Hyderabadi girl
-
టెక్సాస్ కాల్పుల ఘటనపై ఏపీ ప్రభుత్వం ఆందోళన: రత్నాకర్
అమెరికా టెక్సాస్ రాష్ట్రం డల్లాస్‌లో జరిగిన కాల్పుల్లో తెలుగు యువతి ఐశ్వర్య మరణించడంపై ఏపీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా దక్షిణాది రాష్ట్రమైన టెక్సాస్‌లో చాలా మంది భారతీయులు, అందులోనూ తెలుగు వారు నివసిస్తున్నారు. డల్లాస్ లో కాల్పుల ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరమని, తెలుగు యువతి తాటికొండ ఐశ్వర్య కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నామని నార్త్ అమెరికాలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి పండుగాయల రత్నాకర్ అన్నారు. డల్లాస్ అల్లెన్ ప్రీమియం మాల్ ఘటనలో ఎనిమిది మంది మరణించినట్టుగా తెలిసిందని, ఐశ్వర్య ఇందులో ఉన్నారని, గాయపడ్డ వారిలో మరో ఇద్దరు కూడా తెలుగు వారున్నారని, వారు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్టు రత్నాకర్ తెలిపారు. అమెరికాలో ఉంటోన్న ప్రవాసాంధ్రులు నిత్యం జాగ్రత్తలు, నిబంధనలు పాటించాలని కోరారు. ఈ జాగ్రత్తలు పాటించండి ఇటీవల చోటు చేసుకుంటోన్న కాల్పుల ఘటనలు, ఇతర దాడుల నేపథ్యంలో అక్కడ ఉంటున్న తెలుగువారికి, భారతీయులకు తగినన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ► కాల్పుల తరహలో ఏవైనా ఘటనలు లాంటివి జరిగినపుడు వీలైనంత వరకు బయటకు రావొద్దు ► ఎదుటి వారికి కనిపించేలా పరుగులు తీయొద్దు, మన ఆచూకీ తెలియనివ్వకుండా నక్కి ఉండండి ► కాల్పుల శబ్దం విన్నప్పుడు, అది మరీ దగ్గరగా ఉంటే పూర్తిగా నేలపైనే పడుకుని ఉండండి. పైకి కనిపించొద్దు. ► ఆందోళనకు గురి కావొద్దు, హడావిడిగా అటు, ఇటు పరుగులు తీయొద్దు ► బయట సమూహాల్లో కలుసుకునే సందర్భాల్లో వీలైనంత వరకు ఇంగ్లీషులోనే మాట్లాడాలి, మాతృభాషను తక్కువగా వాడాలి ► చుట్టుపక్కల అనుమానస్పద కదలికలపై, వ్యక్తులపై ఓ కన్నేసి ఉంచండి ► ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయని అనుమానం వస్తే, ఎక్కడైనా ట్రాప్ అయ్యామని అనిపిస్తే వెంటనే అలర్ట్ కండి. 911కు కాల్ చేసి సమాచారం ఇవ్వండి ► ఎవరితోనూ ఎలాంటి పరిస్థితుల్లోనూ వాదనలకు దిగొద్దు ► బహిరంగ ప్రదేశాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గొడవపడొద్దు ► చాలామంది రెచ్చగొట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు, ఆ సమయంలో సాధ్యమైనంతవరకు ఆంగ్ల భాషలోనే మాట్లాడండి, సున్నితంగా అక్కడి నుంచి తప్పుకోండి. ► మనుషుల కదలిక తక్కువగా ఉండే నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్లకూడదు ► 911 నంబర్‌కు ఫోన్ చేసేందుకు అస్సలు సంకోచించవద్దు, పైగా పోలీసులతో