* ప్రియుడితో కలిసి భర్త దారుణహత్య
* పైగా కనిపించడం లేదని ప్రచారం
* మూడేళ్లకు వీడిన హత్యకేసు మిస్టరీ!
కొందుర్గు: అదృశ్యమైన ఓ వ్యక్తి హత్యకు గురయ్యాడు. మూడేళ్ల తరువాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. భార్యే ప్రియుడితో కలిసి అతడిని హతమార్చిందని తేలింది. పోలీసులు మంగళవారం నిం దితులను అరెస్ట్‌చేశారు. వివరాలను షాద్‌నగర్ రూరల్ సీఐ మధుసూదన్, ఎస్‌ఐ వెంకటేశ్వర్లు విలేకరులకు వెల్లడించారు.
మండలంలోని ఇంద్రానగర్‌కు చెందిన జా కారం నర్సింహులు(42), తూంపల్లికి చెం దిన వెంకటయ్య దూరపు బంధువులు. ఎని మిదేళ్లక్రితం నుంచి వీరు ఇద్దరు కలిసి తూంపల్లి శివారులోని గుట్టల్లో రాయికొట్టి జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో నర్సింహులు భార్య యాదమ్మ అక్కడికి టిఫి న్ తీసుకెళ్లేది. ఈ క్రమంలో ఆమెకు వెంకటయ్యతో పరిచయం ఏర్పడి.. వివాహేతర సంబంధానికి దారితీసింది.ఈ విషయం ఆమె భర్త నర్సింహులుకు తెలి సింది.
దీంతో ఎలాగైనా అతడిని అడ్డుతొలగించుకోవాలని యాదమ్మ, వెంకట య్య ఓ పథకం రచించారు. ఆ ప్రకారమే 2013 సెప్టెంబర్‌లో పీర్లపండగకు 3రోజుల ముందు హత్యచేయాలని భావించారు.
గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి..
తూంపల్లి శివారులో గుప్తనిధులు ఉన్నాయని నమ్మించి, వాటిని తవ్వుకొద్దామని నచ్చచెప్పి ఆ రోజు రాత్రి అక్కడికి నర్సింహులును తీసుకెళ్లారు. అందరూ కలిసి గొయ్యి తవ్వి.. అందులోకి అతని దించారు. మట్టి తీస్తుండగా అంతకుముందే తెచ్చి సిద్ధంగా ఉంచిన పెద్ద పెద్ద బండరాళ్లను నర్సింహులుపై వేసి హత్యచేశారు. ప్రాణం పోయిందని తెలుసుకుని అదే గొయ్యిలో మృతదేహాన్ని పూడ్చిపెట్టారు. నాటినుంచి నర్సింహులు కనిపించడం లేదని భార్య యాదమ్మ బంధువులతో పాటు పరిసర గ్రామాల్లో నమ్మించింది. కాగా,వెంకటయ్య, యాద మ్మ మరింత చనువయ్యారు. యాదమ్మ అవసరాలకు అప్పుడప్పుడు డబ్బు కూడా ఇచ్చేవాడు.
ఇలా వెలుగులోకి..
కొంతకాలం తరువాత యాదమ్మ, వెంకటయ్య ప్రేమ వ్యవహారం బెడిసికొట్టింది. నర్సింహులును హత్యచేసిన విషయం అతడి తమ్ముడు చంద్రయ్య కు తెలిసింది. దీంతో ఈనెల 25న యా దమ్మతో పాటు ఆమె ప్రియుడు తూం పల్లికి చెందిన వెంకటయ్య కలిసి వీఆర్ ఓ గోపాలకృష్ణ వద్దకు వెళ్లి నిజాన్ని బయటపెట్టారు. నర్సింహులును తామే హత్యచేశామని నేరం అంగీకరించా రు. వీఆర్‌ఓ పోలీసులకు ఫోన్‌ద్వారా సమాచారం ఇచ్చే సమయంలో పరారయ్యారు. దర్యాప్తు చేపట్టిన పోలీ సులు మంగళవారం యాదమ్మ, వెంకటయ్య ను అరెస్ట్‌చేసి రిమాండ్‌కు తరలించారు. నర్సింహులు అస్థికలను బయటికి తీసి, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు.
భార్యే సూత్రధారి!
Published Wed, Jun 29 2016 1:48 AM | Last Updated on Thu, Oct 4 2018 5:51 PM
Advertisement