husband suicide
-
భార్య ఉరేసుకున్న చోటే.. భర్త ఆత్మహత్య
వివాహమైన 4 నెలలకే ఆమె.. తన పుట్టింటి వద్ద ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అదే ప్రదేశంలో సరిగా పెళ్లి రోజుకు ముందు భర్త సైతం ప్రాణాలు తీసుకున్నాడు. హుస్నాబాద్: జీవితంపై విర్తకి చెంది ఓ వ్యక్తి తన పెళ్లిరోజే...భార్య ఉరేసుకున్న చోటే బలవన్మరణానికి పాల్పడ్డాడు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ జిల్లా నేదునూర్ గ్రామానికి చెందిన బొల్లంపల్లి శ్యాంసుందర్(35)కు ఏడాది క్రితం హుస్నాబాద్ పట్టణానికి చెందిన శారదతో వివాహమైంది. పెళ్లయిన కొద్ది నెలలకే ఇద్దరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ఆరునెలల క్రితం శారద తన ఇంటివద్ద ఉన్న చెట్టుకే ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భార్య చనిపోయిన నాటి నుంచి మనస్తాపానికి లోనైన శ్యాం ఆదివారం అర్ధరాత్రి హుస్నాబాద్‌కు వచ్చి భార్య చనిపోయిన చెట్టు వద్దే పురుగుల మందు తాగాడు. చుట్టుపక్కల వారు గమనించేలోగానే మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
క్షణికావేశం.. తమిళనాడులో దారుణం!
క్షణికావేశం.. ఓ కుటుంబాన్ని చిదిమేసింది. నలుగురి ప్రాణాలను మంటలకు ఆహుతి చేసింది. కడలూరుజిల్లాలో భార్యతో గొడవ పడిన ఓ భర్త అత్తారింటికి వెళ్లి మరీ ఘోరానికి పాల్పడ్డాడు. ఏకంగా ఐదుగురిపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నిందితుడితో పాటు వదిన, అన్నెపుణ్యం ఎరుగని ఇద్దరు పసిబిడ్డలు నామరూపాల్లేకుండా పోయారు. భార్య, అత్త కొన ఊపిరితో ఆస్పత్రిలో కొట్టుమిట్టాతున్నారు. సాక్షి, చెన్నై: దంపతుల మధ్య విడాకుల వివాదం ఓ కుటుంబాన్ని ఛిద్రం చేసింది. భార్యపై కోపంతో భర్త.. ఏకంగా ఆమె కుటుంబాన్నే తగల బెట్టేశాడు. కడలూరు చెల్లాంకుప్పంలో జరిగిన ఈ ఘటన బుధవారం ఉదయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం కలిగించింది. వివరాలు.. స్థానిక పిళ్లయార్ వీధిలోని ఓ ఇంట్లో ప్రకాష్(35), తమిళరసి(31), ఏడాది వయసున్న కుమార్తె హాసిని, తమిళరసి తల్లి సెల్వి నివాసం ఉంటున్నారు. తమిళరసి సోదరి ధనలక్ష్మికి రెండేళ్ల క్రితం దేవనంపట్నాకి చెందిన సద్గురుతో వివాహమైంది. వీరికి ఆరు నెలల మగ బిడ్డ ఉన్నాడు. ధనలక్ష్మి, సద్గురుల మధ్య నిత్యం గొడవలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో విరక్తి చెందిన ధనలక్ష్మి విడాకుల కోసం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో ఆమె తన ఆరునెలల బిడ్డతో సహా తమిళరసి ఇంటికి వచ్చేసింది. అయినప్పటికీ ధనలక్ష్మి, సద్గురు ఫోన్లో తరచూ గొడవపడేవారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉదయాన్నే ప్రకాష్ ఎప్పటిలాగే డ్యూటీకి వెళ్లిపోయాడు. ఇంట్లో ధనలక్ష్మి, తమిళరసి, సెల్వి, పసి బిడ్డలు మాత్రమే ఉన్నారు. ఆగ్రహంతో ఇంట్లోకి వచ్చిన సద్గురు భార్య ధనలక్ష్మితో ఘర్షణ పడ్డాడు. తర్వాత తన వెంట తెచ్చుకున్న క్యాన్‌లోని పెట్రోల్‌ను ఇంట్లో ఉన్న వారందరిపై పోసి నిప్పంటించాడు. ఆపై తానూ మంటల్లో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన స్థానికులు వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. తమిళరసి, ఇద్దరు పసిబిడ్డలు అక్కడికక్కడే మృతి చెందారు. కొన ఊపిరితో ఉన్న ధనలక్ష్మి, అత్త సెల్వి, భర్త సద్గురును ఆసుపత్రికి తరలించారు. మార్గం మధ్యలో సద్గురు కూడా మరణించాడు. మృతదేహాలను పోస్టుమారా్టనికి తరలించి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ధనలక్ష్మి, సెల్వి పరిస్థితి విషమంగా ఉండడంతో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. -
