అప‍్పన‍్న హుండీ లెక్కింపు | ​hundi counting in simhachalam temple | Sakshi
Sakshi News home page

అప‍్పన‍్న హుండీ లెక్కింపు

Published Tue, Aug 1 2017 2:34 PM | Last Updated on Mon, Sep 11 2017 11:01 PM

​hundi counting in simhachalam temple

సింహాచలం: ప్రముఖ పుణ్యక్షేత్రం సింహాద్రి అప్పన్న ఆలయంలో స్వామివారికి భక్తులు సమర్పించిన కానుకలను ఆలయ సిబ్బంది మంగళవారం ఉదయం లెక్కించారు. గడిచిన 20 రోజులకు గాను రూ. 70,21,195 నగదుతో పాటు 61 గ్రాముల బంగారం, 5 కేజీల వెండి భక్తులు సమర్పించినట్లు ఈవో కోడూరి రామచంద్రమోహన్‌ తెలిపారు.
 
శ్రావణ మాసం కావడంతో భక్తుల రాక మరింత పెరిగే అవకాశముందని... ప్రతి శుక్రవారం మహిళలను దృష్టిలో పెట్టుకుని ఆలయంలో కుంకుమ పూజలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పెళ్లిళ్ల సీజన్‌ కావడంతో కల్యాణ మండపాలన్నీ రద్దీగా ఉన్నాయని.. వాటి కారణంగా ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement