Hybrid Air Vehicles
-
ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్!
-
ప్రపంచ అతిపెద్ద విమానం క్రాష్‌ల్యాండ్!
అది ప్రపంచంలోనే అతిపెద్ద విమానం. 320 అడుగుల పొడవు, రూ. 222 కోట్ల (25మిలియన్ పౌండ్ల) ఖర్చుతో రూపొందిన ఎయిర్‌ల్యాండర్-10 గాలిలోకి ఎగిరిన ఏడురోజులకే క్రాష్ ల్యాండ్ అయింది. 'ఫ్లయింగ్ బమ్' అని ముద్దుగా పిలుచుకునే ఈ విమానం బుధవారం ల్యాండ్ అయ్యే సమయంలో సమీపంలో ఉన్న ఓ టెలిగ్రాఫ్ స్తంభాన్ని ఢీకొట్టింది. విమానం సవ్యంగా ల్యాండ్ కాకపోవడంతో కాక్‌పిట్ ధ్వంసమైంది. బ్రిటన్‌లోని బెడ్‌ఫోర్డ్‌షైర్ ఎయిర్‌ఫీల్డ్‌లో ఈ ఘటన జరిగింది. అయితే, విమానం చాలా నెమ్మదిగా దిగుతూ ఉండటం వల్ల క్రాష్‌ల్యాండ్ అయినా పెద్దగా నష్టం వాటిల్లలేదని తెలుస్తోంది. అయితే, క్రాష్‌ల్యాండ్ అయ్యే సమయంలో భూమి బద్దలైనట్టు అనిపించిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం గత బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరిన సంగతి తెలిసిందే. పదిటన్నుల బరువు మోయగల ఈ అతిపెద్ద విమానాన్ని బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏవీ) రూపొందించింది. ఈ విమానం బ్రిటన్‌లోనే అతిగొప్ప ఆవిష్కరణగా రూపకర్తలు గొప్పలు చెప్పుకొన్నారు. -
ప్రపంచంలోనే అతి పే..ద్ద విమానం గాలిలో..!
లండన్: ప్రపంచంలోనే అతిపెద్ద విమానం ఎట్టకేలకు బుధవారం గాలిలోకి ఎగిరింది. నాలుగురోజుల కిందటే ఈ విమానాన్ని తొలిసారి నడిపేందుకు ప్రయత్నించినా.. సాంకేతిక కారణాల వల్ల సాధ్యపడలేదు. కొంత విమానం, కొంత ఎయిర్‌షిప్ అయిన ఎయిర్‌ల్యాండర్-10 విమానం బుధవారం మధ్య ఇంగ్లండ్‌లోని కార్డింగ్టన్‌లో ఆకాశంలోకి ఎగిరింది. ప్రపంచంలోని అతిపెద్ద విమానమైన ఎయిర్ ల్యాండర్-10 తొలిసారి ఎగురుతున్న సందర్భంగా పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడి.. దానిని వీక్షించారు. 85 ఏళ్ల కిందట 1930 అక్టోబర్‌లో ఇదే ఎయిర్‌ఫీల్డ్ నుంచి ఎగిరిన ఎయిర్‌షిప్ ఆర్101 ఫ్రాన్స్‌లో కూలిపోయింది. ఈ ఘటనలో 30 మంది చనిపోయారు. ఆ తర్వాత బ్రిటన్‌లో ఎయిర్ షిప్‌లను రూపొందించడం ఆపేశారు. తాజాగా 302 అడుగుల పొడవున్న ఎయిర్‌ల్యాండర్-10ను అమెరికా ఆర్మీ కోసం బ్రిటన్ సంస్థ హైబ్రిడ్ ఎయిర్ వెహికిల్స్(హెచ్ఏవీ) రూపొందించింది. -
అతి పెద్ద విమానం!
♦ కొత్త ఫొటోల విడుదల ♦ నేడు ఆవిష్కరణ ♦ త్వరలో ట్రయల్ రన్ లండన్: ప్రపంచంలోనే అతి పొడవైన విమానం కొత్త ఫొటోలను ఆదివారం విడుదల చేశారు. ఎయిర్‌లాండర్ 10 అనే ఈ విమానాన్ని బెడ్‌ఫోర్డ్‌షైర్‌లో సోమవారం ఆవిష్కరించనున్నారు. త్వరలో ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. 92 మీటర్ల పొడవుతో ఉండే ఈ విమానం అతిపెద్ద ప్యాసింజర్ జెట్ల కన్నా 15 మీటర్లు ఎక్కువ పొడవుగా ఉంటుంది. బ్రిటన్‌కు చెందిన హైబ్రిడ్ ఎయిర్ వెహికల్స్(హెచ్ఏవీ) రూపొందించిన ఈ ఎయిర్‌క్రాఫ్ట్‌లో 3 వారాలపాటు విహరించడానికి అవసరమైన హీలియం ఇంధనాన్ని నింపుకోవచ్చు. 26 మీటర్ల ఎత్తు, 44 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. గాలి కన్నా బరువుగా ఉండే ఎయిర్‌లాండర్ వివిధ రకాల ఉపరితలాలైన నీరు, మంచుపైనా ల్యాండ్ అవుతుందని స్కై న్యూస్ పేర్కొంది. 2009లో దీన్ని మొదటిసారి అమెరికా కోసం తయారుచేశారు. నిఘా, కమ్యూనికేషన్స్, కార్గో, సహాయక సామగ్రి పంపిణీతోపాటు ప్రయాణికుల రవాణకూ ఇది అనువుగా ఉంటుందని హెచ్ఏవీ చెప్పింది. 50 టన్నుల బరువును తీసుకెళ్లే సామర్థ్యం ఉందని తెలిపింది. 92 ఎంపీహెచ్ వేగంతో నడిచే వెస్సెల్ ఉందని, ఇది కాలుష్యాన్ని విడుదల చేయదని పేర్కొంది 2018 నాటికల్లా 12 ఎయిర్లాండర్లను తయారుచేసే అవకాశముంది. ఇందులో 48 మంది ప్రయాణికులు వెళ్లొచ్చు.