో రెండో రౌండ్‌లోని తొలి గేమ్‌ను భారత గ్రాండ్‌మాస్టర్స్ కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక ‘డ్రా’గా ముగించారు. జొలాంటా జవద్జా్క (పోలాండ్)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన కోనేరు హంపి 26 ఎత్తుల్లో ‘డ్రా’ చేసుకుంది. బేలా ఖొటెనాష్విలి (జార్జియా)తో జరిగిన గేమ్‌ను నల్ల పావులతో ఆడిన హారిక 64 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. నేడు జరిగే రెండో గేమ్‌లో గెలిచిన వారు మూడో రౌండ్‌కు అర్హత సాధిస్తారు. ఒకవేళ రెండో గేమ్ ‘డ్రా’ అయితే మాత్రం గురువారం టైబ్రేక్‌లు నిర్వహించి విజేతను నిర్ణయిస్తారు. -
హంపి జట్టుకు టైటిల్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక యూరోపియన్ క్లబ్ కప్ చెస్ టోర్నీలో ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ప్రాతినిధ్యం వహించిన సర్కిల్ డిచెక్స్ డి మోంటెకార్లో (మొనాకో) జట్టు విజేతగా నిలిచింది. హంపి క్లబ్ ఆడిన ఏడు రౌండ్లలో అజేయంగా నిలిచింది. మొత్తం 14 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకుంది. మొనాకో జట్టుకు యూరోపియన్ క్లబ్ కప్ దక్కడం ఇది ఐదోసారి కావడం విశేషం. మొనాకో జట్టులో హంపితోపాటు ప్రపంచ చాంపియన్ హూ ఇఫాన్ (చైనా), అన్నా ముజిచుక్ (స్లొవేనియా), పియా క్రామ్లింగ్ (స్వీడన్), అల్మీరా స్కిర్ప్చెంకో (ఫ్రాన్స్) సభ్యులుగా ఉన్నారు. వ్యక్తిగత విభాగాల్లో హంపి బోర్డు-2లో విజేతగా నిలిచింది. హంపి ఆడిన ఏడు గేముల్లో ఐదింటిలో గెలిచి మిగతా రెండింటిని ‘డ్రా’ చేసుకుంది. -
ఇక్కడితో ఆగను: హంపి
విజయవాడ స్పోర్ట్స్, న్యూస్‌లైన్: ‘గ్రాండ్‌ప్రి’ విజయాలతో సరిపెట్టుకోకుండా... తన చిరకాల స్వప్నం ప్రపంచ చాంపియన్‌షిప్ టైటిల్ లక్ష్యంగా ముందుకు సాగుతానని ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి తెలిపింది. సోమవారం ముగిసిన తాష్కెంట్ గ్రాండ్‌ప్రి టోర్నమెంట్లో విజేతగా నిలిచిన ఈ విజయవాడ అమ్మాయి మంగళవారం నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ ఏడాదిలో గ్రాండ్‌ప్రి టోర్నీలు ముగిశాయని... వచ్చే ఏడాది జరిగే మిగతా మూడు గ్రాండ్‌ప్రి టోర్నీలకుగాను తాను రెండింటిలో బరిలోకి దిగుతున్నట్లు వివరించింది. ఆ రెండు టోర్నీల్లోనూ రాణించి 2015 ప్రపంచ చాంపియన్‌షిప్ మ్యాచ్‌కు అర్హత పొందేందుకు కృషి చేస్తానని తెలిపింది. ‘తాష్కెంట్’ టోర్నీలో టాప్ సీడ్ హంపి స్థాయికి తగ్గట్టుగా ఆడి అగ్రస్థానాన్ని దక్కించుకుంది. ఈనెల 19 నుంచి గ్రీస్‌లో జరిగే యూరోపియన్ క్లబ్ కప్‌లో బరిలోకి దిగుతానని వెల్లడించింది. ప్రస్తుతం కెరీర్‌పైనే పూర్తి దృష్టి సారించానని ఇప్పటికైతే తనకు అకాడమీ పెట్టే ఆలోచన లేదని స్పష్టం చేసింది. -
ఆధిక్యంలో హంపి
తాష్కెంట్: నాలుగో విజయాన్ని నమోదు చేసిన ఆంధ్రప్రదేశ్ గ్రాండ్‌మాస్టర్ కోనేరు హంపి ‘ఫిడే’ మహిళల గ్రాండ్‌ప్రి చెస్ టోర్నమెంట్లో ఆధిక్యంలోకి వెళ్లింది. బుధవారం జరిగిన ఏడో రౌండ్లో హంపి 50 ఎత్తుల్లో నఫీసా ముమినోవా (ఉజ్బెకిస్థాన్)పై గెలిచింది. లాగ్నో (ఉక్రెయిన్)తో జరిగిన గేమ్‌ను మరో గ్రాండ్‌మాస్టర్ హారిక 34 ఎత్తుల్లో ‘డ్రా’గా ముగించింది. హంపి ఐదున్నర పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది.