IAB meeting
-
'విశ్వ' రూపం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: మంత్రి కాలవ శ్రీనివాసులు, ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి మధ్య వాగ్వాదంతో ఐఏబీ(సాగునీటి సలహా మండలి సమావేశం) సమావేశం రసాభాసగా మారింది. ఏడాదికి ఒక్కసారి నిర్వహించే సమావేశానికి సగం మంది ఎమ్మెల్యేలు కూడా హాజరుకాని పరిస్థితి. వచ్చిన వారి అభిప్రాయాలను కూడా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఓపిగ్గా వినకపోవడం గమనార్హం. పక్ష ఎమ్మెల్యేలతో పాటు స్వపక్ష ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గానికి సంబంధించి సమస్యలు చెబుతుండగా మంత్రి జోక్యం చేసుకుని ‘ఓకే.. ఓకే.. అన్ని సమస్యలూ పరిష్కరిస్తాం. వీలైనంత త్వరలో నీళ్లిస్తాం’ అని అడ్డుపడ్డారు. స్వపక్షపార్టీ నేత కావడంతో అధికారపార్టీ ఎమ్మెల్యేలు ఏమనలేక మౌనంగా ఉండిపోయారు. అప్పటికీ ఎమ్మెల్యేలు హనుమంతరాయచౌదరి, జితేంద్రగౌడ్, ఎమ్మెల్సీ శమంతకమణి మాట్లాడేది పూర్తిగా వినాలని మంత్రికి చెప్పారు. ఇంత తతంగం జరుగుతున్నా ఐఏబీ చైర్మన్ జిల్లా కలెక్టర్ వీరపాండియన్ కనీసం పెదవి విప్పలేదు. ప్రేక్షకపాత్ర వహించారు. చివరకు నీటి కేటాయింపుల గురించి కూడా మాట్లాడలేకపోవడం గమనార్హం. ఈ ఏడాది హెచ్చెల్సీ కోటా 25.142 టీఎంసీలు తుంగభద్ర డ్యాంలో ఈ ఏడాది నీటి లభ్యత 164 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ధారించింది. ఇందులో దామాషా ప్రకారం 25.142 టీఎంసీలు హెచ్చెల్సీకి కేటాయించారు. ఇందులో తొలి ప్రాధాన్యతగా 10టీఎంసీలు తాగునీటికి కేటాయించారు. తక్కిన 15.142 టీఎంసీలు సాగునీటికి కేటాయించారు. తుంగభద్ర మెయిన్ కెనాల్, జీబీసీ(గుంతకల్లు బ్రాంచ్ కెనాల్), ఎంపీఆర్ దక్షిణ, ఉత్తర కాలువలు, తాడిపత్రి బ్రాంచ్ కెనాల్‌కు కలిపి 6.808 టీఎంసీలు కేటాయించారు. కర్నూలు జిల్లా ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు 0.742 టీఎంసీలు, వైఎస్సార్‌జిల్లా మైలవరం బ్రాంచ్ కెనాల్‌కు 1.253, పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు 1.378 టీఎంసీలు కేటాయించారు. మొదట పీఏబీఆర్, ఎంపీఆర్‌లో నీటిని నిల్వ చేసుకుని తర్వాత కోటా మేర కాలవలకు నీటి విడుదల ప్రారంభిస్తామన్నారు. హెచ్చెల్సీ మెయిన్ కెనాల్, జీబీసీకి ఈ నెల 6న నీటిని విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. సమావేశంలో మంత్రి పరిటాల సునీత, మండలి చీఫ్ విప్ పయ్యావుల కేశవ్, విప్ యామినీబాల, జెడ్పీ చైర్మన్ పూల నాగరాజు, జాయింట్ కలెక్టర్ ఢిల్లీరావు, హెచ్చెల్సీ ఎస్ఈ మక్బూల్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. జీబీసీకి రేపు నీటి విడుదల అసాధ్యం: జీబీసీకి రేపు నీటి విడుదల చేస్తామని మంత్రి దేవినేని ఉమా ప్రకటించారు. అయితే కాలవ ఉన్న పరిస్థితుల్లో వెంటనే నీటి విడుదల సాధ్యం కాదని పనులు చూస్తే స్పష్టమవుతుంది. ఈ పనులను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ చేస్తోంది. వీరికి నీటి విడుదల తేదీ 23 అని ప్రభుత్వం తెలిపినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కాలవలో మట్టి ఉంది. దీన్ని తొలగించాలంటే కనీసం 15–20 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కానీ మంత్రి దేవినేని మాత్రం రేపు జీబీసీకి నీళ్లస్తామని ప్రకటించడం గమనార్హం. ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి: ‘‘జిల్లాలో కరువు తీవ్రంగా ఉంది. కరువు మండలాలను ఏమైనా గుర్తించారా?’’ అని జిల్లా ఇన్చార్జ్ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావును ప్రశ్నించారు. మంత్రి కాలవ: మీరు కరువు మండలాల గురించి మాట్లాడకూడదు. ఎమ్మెల్యే విశ్వ: ఏడాదికి ఒకసారి సమావేశం జరుగుతుంది. విపక్షపార్టీకి చెందిన ఇద్దరు నేతలు ఉంటే కనీసం మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకపోతే ఎలా? కాలవ: వైఎస్ రాజశేఖరరెడ్డి బతికుంటే అనంతపురానికి, రాయలసీమకు నీళ్లు వచ్చేవి కావు. చంద్రబాబే నీళ్లు తీసుకొచ్చారు. విశ్వ: చనిపోయిన వ్యక్తి పేరును ప్రస్తావించకూడదనే సంస్కారం కూడా లేదా. వైఎస్ హయాంలో హంద్రీనీవా 75శాతం పూర్తయితే ఇప్పటి వరకూ మిగిలిన పనులు పూర్తి చేయలేకపోయారు. 2012లోనే జీడిపల్లికి నీళ్లొచ్చాయి. అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉందా? హంద్రీనీవా సామర్థ్యాన్ని 5టీఎంసీలకు తగ్గించి తాగునీటి ప్రాజెక్టుగా చంద్రబాబు మార్చారు. 40టీఎంసీలతో వైఎస్ పనులు చేసి నీళ్లు తెచ్చారు. పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 54వేల క్యూసెక్కులకు వైఎస్ పెంచారు. అనంతపురం కరువు జిల్లా అని సొంత జిల్లా కేసీ కెనాల్‌కు వెళ్లే నీటిలో 10 టీఎంసీలను హెచ్చెల్సీ ద్వారా అనంతకు కేటాయిస్తూ వైఎస్ జీఓ ఇచ్చారు. ఆ నీళ్లే ఇప్పటికీ ‘అనంత’కు అందుతున్నాయి. పోలవరానికి రూ.5వేల కోట్లు వైఎస్ హయాంలోనే ఖర్చు చేశారు. కుడి కాలవను కూడా ఆయన హయాంలోనే పూర్తి చేశారు. నాలుగేళ్లుగా టీడీపీ అధికారంలో ఉన్నా హంద్రీ–నీవా నీళ్లు జిల్లాకు వస్తుంటే డిస్ట్రిబ్యూటరీలు పూర్తి చేయలేక, ఒక్క ఎకరానూ తడపలేకపోయారు. ఇలాంటి ప్రభుత్వంలో భాగస్వాములైనా మీరు వైఎస్ గురించి మాట్లాడుతారా? .. విశ్వేశ్వరరెడ్డి నేరుగా సంధిం చిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కాలవ సహనం కోల్పోయి సంబంధం లేని విషయాలను మాట్లాడారు. ఇంతలో మంత్రి దేవినేని ఉమాతో పాటు ఇతర ఎమ్మెల్యేలు జోక్యం చేసుకుని ఇద్దరిని సముదాయించారు. -
తాగునీరే.. సాగుకు లేదు!
ఐఏబీ సమావేశంలో స్పష్టం చేసిన మంత్రులు, అధికారులు – టీబీ డ్యాంలో ప్రస్తుత నీటి నిల్వ 64 టీఎంసీలు - హెచ్చెల్సీ కోటా 9.8 టీఎంసీలు – అనంత, కర్నూలు, వైఎస్సార్ జిల్లాల తాగునీటి అవసరాలకు 10టీఎంసీలు – ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉండటంతో డ్యాంలో నీటిలభ్యత పెరిగే అవకాశం – అదే జరిగితే 12 టీఎంసీల వరకూ అందే అవకాశం – ఆయా ప్రాంతాల తాగు, సాగునీటి అవసరాలను ప్రస్తావించిన మూడు జిల్లాల ప్రజాప్రతినిధులు సాక్షిప్రతినిధి, అనంతపురం: ‘తుంగభద్రడ్యాంలో ప్రస్తుతం 64 టీఎంసీల నీరు ఉంది. ఏపీకి దామాషా ప్రకారం 9.8 టీఎంసీలు కేటాయించారు. ఆ నీటిని పూర్తిగా తాగునీటికే వినియోగిస్తాం. ప్రస్తుతం డ్యాంలో ఇన్‌ఫ్లో ఆశాజనకంగా ఉంది. మంచి వర్షాలు కురిసి, డ్యాంలో నీటి లభ్యత పెరిగితే సాగునీటి గురించి తర్వాత ఆలోచిస్తాం’ అని జిల్లా ఇన్చార్జ్మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్పష్టం చేశారు. కలెక్టరేట్లోని రెవెన్యూభవన్‌లో బుధవారం ఐఏబీ (నీటిపారుదల సలహా మండలి) సమావేశం నిర్వహించారు. మంత్రులు దేవినేని, కాలవ శ్రీనివాసులుతో పాటు అనంతపురం, కర్నూలు, వైఎస్సార్‌జిల్లాల ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీరు : ఎస్ఈ టీబీడ్యాంలో నీటిలభ్యత, హెచ్చెల్సీ కోటా, తాగు, సాగునీటి అవసరాలు, ప్రాధాన్యతలను హెచ్చెల్సీ ఎస్ఈ శేషగిరిరావు వివరించారు. ఏటా తుంగభద్ర నుంచి వచ్చే నీటిని ఎగువ ప్రాంతంలోని ఆయకట్టుకు ఇస్తూ దిగువన ఉన్న పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్‌లకు కూడా ఇచ్చేవాళ్లమని గుర్తు చేశారు. అయితే ఈ ఏడాది డ్యాంలో నీటిలభ్యత తక్కువగా ఉందన్నారు. ప్రస్తుతం డ్యాంలో 64 టీఎంసీలు ఉన్నాయని, ఇందులో హెచ్చెల్సీ వాటాను 9.8 టీఎంసీలుగా టీబీ బోర్డు నిర్ణయించిందన్నారు. అయితే హెచ్చెల్సీ పరిధిలో తాగునీటి అవసరాలకే 10 టీఎంసీల నీరు అవసరమన్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన సమీక్షలో హెచ్చెల్సీకి ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిలో నీరిస్తామని టీబీబోర్డు స్పష్టం చేసిందన్నారు. 20 రోజులు ఆన్, 10 రోజులు ఆఫ్ పద్ధతిలో నీటిని విడుదల చేస్తామన్నారని వివరించారు. టీబీడ్యాం నుంచి ఎంపీఆర్‌కు నీరు చేరాలంటే కనీసం 30 రోజులు పడుతుందన్నారు. 20 రోజులు విడుదల చేసి పదిరోజులు నీటి విడుదల ఆగిపోతే నీరు చేరదన్నారు. అందుకే మొదటి 30 రోజులు నీటిని విడుదల చేసి, ఆపై 10 రోజులు కావాలంటే ‘ఆఫ్ పద్ధతి’లో కర్ణాటకకు వినియోగించుకోవాలని తెలిపామన్నారు. ఇలా కాకుండా దామాషా ప్రకారం నిరాటకంగా నీరు విడుదల చేస్తే 1100 క్యూసెక్కులు ఇచ్చినా సరిపోతుందన్నారు. ఈ నీటిని 85 రోజుల వరకూ తీసుకోవచ్చన్నారు. టీబీడ్యాంలో నీటినిల్వ సామర్థ్యం 16 టీఎంసీలకు తగ్గితే హెచ్చెల్సీ ద్వారా చుక్కనీరు కూడా తీసుకునే అవకాశం ఉండదని, అందుకే నీటి సామర్థ్యం 16 టీఎంసీలకు చేరకముందే కోటా మేర నీటిని తీసుకోవాలన్నారు. తర్వాత ప్రజాప్రతినిధులు ఆయా ప్రాంత అవసరాలను ప్రస్తావించారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమస్యలు, సూచనల తర్వాత కలెక్టర్ వీరపాండియన్ మాట్లాడారు. 12 టీఎంసీలు తీసుకునే అవకాశం : కలెక్టర్ డ్యాంలో ప్రస్తుతం 64 టీఎంసీలు ఉన్నాయని, ప్రస్తుతం 26 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉందని కలెక్టర్ వీరపాండియన్ తెలిపారు. డ్యాంలో 75–80 టీఎంసీల నీటి లభ్యత ఉండే అవకాశం ఉందన్నారు. కాబట్టి 11.5 నుంచి 12 టీఎంసీలు హెచ్చెల్సీ ద్వారా తీసుకునే అవకాశం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే ప్రతినీటి చుక్కును తాగునీటి అవసరాలకే వినియోగిస్తామన్నారు. భవిష్యత్తులో మంచి వర్షాలు కురిసి, డ్యాంలో నీటి లభ్యత పెరిగితే సాగునీరు, రక్షకతడుల గురించి ఆలోచిస్తామన్నారు. హంద్రీ–నీవా ద్వారా నీరు వచ్చే అవకాశం ఉందని, అన్ని ప్రాంతాల అవసరాలను పరిగణలోకి తీసుకుంటామని ప్రజాప్రతినిధులు సహకరించాలని విన్నవించారు. నీటి లభ్యత బాగా తగ్గింది : మంత్రి కాలవ మంత్రి కాలవ శ్రీనివాసులు మాట్లాడుతూ టీబీడ్యాం చరిత్రలో ఎన్నడూలేని విధంగా నీటిలభ్యత తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం ఇన్ఫ్లోకాస్త మాత్రం ఆశాజనకంగా ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో తాగునీటికే ప్రాధాన్యత ఇస్తామని, ఆ దిశగానే అధికారులు ప్రణాళికలు రూపొందించారన్నారు. శ్రీశైలం నుంచి కూడా నీరు వచ్చే అవకాశం ఉందని, దీన్ని కూడా తాగునీటి అవసరాలకు వినియోగించాలన్నారు. కణేకల్ చెరువుకు మొదట నీళ్లిస్తాం : మంత్రి దేవినేని అందరి అభిప్రాయాలు ఆలకించిన తర్వాత చివరగా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు మాట్లాడారు. ప్రజాప్రతినిధులు సూచించిన మేరకు ఆయా ప్రాంత అవసరాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. ఆయకట్టు రైతులు కూడా కలిసి సమస్యలను విన్నవించారన్నారు. అయితే డ్యాంలో నీరు తక్కువగా ఉండటంతో ఆన్‌అండ్‌ఆఫ్ పద్ధతిన తీసుకుంటున్నామన్నారు. టీబీడ్యాం నుంచి మొదట కణేకల్ చెరువును నింపుతామన్నారు. తర్వాత పీఏబీఆర్, ఎంపీఆర్, సీబీఆర్ నింపుతామన్నారు. ముచ్చుమర్రి ద్వారా సెప్టెంబర్ రెండోవారంలో ఎత్తిపోతల ప్రారంభిస్తామన్నారు. గండికోటతో పాటు హంద్రీ–నీవా ద్వారా వచ్చేనీటితో మూడు జిల్లాలలో తాగునీటి సమస్యను నివారిస్తామన్నారు. ఎవరివాదన వారిది... సీబీఆర్ పూర్తిగా అడుగంటిపోవడం, ఎంపీఆర్‌లో నీరు లేకపోవడం, పీఏబీఆర్ ప్రమాదకరస్థాయిలో ఉండటంతో ప్రజాప్రతినిధులు ఎవరికివారు తమ ప్రాంత అవసరాల గురించి మాట్లాడారు. 4 దశాబ్దాలుగా ఐఏబీ సమావేశంలో పాల్గొంటున్నానని, ఇప్పటికీ తాడిపత్రికి సాగునీరు అందించలేకపోతున్నానని ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ‘ఇన్నేళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నావు. సాగునీళ్లు ఇప్పించలేకపోతే నువ్వేం నేతవని మా ప్రాంత ప్రజలు నిలదీసే అవకాశం ఉందని, ఆ పరిస్థితి రానివ్వొద్దన్నారు. వచ్చేనీటిలో తొలిప్రాధాన్యతగా తాడిపత్రికి తాగునీరు అందించాలని కోరారు. శింగనమలలో 26 డిస్ట్రిబ్యూటరీలు ఉన్నాయని, నీళ్లు రాగానే మొదట టైఎల్అండ్ అంటూ పులివెందులకు తీసుకెళ్తున్నారని, శింగనమలకే మొదట నీళ్లు ఇవ్వాలని ఎమ్మెల్సీ శమంతకమణి కోరారు. సీబీఆర్ పరిస్థితి దారుణంగా ఉందని, యుద్ధప్రాతిపదికను నీళ్లు వదలకపోతే పులివెందుల, ధర్మవరం, పుట్టపర్తి, కదిరి నియోజకవర్గాలలోని 850 గ్రామాలకు తాగునీరు ఆగిపోతుందని ఎమ్మెల్యేలు వరదాపురం సూరి, చాంద్‌బాషా తెలిపారు. చిత్రావతికి ఎప్పుడూ అన్యాయమే ‘టీబీడ్యాంలో 64 టీఎంసీలు ఉన్నాయి. ఇన్ఫ్లోబాగానే ఉంది. గతంతో పోలిస్తే నీటి లభ్యత తగ్గింది. పీఏబీఆర్, సీబీఆర్లు తాగునీటికి నిర్ధేశించినవి. సీబీఆర్‌లో 0.1 టీఎంసీలు మాత్రమే ఉన్నాయి. పుట్టపర్తి, ధర్మవరం, కదిరి, పులివెందులలో తాగునీటి పథకాలు పనిచేయడం లేదు. చిత్రావతికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది. ఎంపీఆర్ నుంచి వెంటనే సీబీఆర్‌కు నీటిని విడుదల చేయాలి. అలాగే పులివెందుల పరిధిలోని చీనీచెట్లను కాపాడాలి. – అవినాశ్‌రెడ్డి, ఎంపీ, కడప ఆలూరు కెనాల్‌కు నీళ్లివ్వండి ఆలూరు, పత్తికొండ నియోజకవర్గాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. ఖాజాపూర్ రిజర్వాయర్ ఎండిపోయింది. మాకు 15 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. సాగునీరు లేకపోయినా ఫర్వాలేదు. మొదట తాగునీరు విడుదల చేయండి. హంద్రీ–నీవా ద్వారా నీరు వస్తే ఆ నీటిని ఆలూరు బ్రాంచ్ కెనాల్‌కు విడుదల చేయాలి. – గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే, ఆలూరు ‘ప్రాంతాలతో పనిలేదు. జిల్లాలోని అన్ని గ్రామాలకు తాగునీరు అందించాలి. పశువులకు నీరు లేక కబేళాలకు తరలుతున్నాయి. నీరు అనేది ప్రాణాధారం. మాకంటే మాకివ్వండని ఎమ్మెల్యేలు అడగటం కరెక్ట్ కాదు. అన్ని ప్రాంతాల్లో తాగునీటి సమస్యను పరిష్కరించాలి. సాగుకు వినియోగించే నీటిని అరికట్టాలి. ఎస్పీని కూడా సమావేశానికి పిలిపించాలి. అవసరమైతే ఒక చెరువు నుంచి మరో చెరువుకు కాలువలు నిర్మించి అన్నింటినీ నీటితో నింపాలి.’’ – వెన్నపూస గోపాల్‌రెడ్డి, ఎమ్మెల్సీ ‘నీటి వినియోగంపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదు. గతేడాది హంద్రీనీవా ద్వారా 26 టీఎంసీలు వచ్చాయి. భవిష్యత్ అవసరాలు పట్టించుకోకుండా ఎవరికి బలం ఉంటే వారు చెరువులకు తీసుకెళ్లారు. నీటి విడుదలలో మంత్రులు, ఎమ్మెల్యేలు మినహా అధికారుల ప్రమేయం ఉండటం లేదు. ఈ ఏడాది టీబీ డ్యాంలోకి నీరు రాకపోయి ఉంటే తాగునీటి పరిస్థితి ఏంటి? ఉరవకొండకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. రాజకీయంగా చూస్తున్నారు. కర్ణాటక అన్యాయంగా వ్యవహరిస్తున్నా ప్రభుత్వం స్పందించడంలో వైఫల్యం చెందింది. – విశ్వేశ్వరరెడ్డి, ఎమ్మెల్యే, ఉరవకొండ -
వాడీవేడీగా ఐఏబీ సమావేశం
-
రైతుల మధ్య వైషమ్యాలు రగిల్చే కుట్ర
ఐఏబీ సమావేశం వెంటనే ఏర్పాటు చేయాలి జిల్లా మొత్తానికి సాగునీరందించాలి రైతులను డెల్టా, నాన్ డెల్టాగా విడగొట్ట రాదు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల డిమాండ్ సాక్షి ప్రతినిధి, నెల్లూరు: తెలుగుదేశం పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం జిల్లా రైతులందరినీ ఒకే విధంగా చూడకుండా, డెల్టా, నాన్ డెల్టాగా విడగొట్టి వారి మధ్య వైషమ్యాలు రగిల్చే కుట్ర చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో «ధ్వజమెత్తారు. జిల్లా నీటి యాజమాన్య సలహా మండలి సమావేశం (ఐఏబీ) వెంటనే ఏర్పాటు చేసి జిల్లా మొత్తానికి నారుమళ్లు వేసుకోవడానికి నీరు విడుదల చేసేలా నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి నివాసంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. సోమశిల జలాశయంలోని నీటిని నమ్ముకుని నారుమళ్లు పోసుకోవాలనుకుంటున్న రైతాంగానికి ఐఏబీ సమావేశం ఏర్పాటు చేసి భరోసా కల్పించాల్సిన ప్రభుత్వం డెల్టాకు మాత్రమే నీరిచ్చి మెట్ట ప్రాంతాల రైతులను నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరమని జెడ్పీ చైర్మన్ రాఘవేంద్రరెడ్డి పేర్కొన్నారు. సోమశిల రిజర్వాయర్‌లో ఉన్న 37 టీఎంసీల