hurriyat leaders
-
పాక్ ప్రధానికి లేఖ రాసిన జుమా మసీద్ ఇమామ్
న్యూఢిల్లీ: ఢిల్లీ జమా మసీదు షాహి ఇమామ్, సయ్యద్ అహ్మద్ బుఖారీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్‌కు లేఖ రాశారు. ప్రస్తుతం కాశ్మీర్ లోయలో నెలకొన్న అశాంతి పరిష్కారం, కాల్పుల విరమణ, వేర్పాటువాద నాయకులు, తీవ్రవాద యువతతో చర్చలకు తనను ఉపయోగించుకోవాలని నవాజ్‌ను కోరారు. భారతదేశం, పాకిస్తాన్‌లతోపాటు, వేర్పాటు నాయకులు, తీవ్రవాద యువత, రెండు దేశాల ప్రభుత్వాలకు మధ్యవర్తిగా ఉంటానని ఇమాం చెప్పాడు, తెలివితేటలతో అక్కడ ఉన్న అశాంతి, హింసలను తొలగించి శాంతి స్థాపనకు కృషి చేయాలని సూచించారు. కశ్మీర్ సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పరస్పర చర్చల ద్వారా కాల్పుల విరమణను ప్రకటించాలని తద్వారా సమస్యను పరిష్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుందన్నారు బుఖారీ జూన్ 22 న రాసిన ఈ ఉత్తరంలో భూతలంపై స్వర్గం పేరుపొందిన కశ్మీరీ లోయలో ఇప్పడు కన్నీరు ప్రవహిస్తోందన్నారు. ఇప్పడు అది నమ్మలేనంత నేడు ఇది ఒక వధశాల మారిందన్నారు. కశ్మీర్లో శాంతి భద్రతల పరిస్థితి రోజురోజుకు దిగజారిపోతోందని, ఫలితంగా రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చర్చలు ఆలస్యం అయ్యే కొద్ది సమస్యకు పరిష్కారం మరింత క్లిష్టమవుతుందని బుఖారీ తెలిపారు. శాంతి భద్రతలు కనుమరుగవడంతో కశ్మీర్‌లోని సాధారణ ప్రజలు, ఏకే-47ల నీడలోనిస్సహాయ స్థితిలో ఉన్నారు. లక్షలాదిమంది భారతీయ ముస్లింలు ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నారని బుఖారీ చెప్పారు. రెండు దేశాల మధ్య చర్చల ద్వారా సరిహద్దుల వద్ద ఉద్రిక్తత తగ్గించటం, పరిస్థితిని సాధారణ పరిస్థితికి తీసుకురావచ్చని సూచించారు. కాశ్మీర్ పరిస్థితి తుపాకీలు, సైనిక దాడుల ద్వారా పరిష్కరించబడదన్నారు. చర్చలకు అనుకూమైన వాతావరణాన్నిరెండు దేశాల మధ్య తాము ఏర్పాటు చేస్తామని ఆయన తన లేఖలో తెలిపారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా రెండు దేశాల ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, కాల్పుల విరమణ కోసం, తీవ్రవాద యువత హుర్యిత్ నాయకులను ఒప్పించాలని ఆయన పాక్ ప్రధానిని కోరారు. -
‘తలలు నరికి వేలాడదీస్తా..’
శ్రీనగర్: తమ ఉద్యమానికి అడ్డొస్తే తలలు నరికి లాల్ చౌరస్తాలో వేలాడాదీస్తానంటూ కశ్మీర్ వేర్పాటువాద సంస్థ హుర్రియత్‌కు చెందిన నాయకులను హెచ్చరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన ఉగ్రవాది జాకీర్ మూసా ఒక సంచలన ఆడియోను విడుదల చేశాడు. ఇస్లాం స్థాపనకోసం తామెంతో పోరాడుతున్నామని, దీనికి అడ్డంకులు సృష్టిస్తే ఏ ఒక్కరినీ వదిలిపెట్టబోనని, వారు హుర్రియత్ నాయకులైనా తలలు నరికిపడేస్తానంటూ వార్నింగ్ ఇచ్చాడు. ఈ ఆడియోను ముజఫరా బాద్ నుంచి విడుదల చేశాడు. అయితే, ఈ వ్యాఖ్యలతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ హిజ్బుల్ నేతలు ఒక ప్రకటన విడుదల చేశారు. మూసా ప్రకటనకు తమ ఉద్యమానికి సంబంధం లేదని, అది అతడి వ్యక్తిగత అభిప్రాయం అని అన్నారు. ముసా ఇచ్చిన ప్రకటనకు తమకు ఎలాంటి బాధ్యత లేదని చెప్పారు. ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తీసుకున్న హుర్రియత్ నేతలు సయ్యద్ అలీ షా గిలానీ, మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్, యాసిన్ మాలిక్ ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశారు. ఇస్లామిక్ స్టేట్, అల్ కాయిదా ఇతర ఉగ్రవాద సంస్థలకు కశ్మీర్లో ఉద్యమానికి ఎలాంటి సంబంధం లేదని అన్నారు. మరోపక్క హిజ్బుల్ సంస్థ అధికారిక ప్రతినిధి సలీం హష్మీ స్పందిస్తూ గందరగోళం సృష్టించే ఏ ప్రకటన ఉన్నా అది పోరాటాన్ని దెబ్బతీస్తుందని, ముసా ప్రకటనకు తమకు సంబంధం లేదంటూ స్పష్టం చేశారు. హిజ్బుల్ సంస్థ పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉండి ఉగ్రవాద చర్యలకు దిగుతోంది. మరోపక్క, పోలీసులు రంగంలోకి దిగి ఆ ఆడియో టేపును పరిశీలించే పనిలో పడ్డారు. ఇదిలాఉండగా తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ముసా ప్రకటించాడు. అయితే, అతడిని తమతో కొనసాగించుకునేందుకు హిజ్బుల్ సంస్థ నిరాకరించడంతో అతడు వేరే ప్రత్యామ్నాయం లేక సంస్థను వదిలేశాడు. -
‘పాక్’ వేడుకలో మోదీపై హురియత్ ఫైర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ సర్కారును కశ్మీర్ వేర్పాటువాద, హురియత్ నేతలు విమర్శించారు. భారత్లోనిపాక్ హైకమిషన్ అబ్దుల్ బాసిత్ ఆహ్వానంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్సహా అతివాద హురియత్ నేతలు సయ్యద్ అలీషా గిలానీ, మితవాద నేత మిర్వాయిజ్ ఫరూక్ తదితరులు హాజరయ్యారు. కశ్మీర్‌పై మాజీ ప్రధాని వాజ్‌పేయి వైఖరిని ప్రస్తుత బీజేపీ సర్కారును నుంచి ఆశిస్తున్నామని, అయితే అది ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని అలీషా గిలానీ అన్నారు. వాజ్‌పేయిలా సానుకూల దృక్పథంతో మోదీ సర్కారు కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుందనడానికి సంకేతాలేవీ కనిపించడం లేదన్నారు. హురియత్, కశ్మీరీలు, పాకిస్తాన్ల భాగస్వామ్యం లేకుండా చర్చలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని, ఇది రాజకీయ సమస్య అని అన్నారు. గొప్ప ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటూనే కశ్మీర్‌లోని మైనారిటీ వర్గాలైన ముస్లింలు, సిక్కులు, దళితులపై సర్కారు వివక్షచూపుతోందని గిలానీ అన్నారు. తమ గడ్డపైనుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపారేస్తామని పాక్ ప్రధాని షరీఫ్ ఈ కార్యక్రమానికి పంపిన సందేశంలో అన్నారు.