ICC World Twenty20
-
టీ20ల్లో ఇప్పటికీ ఇదే బెస్ట్ బౌలింగ్
సాక్షి, స్పోర్ట్స్: క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్మెన్లకు అతడు సింహస్వప్నం. టీ20 క్రికెట్లో రెండు పర్యాయాలు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అతడు. ఆ మిస్టరీ స్పిన్నర్ బౌలర్ మరెవరో కాదు లంక క్రికెటర్ అజంతా మెండిస్. నేడు ఈ లంక బౌలర్ పుట్టినరోజు. 2012లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడింది. ఆ మ్యాచ్‌లో మిస్టరీ బౌలర్ మెండిస్ ప్రత్యర్ధి ఆటగాళ్లకు ఎలా ముచ్చెమటలు పట్టించాడో మరోసారి వీక్షించండి. ఆ మ్యాచ్‌లో కేవలం 8 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు మెండిస్. ఐసీసీ టీ20 క్రికెట్లో ఇప్పటికీ అత్యుత్తుమ ప్రదర్శనను తన పేరిట లిఖించుకున్న మెండిస్ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ అధికారిక ట్వీటర్లో ఈ వీడియో పోస్ట్ చేసింది. To celebrate the birthday of Ajantha Mendis, we take a look back at his sensational performance with the ball against Zimbabwe in the 2012 World T20! His figures on that day of 6/8, are still the best ever for a bowler in T20Is! Happy Birthday! 🎂 🎉 pic.twitter.com/KmDbnLIubq — ICC (@ICC) 11 March 2018 -
టీ20ల్లో ఇప్పటికీ బెస్ట్ బౌలింగ్
-
పాకిస్తాన్ టీమ్ వస్తోంది..!
కరాచీ: భారత్‌లో జరిగే టి-20 ప్రపంచ కప్‌లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మార్చి 19న ధర్మశాలలో జరిగే మ్యాచ్‌లో దాయాదులు భారత్, పాక్‌లు తలపడనున్నాయి. భారత్‌లో మార్చి 8న ఈ ఈవెంట్ ఆరంభంకానుంది. భద్రత కారణాల రీత్యా పాక్ జట్టు భారత్ పర్యటనకు వచ్చేది సందేహంగా మారిన సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్‌లో తాము ఆడబోయి మ్యాచ్‌లను భారత్ వెలుపల తటస్థ వేదికలపై నిర్వహించాలని ఇంతకుముందు పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. అయితే పాక్ విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించింది. దీంతో పాక్ టి-20 ప్రపంచ కప్‌లో ఆడాలంటే భారత్‌కు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. భారత్‌కు వెళ్లేందుకు పాక్ జట్టు అనుమతి ఇవ్వాలని పీసీబీ కోరగా, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ముంబై ఉగ్రవాదదాడుల అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రపంచ కప్ వంటి ఈవెంట్లలో ఇరు జట్లు ఆడటం మినహా ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడటం లేదు. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌కు పీసీబీ ఆసక్తి కనబరిచినా ఇటీవల పఠాన్‌కోట్‌లో ఉగ్రవాద దాడి జరగడంతో భారత్ విముఖత చూపింది.