హైదరాబాద్ ఫతేనగర్ లో యువకుడి ఆత్మహత్య
-
ప్రియుడితో కలిసి భర్తపై భార్య వేధింపులు
సాక్షి, మల్యాల(చొప్పదండి): భార్య, ఆమె ప్రియుడి వేధింపులు తాళలేక భర్త వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మల్యాల మండలంలోని నూకపల్లిలో చోటుచేసుకుంది. ఎస్సై నాగరాజు కథనం ప్రకారం.. మల్యాలకు చెందిన అట్టపల్లి రాజు(30)కు గొల్లపల్లి మండలం బొంకూరు గ్రామానికి చెందిన రమ్యతో ఏడాది కిందట వివాహం జరిగింది. తర్వాత రమ్యకు తుంగూరుకు చెందిన రాజేందర్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు రాజుకు తెలిసింది. ఈ క్రమంలో రాజేందర్‌తో ఆమె చనువుగా ఉండటం చూసిన రాజు పద్ధతి మార్చుకోవాలని పలుమార్లు హెచ్చరించినా పట్టించుకోలేదు. కొద్దిరోజుల కిందట రమ్య గర్భం దాల్చింది. తన ప్రియుడి వల్లే తాను గర్భం దాల్చానని చెప్పి, తల్లిగారింటికి వెళ్లి అబార్షన్ చేయించుకుంది. ‘నువ్వు బతికి ఉండటం వృథా, చచ్చిపో’ అంటూ రమ్యతోపాటు రాజేందర్ ఫోన్లో తరచూ రాజును మానసికంగా వేధించేవారు. దీంతో మనస్తాపం చెందిన అతను మంగళవారం రాత్రి ఇంటి నుంచి వెళ్లిపోయి, నూకపల్లి శివారులోని వరద కాలువలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు వరద కాలువ వద్ద వెతకగా బైక్‌తోపాటు రాజు చెప్పులు కనిపించాయి. కాలువలో గాలించడంతో మృతదేహం లభ్యమైంది. తన కుమారుడి మృతికి కోడలు, ఆమె ప్రియుడే కారణమని మృతుడి తండ్రి నాగయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
భార్య కాపురానికి రాలేదని.. భర్త బలవన్మరణం
సాక్షి, బొమ్మలసత్రం, కర్నూలు: ప్రేమించి పెళ్లిచేసుకుని కాపురం చేసిన పదేళ్ల తర్వాత వారి మధ్య విభేదాలు రావటాన్ని జీర్ణించుకోలేక చివరకు ఓ యువకుడు విష గులికలు మింగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నంద్యాల పట్టణంలో గురువారం చోటుచేసుకుంది. త్రీటౌన్ సీఐ శివశంకర్ తెలిపిన వివరాలు.. శిరివెళ్లకు చెందిన సజ్జల నరసింహులు(32) నంద్యాల పట్టణంలోని దేవనగర్‌కు చెందిన షేక్ ఆశాను ప్రేమించి, పదేళ్ల క్రితం కులాంతర వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. సాఫీగా సాగిపోతున్న వీరి కాపురంలో మూడు నెలల క్రితం మనస్పర్ధలు వచ్చాయి. తరచూ గొడవలు జరిగాయి. ఈక్రమంలో ఆశా ఫిర్యాదు మేరకు నరసింహులుపై స్థానిక త్రీటౌన్ పోలీస్టేషన్లో గృహ హింస చట్టం కింద కేసు నమోదైంది. రిమాండ్‌కు వెళ్లి తిరిగి వచ్చిన అనంతరం తిరిగి భార్య, పిల్లల కోసం దేవనగర్లోని ఆశా ఇంటి వద్దకు వెళ్లాడు. నరసింహులును కలవటానికి ఆశా నిరాకరించటంతో బుధవారం అర్ధరాత్రి విషగులికలు మింగాడు. గమనించిన ఆశా వెంటనే నరసింహులును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించింది. చికిత్స పొందుతూ కోలుకోలేక గురువారం ఉదయం మృతిచెందాడు. నరసింహులు తండ్రి పెద్దనర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టామని సీఐ శివశంకర తెలిపారు. -
భార్య మృతి తట్టుకోలేక భర్త ఆత్మహత్య
-
కేసీఆర్,మోదీలకు చేరాలంటూ.. ఆత్మహత్య
-
మనస్తాపంతో భర్త ఆత్మహత్య