నీటితో పాటు చెన్నయ్ తాగునీటి కోసం మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రావాల్సిన 10 టీఎంసీల నీటిని ప్రభుత్వం తెప్పిస్తే జిల్లా మొత్తానికి సాగునీరు అందించవచ్చన్నారు. అలాగే కండలేరు రిజర్వాయర్‌లో ఉన్న 20 టీఎంసీల నీటితో ఆ ఆయకట్టు కింద 2 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పారు. డెల్టాకు మాత్రమే నీరివ్వాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల సూళ్లూరుపేట, వెంకటగిరి, ఆత్మకూరు, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం రైతులతో రాజకీయం చేయొద్దనీ, జిల్లా మొత్తాన్ని ఒకే విధంగా చూడాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ సొంత వ్యవహారమా? టీడీపీ నాయకులు వారి పార్టీ ఆఫీసులో సమావేశం పెట్టి నీటి విడుదలపై నిర్ణయం తీసుకోవడానికి ఇది వారి సొంత వ్యవహారమా? అని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి నిలదీశారు. జిల్లా మొత్తానికి మొదటి పంటకు నీరిచ్చేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సాగునీటి రాజకీయం చేస్తోందని మండిపడ్డారు. మంత్రి నారాయణ జిల్లా గురించి పట్టించుకోవడం మానేశారనీ, ఆయనకు ఎప్పుడూ అమరావతిలో సింగపూర్ కంపెనీలకు భూములు ఇప్పించడం తప్ప మరే ధ్యాస లేదన్నారు. సంగం బ్యారేజీ నిర్మాణం ఏడాదిలో పూర్తి చేస్తామని చెప్పి రెండేళ్లు గడిచిందన్నారు. కావలిలో సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నీళ్లు అయిపోయాయని తాము చెబుతుంటే పట్టించుకోక పోవడం వల్ల తాగునీటి కరువు ఏర్పడిందన్నారు. ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి కొందరు టీడీపీ నాయకులు లబ్ధి పొందేందుకు ఇలాంటి నీచానికి దిగజారారని ఆయన మండిపడ్డారు. ప్రభుత్వం వెంటనే ఐఏబీ మీటింగ్‌పెట్టి జిల్లా మొత్తానికి మొదటి పంటకు నీరిచ్చేలా నిర్ణయం తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేయాలి ప్రభుత్వం ఒక ప్రాంతాన్నే పట్టించుకుని మరో ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేయడం సరైంది కాదని ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆవేదన చెందారు. ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు సమన్యాయం చేసి జిల్లా మొత్తానికి నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. డెల్టా కింద రెండో పంటకు నీరిస్తే ఇలాంటి పరిస్థితి వస్తుందని అధికారులు ముందే చెప్పినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. అప్పుడిచ్చిన 20 టీఎంసీల నీరు, ఇప్పుడున్న 37 టీఎంసీల నీరు కలిపితే జిల్లా మొత్తానికి అందించే అవకాశం ఉండేదన్నారు. ప్రభుత్వం రైతులను విడదీసి రాజకీయ ప్రయోజనం పొందే చర్యలు మానుకోవాలనీ, జిల్లా మొత్తానికి నీరివ్వాలని డిమాండ్ చేశారు. పెన్నా అప్పర్ డెల్టా రైతులు తమ పరిస్థితి ఏమిటో అని ఆందోళనలో ఉన్నారనీ, ఆత్మకూరు నియోజకవర్గంలో పశువులకు తాగేందుకు నీరు దొరకని పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వం వెంటనే ఐఏబీ మీటింగ్ పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. బ్రిటిష్ పాలనకంటే ఘోరంగా ఉంది వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అధికారులు పద్ధతిగా నీటి నిర్వహణ చేసి సోమశిలలో 20 టీఎంసీల నీరున్నా జిల్లా మొత్తానికి నారుమళ్లకు నీళ్లిచ్చే వారని మాజీ శాసనసభ్యుడు మేకపాటి చంద్రశేఖరరెడ్డి పేర్కొన్నారు. ప్రభుత్వ పనితీరు బ్రిటిష్ పాలనకంటే ఘోరంగా ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారని ఆయన చెప్పారు. జిల్లాలో తమ పార్టీ ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలవలేదని సీఎం కక్ష కట్టారని ఆరోపించారు. నీటి నిర్వహణ పెత్తనం కలెక్టర్ అధికారుల చేతిలో పెట్టి వారిని జిల్లా మొత్తానికి నీరు ఇప్పించే ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
ప్రశ్నిస్తే చిందులా !
