క్రికెట్లో అడుగుపెట్టిన తొలినాళ్లలో ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్లకు అతడు సింహస్వప్నం. టీ20 క్రికెట్‌లో రెండు పర్యాయాలు వికెట్లు తీసిన ఏకైక బౌలర్ అతడు. ఆ మిస్టరీ స్పిన్నర్ బౌలర్ మరెవరో కాదు లంక క్రికెటర్ అజంతా మెండిస్. నేడు ఈ లంక బౌలర్ పుట్టినరోజు. 2012లో జరిగిన ఐసీసీ టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా శ్రీలంక ఫస్ట్ మ్యాచ్ జింబాబ్వేతో ఆడింది. ఆ మ్యాచ్‌లో మిస్టరీ బౌలర్ మెండిస్ ప్రత్యర్ధి ఆటగాళ్లకు ఎలా ముచ్చెమటలు పట్టించాడో మరోసారి వీక్షించండి. ఆ మ్యాచ్లో కేవలం 8 పరుగులు ఇచ్చి 6 వికెట్లు పడగొట్టి లంక విజయంలో కీలకపాత్ర పోషించాడు మెండిస్. ఐసీసీ టీ20 క్రికెట్లో ఇప్పటికీ అత్యుత్తుమ ప్రదర్శనను తన పేరిట లిఖించుకున్న మెండిస్ పుట్టినరోజు సందర్భంగా ఐసీసీ అధికారిక ట్వీటర్‌లో ఈ వీడియో పోస్ట్ చేసింది.
టీ20ల్లో ఇప్పటికీ బెస్ట్ బౌలింగ్
Published Sun, Mar 11 2018 8:36 PM | Last Updated on Thu, Mar 21 2024 6:45 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement