‘పాక్’ వేడుకలో మోదీపై హురియత్ ఫైర్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ గణతంత్ర దినోత్సవం సందర్భంగా బుధవారం ఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ సర్కారును కశ్మీర్ వేర్పాటువాద, హురియత్ నేతలు విమర్శించారు. భారత్‌లోనిపాక్ హైకమిషన్ అబ్దుల్ బాసిత్ ఆహ్వానంపై కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్‌సహా అతివాద హురియత్ నేతలు సయ్యద్ అలీషా గిలానీ, మితవాద నేత మిర్వాయిజ్ ఫరూక్ తదితరులు హాజరయ్యారు. కశ్మీర్‌పై మాజీ ప్రధాని వాజ్‌పేయి వైఖరిని ప్రస్తుత బీజేపీ సర్కారును నుంచి ఆశిస్తున్నామని, అయితే అది ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని అలీషా గిలానీ అన్నారు.
వాజ్‌పేయిలా సానుకూల దృక్పథంతో మోదీ సర్కారు కశ్మీర్ సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తుందనడానికి సంకేతాలేవీ కనిపించడం లేదన్నారు. హురియత్, కశ్మీరీలు, పాకిస్తాన్‌ల భాగస్వామ్యం లేకుండా చర్చలతో కశ్మీర్ సమస్య పరిష్కారం కాదని, ఇది రాజకీయ సమస్య అని అన్నారు. గొప్ప ప్రజాస్వామ్యదేశమని చెప్పుకుంటూనే కశ్మీర్‌లోని మైనారిటీ వర్గాలైన ముస్లింలు, సిక్కులు, దళితులపై సర్కారు వివక్షచూపుతోందని గిలానీ అన్నారు. తమ గడ్డపైనుంచి ఉగ్రవాదాన్ని తుడిచిపారేస్తామని పాక్ ప్రధాని షరీఫ్ ఈ కార్యక్రమానికి పంపిన సందేశంలో అన్నారు.