అడిగే ప్రశ్నకు సమాధానం లేకపోతే ఆవేశం .. అరుపులు .. గందరగోళం సృష్టించి తమదే పైచేయంటూ భుజాలెగరేయడం ... ఇదీ నేటి టీడీపీ నేతల తీరు. గురువారం రాత్రి జిల్లా కలెక్టర్ హెచ్. అరుణ్ కుమార్ అధ్యక్షతన జరిగిన నీటి పారుదల సలహా సంఘ సమావేశంలో వారు అదే బాటను అనుసరించారు. వేదికపైనున్న మంత్రులనుద్దేశించి ఎమ్మెల్సీ సుభాస్ చంద్రబోస్ అడిగిన ఓ ప్రశ్నకు ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు అడ్డుపడుతూ చెలరేగిపోయారు. సహచర ఎమ్మెల్యేలు వారించినా ... మంత్రులు సర్ధిచెబుతున్నా వినకుండా గాలిలో చేతులూపుతూ అసభ్య పదజాలంతో తన అసహనాన్ని వెళ్లగక్కారు. -
ఓరి దేవుడా..ఎందుకీ పనులు!
నీటి పారుదల శాఖలో రూ.8 కోట్లకు ప్రతిపాదనలు నీరు విడుదల చేయకుండా స్వప్రయోజనాలకు పెద్దపీట అధికారపార్టీ నాయకుల తీరుపై ఆశ్చర్యపోతున్న రైతులు ఐఏబీ సమావేశం నిర్వహించకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట): ఓ వైపు ఐఏబీ సమావేశంపై గందరగోళం నెలకొని ఉండగా, మరోవైపు రూ.8 కోట్లు ఓ అండ్ ఎం పనులకు అధికారపార్టీలోని ఓ వర్గం ప్రతిపాదనలు తెచ్చారు. ఈ ప్రతిపాదనలను మరో వర్గం వ్యతిరేకించడంతో విషయం బయటకు పొక్కింది. నీటి విడుదల మరచి స్వప్రయోజనాలకు పాకులాడుతున్న వైనంపై రైతులు మండిపడుతున్నారు. పకడ్బందీగా నీటి పంపిణీ చేయాలంటే కాలవల మరమ్మతులు ఎంతో ముఖ్యం. గత ఐఏబీ సమావేశంలో రూ.7 కోట్లతో ఓ అండ్ ఎం (ఆపరేషన్ అండ్ మెయింటనెన్స్) పనులు చేపట్టాలని తీర్మానించారు. ఈ నిధులతో కాలువల మరమ్మతులు చేపట్టారు. అయితే అవి పూర్తి కాక ముందే నీటిని విడుదల చేశారు. ఈ క్రమంలో నీరు వృధా అయింది. పనుల్లో అక్రమాలదే పైచేయి అయింది. ఇదిలా ఉంటే, గత ఐఏబీ తీర్మానం ప్రకారం చేసిన ఓ అండ్ ఎం పనులకు సంబంధించి రూ.7 కోట్ల బిల్లులు తమకు చెల్లించలేదని కాంట్రాక్టర్లు చెప్పుకొస్తున్నారు. అవసరం లేకున్నా.. తాజాగా జలాశయంలోని నీటితో పనిలేకుండా కేవలం పనుల కోసమే టీడీపీలోని ఓ వర్గం పట్టుబడుతోంది. దీనిని అధికార పార్టీ నాయకులే తప్పుబడుతున్నారు. నాలుగైదు నెలల వ్యవధిలో కాలువలకు ఎలాంటి మరమ్మతులు చేయాల్సిన అవసరం లేదని ఇరిగేషన్ అధికారులు అభిప్రాయపడుతున్నారు. వాస్తవ అవసరాలను తెలుసుకుని ఓ అండ్ ఎం ప్రతిపాదనలు రూపొందించకుండా స్వాహానే లక్ష్యంగా ప్రతిపాదనలు సిద్ధం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారాయణ చెప్పినట్లు ఐఏబీ సమావేశం తేదీ నిర్ణయించాలంటే జలాశయానికి సుమారు 50 టీఎంసీల నీరు చేరాల్సి ఉంది. ఇన్చార్జి మంత్రి , ఎమ్మెల్సీలు ప్రకటించినట్లు 20వ తేదీన మీటింగ్ జరగాలంటే కృష్ణానది నుంచి నీటిని విడుదల చేయాల్సి ఉంది. అయితే కృష్ణాజలాలను విడుదల చేసే ప్రసక్తి లేదని రాష్ట్ర స్థాయి అధికారులు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పనులను తెచ్చుకోవడమా లేక రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ఐఏబీ నిర్వహించాలా? అన్న మీమాంస అందరి మెదళ్లను తొలుస్తోంది. విచారణ ఏమైనట్లు? నీటి పారుదల శాఖలో నీరు –చెట్టు, ఎఫ్డీఆర్, సీఈ మంజూరులు, ఒకే పనికి మూడు బిల్లులు తదితరాలపై భారీగా అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. స్పందించిన కలెక్టర్ నీరు–చెట్టు 2 కు సంబంధించి సుమారు రూ.87 కోట్ల బిల్లులను కలెక్టర్ ముత్యాలరాజు ఆపేశారు. నీటి పారుదల శాఖ పనులపై విచారణకు ఆదేశించారు. నలుగురు ప్రత్యేకాధికారులను విచారణకు పురమాయించారు. ఆ అధికారుల పరిశీలనలు ఎంత వరకు వచ్చాయో ఎవరికీ అంతుబట్టడంలేదు. దీనికి తోడు కడప క్వాలిటీ కంట్రోల్ ఎస్ఈ, ఈఈలు ఎవరికి వారు విచారణ చేస్తూనే ఉన్నట్లు సమాచారం. కోవూరు నియోజకవర్గంలో నీరు–చెట్టు అవినీతి, అక్రమాలపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపేందుకు కావలి ఈఈని నియమించారు. ఆ పరిశీలనలకు సంబంధించిన వివరాలు తెలియరావడం లేదు. కేవలం విడవలూరు ఏఈని సరెండర్ చేసి చేతులు దులుపుకున్నారు. అవినీతి,ఆరోపణలపై నిష్పక్షపాతంగా విచారణ జరిపే స్వేచ్ఛ అధికారులకు లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశించి నెల రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎటువంటి నివేదికలు బయటకు రాలేదని రైతులు విమర్శిస్తున్నారు. పనులపై నిష్పక్షపాత విచారణ జరిగి ఉంటే అధికారపార్టీ నాయకులు రైతు ప్రయోజనాలు మరచి ఓ అండ్ ఎం పనుల కోసంఽ కొత్తగా ముందుకు వచ్చి ఉండేవారు కాదని రైతులంటున్నారు. అధికారపార్టీ నాయకుల కుమ్ములాటల వల్ల తమకు తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులను పరిశీలించి ఓ అండ్ ఎం పనులను ఇవ్వాలని అభిప్రాయపడుతున్నారు. అయితే గత ఓ అండ్ ఎం పనుల బిల్లులే మంజూరు కాకపోవడంతో ఈ పనులను నీరు–చెట్టు కింద చూపాలని అధికారపార్టీ నాయకులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. అందులో భాగంగానే ఐఏబీని నిర్వహించడంలో జాప్యం జరుగుతోందని, ఇది అధికారపార్టీ నాయకుల మధ్య అంతర్యుద్ధానికి దారితీసిందని సమాచారం. 20న సమావేశం నిర్వహించకుంటే ఉద్యమం పంటలకు అనుకూలమైన డెల్టా ప్రాంతానికి మొదట నీటిని అందించేందుకు పార్టీలకతీతంగా కృషిచేయాలని రైతులు కోరుతున్నారు. నీటి పంపిణీలో అలసత్వం వహించి జిల్లా రైతులకు అన్యాయం చేస్తే సహించేది లేదని స్పష్టం చేస్తున్నారు. ఓ అండ్ ఎం పనుల పందేరాన్ని పక్కన పెట్టాలని, ఈ నెల 20వ తేదీ లోగా ఐఏబీ నిర్వహించి నీటి విడుదల వెంటనే చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే ఉద్యమిస్తామంటున్నారు. -
వరికి ఉరి
- సాగునీరివ్వలేం.. రైతులెవ్వరూ వరి సాగు చేయకూడదు - టీబీ డ్యాం నుంచి వచ్చేది 11 టీఎంసీలు మాత్రమే - అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీఎంసీలు - అక్రమ ఆయకట్టుదారులపై కఠినంగా వ్యవహరించాలి - ఐఏబీ సమావేశంలో తీర్మానం అనంతపురం అర్బన్/ ఇరిగేషన్ : ‘తుంగభద్ర డ్యాం నుంచి హెచ్ఎల్సీకి 22.689 టీఎంసీల నీటిని విడుదల చేస్తామని చెప్పారు. నెల రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఎగువ నుంచి నీరు రాకపోవడంతో 11 టీఎంసీలు మాత్రమే ఇస్తామని టీబీ డ్యాం అధికారులు వరికి ఉరి చెబుతున్నారు. ఇందులో అధిక ప్రాధాన్యతగా తాగునీటికి 8.5 టీంఎసీలు ఇవ్వాలి. మిగిలిన నీటిని ఏమి చేయాలనేది తరువాత నిర్ణయిద్దాం. ప్రస్తుత పరిస్థితుల్లో జిల్లాలో ఏ ఒక్క రైతూ వరి సాగు చేయకుండా చూడాలి. అక్రమ ఆయకట్టుదారుల పట్ల కఠినంగా వ్యవహరించాల’ని నీటి పారుదల సలహా మండలి(ఐఏబీ) సమావేశంలో తీర్మానించారు. శుక్రవారం కమిటీ చైర్మన్, అనంతపురం జిల్లా కలెక్టర్ కోన శశిధర్ అధ్యక్షతన కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో సమావేశం నిర్వహించారు. జిల్లా మంత్రులు పరిటాల సునీత, పల్లె రఘునాథ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ సతీష్ కుమార్‌రెడ్డి, చీఫ్ విప్ కాలవ శ్రీనివాసులు, విప్ యామినిబాల, జెడ్పీ చైర్మన్ చమన్, అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, కడప ఎంపీ వైఎస్ ఆవినాశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్ చాంద్‌బాషా, జేసీ ప్రభాకర్‌రెడ్డి, వరదాపురం సూరి, హనుమంతరాయచౌదరి, ప్రభాకర్ చౌదరి, ఈరన్న, జితేంద్రగౌడ్, జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ఆలూరు ఎమ్మెల్యే జయరామప్ప, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, పయ్యావుల కే శవ్, శమంతకమణి హాజరయ్యారు. నీటి విడుదలకు సంబంధించి వాస్తవ పరిస్థితిని సభ్యులకు కలెక్టర్ వివరించారు. వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో సమస్య తీవ్రంగా మారిందన్నారు. గత ఏడాది ఇదే సమయంలో టీబీ డ్యాంలో ఇన్‌ఫ్లో 1.22 లక్షల క్యూసెక్కులు ఉండగా, ఇప్పుడు ఏడు వేల క్యూసెక్కులు మాత్రమే ఉందన్నారు. గత ఏడాది ఈ సమయానికి డ్యాంలోకి 113 టీఎంసీల నీరొస్తే, ఇప్పుడు 12 టీఎంసీలు మాత్రమే వచ్చిందన్నారు. అటు శ్రీశైలం డ్యాంలోనూ నీటిమట్టం డెడ్ స్టోరేజీకి పడిపోయిందన్నారు. హెచ్చెల్సీ ద్వారా అనంతపురం జిల్లాలో 1.47 లక్షల ఎకరాలు, కర్నూలు, వైఎస్సార్ జిల్లాలు కలిపి 69 వేల ఎకరాలకు నీరందించాల్సి ఉందన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆయకట్టుకు నీరివ్వడం సాధ్యం కాదన్నారు. హామీ కూడా ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. ఈ నేపథ్యంలో సలహా మండలి సమావేశం వద్దనుకున్నామని, అయితే వాస్తవాలను సభ్యుల దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేశామని వివరించారు. దీంతో సభ్యులు తొలి ప్రాధాన్యత తాగునీటికి ఇవ్వాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. భవిష్యత్‌లో డ్యాంలలో నీటిమట్టం పెరిగితే సాగునీటి అవసరాల కోసం చర్చించడానికి ఆగస్టు చివరి వారంలో మరోసారి సమావేశం నిర్వహించాలని తీర్మానించారు. మైలవరం, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లను మొదటి నుంచి నిర్లక్ష్యం చేస్తున్నారని వైఎస్సార్ జిల్లా ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు. వృథా అరికట్టాలి : సతీష్‌రెడ్డి, ఎమ్మెల్సీ, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ చిత్రావ తి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌కు కేటాయించిన నీళ్లు ఎప్పుడూ చేరలేదు. చాలా వరకు వృథా అవుతున్నాయి. దీనిని అరికట్టకపోతే తాగునీటికి కూడా చాలా ఇబ్బంది పడాల్సివస్తుంది. కేటాయించిన నీరు సీబీఆర్‌కు చేరాలంటే ఎక్కువ నీటిని విడుదల చేస్తేనే సాధ్యం. మూడేళ్లుగా మైలవరానికి నీళ్లు లేవు : ఆదినారాయణరెడ్డి, జమ్మలమడుగు ఎమ్మెల్యే మూడేళ్లుగా మైలవరం ప్రాజెక్టుకు నీటి కేటాయింపులు జరుగుతున్నా, ఏ ఏడాదీ ఒక చుక్క రావడం లేదు. మా ప్రాంతంలో 1500 నుంచి 2000 అడుగుల లోతుకు బోర్లు వేసినా నీళ్లు పడటం లేదు. పరిస్థితి భయానకంగా ఉంది. ఈ ఏడాది కేటాయించిన నీటిని విడుదల చేస్తేకానీ మా ప్రాంత ప్రజల పరిస్థితి మెరుగుపడదు. మా గురించి ఆలోచించే తీరిక లేదా? : వైఎస్ అవినాష్‌రెడ్డి, కడప ఎంపీ గత ఐఏబీ సమావేశంలో కూడా మా ప్రాంతానికి నీళ్లు రావడం లేదని వివరించా. అయినప్పటికీ గత ఏడాది మాకు తీవ్ర అన్యాయం జరిగింది. సీబీఆర్‌కు రెండు టీఎంసీలు కేటాయించినా, రిజర్వాయర్‌లోకి ఒక్క టీఎంసీ నీరు కూడా రావడం లేదు. తుంపెర వద్ద నీటి ప్రవాహం సూచించే గేజ్ ఏటవాలుగా ఉంది. దానితో రిజర్వాయర్‌లోకి ఎక్కువ నీరు వచ్చినట్లు అధికారులు ఊహించుకుంటున్నారు. తక్షణమే హెచ్చెల్సీ ఆధునికీకరణ పూర్తి చేసి సీబీఆర్‌కు నాలుగు టీఎంసీలివ్వాలి.