పాటు వైద్యంతో పాటు ఏ రకమైన సాయమైనా క్షణాల్లో దొరుకుతుంది ► అమెరికాలో పరిస్థితులు చాలా వరకు సురక్షితమే. అయితే ఒకటో, రెండో నేర ఘటనలు జరుగుతున్నాయి కాబట్టి సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి. ► ఎవరికి వారు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండటం మంచిది. చదవండి: టెక్సాస్ కాల్పుల ఘటన.. హైదరాబాద్ యువతి మృతి -
అమెరికాలో కాల్పులు.. రాష్ట్ర యువతి మృతి
నేరేడుచర్ల/హుడా కాంప్లెక్స్ (హైదరాబాద్): అమెరికాలోని టెక్సాస్‌లో దుండగుడు జరిపిన కాల్పుల్లో తెలంగాణకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ తాటికొండ ఐశ్వర్య (27) మృతి చెందింది. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన ఆమె.. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసింది. కొన్ని నెలల కిందే అక్కడ ఉద్యోగంలో చేరింది. ఇంతలోనే ఆమె కన్నుమూయడంతో కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. షాపింగ్ కోసమని వెళ్లి..: ఐశ్వర్య కుటుంబం స్వస్థలం సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలోని పాత నేరేడుచర్ల. తాత రామనర్సింహారెడ్డి గతంలో ఎంపీపీగా పనిచేశారు. తండ్రి తాటికొండ నర్సిరెడ్డి రంగారెడ్డి జిల్లా కోర్టులోని ఆర్థిక వివాదాల పరిష్కారాల కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు. వీరు చాలా ఏళ్ల కిందటే హైదరా బాద్‌కు వలస వచ్చారు. ప్రస్తుతం సరూర్‌నగర్ హుడాకాలనీలో ఉంటున్నారు. హైదరాబాద్‌లోనే ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఐశ్వర్య.. 2019 జనవరిలో ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లారు. టెక్సాస్ వర్సిటీలో ఎంఎస్ పూర్తిచేశాక.. అక్కడే పర్ఫెక్ట్ జనరల్ కాంట్రాక్టర్స్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజర్‌గా ఉద్యోగంలో చేరారు. శనివారం మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం ఆదివారం తెల్లవారుజామున) టెక్సాస్‌లోని డాలస్‌లో ఓ ఫ్రెండ్‌తో కలసి షాపింగ్‌కు వెళ్లింది. ఆ సమయంలో షాపింగ్ మాల్‌లోకి వచ్చిన ఓ దుండగుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడిక్కడే మృతిచెందారు. కాల్పుల్లో ఐశ్వర్య ముఖం ఛిద్రం కావడంతో తొలుత ఆమె ఎవరనేది తెలియలేదు. పోలీసులు వేలిముద్రల ఆధారంగా ఐశ్వర్యను గుర్తించి సోమవారం ఉదయం తల్లిదండ్రులకు సమాచారం అందించారు. ఐశ్వర్య మృతదేహాన్ని ఇండియాకు తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని, ఇందుకు మూడు రోజులు పట్టవచ్చని ఆమె సోదరుడు శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు. చదవండి: ఆస్ట్రేలియా తీరంలో వింతచేప.. అధ్యయనంలో ఆసక్తికర విషయాలు.. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా? అల్లారుముద్దుగా చూసుకున్న ఐశ్వర్య ఇక లేదనే విషయం తెలిసి ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. కొన్ని నెలల కిందే హైదరాబాద్‌కు వచ్చి వెళ్లిన ఆమెను గుర్తు చేసుకుంటూ తండ్రి తాటికొండ నర్సిరెడ్డి శోకసంద్రంలో మునిగిపోయారు. ‘‘నన్ను, అమ్మను వెంట తీసుకెళతానంది. తనతోపాటు నేను కూడా అక్కడే ఉండాలన్నది. నా చిట్టి తల్లి ఇంకా ఫోన్ చేయలేదా?’’ అంటూ ఆయన తీవ్రంగా రోదించడం అందరినీ కంటతడి పెట్టించింది. (చదవండి : అమెరికాలో ఉన్న వాళ్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?) రోజూ ఫోన్ చేసి మాట్లాడేదని, వేళకు మందులు వేసుకోవాలని చెప్పేదని, ఇంతలోనే తమకు శాశ్వతంగా దూరమైందంటూ ఐశ్వర్య తల్లి విలపించింది. ఉన్నత విద్య, ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన తన మనవరాలు దుండగుడి కాల్పుల్లో మృతిచెందడం దురదృష్టకరమని ఐశ్వర్య తాత తాటికొండ రామనర్సింహారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. చదవండి: బంగారు గనిలో ప్రమాదం.. 27 మంది మృతి -
National Tennis Championship: శ్రీవల్లి రష్మిక అదరగొట్టింది
National Tennis Championship- Shrivalli Rashmikaa: జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్ అమ్మాయి భమిడిపాటి శ్రీవల్లి రష్మిక శుభారంభం చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో రష్మిక 6–1, 6–0తో ఆయూషి సింగ్ (బిహార్)పై విజయం సాధించింది. ఇక హైదరాబాద్‌కే చెందిన నిధి చిలుముల, తటవర్తి శ్రేయ కూడా రెండో రౌండ్లోకి అడుగుపెట్టారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో నిధి 6–3, 6–2తో సాయిదేదీప్యపై, శ్రేయ 6–2, 6–3తో ప్రతిభా నారాయణ్‌పై గెలిచారు. చదవండి: T20 WC 2021 IND Vs PAK: షమీపై నెటిజన్ల దాడి.. ఖండించిన టీమిండియా మాజీలు T20 World Cup 2021: భారత్ పై విజయం.. ఇప్పుడు పాకిస్తానే టైటిల్ ఫేవరెట్ -
శభాష్ ! సాయి అలంకృత.. వెయిట్ లిఫ్టింగ్‌లో వరల్డ్ రికార్డ్
హైదరాబాద్ : చెంగిచర్లలో నివాసముంటున్న సందీప్, స్నిగ్థ బసు దంపతుల కూతురు సాయి అలంకృత అరుదైన ఫీట్ చేసింది. ప్రపంచ రికార్డును సొంతం చేసుకుని ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో స్థానం సంపాదించింది. పిన్న వయసులోనే అదిక బరువులను అవలీలగా ఎత్తేస్తూ ఔరా అనిపిస్తోంది. చదవండి: మోడరన్ మామ్స్.. బేబీ ఫుడ్ కుకర్ గురించి మీకు తెలుసా? -
తెలంగాణ యాసకు క్రేజ్ తెచ్చిన హారిక
ఒకప్పుడు సోషల్ మీడియా అంటే గూగుల్, యాహూ వంటివి మాత్రమే. ఆ తర్వాత వచ్చిన ఫేస్‌బుక్‌ను ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది వాడుతుండటం విశేషం. ఇప్పుడు ఇన్‌స్ట్రాగ్రామ్, టిక్‌టాక్ హవా సాగుతోంది. సిటీకి చెందిన కొందరు అమ్మాయిలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. వారు టిక్‌టాక్‌లో చేసిన ఒక్కో వీడియోను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో అప్లోడ్ చేస్తే చాలు అయిదారు గంటల్లోనే లక్షల్లో వ్యూస్, వేలల్లో లైక్‌లు రావడం విశేషం. నేడు సోషల్ మీడియా డే సందర్భంగా సిటీకి చెందిన కొందరు సోషల్‌మీడియా సెలబ్రిటీల అభిప్రాయాలు ఇవీ.. – సాక్షి, సిటీబ్యూరో యాసకు క్రేజ్.. ఈమె పేరు హారిక అలేఖ్య. తెలంగాణ యాసలో హారిక చెప్పే డెలాగ్లు సోషల్ మీడియాలోనే కాదు గ్రామీణ ప్రాంతాల్లో సైతం హల్చల్ చేస్తుంటాయి. ఈమె ప్రాతినిధ్యం వహించే ‘దేత్తడి’ యూట్యూబ్ చానెల్‌కు ప్రస్తుతం 8లక్షల 70వేల సబ్స్క్రైబర్లు ఉన్నారు. త్వరలో ఈ సంఖ్య పది లక్షలకు చేరనుంది. ఈ మార్క్‌ను అధిగమిస్తే తెలుగులో ‘దేత్తడి’ రికార్డు సృష్టించనుంది. ఈమె పర్సనల్ ఇన్‌స్ట్రాగ్రామ్‌లో 2.50 లక్షలమంది ఫాలోవర్స్ ఉన్నారు. ‘దేత్తడి’ చానల్లో ఈమె నటించిన వీడియోలు బిట్స్‌గా సోషల్ మీడియా వేదికగా ఫుల్ వైరల్ కావడం విశేషం. అతి తక్కువ కాలంలో తనదైన శైలిలో డైలాగులు చెప్పడం.. హావభావాలు పలికించడం ఈమెకు ఈమే సాటి. తెలంగాణ యాసలో నటించిన ‘కూల్ డైరీస్ ఫస్ట్ లవ్, ఫస్ట్రేట్ తెలంగాణ పిల్ల, ఫస్ట్రేటెడ్ ఎంబీబీఎస్ స్టూడెంట్’ వంటి వీడియోలు వాట్సప్ స్టేటస్‌లలో హల్చల్ చేస్తున్నాయి. షీ ఈజ్ ఎఫ్బీ క్వీన్ సరదా కోసం ఫేస్బుక్ లైవ్‌ను ప్రారంభించిన.. దివ్య అన్వేషిత కొమ్మరాజు ఫేస్బుక్లో 4 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కసారి ఫేస్బుక్ లైవ్‌లోకి వచ్చి హాయ్ అంటూ పలకరిస్తే చాలు నెటిజన్లు ఈమెకు ఇచ్చే కాంప్లిమెంట్స్‌కి ఎవరైనా ఫిదా కావాల్సిందే. ఎంతో ఆప్యాయతతో, భారతీయ సంస్కృతి ఉట్టిపడే వస్త్రధారణతో లైవ్‌లోకి వచ్చి నెటిజన్లును ఆనందిపజేస్తుంది. కేవలం తన సరదానే కాదు.. ఆపదలో ఉన్నవారికి అండగా అందరూ నిలవాలంటూ ఫేస్బుక్ వేదికగా ఒక్క పిలుపు ఇస్తే చాలు మేమున్నాం అంటూ ఆమె ఫ్యాన్స్ నిలబడతారు. గత ఏడాది కేరళలో వరదలు వచ్చినప్పుడు ఫేస్బుక్ వేదికగా దివ్య అన్వేషిత విరాళాలు సేకరించగా..రూ.5లక్షలకు పైగా పేటీఎం, గూగుల్ ప్లే, బ్యాంకు ఎకౌంట్ల ద్వారా అక్కడి ప్రభుత్వానికి అందాయి. కళ్లతో కట్టిపడేస్తది ఈమె పేరు రమ్యవర్మ. 2014లో సరదాగా ఈ వీడియో చేసింది. వ్యూస్, లైక్‌లు ఎక్కువ రావడంతో మరిన్ని వీడియోలు చేసేందుకు సంసిద్ధమైంది. ఇప్పటి వరకు చేసిన వీడియోల్లో సమంతకు సంబంధించినవి బాగా ఫేమస్ అయ్యాయి. సినిమాల్లో సమంత ఎలా హావభావాలు వ్యక్తపరుస్తుందో.. అదే రీతిలో రమ్యవర్మ వ్యక్తపరచడం విశేషం. వీడియోలు చేసేటప్పుడు కళ్ల కదిలికలు చేస్తున్న తీరు కుర్రకారును కట్టిపడేస్తోంది. స్మైలింగ్ స్టార్ ఉప్పల్‌కు చెందిన రౌతు సాహినీరావుకు ప్రస్తుతం ఇన్‌స్ట్రాగ్రామ్‌లో ఫాలోవర్స్ 50వేల మందికిపైగా ఉన్నారు. లేటెస్ట్గా ఏదైనా సినిమాలో డైలాగ్ ఫేమస్ అయ్యిందంటే చాలు.. క్షణాల్లో ఆ డైలాగ్‌ని టిక్‌టాక్ చేసి ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుంది. స్మైల్‌తో చెప్పే డైలాగ్స్‌కి ఈమె ఫాలోవర్స్ ఫిదా అవుతుంటారు. ‘మజిలీ’ సినిమాలో సమంత ఫోన్లో మాట్లాడే సన్నివేశాన్ని అచ్చుగుద్దినట్లు చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడంతో ఈమె ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఎక్స్‌ప్రెషన్స్‌లో క్వీన్ ఈమె ‘చైతన్య కల్లూరి’ ప్రస్తుతం టెస్టింగ్ ఇంజినీర్‌గా చేస్తోంది. టిక్‌టాక్‌లో సూపర్బ్. లేటెస్ట్ డైలాగ్స్‌ను తనదైన శైలిలో చేయడంలో ఈమె ఎంతో ఫేమస్. నవ్వు, ఏడుపు, బాధ, కన్నీళ్లు ఏదైనా సరే.. ఎక్స్ప్రెషన్ ఇవ్వడంలో ఈమె క్వీన్. అందుకే తను ఏ వీడియో చేసినా అభిమానులు ఆ వీడియోను ఫాలో అవుతారు. లైక్ కొట్టి కామెంట్ రూపంలో తమ అభిమానాన్ని చూపిస్తుంటారు. ప్రస్తుతం ఈమె ఫాలోవర్స్ 60 వేల మందికిపైగా ఉన్నారు. ‘అసలేం గుర్తుకు రాదు’ అనే సాంగ్‌ని చికెన్‌తో చేసింది. ఈ వీడియో వాట్సప్‌లో స్టేటస్‌కి బాగా వాడుకున్నారు. అద్భుతాలు సృష్టిస్తూ.. ప్రియాంక దారపు ఫన్నీ కోసం డబ్స్మాష్, వీడియోస్ చేయడం హాబీగా ఎంచుకుంది. సినిమాల్లోని, అడ్వర్టయిజ్మెంట్స్లోని డైలాగ్స్‌ని తనదైన శైలిలో వ్యక్తపరచడంలో దిట్ట. ప్రతి వీడియో స్మైల్‌తో చేస్తుండటంతో ఈమె ఫ్యాన్స్ కేరింతలు కొడుతున్నారు. -
దియా మిర్జా డెరైక్షన్
ఈ జనరేషన్ హీరోయిన్లు అటు ప్రొడక్షన్లోనూ, ఇటు డెరైక్షన్లోనూ అడుగుపెట్టి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఈ జాబితా పెరుగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్టులో దియా మిర్జా కూడా చేరారు. హైదరాబాదీ అమ్మాయిగా హిందీ పరిశ్రమలో అడుగుపెట్టి పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన దియా మిర్జా ఇప్పుడు ఓ చిత్రాన్ని తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నారు. గతేడాది నిర్మాతగా ‘బాబీ జాసూస్’ అనే చిత్రాన్ని నిర్మించిన దియా, డైరక్షన్ వైపు దృష్టి సారించారు. ‘‘నాకు మొదటి నుంచి డెరైక్షన్ అంటే చాలా ఇష్టం. అందుకే ఆ దిశగా అడుగులు వేస్తున్నా. ప్రస్తుతం స్క్రిప్ట్ రాస్తున్నా. వచ్చే ఏడాది నుంచి చిత్రీకరణ ప్రారంభిస్తా’’ అని చెప్పారు.