చిలకలూరిపేటటౌన్ : భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని తెలిసిన భర్త మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గురువారం రాత్రి చిలకలూరిపేట పట్టణంలో జరిగింది. అర్బన్ సీఐ బండారు సురేష్‌బాబు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని వడ్డి కాలనీలో నివశించే షేక్ బషీర్ అహ్మద్ (32) స్థానిక ఐరన్ దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. భార్యకు వేరే వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తరచూ గొడవ పడేవాడు. గురువారం రాత్రి విధులు ముగించుకుని ఇంటికి చేరుకున్నాడు. ఇంతలో భార్య ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతుండటాన్ని గమనించాడు. ఎవరితో మాట్లాడుతున్నావని నిలదీశాడు. తన ఇంటి సమీపంలో నివశించే ఆటో డ్రైవర్ సురేష్‌తో మాట్లాడుతున్నానని, నీకు చేతనైంది చేసుకో.. అని తేల్చి చెప్పింది. ఆ సమయంలో 12 ఏళ్ల కొడుకు సమీర్ కూడా అక్కడే ఉన్నాడు. భార్య, కొడుకు ఇద్దరూ నిద్రకు ఉపక్రమించాక బషీర్ ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. వివరాలు నమోదు చేసుకున్నారు. అనంతరం సీఐ విలేకరులతో మాట్లాడుతూ మృతుడి కొడుకు సమీర్, తల్లి నూర్జహాన్, బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని చెప్పారు. భార్య వివాహేతర సంబంధం కారణంగానే బషీర్ ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక నిర్ధారణకు వచ్చామన్నారు. భార్య హసీనాతో పాటు ఆటో డ్రైవర్ గుంజి సురేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంటాడుతున్న మరణాలు.. బషీర్ తండ్రి ఇరవై ఏళ్ల కిందట ప్రమాదంలో మరణించాడు. అప్పటి నుంచి తల్లి నూర్జహాన్ తన ముగ్గురు పిల్లలను కష్టపడి పెంచి పోషించింది. మూడో సంతానమైన బషీర్‌కు స్థానికంగా ఉండే హసీనాతో 13 ఏళ్ల కిందట వివాహం జరిగింది. ఆరేళ్ల కిందట బషీర్ పెద్దకొడుకు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. రెండో కుమారుడు సమీర్ ప్రస్తుతం 7వ తరగతి చదువుతున్నాడు. తల్లి ప్రవర్తనపై విసిగి వేసారిన కొడుకు సమీర్ సైతం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇప్పుడు బషీర్ కూడా మరణించడటంతో ఆ కుటుంబంలో విషాదం నిండింది. -
భార్య కేసు పెట్టిందని భర్త ఆత్మహత్య
హైదరాబాద్ : కట్టుకున్న భార్యే తనపై కేసు పెట్టిందని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి మియాపూర్ కోర్టు ప్రాంగణంలో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మియాపూర్ ఎస్ఐ రఘుబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్ మదీనాగూడలోని ఉషోదయ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న రిటైర్డ్ ఆర్మీ అధికారి అశోక్ కుమార్(52)కు భార్య లక్ష్మి, కూతురు అమూల్య ఉన్నారు. వారి మధ్య విభేదాలు రావటంతో భార్య, కూతురుతో కలసి జీడిమెట్ల ఎంఎన్ రెడ్డి కాలనీలో వేరుగా నివాసముంటోంది. కాగా లక్ష్మి భర్తపై గత ఏడాది వేధింపుల కేసు పెట్టింది. నష్టపరిహారం కింద రూ.5లక్షలు, నెలకు రూ.10వేలు భరణం ఇవ్వాలని, అశోక్ ఇంటిలో వాటా కావాలని అందులో పేర్కొంది. ఈ నేపథ్యంలో అశోక్ కోర్టుకు తిరగలేక భార్యను, కూతురును తన వద్దకు వచ్చేలా చేయాలని తన న్యాయవాది గిరీష్‌ను కోరేవాడు. తరచూ కోర్టుకు రావడం అవమానంగా భావించి మనస్థాపానికి గురయ్యాడు. శుక్రవారం మియాపూర్ 9వ మెట్రోపాలిటన్ కోర్టులో వాయిదా ఉండడంతో అశోక్ కుమార్ కోర్టుకు వచ్చాడు. కోర్టు ప్రాంగణంలోనే తనవెంట తెచ్చుకున్న పురుగులమందు తాగాడు. వెంటనే న్యాయవాదులు గమనించి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు.