hundi count
-
అప్పన్న హుండీ లెక్కింపు
సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది మంగళవారం ఉదయం లెక్కించారు. గడిచిన 20 రోజులకు గాను రూ. 70,21,195 నగదుతో పాటు 61 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి భక్తులు సమర్పించినట్లు ఈవో కోడూరి రామచంద్రమోహన్ తెలిపారు. శ్రావణ మాసం కావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముందని... ప్రతి శుక్రవారం మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్ కావడంతో కల్యాణ మండపాలన్నీ రద్దీగా ఉన్నాయని.. వాటి కారణంగా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. -
బ్రహ్మోత్సవాల తాత్కాలిక హుండీల లెక్కింపు
కదిరి : ఖాద్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక హుండీలను మంగళవారం లెక్కించారు. వాటి ద్వారా స్వామి వారికి రూ.16,89,484 లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ దొడ్డా వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ రామతులసి, ఆలయ ఉద్యోగులు, సిబ్బంది, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు ఉద్యోగులు, ఇతర పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. -
వేంకటేశ్వరాలయం హుండీ లెక్కింపు
అనంతపురం కల్చరల్ : హౌసింగ్బోర్డులోని శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయం హుండీని మంగళవారం సాయంత్రం లెక్కించారు. రూ.1,24,835 ఆదాయం వచ్చినట్టు నిర్వాహకులు క్రిష్ణమూర్తి తెలిపారు. వైకుంఠ ఏకాదశి పర్వదినాన స్వామివారి హుండీ ఆదాయం పెరగడం ఆనందంగా ఉందన్నారు.