Husband Brutal Murder
-
కోర్టులో విడాకులకు దరఖాస్తు.. భార్యను నరికి చంపిన భర్త
కొయ్యలగూడెం: భర్తే కాలయముడై భార్యను కడతేర్చాడు. కత్తితో విచక్షణా రహితంగా నరకడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సీఐ మధుబాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. రామానుజపురం గ్రామానికి చెందిన రాజనాల సాయి లక్షి్మ(35)కి భర్త సూర్యచంద్రంతో 13 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి విలాష్ సాయి, విశాల్ సాయి అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. సుమారుగా పది సంవత్సరాల నుంచి వీరు నిత్యం గొడవలు పడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో సూర్యచంద్రంపై సాయి లక్ష్మి కొయ్యలగూడెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు భార్యాభర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి పంపివేశారు. అనంతరం ఇద్దరూ కోర్టులో విడాకుల కొరకు దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఈ కేసు కొనసాగుతోంది. బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో ఇంట్లో భార్యాభర్తల మధ్య మరోసారి గొడవ జరిగింది. సాయిలక్ష్మి ఇంట్లో నుంచి బయటకు వస్తుండగా.. సూర్యచంద్రం ఆవేశంతో ఇంట్లో ఉన్న కత్తి తీసుకుని సాయి లక్ష్మి మెడపై విచక్షణారహితంగా నరకడంతో ఆమె రోడ్డుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. భర్తను అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కాగా తన కుమార్తెను అల్లుడు సూర్యచంద్రం ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని, కొంతకాలంగా తన కుమార్తెను ఆడపడుచు, భర్త, అత్తమామలు చిత్రహింసలకు గురిచేస్తున్నారని తల్లి నాగలక్ష్మి ఆరోపించింది. బిడ్డల్ని కూడా అల్లుడు చూసుకునేవాడు కాదని, కుమార్తె తన వద్దకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకువెళుతూ ఉండేదని తల్లి పేర్కొంది. తన చెల్లెలు మృతి వెనుక సూర్యచంద్రం తల్లిదండ్రులు, చెల్లి, బావ ఉన్నారని అన్న మృతురాలి అన్న సుబ్రహ్మణ్యం ఆరోపించాడు. దీనిపై మృతురాలి తల్లి, అన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు డీఎస్పీ సురేష్ కుమార్‌రెడ్డి నేతృత్వంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
భార్యే సూత్రధారి!
* ప్రియుడితో కలిసి భర్త దారుణహత్య * పైగా కనిపించడం లేదని ప్రచారం * మూడేళ్లకు వీడిన హత్యకేసు మిస్టరీ! కొందుర్గు: అదృశ్యమైన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మూడేళ్ల తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యే ప్రియుడితో కలిసి అతడిని హతమార్చిందని తేలింది. పోలీసులు మంగళవారం నిం దితులను అరెస్ట్‌చేశారు. వివరాలను షాద్‌నగర్ రూరల్ సీఐ మధుసూదన్, ఎస్ఐ వెంకటేశ్వర్లు విలేకరులకు వెల్లడించారు. మండలంలోని ఇంద్రానగర్‌కు చెందిన జా కారం నర్సింహులు(42), తూంపల్లికి చెం దిన వెంకటయ్య దూరపు బంధువులు. ఎని మిదేళ్లక్రితం నుంచి వీరు ఇద్దరు కలిసి తూంపల్లి శివారులోని గుట్టల్లో రాయికొట్టి జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో నర్సింహులు భార్య యాదమ్మ అక్కడికి టిఫి న్ తీసుకెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు వెంకటయ్యతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ విషయం ఆమె భర్త నర్సింహులుకు తెలి సింది. దీంతో ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని యాదమ్మ, వెంకట య్య ఓ పథకం రచించారు. ఆ ప్రకారమే 2013 సెప్టెంబర్‌లో పీర్లపండగకు 3రోజుల ముందు హత్యచేయాలని భావించారు. గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి.. తూంపల్లి శివారులో గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి, వాటిని తవ్వుకొద్దామని నచ్చచెప్పి ఆ రోజు రాత్రి అక్కడికి నర్సింహులును తీసుకెళ్లారు. అందరూ కలిసి గొయ్యి తవ్వి.. అందులోకి అతని దించారు. మట్టి తీస్తుండగా అంతకుముందే తెచ్చి సిద్ధంగా ఉంచిన పెద్ద పెద్ద బండరాళ్లను నర్సింహులుపై వేసి హత్యచేశారు. ప్రాణం పోయిందని తెలుసుకుని అదే గొయ్యిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. నాటినుంచి నర్సింహులు కనిపించడం లేదని భార్య యాదమ్మ బంధువులతో పాటు పరిసర గ్రామాల్లో నమ్మించింది. కాగా,వెంకటయ్య, యాద మ్మ మరింత చనువయ్యారు. యాదమ్మ అవసరాలకు అప్పుడప్పుడు డబ్బు కూడా ఇచ్చేవాడు. ఇలా వెలుగులోకి.. కొంతకాలం తరువాత యాదమ్మ, వెంకటయ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. నర్సింహులును హత్యచేసిన విషయం అతడి తమ్ముడు చంద్రయ్య కు తెలిసింది. దీంతో ఈనెల 25న యా దమ్మతో పాటు ఆమె ప్రియుడు తూం పల్లికి చెందిన వెంకటయ్య కలిసి వీఆర్ ఓ గోపాలకృష్ణ వద్దకు వెళ్లి నిజాన్ని బయటపెట్టారు. నర్సింహులును తామే హత్యచేశామని నేరం అంగీకరించా రు. వీఆర్ఓ పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చే సమయంలో పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీ సులు మంగళవారం యాదమ్మ, వెంకటయ్య ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సింహులు అస్థికలను బయటికి తీసి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.